*11ఏళ్ల బాలిక ప్రాణం ఖరీదు 4 లక్షలు..*
*ఖాకీ ల సాక్షిగా.. డీల్..?*
*వార్త రాయకుండా ఉండేందుకు విలేకరులకు 22 వేల రూపాయలు నజరానా..*
*ఇది వనస్థలిపురం* *లోని ఓ ప్రైవేట్* *ఆస్పత్రి నిర్వాకం..*
*ఇంకెక్కడి చట్టం..* *న్యాయం.?*
(ఎల్బీనగర్):
సెప్టెంబర్ 20..
*ధనార్జన కోసం.. డాక్టర్లు ప్రాణాలు తీస్తూనే ఉంటారు.. కాసులు వెదజల్లుతూనే ఉంటారు.. కానీ చర్యలు ఉండవు..!*
*వ్యవస్థలన్నీ నిర్వీర్యం..*
అభం శుభం తెలియని ఒక పసిపాప నిండు ప్రాణాలు కోల్పోయింది.11ఏళ్ల చిరు ప్రాయంలో ధనార్జన కోసం ఏర్పాటు చేసిన హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైయింది. చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు కుప్పకూలడంతో పేదల ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా నే కనిపిస్తుంది.ఆ చిన్నారి ప్రాణానికి పోలీసుల సాక్షిగా ₹ 4 లక్షలకు వెల కట్టి హాస్పటల్ యాజమాన్యం చేతులు దులుపుకుంది.
ఓ నిండు ప్రాణం బలితీసుకున్న వైద్యుల నిర్లక్ష్యం నేరం కాదా..! ప్రాణానికి వెలకట్టి రాజీ చేసే మనుషులను ఏమనాలి..? డాక్టర్స్ ఇలా ప్రాణాలు తీస్తూనే,ఎటువంటి అనుమతులు లేకుండా డబ్బే పరమావధిగా హాస్పిటల్ లు కొనసాగించినంత కాలం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి.ధనార్జనే ధ్యేయంగా హాస్పటల్స్ ఏర్పాటు చేసి, నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు.వీరికి రక్షణగా చట్టం ముసుగులో కొంత మంది సహకరిస్తూనే ఉన్నారు.వాటిపై ఎటువంటి విచారణ ఉండదు,రాజీ పేరుతో డబ్బులు వెదజల్లి... మళ్లీ తమ నైజం ప్రదర్శిస్తూనే ఉంటారు.
*వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు రాలే..!*
ఓ ప్రాణం పోయినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వనస్థలిపురం తన్వి హాస్పిటల్వైపు కన్నెత్తి చూడలేదు.వారికి ప్రతి నెలా మామూళ్ల రూపంలో వచ్చే లంచాలే ప్రధాన కారణం.వనస్థలిపురం సుష్మా థియేటర్ రోడ్ హుడా సాయి నగర్ లో ఉన్న తన్వి హాస్పిటల్ దారుణాలు వర్ణనాతీతం. అడ్మినిస్ట్రేషన్ వర్కర్ గా పనిచేస్తున్న రాము అనే వ్యక్తి అంతా తానై వ్యవహరిస్తు,హాస్పిటల్ లో గర్భస్థ పరీక్షలు కూడా చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావం చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయ్.
ఇంత దారుణం జరిగి ఓ పసి పాప ప్రాణం తీసిన తన్వి హాస్పిటల్ పైచర్యలు తీసుకుంటారో,ఆ దిశగా ప్రభుత్వం అధికారులు ఆలోచన చేస్తారా,లేదా మరిన్ని ప్రాణాలు పోయే వరకు ఇదే ధోరణి అవలంబిస్తారా చూద్దాం..కొస మెరుపు
ఈ దారుణాన్ని పత్రికలలో ప్రచురించకుండా ఉండేందుకు 15 మంది విలేకరులకు ఆసుపత్రి యజమాన్యం 22 వేల రూపాయల నజరానాను యూపీఐ పేమెంట్ చేసింది..
*విలేకరుల వివరాలు*
దార్ల శ్రీనివాస్ (ప్రజా జ్యోతి )రమేష్,అంజి నెలంకి,శ్రీనివాస్, నాగేందర్,రమేష్.ఎన్, సీత రామ్ నాయక్, మల్లేష్ యాదవ్,కె.ఎస్. నారాయణ, లింగారెడ్డి,రామ్మోహన్, రాజు,పాండు,సురేష్, రామచందర్ తదితరులు ఉన్నారు.
(సేకరణ)
*******-*******
https://x.com/Praja_Snklpm/status/1969636551866138864?t=2AEmPTWUPXFwEYVUK9C4Cw&s=08
*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*
*_రాయల్ పోస్ట్ మీడియా వారికి ఉద్యమ దండాలు ✊...చిన్నారి ప్రాణం ఖరీదు కట్టి జర్నలిజం కు మచ్చతెచ్చిన సన్నాసులు పాత్రికేయులు ఎలా అవుతారు ? బ్రోకర్ లు అవుతారు... వీరి గురించి #IPR కమీషనర్ & తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి ద్రుష్టికి తీసుకెళ్తాము....._*
*@IPRTelangana*
*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*
*ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత*
*Bapatla Krishnamohan*
*#SocialActivist*
*#HumanRightsMember*
*Bplkm✍️*
No comments:
Post a Comment