Monday, September 1, 2025

ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తులు జారీ చేసే విష‌యంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, గేటెడ్ క‌మ్యూనిటీల నిర్మాణం, ఇత‌ర అనుమ‌తుల విష‌యంలో కొంద‌రు అధికారులు ఉద్దేశపూర్వకంగా అల‌సత్వం చూపుతున్నార‌ని మండిప‌డ్డారు.

❇️డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో #HMDA ప‌రిధిలో బిల్డ్ నౌ కింద ప‌నుల అనుమ‌తుల అంశంపై ముఖ్యమంత్రి గారు స‌మీక్షించారు. అనుమ‌తుల జాప్యంలో ఆల‌స్యానికి కార‌కులను గుర్తించి వారిని స‌రెండ‌ర్ చేయాల‌ని @HMDA_Gov కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుద‌ల శాఖ విభాగం అధికారులపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, వాటిని ఎంత‌మాత్రం స‌హించేది లేద‌ని స్పష్టం చేశారు.

❇️హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువులు, నాలాల‌, ఇత‌ర నీటి వ‌న‌రుల‌కు సంబంధించి లైడార్ స‌ర్వేను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆదేశించారు. స‌మ‌గ్ర‌మైన వివ‌రాలున్న‌ప్పుడు మాత్ర‌మే ఎటువంటి వివాదాల‌కు తావుండ‌ద‌ని అన్నారు.

❇️ఈ విష‌యంలో #GHMC, #Hydraa, ఇరిగేష‌న్ అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మావేశాలు నిర్వ‌హిస్తూ త్వ‌ర‌గా అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ఆదేశించారు. స‌మీక్ష‌ సమావేశంలో హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్, @CommissionrGHMC, @Comm_HYDRAA త‌దిత‌రులు పాల్గొన్నారు. #BuildNow #OneStateOnePlatform

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1962547974418072004?t=EKT0xZ2ppe__uMGi3z_UxA&s=19

                   ***************

ఇన్నాళ్లకు Mr రేవంత్ రెడ్డి గారు స్పందించారు సంతోషం...

చూడాలి అవినీతి అధికారులు @TelanganaCMO ఆదేశాలను పాటిస్తారో ?

#TelanganaHighCourt #EncroachmentOfLakes #IllegalConstructions

@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist*
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1962567171797852284?t=an9aw6GZCEasWSMPXPGGLg&s=19


No comments:

Post a Comment