Wednesday, September 3, 2025

బీఆరెస్, కవిత వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్…

బీఆరెస్, కవిత వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్…

కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యులు కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు 

ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు 

ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారు 

అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు 

కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు 

పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందే

ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు 

అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాను 

నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటా 

వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే…

లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు 

మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు.. 

అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా?

దయచేసి మీ కుటుంబ పంచాయతీలనో… మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి 

మాకు ఎలాంటి ఆసక్తి లేదు 

మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు 

కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది 

ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది

No comments:

Post a Comment