*నేలపై నిద్రిస్తూ... కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ....మోదీ కఠినమైన నియమాలు*
దిల్లీ...అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయన 11 రోజుల పాటు అనుష్ఠానం పాటిస్తున్నారు. ఈ క్రమంలో కఠినమైన ఉపవాసం చేస్తున్నారని సమాచారం.
ఇందులో భాగంగా ఒక్క దుప్పటి మాత్రమే వేసుకొని నేలపై నిద్రిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగుతున్నారన్నారు. అనుష్ఠానంలో భాగంగా పాటించే యమ నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, యోగా.. ధ్యానం చేయటం, సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు. ఈ అనుష్ఠానం గురించి గతవారం మోదీ ఆడియో సందేశం విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16 నుంచి ఆరు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ నిర్వహించలేరు కాబట్టి, ఆయనకుబదులుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్ర దంపతులు అన్ని పూజల్లో పాల్గొంటున్నారు. ఇక, 22న కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో మోదీ గర్భగుడిలోకి విగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు
*V.S. జీవన్*
No comments:
Post a Comment