Monday, January 1, 2024

మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు-సీఎం రేవంత్ రెడ్డి

Metro and Pharmacy are not cancelled.
   -- CM Revanth Reddy, Chit Chat at Secretariat👇

మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.
  -- సీఎం రేవంత్ రెడ్డి , చిట్ చాట్ సచివాలయం👇

👉 మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.
👉 ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నా.
👉 ఎయిర్ పోర్టుకి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే 
దూరం తగ్గిస్తాం.
👉 BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది 
👉 ఎంజిబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుంది.
👉 నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్  మీదుగా చాంద్రాయణ్ గుట్ట
వద్ద ఎయిర్పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తాం.
👉 మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తాం.
👉 అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం.
👉 గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరు. 
👉 మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుంది.
👉 ఫార్మాసిటీ ని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాము.
👉 జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.
👉 అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుంది 
👉 అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయి.
👉 గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తాం.
👉 యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు 
ఏర్పాటు.
👉 అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ....ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుంది.
👉 సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి ....స్కిల్స్ అదనంగా ఉంటాయి.
👉 అక్కడ నుంచి బైటకి వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుంది.
👉 ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం.
👉 మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా  బాధ్యతలు అప్పగించాం.
👉 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుంది.
👉 విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తాం.
👉 ఆయాదేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం.
👉 ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు  మెరుగుపరుస్తాం.
👉 మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది...వారికీ ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం.
👉 చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే 
అవకాశం ఉంది.
👉 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది.
👉 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తాం.
👉 పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.
👉 నాకు దగ్గరనో భందువులనో పదవులు ఇచ్చేది ఉండదు.
👉 నేను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తాం.
👉 పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తాం.👉 ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమశ్యలు పరిష్కరిస్తాం.

👉 హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించా ....వారికి అవసరమైన మాన్ పవర్ ను వాళ్ళే పిక్ చేసుకుంటారు.
👉 శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తా.
👉 వాళ్ళ పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేట్లు చూసుకోవాలి.
👉 అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తాం.
👉 సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నా.
👉 నా వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి
ఉండదు.
👉 జర్నలిస్టులకు సంభందించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం.
👉 ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తాం.

#RevanthReddy @revanth_anumula

Sunday, December 31, 2023

ప్రతిఒక్కరికి ధన్యవాదములు✊

_*ఈరోజు ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం చివరి రోజు. ఈ సంవత్సరంలో నన్ను ఆప్యాయతగా పలకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు చెప్పాలనీ భావించాను. అందులో మీరు ఒకరు అందుకే మీకు నా ధన్యవాదములు 🙏... కిట్టు (కృష్ణమోహన్)*_

_*సమాజాన్ని డ్రైవ్ చేసే సత్తా ఉన్నవాళ్లు మనకెందుకులే అనుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద రాజకీయాల మీద అసహ్యించుకోవడం కంటే మన తలరాతలు మార్చే వ్యవస్థల మీద కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.*_

_*చరిత్ర చూస్తే.. రాముడు గొప్పతనం రావణుండు ఉన్నప్పుడే.. మంచోడి గొప్పతనం చెడ్డోడు ఉన్నప్పుడు తెలుస్తుంది.*_

_*రాజకీయ నాయకుణ్ణి పనితీరును బట్టి ఎన్నుకోవాలి తప్ప వారి ప్రామిసెస్ ను బట్టి కాదు.*_

_*ఆనాడు విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేది.ప్రస్తుతం విద్యాసంస్థల నిర్వాకం వల్ల విద్యార్థులు రాజకీయాలలోకి రావడం లేదు.*_

*Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/                                                     prj_snklpm9456 (Instagram)

Saturday, December 30, 2023

కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి కోసం KADA ఏర్పాటు.

KADA - Kodangal Area Development Authority 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి కోసం KADA ఏర్పాటు.
👉 GO జారీ చేసిన ప్రభుత్వం.

Chief Minister Revanth Reddy formed KADA for special development of Kodangal constituency.
 👉 GO issued by Govt.

https://twitter.com/Congress4TS/status/1741037720368271845?t=DcsOg-Hge7IFLzklQ-F5KA&s=19

ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరికాదు

రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరికాదని      మఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు. 

ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్టరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.

https://twitter.com/TelanganaCMO/status/1741112075429236850?t=38O6a2Gaw_7GSCtwOo_DeQ&s=19

కాలేజీ స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలతో ఈటెల

హైదరాబాద్ : యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్ లో నిర్వహించిన  “Mega Alumni Meet -2023” లో పాల్గొని ప్రసంగించడం జరిగింది.

ఈ కాలేజీలో 1981 నుండి 84 వరకు హాస్టల్ ఉండి డిగ్రీ పూర్తి చేశాను. స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాలేజీ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. అరే అని పిలవగలిగే హక్కు ఒక్క స్కూల్, కాలేజీ ఫ్రెండ్ కే ఉంటుంది.

ఆనాడు విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేది. ఏ వ్యవస్థ కొలాప్స్ అయినా రిపేర్ చేసుకోవచ్చు.. కానీ పొలిటికల్ లీడర్ కొలాప్స్ అయితే వ్యవస్థ కొలాప్స్ అవుతుంది.

సమాజాన్ని డ్రైవ్ చేసే సత్తా ఉన్నవాళ్లు మనకెందుకులే అనుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద రాజకీయాల మీద అసహ్యించుకోవడం కంటే మన తలరాతలు మార్చే వ్యవస్థల మీద కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.

చరిత్ర చూస్తే.. రాముడు గొప్పతనం రావణుండు ఉన్నప్పుడే..
మంచోడి గొప్పతనం చెడ్డోడు ఉన్నప్పుడు తెలుస్తుంది.

రాజకీయ నాయకుణ్ణి పనితీరును బట్టి ఎన్నుకోవాలి తప్ప వారి ప్రామిసెస్ ను బట్టి కాదు.

నేను బయోలాజికల్ స్టూడెంట్ ను, ఎకనామిస్ట్ ను కాదు. కాని తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్ధిక మంత్రిగా నా ప్రసంగంలో మొదటి పేరాలో ఒక లైన్ రాశాను.. ఈడబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే భాద్యత ఉంది అని చెప్పిన. అది సైఫాబాద్ సైన్స్ కాలేజీ నేర్పిన చైతన్యం.

ఓల్డ్ ఈస్ గోల్డ్ అని నేను బలంగా నమ్ముతా. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలది, న్యాయానిది, ధర్మానిది.

చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే.

సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన.. ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ తేలేదు. ఇక మీద కూడా తేకుండా ఉంటానని మాట ఇస్తున్నాను.

https://twitter.com/Eatala_Rajender/status/1741067158309011794?t=RQ0tiwaDTHbeRk3fMwkdXQ&s=19

ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆగ్రహం!

'ప్రజా పాలన' దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు.

రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. 'ప్రజా పాలన' దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి 'ప్రజా పాలన' కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, 'ప్రజా పాలన' దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 'ప్రజా పాలన' కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 'ప్రజా పాలన' క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు సీఎం మరోసారి స్పష్టంగా సూచించారు.

#Prajapalana

https://twitter.com/TelanganaCMO/status/1741002695086117239?t=sYa_8ipIk4urGmUFc1ca-Q&s=19

Thursday, December 28, 2023

BRS పాలనలో 8లక్షలకోట్ల ప్రభుత్వ భూములు కబ్జా

https://x.com/Praja_Snklpm/status/1740623940010291654?t=-3YIbsSpqC1sgy15sufBPg&s=08                                                                                               _*#ప్రజాస్వామికతెలంగాణ సీఎం @revanth_anumula సారుకు దండాలు 🙏*_
_*సర్ గత ప్రభుత్వం /ప్రజాప్రతినిధులు / బ్యూరోక్రాట్స్ /దొర బంధుమిత్రులు ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాలు చేశారు.#మేడ్చల్ జిల్లాలో అయితే చెప్పనక్కరలేదు. ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ల ద్రుష్టికి తీసుకొచ్చినా చర్యలు తీసుకోలేదు.#ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం లో మొత్తం ప్రభుత్వ భూములు &  చెరువులు & (దేవాదాయ & గ్రామకంఠ)భూములను కబ్జా చేశారు. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉంది. వారిమీద చర్యలు తీసుకోవాలి.కబ్జాలు అయిన ప్రభుత్వ భూములను స్వాధీణంచేసుకోవాలి అట్టి భూములను ప్రజాప్రయోజనాలకోసం ఉపయోగించాలి అని 'ప్రజాసంకల్పం' విజ్ఞప్తి చేస్తుంది.*_

*@TelanganaCMO @Bhatti_Mallu @mpponguleti*  *@TelanganaCS @seethakkaMLA @KondaSurekha @DamodarCilarapu @PonnamLoksabha @OffDSB @UttamINC @KomatireddyKVR @zson_bakka @ADayakarINC @RamMohanINC @Congress4TS*

*@dr_mvreddy @RSPraveenSwaero @ProfKodandaram @K_Nageshwar @RamsGTRK @Narhariyarabotu @RaviVattem @BplplH*