Sunday, December 7, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 DAY-1 (DEC 8) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025

*DAY 1 (DEC 8)  CM SIR Schedule*

రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025  ఈరోజు (డిసెంబర్​ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్​ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్​ వేదిక వద్ద  ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలిస్తారు. 

1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

ఈ వేడుకపై ముఖ్యమంత్రి  ప్రసంగిస్తారు.  ప్రజా ప్రభుత్వం రెండేళ్ల  విజయోత్సవాలతో పాటు  తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా  తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. 

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు.  

దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. 

ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్​ రౌండ్​ టేబుల్​ మీటింగ్​ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు  దాదాపు 15  సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. 

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి,  రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా ప్రతినిధులు,  ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్​టైల్​,  ఫర్నిచర్ తయారీ  MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ ​ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్​ టేబుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఏరోస్పేస్, డిఫెన్స్  రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు,  యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ ప్రతినిధులు,  వంతార, VinGroup  ప్రతినిధులు,  వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. 

రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు

Wednesday, December 3, 2025

తెలంగాణలో మరో అవినీతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారి

Sai Kumar, Junior Assistant and In-Charge Sub-Registrar, Sub Registrar Office,Tandur of Vikarabad District along with  D.Saikumar, Document Wtiter and D.Ashoke, Assitant Document Writer, near to the same Sub-Registrar Office, were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.16,500/- from the Complainant "to hand over the registered documents of 4 Plots and also to hand over the remaining documents of 7 plots by registering them, from the 11 Plots related to the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి సంబంధించిన 11 ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్  అయిన 4 ప్లాట్ల యొక్క దస్తావేజులను అప్పగించడం తో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వాటి దస్తావేజులను అప్పగించడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.16,500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయపు ఇన్-చార్జ్ సబ్-రిజిస్ట్రార్  మరియు జూనియర్ అసిస్టెంట్ - సాయి కుమార్, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయ పరిసర ప్రాంతము లోని దస్తావేజు లేఖకుడు - డి.సాయికుమార్ మరియు సహాయక దస్తావేజు లేఖకుడు డి.అశోక్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :https://x.com/TelanganaACB/status/1996208690391662676?t=qcQ9KfMzm0fDzF91qWJaNg&s=19

Sunday, November 30, 2025

Notification for Recruitment of 66 Civil Judge Posts

Notification for Recruitment of 66 Civil Judge Posts

Telangana High Court invites online applications for 66 Civil Judge (Junior Division) posts.
Apply from Dec 8 to 29.
Exam dates, hall tickets & CBT details will be announced on the official website.

Notification is available on the High Court website: tshc.gov.in.

#TelanganaHighCourt #CivilJudgeRecruitment #JudicialService #JobNotification #TSHC #Recruitment2025

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/1995126589244526785?t=M09mtYtmCGxlAOs6FpUUZg&s=19

Friday, November 28, 2025

“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” సీఎం రేవంత్ రెడ్డి


“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ #BharathFutureCity లో జరగనున్న ఈ సదస్సు  నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

❇️హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన  ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

❇️బ్రిటన్ మాజీ ప్రధాని @TonyBlairEU, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం @anandmahindra, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.

❇️#UAE రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, #RasAlKhaimah ప్రతినిధులు, డుయిష్ బోర్సే (#DeutscheBörse) గ్రూప్ హెడ్ Ludwig Heinzelmann , ఎన్రిషన్ (#Enrission) వ్యవస్థాపక భాగస్వామి #Winston, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ #MandaiWildLife గ్రూప్ సీఈఓ Bennett Neo తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

❇️‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.

❇️ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో #TelanganaRisingGlobalSummit2025 ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి గారి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.

❇️తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.

లియోనెల్ మెస్సీ..
❇️రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తారు.

❇️తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ #GOAT లయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది. #Messi #Hyderabad
#MessiInHyderabad #TelanganaRising2047

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1994665836997657072?t=R6pvGVQWiKqQttOC1j0mWQ&s=19

corruption in Telangana State Waqf Board

Hyderabad 28nov2025

MEETING WITH TELANGANA WAQF BOARD CEO, JNB (DR.)MOHAMMED ASADULLAH, LLM ON 27.11.2025 AT HIS OFFICE, ON CWC REPORT ON CORRUPTION, WAQF DATABASE, WAQF BOARD & STAFF LIST, SEC.4 RTI IMPLEMENTATION, PENDING RTI APPLICATIONS, ETC. 

Today 27.11.2025, a delegation viz., Adv Dr Lubna Sarwath, Jnb Mubasheruddin, Jnb Nayeemullah Sharif, Prof Anwar Khan, met Jnb (Dr)Mohammed Asadullah, LL.M, Chief Executive Officer, Telangana  State Waqf Board, Hyderabad, at his office.

A copy of CWC Report 2018, that contained detailed report on corruption in Telangana State Waqf Board since 1996, was submitted to the CEO.  We told him that the Central Waqf Council that detailed cases of WB elected member Mutawalli Akbar Nizamuddin and complicity of then Chief Minister Mr K Chandrasekhar Rao, was already given to Mr Chairman TGWB on 24.09.2025, but we do not have reply till date.  The locked Record Room of Waqf was well highlighted and critiqued in the said Report. 

CEO stated that there is a counter filed in 2019 to this Report.  We assured that, we would also study the 2019 report of the 3-member CWC committee by 1 Rais Khan Pathan .2.Adv. Naushad T.O.  3. Wasim Rahatali Khan and submit the response to the CEO, shortly.

RTI applications that are mandatorily to be put up on Telangana waqf board website under Sec.4 of RTI Act, are pending for reply since September 2025 , were brought before the CEO.  He instructed the concerned staff to reply promptly.  

Database of Waqf was discussed on multiple counts. 

List of Waqf Board members is still not put up on the website for public knowledge was urged upon, for action.  Similarly we exhorted that list of staff of Waqf Board, who are paid public servants, is not exempted under RTI  Act as being claimed by the PIO, TG waqf board.  

We thanked the CEO for his no-nonense approach, sincere hardwork , knowledgeable services and expressed our duas that Allah tala bless him with more strength for righteous work bound by ethics and law.  We extended our support in public interest.

Monday, November 24, 2025

2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు.

2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడుదామని చెప్పారు.

❇️ముఖ్యమంత్రి గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ #HKM వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం @AkshayaPatra ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు.

❇️ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు.

❇️ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన  విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నాం.

❇️ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదే విధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నాం. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదు. ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించాం. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నాం.

❇️#Kodangal నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నాం. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియో థెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభించుకోబోతున్నాం.

❇️రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మించుకుంటున్నాం. గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లే విధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం.

❇️కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించాం.

❇️భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయి. రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చాం. లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం.

❇️కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నాం.

❇️ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ కావాలి. అందుకే వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ (వికారాబాద్, పరిగి కొడంగల్ నారాయణపేట్, మక్తల్) నుంచి కర్నాకట రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదమే  కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేశాం. 70 ఏండ్లుగా వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నాం.

❇️ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండలంలో తొందరలోనే సిమెంట్ పరిశ్రమను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబోతున్నాం.

❇️రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పంపిణీ చేయడానికి కోటి చీరెలను సారెగా నాణ్యత కలిగిన చీరలను అందిస్తున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర అందాలి. ప్రతి ఆడబిడ్డ ఇంటికెళ్లి చీర అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

❇️గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలి.. అని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.

❇️నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని 300 కోట్ల రూపాయల చెక్కును అందించారు. అంతకుముందు మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న బస్సుకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు.

❇️ఈ కార్యక్రమాల్లో మంత్రులు @DamodarCilarapu గారు, వాకిటి శ్రీహరి గారు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. #AkshayaPatraFoundation #MidDayMeals #TelanganaRising2047

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1992953586335265274?t=VAFWVW6a6wjjcteOORYeWw&s=19

Sunday, November 23, 2025

*దుబాయ్ రన్ 2025 ఇన్ మోషన్ లో తెలుగువారు*

*#Dubai #India #dubairun2025*

*దుబాయ్ రన్ 2025 ఇన్ మోషన్:*

*ఒక అద్భుతమైన టైమ్-లాప్స్...*

*_ఈ రోజు ఉదయం దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు లో దుబాయ్ రన్ 2025 కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రన్నింగ్ ట్రాక్‌గా కనిపించడం విశేషం.200+ జాతీయులు, 100లాది  మంది విశ్వాసాలు మరియు మతాలు శాంతి మరియు సామరస్యంతో కలిసి జీవించడం  దుబాయ్ లో చూడటం చాలా అద్భుతం,మన తెలుగు వారు అనేకమైన జనం.జగిత్యాల,కరీంనగర్,నిజామాబాద్ మరియు వివిధ జిల్లాల వారు ఈ దుబాయ్ రన్ లో  పాల్గొన్నారు.నా మిత్రులు దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న మెట్‌పల్లి ప్రాంతానికిచెందిన పొన్నం సత్యనారాయణ పాల్గొన్నారు._*

*@satyan559 cgidubai*
                 https://www.instagram.com/p/DRZVf40EsdN/?igsh=Y25xd2M3cnIwYW9m

మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారు.. సీఎం రేవంత్ రెడ్డి

భగవాన్ సత్య సాయిబాబా గారి ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తెలిపారు. సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.

❇️పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో @VPIndia శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, @TripuraGovernor శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, @AndhraPradeshCM శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ @naralokesh గారితో పాటు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

❇️ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, సాయిబాబా గారి సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ప్రకటించారు.

❇️“సాయిబాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.

❇️సాయి గారు మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వహకుల అందరిలో కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా గారు, వారి ట్రస్టు ద్వారా చేసి చూపించారు. ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

❇️విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నాడు.

❇️పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారు.

❇️మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారు. ఈనాడు 140 దేశాల్లో బాబా గారికి భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారు.

❇️సాయి గారి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.

❇️సత్య సాయిబాబా గారి ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది.." అని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి గారు సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా గారి మహాసమాధిని దర్శించుకున్నారు. @CPR_VP #SriSathyaSaiBaba
#100YearsofSriSathyaSai #Puttaparthi 

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1992496058765897915?t=LahPXT_CIM-kWge3CbaGqw&s=19

Tuesday, November 18, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 

ఈ నెల 27 న రాహుల్ సిప్లిగంజ్ వివాహం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

BREAKING 

రేపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నెక్లెస్ రోడ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం

కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం 

అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని నిర్ణయం 

రేపు సెక్రటేరియట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో మాట్లాడనున్న సీఎం.

అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో మొదలు కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ

చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని నిర్ణయం.  

తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ. 

రేపటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ
 
రెండవ దశలో మార్చి 1నుంచి మార్చి 8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ 

చీరల నాణ్యత విషయంలో రాజీపడకుండా పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.

అయ్యప్ప మాలలో రెవిన్యూ అవినీతి అధికారులు

Kaluva Kiran Kumar, Mandal Surveyor and Mekala Bhaskar, Chainman, O/o the Tahsildar, Secunderabad Mandal in Hyderabad District were caught by the Telangana #ACB Officials, for demanding the #bribe of Rs.3,00,000/- and accepting Rs.1,00,000/- as first installment from the Complainant "for not to take any adverse action on the notice issued against the property pertaining to the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు"
ఫిర్యాదుధారుని నుండి రూ.3,00,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో మొదటి విడతగా రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ - కాలువ కిరణ్ కుమార్ మరియు చైన్ మెన్ - మేకల భాస్కర్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1990799434804797567?t=Dme-Tclsisk7BoT-elQrVg&s=19


Monday, November 17, 2025

🏡 Telangana Tourism – Homestay Applications Invited

🏡 Telangana Tourism – Homestay Applications Invited

To promote world-class, comfortable homestay facilities across district headquarters, rural areas & major tourist destinations, the Government of Telangana is inviting applications to classify fully operational homestay rooms as “Telangana Tourism Homestay Establishments.”

These homestays will offer:
✔️ Clean & comfortable accommodation
✔️ Authentic Telangana cuisine
✔️ A chance for domestic & foreign tourists to experience local culture, customs & traditions

💰 Classification Fees:
• Silver Category – ₹2,000
• Gold Category – ₹4,000
(Payable via DD to “Commissioner/Director of Tourism, Government of Telangana, Hyderabad.”)

📩 Applications & Guidelines:
Available at the Department of Tourism, Hyderabad
OR download from: tourism.telangana.gov.in

📮 Submit Applications to:
Director, Department of Tourism,
Govt. of Telangana,
Kala Bhavan, Ravindra Bharathi, Saifabad, Hyderabad – 500004
📞 040-23459282
📧 director.telanganatourism@gmail.com / telanganatourismpub@gmail.com

#TelanganaTourism #telanganaHomestays #TourismDevelopment #ExploreTelangana #TravelTelangana #TelanganaCuisine #RuralTourism #CulturalTourism #IncredibleIndia #VisitTelangana #TourismOpportunities #iprtelangana #TourismGrowth @TravelTelangana

Courtesy / Source by :
https://x.com/IPRTelangana/status/1989321164657918248?t=VSrucfjUl6XTDYP0PALRuQ&s=19

Sunday, November 16, 2025

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు.

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.

❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.

❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి,  ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.

❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.

❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

#Eenadu #RamojiFilmCity

Courtesy / Source by:

https://x.com/TelanganaCMO/status/1990103785851810087?t=HBHXRhcJGMpw35rL6Gx3iQ&s=19

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు.

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.

❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.

❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి,  ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.

❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.

❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

#Eenadu #RamojiFilmCity

Courtesy / Source by:

https://x.com/TelanganaCMO/status/1990103785851810087?t=HBHXRhcJGMpw35rL6Gx3iQ&s=19

Friday, November 14, 2025

*_అందెశ్రీకి అవమానం.!_*

*_అందెశ్రీకి అవమానం.!_*
_# ఆంధ్రా చిత్ర పరిశ్రమ వింత వైఖరి_
_# కీరవాణి నీకేమైంది.?_
_# డబ్బున్నోడు చస్తే... ఇలాగే చేస్తారా..?_
_# 'ఆంధ్రోళ్లు'కు తెలంగాణలో అధికారిక లాంఛానాలు బంద్ చేయ్యాల.!_

Courtesy / Source by:
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009,  "ఘంటారావం"కు ప్రత్యేకం)_

*_అందెశ్రీ సినిమాలకు కూడా పనిచేశాడు కదా..! ఒకరూ ఇద్దరు మినహా టాలీవుడ్ పెద్దల్లో ఒక్కడైనా సంతాపం ప్రకటించాడా..? బన్నీ తన తెలివితక్కువతనానికి ఒక్కరోజు జైలుపాలయితే అదేదే కుట్రకేసు అన్నట్టుగా టాలీవుడ్ కేరక్టర్లు అన్నీ సంతాపం, మద్దతు ప్రకటించడానికి బన్నీ ఇంటి ఎదుట పొర్లుదండాలు పెట్టాయి కదా..! ‘మెగా విషాదం’ అన్నాయి కదా..!_*

*_కీరవాణి...ఏందీ పని_*
ఓ తెలంగాణ ఆత్మకవి అందెశ్రీ మరణం వారికెందుకు పట్టలేదు..? అవన్నీ ఎందుకు..? కీరవాణి కంపోజర్‌ను పిలిచి తెలంగాణ రాష్ట్ర గీతానికి ట్యూన్ కట్టమన్నారు కదా.! బోలెడంత డబ్బు ఇచ్చారు కదా.! ఓ చెత్తా ట్యూన్ ఇచ్చాడు కదా.! ఐనా తెలంగాణ ఓన్ చేసుకుంది కదా.!

*_డిఫెండ్ చేయకపోతే..!_*
తన మీద వచ్చిన విమర్శలకూ అందెశ్రీయే డిఫెండ్ చేసుకొచ్చాడు. తను మరణించాడు కదా.! మీకెక్కడైనా 'కీరవాణి' అనే మనిషి కనిపించాడా.? మాయమైపోయాడా…?

*_కృతజ్ఞత కూడా లేదా..?_*
నాకైతే ఓ ట్వీట్ గానీ, ఓ పోస్టు గానీ కనిపించలేదు, ఓ సంతాప ప్రకటన లేదు. ఈ మనిషికి అందెశ్రీ పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదా..?
జయజయహే తెలంగాణ గీతానికి కీరవాణి కట్టిన ట్యూన్ ఏమాత్రం పవర్‌ఫుల్‌గా ఓ పోరాట, ఓ రాష్ట్రగీతం స్థాయిలో లేదు అంటే అందెశ్రీ ఒప్పుకోలేదు. ఆ విమర్శ చేసిన వాళ్ల మీదే కోపగించాడు, అంటే కీరవాణికి కోట్ల డబ్బే కాదు, తన మీద విమర్శలకూ అడ్డుగా నిలిచాడు.

*_కీరవాణి కరెన్సీ బంధం_*
నీకు 'ఒక్క తెలంగాణ కంపోజర్ దొరకలేదా.?' అనే ప్రశ్ననూ ఎదుర్కున్నాడు తను. సరే, ఆ పాటతో అందెశ్రీది నెత్తుటి ఉద్వేగ బంధం.! కీరవాణిదేముంది..? జస్ట్, ఓ కరెన్సీ నోెట్ల బంధం… నిజానికి అందెశ్రీ పార్థివశరీరం మీద పూలు జల్లి, నివాళి అర్పించాల్సినవాడు. మరి ఏమయ్యాడు..?

*_వీళ్ళంతా ఇంతేనా..?_*
ఈ రాజమౌళి కుటుంబమంతా ఇంతేనా..? పక్కా కమర్షియల్ బందీలేనా..?
దీనికి రచయిత, నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ స్పందన ఏమిటంటే..? ఆలోచించాల్సిన విషయమే.!

_‘‘మనం వాళ్ల నుంచి ఆ సంస్కారం ఎక్స్ పెక్ట్ చేయడమే తప్పు. ముఖ్యమంత్రితో ప్రయోజనాలు పొందాలని తప్పితే, స్టూడియోలకు స్థలాలు పొందడానికి, సినిమాలకు రాయితీలు పొందడానికి తప్పితే, సినిమా వాళ్ళెవరికీ, తెలంగాణా పట్ల ఎటువంటి అభిమానం లేదు."_

*_'సుద్ద'పూస..బోసు పురాణం_*
తెలంగాణా ఉద్యమం సమయంలో ఈ సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ ఉద్యమ గీతం రాయమని అడిగితే ఉచ్చలు పోసుకున్నరు. ‘మా పొట్ట గొట్టుకుంటమా?’ అని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పుడు సిగ్గు లేకుండా, ముఖ్యమంత్రి ముందర కూర్చుని తెలంగాణా సాంస్కృతిక అభ్యుదయం గురించి మాట్లాడుతున్నారు.

*_వీడో తేడా గాడు_*
ఇంకొకడు, ఉత్తేజ్ అనే థర్డ్ గ్రేడ్ జోకర్, తెలంగాణా ఉద్యమంలో 1200 మంది ఆత్మాహుతి చేసుకుంటే, తాగి పండుకున్నడు గాని, ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు గాని, వైజాగ్ లో ‘హుదూద్’ తుపాను వస్తే మాత్రం హృదయం కరిగి కవితలు రాసిండు జోకర్ గాడు. వీళ్ళిద్దరూ కేసీయార్ ముందు కూర్చుని సినిమా రంగ అభివృద్ధికి సలహాలు ఇచ్చారు. అశోక్ తేజకు, ఈ ప్రభుత్వమైతే ఏకంగా కోటి రూపాయలిచ్చి, అపవిత్రమయింది.

*_జలగల్లా మనను పీక్కు తింటూనే..!_*
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తెలంగాణా పాట పాడమని అడిగితే నిరాకరించాడు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడినా, ఈ సినిమా వాళ్ళు, ఇంకా జలగల్లా మనను పీక్కు తింటూనే ఉన్నారు. సినిమా రంగంలో తెలంగాణా నటులు, టెక్నీషియన్స్ తమది తెలంగాణా అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. ‘జయజయహే’ పాటను ఖూనీ చేసినవాడు ఆ గేయాన్ని రాసిన అందెశ్రీకి నివాళి అర్పిస్తాడని ఎలా అనుకున్నారు. సినిమా రంగం నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా.? స్పందించరు. వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు వేరు.. తెలంగాణ సంప్రదాయాలు వేరు.

*బాక్స్:*
ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి? గండ పెండేరాలు తొడిగేవాళ్లు కాదు, అశ్రునయనాలతో అంతిమ యాత్రలో పాడె మోసేవాడిని చూడు.!

నేనైతే, ఒక కవి పాడెను మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వాల అధినేతలు రాజాంతఃపురాలలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ, ఇలా ఒక కవి అంతిమయాత్రలో పాల్గొన్న వారు లేరు.

ఈ విషయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ను పక్కన పడేసి, మట్టిలో కలిసి మాయమైపోతున్న అందెశ్రీ పార్థివ శరీరం పక్కన నిలవడం, చివరిసారిగా, దింపుడు కళ్ళెం దగ్గర చెవిలో పిలవడం, నోట్లో పాలు పోయడం, అతనికి అందెశ్రీ పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకు తార్కాణం.
రాజకీయాలు, ద్వేషాలు వదిలి, సజల నయనాలతో ఈ దృశ్యాన్ని వీక్షించండి.
జోహార్ ప్రకృతికవి అందెశ్రీ!

*_ఫాంహౌస్ దొర_*
కొండగట్టు అంజన్న గుడి దగ్గర 61 మంది పోతే థూ నా బొడ్డు అన్న గొప్ప ఔదార్యం మన దొర గారిది
ఆర్టీసీ కార్మికులు చస్తుంటే అది ఒడిసిన ముచ్చట
గూడ అంజన్న చావు బ్రతుకులో ఉంటే పట్టించుకోని రియల్ స్టేట్స్‌మాన్

ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్నకు అధికార లాంఛనాలు ఇవ్వని మనిషి
ఆంధ్రా హరికృష్ణకు బుర్రిపాలెం కృష్ణకు అధికార లాంఛనాలతో జరిపిన ఉదార స్వభావం

ఆంధ్రా మాగంటి గోపినాథ్ పోతే వెక్కి వెక్కి ఏడ్చిన సారు, అలగా అందెశ్రీ పోతే అడుగు బయట పెట్టని మహా నటుడు మా సారు...?

*అంకితం*
*_మట్టి కవి అందెశ్రీ అన్నకు_*

Tuesday, November 11, 2025

అందెశ్రీ గారి అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాడె మోశారు

ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థీవ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి గారు వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు.

❇️అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ ఎన్ఎఎఫ్‌సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది.

❇️అందెశ్రీ గారి సతీమణి మల్లుబాయి గారు, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.

❇️సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు @OffDSB గారు, @jupallyk_rao గారు, @seethakkaMLA గారు, @Ponnam_INC గారు, @INC_Ponguleti గారు, @minister_adluri గారు, ప్రభుత్వ సలహాదారులు @Vemnarenderredy గారు, కే కేశవరావు గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు  పాల్గొన్నారు. #AndeSri #JayaJayaheTelangana

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1988184387905855531?t=SzLs7M01dXZFfCSLs6L0sg&s=19

అందెశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు

మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ...

పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ 

వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు 

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరా 

గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ గారు  కూడా ప్రజల్లో  స్పూర్తి నింపారు 

ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది 

అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం 

ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాం 

వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది 

ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ గా ఉపయోగపడుతుంది 

అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో “నిప్పుల వాగు” ను అందుబాటులో ఉంచుతాం 

అందెశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశాం 

ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తాం 

వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలి.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గా వారిని పద్మశ్రీ తో గౌరవించుకునేందుకు కృషి చేద్దాం..
Courtesy 

Saturday, November 1, 2025

*_All D best for Indian proud daughters ✊_*

https://x.com/Praja_Snklpm/status/1984790299189952888?t=y0CmAhCNFhCC82N4b4fsbw&s=08

*_All D best for Indian proud daughters ✊_*

*Let the good wishes flow! 🫶*
*✍️ Send in your message of support for the #WomenInBlue ahead of the #Final 👇*
*#TeamIndia | #CWC25 |*

*#INDvSA*
*#IndianWomenCricket*
*#BCCIWOMEN*
*#ICCWomensWorldCup2025*  
*@BCCIWomen @CVAnandIPS*
*@IPRTelangana @IPR_AP*

*Bplkm✍️*

📲 Just scan & share your experience instantly... Collector,Hyderabad

📢 Dear Citizens,
Your feedback shapes better public service delivery!

💡 We’ve launched the QR Code Feedback System at the #Hyderabad Collectorate.

📲 Just scan & share your experience instantly.

💬 Your voice drives change — every opinion counts!

#PeopleFirst #SmartGovernance #Hyderabad

@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@harichandanaias

Courtesy / Source by :

https://x.com/Collector_HYD/status/1984130048799219843?t=J8vNbN9FQuuonwc4pjlhbQ&s=19


Thursday, October 30, 2025

మొంథా తుపాను... అధికారులకు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశాలు జారీ

మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్‌, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని @TelanganaCS గారిని, @TelanganaDGP గారిని ఆదేశించారు.

❇️వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని ఆదేశించారు.

❇️ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.

❇️పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.

❇️వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి గారు గురువారం రోజున వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. @Collector_WGL @Collector_HNK @cpwarangal #CycloneMontha #Warangal #Hanamkonda #ReliefOperation #SDRF 

Courtesy / source by :

https://x.com/TelanganaCMO/status/1983813217135812623?t=gqrqGNoZQzQ9PmlFQFctkg&s=19

Wednesday, October 29, 2025

మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఆరా...

మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఆరా...

* అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశం...
*  క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని ఆదేశాలు...

హైద‌రాబాద్‌:  మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను బుధ‌వారం ఆరా తీశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం... ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన నేప‌థ్యంలో ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లోనూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం సూచించారు. మొంథా తుపాను ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండ‌డం.. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ జంక్ష‌న్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమ‌డుగు స్టేష‌న్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవ‌డం.. ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు దారి మ‌ళ్లించిన నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. మొంథా తుపాన్ ప్ర‌భావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని.. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాల‌కు త‌గిన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని సీఎం సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్ట‌ర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌న్నారు.  పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సీఎం ఆదేశించారు. తుపాను ప్ర‌భావంతో వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని... అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య‌, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో సాగాల‌ని సీఎం సూచించారు.  హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Tuesday, October 28, 2025

PUBLIC/PRESS NOTE

28.10.2025 Hyderabad

PUBLIC/PRESS NOTE

On 27.10.2025 hearing was held at Real Estate Appellate Tribunal, MCRHRD campus, Hyderabad in Dr Lubna Sarwath vs Phoenix Global Spaces Pvt Ltd & Ors. 

On 7.10.2025 Phoenix was instructed to file Building permissions, TGRERA registrations , all related documents, yet they were not filed.
Appellant filed rejoinder to the counter affidavit of R1 & R2.  
The Counter filed on 7.10.2025 by R1&R2 does not answer any of the grounds of the appeal, rather they gone into same rhetoric of ‘maintainability’ of appellant,  etc.

Prima facie analysis shows that at the date of TGRERA Order dt. 27.03.2025 the
said survey numbers 272 and 273 Puppalguda V Gandipet M, RR District, were held in Prohibited List which was blatantly denied in the TGRERA Order, that clearly indicates the collapse of TGRERA Order and exposes the unfairness of TGRERA order and all the Respondents.

Secondly, it is observed that R1 hastens with another letter to get the said survey numbers
to the said extent to be deleted from Prohibited List after this Appeal is filed in this Hon’ble
Tribunal. The said District Registrar obliges by a mere letter from the Tahsildar. All due procedure
has been manipulated by the Respondents.

As the Respondents private and state are seen to be colluding with one another it is
appealed once again to the Tribunal that the TGRERA Registrations be suspended pending thorough investigation, to save allottee interests that is one of the primary objectives of the RERA Act 2016 and objective of this Hon’ble Tribunal.

Thanks
Dr Lubna Sarwath, Social & Environmental Activist, Indian National Congress, Hyderabad

Friday, October 24, 2025

*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*

*ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.* https://x.com/Praja_Snklpm/status/1981715955261870362?t=J2iZUdkbNA8zLBQGpNmO2Q&s=08

*ఆదాబ్ హైదరాబాద్: 24 Oct 2025*

*సికింద్రాబాద్ ఎస్టేట్ భూములు & అబ్దుల్లాపూర్ మెట్ అటవీభూములు*

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ??*

*@HMDA_Gov @Comm_HYDRAA*

*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @Aadabtvlive @iamkondasurekha @HarithaHaram @CollectorRRD @Acpibrahimpatnm @Tahsildaribp @IbrahimpatnamPS @PIBHyderabad @BplplH*

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :

1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం. రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా – గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

2.బడంత్ర జయసూర్య (వయసు 24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.

3.అండోజ్ నవీన్ కుమార్ (వయసు 26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి చికిత్సలో ఉన్నారు.

4.సరస్వతి హారిక (వయసు 30), తండ్రి రంగరాజు, బెంగళూరు – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు.

5.నెలకుర్తి రమేష్ (వయసు 36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలు, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

6.శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (వయసు 8), అభీరా (వయసు 1.8 సంవత్సరాలు) – ముగ్గురు సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు.

7.కపర్ అశోక్ (వయసు 27), తెలంగాణ రాష్ట్రం – సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు.

8.ముసలూరి శ్రీహర్ష (వయసు 25), నెల్లూరు జిల్లా – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.

9.పునుపట్టి కీర్తి (వయసు 28), ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్ – చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు.

10.వేణుగోపాల్ రెడ్డి (వయసు 24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.

11.ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా – చికిత్స పూర్తయి హైదరాబాద్ చేరుకున్నారు.

12.ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

13.అశ్విన్ రెడ్డి – ఎటువంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు.

14.ఆకాశ్ – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.

15.జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్‌ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు.

16.పంకజ్ ప్రజాపతి – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.

17.గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా – స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.

18.శివా (గణేష్ కుమారుడు) – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.

19.గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.

20.చారిత్ (వయసు 21), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.

21.మొహమ్మద్ ఖిజర్ (వయసు 51), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.

22.తరుణ్ (వయసు 27) – బస్సులో ఎక్కకముందే రద్దు చేసుకున్నారు.

డ్రైవర్ల వివరాలు
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్‌. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత అబ్స్కాండ్‌ అయ్యారు (సంఘటన స్థలం నుండి పరారయ్యారు).
2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్‌. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్నారు మరియు విచారణ కొనసాగుతోంది.

ప్రయాణికుల రాష్ట్రాలవారీగా:
👉తెలంగాణ రాష్ట్రం – 6
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11
👉మధ్యప్రదేశ్ – 1
👉కర్ణాటక రాష్ట్రం – 4

మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.
@Collector_JGL 

Source / Courtesy by :

https://x.com/IPRTelangana/status/1981664928810373602?t=mn9So2NzD25H5Ck_ZfvJ9w&s=19

Tuesday, October 21, 2025

*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*

*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ బూర్గుల సుమన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈమె హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి  బూర్గుల రామకృష్ణారావు సోదరుడి కుమార్తె , బూర్గుల నరసింగరావు చెల్లెలు. ఈమె బూర్గుల గ్రామానికి ఒక సారి ఎంపీటీసీ గా మరియు సర్పంచ్ గా సేవలందించారు.. అంతే కాకుండా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో తాను టీచర్ గా తన దగ్గర చదువుకున్న ఆ నాటి విద్యార్ధుల సహకారం తో బూర్గులలో "ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్" ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నేడు ఈ అసోసియేషన్ అనేక గ్రామాలకు విస్తరించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది.. అంతేకాదు తాను చనిపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగ పడాలని హాస్పిటల్ కి దానం చేస్తున్నట్లు వీలునామా రాసుకున్న గొప్ప వ్యక్తి.  ఆమె లేని లోటు బూర్గుల గ్రామ ప్రజలతో పాటు చుట్టూ పక్కల ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... 
(Courtesy/ Source)by:➡️𝗚𝗡𝗥

Sunday, October 19, 2025

*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*

https://youtu.be/iO9xmgfmQJ4?si=N2yCnNSiZj8XJ5ZY  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*
 
*_#TelanganaRising అంటే అవినీతి లో అని అన్ని ప్రభుత్వ శాఖల అవినీతి ప్రభుత్వ అధికారులు / అవినీతి ప్రజాప్రతినిధులు రుజువు చేస్తుండ్రు._*

*@MNatarajanINC*
*@TelanganaCMO* *@CPRO_TGCM @IPRTelangana @TelanganaCS* *@INC_Ponguleti @Bmaheshgoud6666 @PIBHyderabad @aadabhyd* *@INCTelangana @RamMohanINC @TRPpartyTG @BplplH*

https://x.com/Praja_Snklpm/status/1979811942740197680?t=GUsxMmL2fm-ktcjHw3-cOg&s=19
               *****
https://www.instagram.com/reel/DP-5TBHEoOC/?igsh=eTJkNWt6eW1va243
               *****
https://www.facebook.com/share/1CMgZLpaWM/