వంగవీటి రంగా గారి వారసత్వం ఆశయాల అడుగుజాడలా? రాజకీయ స్వార్థాలా?
ఇది ఆత్మ పరిశీలన సమయం..
వంగవీటి రంగా గారి వారసత్వం అనేది కేవలం రక్త సంబంధమో లేదా ఒక కులానికో పరిమితమైనది కాదు; అది ఆయన ప్రాణాలకు పణంగా పెట్టిన ఆశయాల వారసత్వం.
సామాజిక న్యాయం, సమానత్వం, మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిలబడ్డ విలువల సమాహారమే నిజమైన రంగా గారి వారసత్వం.
రేపు ఆయన 38వ వర్ధంతి సందర్భంగా భారీ సభలు, వేడుకలు నిర్వహిస్తున్న వారు.. ఆ రంగా గారి ఆశయాలకు ఇప్పటి వరకూ ఎంతవరకు నిబద్ధులుగా ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
కేవలం కుల గుర్తింపుతోనో లేదా ఎన్నికల రాజకీయ లాభాల కోసమో ఆయన పేరును వాడుకోవడం రంగా గారి త్యాగానికి మనం చేసే ద్రోహం తప్ప మరొకటి కాదు.
భారీ బహిరంగ వర్ధంతి సభల వెనుక ఉన్న శక్తులు ఎవరు? వారి అసలు లక్ష్యం సామాజిక న్యాయమా లేక వ్యక్తిగత రాజకీయ స్వార్థమా అన్న విశ్లేషణ జరగాలి? దీనిపై సమాజం అప్రమత్తంగా ఉండాలి.
ఇది నేను ఏ రాజకీయ పార్టీ తరపునో లేదా ఒక సామాజిక వర్గం తరపునో ఇస్తున్న సందేశం కాదు. స్వయంగా రంగా గారితో, ఆయన అనుచరులతో నాకు ఉన్న సన్నిహిత సంబంధం వల్ల.. ఆయన ఆశయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక బాధ్యతాయుత పౌరుడిగా ఈ ఆవేదనను మీతో పంచుకుంటున్నాను.
వంగవీటి రంగా గారి ఆశయాలను తమ జీవితాల్లో ఆచరించి చూపినవారే ఆయన నిజమైన వారసులు. అది లేనప్పుడు జరిగేదంతా కేవలం కుల రాజకీయమే తప్ప సమాజ హితం కోసం కాదు.
సమసమాజ నిర్మాణమే రంగా గారి ఆశయం.. అందుకే ఆయన అమరుడు. ఆయన ఆశయాలు అజరామరం.
జోహార్ వంగవీటి రంగా!
వంగవీటి రాధాకృష్ణ గారు తన తండ్రి స్థాయిని అందుకోలేకపోయునా ఆయన ఆశయాలకు భంగం కలుగకుండా చూసారు, అమ్ముకోలేదు అన్నది నా అభిప్రాయం
#VangaveetiMohanaRanga
#VangaveetiMohanaRangaVardanti
#SocialJustice
Courtesy / Source by :
Bolisetty Satyanarayana
No comments:
Post a Comment