మండల ప్రాథమిక పాఠశాల రామాంతపూర్ నందు గల పాఠశాలలో 255 మంది విద్యార్థులకుగాను టీచర్స్ 8 మంది కావల్సి ఉండగా నలుగురు టీచర్స్ ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులకు సరైన పద్ధతిలో భోధన చేయలేక పోతున్నాం. కావున విద్యావాలంటరు టీచర్ను మీ ద్వారా పంపగలరు. పాఠశాల ప్రైమిసన్ నందు హైస్కూల్ విద్యార్థులు సుమారు 700, మొత్తం ప్రైమరి, హైస్కూల్ కలిపి 1000 మంది విద్యార్థులు ఉండడంతో మంచినీరు సరిపోవడం లేదు. మాకు అదనపు కనెక్షన్ ఇప్పించగలరు, యూరినల్స్, డ్రైలేజ్ బయటకు వెళ్ళే దారి బాగోలేక దుర్ఘందపు వాసనతో విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది మరియు MDM పథకము క్రింద విద్యారులందరికి ఇక్కడే వంట చేసి పెట్టే అవకాశం ఉన్నప్పటికి దానికి షేడ్డు లే లేకపోవడంతో వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కావున పాఠశాల నందు తరగతి గదులు సరిపోక పోవడంతో విద్యార్థులకు భోదన బయట చేయల్సి వస్తుంది మాకు బిల్డింగ్ పైన మూడు రూమ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు గారు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment