జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో 252 ను సవరించాలి.. జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్..
హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జర్నలిస్టులు..!
జీవో 252 ను వ్యతిరేకిస్తూ
* మేడ్చల్ కలెక్టరేట్ ముందు
* టీయూడబ్ల్యూజే (హెచ్ 143) ధర్నా..!
*
* సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతిపత్రం..!
*
రెండు కార్డుల విధానాన్ని స్వస్తి పలకాలి.. బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్* కోల వెంకటేశ్వర్లు
SOURCE:
మేడ్చల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 27 ..
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ బృందం బొమ్మ అమరేందర్ ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీయూడబ్ల్యూజే (TUWJ-H-143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేడ్చల్ జిల్లా జర్నలిస్టులతో కలిసి ఆందోళన ధర్నా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లాలోని, కుత్బుల్లాపూర్ కూకట్పల్లి,మల్కాజ్గిరి మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అక్రిడిటెషన్ కార్డులకోత విధించే జీవోలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ 252 జీవో తీసుకురావడం శోచనీయమన్నారు. లోప భూయిష్టమైన ఈ జీవో వల్ల మేడ్చల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ కేంద్రాల్లో, లక్ష జనాభా దాటిన పట్టణాల్లో అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. కొత్త జీవో వల్ల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అనేకమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటెషన్ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని, జీవో 252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదనీ , దీని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
పాత జీవో 239 యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అందించాల్సిన ఆర్టీసీ బస్ పాస్ కు సంబంధించిన స్పష్టమైన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు కోరారు.
ధర్నా అనంతరం జర్నలిస్టు సమస్యలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు
* అక్రిడిటెషన్ కార్డులతో పాటు జర్నలిస్టుల సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమస్యలను పరిష్కరించమని, మీ ద్వారా ప్రభుత్వానికి తెలుపవలసిందిగా వారు కోరారు. మేడ్చల్ జిల్లా జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని అక్రిడేషన్ల కార్డులను కోత విధించవద్దని కోరగా అదన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల నివాస స్థలాల విషయంలోనూ సాధ్యాసాధ్యాలను కలెక్టర్ కలెక్టర్ తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు శివాజీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, మేడ్చల్ జిల్లా స్టాపర్స్, మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, రవిచంద్ర (దిశ,) , రామారావు (నమస్తే తెలంగాణ) , హనుమంత రెడ్డి (విజయ క్రాంతి), రచ్చ శ్రీనివాస్ (ఆంధ్రప్రభ),, భరత్ కళ్యాణ్ (జనం సాక్షి), కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు సుధీర్ మంకాల, కృష్ణారెడ్డి, కూకట్పల్లి అధ్యక్ష కార్యదర్శులు యాకయ్య నాగరాజు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు , బండారి జార్జ్ విల్సన్, గిరి గౌడ్ కాప్రా ప్రెస్ క్లబ్ కాప్రా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దొమ్మటి కిరణ్ కుమార్ రావు,
జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ జవహర్ నగర్ ప్రెస్ క్లబ్, జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ కీసర ప్రెస్ క్లబ్ కీసర ప్రెస్ క్లబ్ మేడ్చల్ ప్రెస్ క్లబ్ షామీర్పేట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ నేత, అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి, మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సోమయ్య నాగభూషణ చారి,నవీన్ కుమార్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు మురళి యాదవ్, జిల్లా నియోజకవర్గ నాయకులు,, వెంకట నాయుడు,అక్కల రాజు గౌడ్, పాండుగౌడ్ నమస్తే తెలంగాణ బాపు కొలిపాక వెంకట్, బాన్సువాడ వెంకట్ ఎర్రోళ్ల బాబు ఎర్రోళ్ల కృష్ణ ఎర్రం పెంటయ్య వీరేడ్ శివకుమార్ పిట్ల శివకుమార్ పక్కనే పాండురంగం బిక్షపతి యాకూబ్ శ్రీనివాస్ ప్రసాద్,, రామకృష్ణ, బబ్బి కాంత్, జవహర్ నగర్ నాయకులు, గుమ్మడి వెల్లి సత్యనారాయణ, పోరండ్ల యాదగిరి, పెద్ది రమేష్,తుని రమేష్ చారి, తుటి శ్రీనివాస్ వెంకటకృష్ణ, లక్ష్మణ్, మధు, ప్రశాంత్ నరేష్ చారి, రాము పురేందర్ శ్రీధర్, పందిరి శ్రీనివాసులు, కిట్టు వంశీ, రాజు రాజేందర్ కుమార్, నాగేందర్ అబ్దుల్, మల్లేష్ నర్ర శ్రీనివాసరెడ్డి శివకుమార్, సందీప్ శ్రీనివాస్, కనకయ్య, వెంకట్ కుమారస్వామి, నరేష్ జి ఎన్ కిషోర్ మంద స్వామి దాస్, నవీన్ చారి అరుణ్ శ్రీధర్ మే రోజు రామబ్రహ్మం బుచ్చిరెడ్డి మల్లేష్ గౌడ్ రఘు,,యూనియన్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment