*గణపతి నిమజ్జన ఊరేగింపు ఉత్సవాన్ని ఆపివేయాలని వేసిన పిటిషన్ కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు*
*ప్రభుత్వం పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం వరకే ఊరేగింపులు ఆపడానికి కాదు*
*దేశంలో గణేశ్ ఉత్సవం కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు*
*అది సమైక్యత, ఆనందం, సాంస్కృతిక వైభవానికి ప్రతీక*
*మతం పేరుతో, ప్రార్థనా స్థలాల పేరుతో ఊరేగింపును ఆపడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు*
*తీర్పుపై పలు హిందూ సంఘాలు హర్షం*
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు ఆపివేయాలని కోరుతూ కొంత మంది పిటీషన్ వేశారు.
ఈ మేరకు పిటిషన్ ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది
గత ముప్పై ఏళ్లుగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు జరుపుతున్న మార్గం మార్చకూడదని కోర్టు స్పష్టంగా తెలిపింది.
రోడ్లు అన్నీ ప్రజలకే చెందుతాయని, మతం పేరుతో, ప్రార్థనా స్థలాల పేరుతో ఊరేగింపును ఆపడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పోలీసులు చేసే పని ఏమిటంటే – శాంతి భద్రతను కాపాడటం మాత్రమే, ఊరేగింపును ఆపడం కాదనీ స్పష్టం చేసింది
గణేష్ నిమజ్జనం ఊరేగింపు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మత స్వేచ్ఛకు గౌరవం చూపిన చారిత్రక తీర్పుగా నిలిచింది.
ఈ తీర్పుపై పలు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ధర్మానికి మార్గం ఎవరూ మూయలేరని, మత స్వేచ్ఛ అందరి హక్కు అని ఆ హక్కును వినియోగించే క్రమంలో ఇతర మతాల గౌరవాన్ని కాపాడటం అందరి కర్తవ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...
SOURCE
No comments:
Post a Comment