Saturday, August 30, 2025

*ప్రభుత్వం పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం వరకే ఊరేగింపులు ఆపడానికి కాదు*

*గణపతి నిమజ్జన ఊరేగింపు ఉత్సవాన్ని ఆపివేయాలని వేసిన పిటిషన్ కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు* 

*ప్రభుత్వం పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం వరకే ఊరేగింపులు ఆపడానికి కాదు* 

*దేశంలో గణేశ్ ఉత్సవం కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు*
 
*అది సమైక్యత, ఆనందం, సాంస్కృతిక వైభవానికి ప్రతీక*

*మతం పేరుతో, ప్రార్థనా స్థలాల పేరుతో ఊరేగింపును ఆపడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు*

*తీర్పుపై పలు హిందూ సంఘాలు హర్షం*

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు ఆపివేయాలని కోరుతూ కొంత మంది పిటీషన్ వేశారు.

ఈ మేరకు పిటిషన్ ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది

గత ముప్పై ఏళ్లుగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు జరుపుతున్న మార్గం మార్చకూడదని కోర్టు స్పష్టంగా తెలిపింది.

రోడ్లు అన్నీ ప్రజలకే చెందుతాయని, మతం పేరుతో, ప్రార్థనా స్థలాల పేరుతో ఊరేగింపును ఆపడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పోలీసులు చేసే పని ఏమిటంటే – శాంతి భద్రతను కాపాడటం మాత్రమే, ఊరేగింపును ఆపడం కాదనీ స్పష్టం చేసింది

గణేష్ నిమజ్జనం ఊరేగింపు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మత స్వేచ్ఛకు గౌరవం చూపిన చారిత్రక తీర్పుగా నిలిచింది.

ఈ తీర్పుపై పలు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ధర్మానికి మార్గం ఎవరూ మూయలేరని, మత స్వేచ్ఛ అందరి హక్కు అని ఆ హక్కును వినియోగించే క్రమంలో ఇతర మతాల గౌరవాన్ని కాపాడటం అందరి కర్తవ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు... 
SOURCE 

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*


https://x.com/Praja_Snklpm/status/1961780023326818501?t=fHYGLczzaq7xOqBCokSD1w&s=08  
                    *****
https://www.facebook.com/share/p/16EfC5z2AD/

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*రామంతాపూర్ లో కరెంటు షాక్ తో 6గురు మరణించినా అధికారుల & సిబ్బంది పర్యవేక్షణ ఎలా ఉందొ ఈ ఫొటోస్ చూస్తే అర్ధం అవుతుంది.*

*Land Mark : Near bharath nagar community hall, Ramanthapur*
 
*@tgspdcl  @se_op_habsiguda*

*#TelanganaHighCourt*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @Eatala_Rajender @BrsBandari @HRF_Humanrights @IndiaToday @BplplH @GHMCOnline @UppalPS2 @uppalps_ @Dc_Ghmc*

Friday, August 29, 2025

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

A #DisproprtionateAssets (DA) Case has been registered against Bandi Nageswara Rao, Tahsildar of Warangal Fort Mandal in Warangal district by Telangana #ACB Officials.

#ACB Officials conducted searches at 7 locations linked to him and his relatives. Movable and immovable properties including 1- House (1.15 Cr), Agricultural land -17.10 Acres (1,43 Cr), Ornaments (Gold - 70 Tulas & Silver 1.791 Kg), Wrist watches-23 and Vehicles (Four wheelers-2 & Two wheeler-1) along with Household articles were unearthed. The worth of the identified properties about Rs.5,02,25,198/- as per document value. Case is under investigation.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"వరంగల్ జిల్లా లోని వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ - బండి నాగేశ్వర్ రావు పైన #అక్రమఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

#అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధం గల 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి 1- భవనం (1.15 కోట్లు), 17.10 ఎకరాల (1,43 కోట్లు) వ్యవసాయ భూమి, ఆభరణాలు (బంగారం - 70 తులాలు & వెండి 1.791 కిలోలు), చేతి గడియారాలు - 23,  వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు - 2 & ద్విచక్ర వాహనం - 1)  మరియు  గృహోపకరణాలు వంటి స్థిర మరియు చరాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించినారు. గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం దాదాపు రూ.5,02,25,198/-. కేసు దర్యాప్తులో ఉన్నది.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1961415148503273713?t=46zz2u8beYE7vzx1Drk_tQ&s=19

Wednesday, August 27, 2025

*_ఈరోజు మా ఇంట్లో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 🙏._*

https://x.com/Praja_Snklpm/status/1960605019658715309?t=OIm1y5zDtawLNMKA-wwA5g&s=08 
                 *****
https://www.instagram.com/p/DN2dco2ZPZY/?igsh=Ynhkajk1bHRoYXZ4
                *****
https://www.facebook.com/100006620980242/posts/4232177663679558/?mibextid=rS40aB7S9Ucbxw6v

*_ఈరోజు మా ఇంట్లో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 🙏._*

*_గత 9 సంవత్సరాలుగా #HMDA & #GHMC సహకారంతో హైదరాబాద్ జిందాబాద్ / ప్రజాసంకల్పం ఆధ్వర్యంలో "శ్రీనిధి మహిళా ఫౌండేషన్" సంస్థ ద్వారా మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నాము...రామంతాపూర్ లో 26/08/2025 రోజు సాయంత్రం 6గంటలకు "Pushpa fashions" & "ప్రజాసంకల్పం"  కలం యోధుల మీడియా కార్యాలయం, RTC కాలనీ  వద్ద విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది._*

*@TelanganaCMO*
*@AndhraPradeshCM*
*@CPRO_TGCM @IPR_AP @IPRTelangana @TelanganaCS @HMDA_Gov @GHMCOnline* *@HyderabadCitiz9 @BplplH @UNTGAPS @RachakondaCop @hydcitypolice @cyberabadpolice*

Tuesday, August 26, 2025

సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం కాక నాగలక్ష్మీ.

సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీటు సాధించిన  ఆదివాసి ఆణిముత్యం కాక నాగలక్ష్మీ.

డిగ్రీ ఫైనల్ ఇయర్  చివరి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మధ్యలో రోడ్డు యాక్సిడెంట్లో తండ్రి  కాక కృష్ణ మరణం అయినప్పటికీ కూడా అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేసి మరుసటి రోజు ఉదయం ఎగ్జామ్స్ కొరకు ప్రయాణం.

గంగదేవి గుప్ప మారుమూల గ్రామంనుండి సెంట్రల్ యూనివర్సిటీలో  పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సీటు సాధించిన తొలి విద్యార్థినీ కాక నాగలక్ష్మి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంగదేవిగుప్ప గ్రామం    పాల్వంచ మండలం కి చెందిన    కోయ తెగ అమ్మాయి  కాక నాగలక్ష్మి  ఈమె తండ్రి కాక కృష్ణ వ్యవసాయ కూలీ తల్లి కాక పద్మ వీరి మొదటి సంతానం నాగలక్ష్మి. తండ్రికి చదువు లేకపోతే పదవ తరగతి వరకు చదివిన తల్లి పద్మ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి భద్రాచలం ఐటిడిఎ ద్వారా నడపబడుతున్న గురుకులాలలోని ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేసి అదేవిధంగా కొత్తగూడెంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మహిళలు )డిగ్రీ కాలేజీ లో  బి ఏ హెచ్  యి పి లో డిగ్రీను పూర్తి చేసిన కాకా నాగలక్ష్మి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న తరుణంలో వారి నాన్నగారికి రోడ్డు యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న   అమ్మాయి చదువుకి ఇబ్బంది కలుగకూడదని తల్లి పద్మ నిర్ణయం తీసుకొని చివరిదాక తండ్రి మృతి చెందిన విషయం చెప్పకుండా ఎప్పటికప్పుడు  డిగ్రీ గురుకులం  యాజమాన్యంతో మాటలాడి అదే రోజు తండ్రి అంత్యక్రియలు  నిర్వహించి ఉదయాన్నే పరీక్షకుహాజరై గురుకుల డిగ్రీ కళాశాల  అధ్యాపకుల  సూచనలు సలహాతో  పరీక్షలకు హాజరై  డిస్టింక్షన్ లో డిగ్రీ ఉత్తీర్ణత అవటం జరిగినది.
జాతీయస్థాయి యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం నిర్వహిస్తున్నటువంటి Central Universities Common Entrance Test (CUCET), with the National Testing Agency (NTA) ద్వార నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగినది. 
కాక  నాగలక్ష్మి గంగదేవి గుప్ప గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని  ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ పాల్వంచలోను మరియు పదవ తరగతి భద్రాచలం లిటిల్ ఫ్లవర్ స్కూల్లోనూ అక్కడనుండి అంకంపాలెం  గురుకుల కళాశాలలోని ఇంటర్మీడియట్  సిఇసి  విభాగంలో పూర్తి చేయడం జరిగినది. తర్వాత డిగ్రీ కొరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో సీటు సాధించి డిగ్రీని పూర్తిచేయడం జరిగినది. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సంకల్పంతో అధ్యాపకుల యొక్క సలహాలు సూచనలతో ఇక్కడ వరకు చేరుకోగలిగింది అని తల్లి పద్మ తెలియచేసింది.
SOURCE by : P. Pradeep kumar 

Monday, August 25, 2025

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం


https://youtube.com/shorts/x9PiET8YqPk?si=sMQLfEGXkm1gHomW 
               *****
https://www.instagram.com/reel/DNxxoPU5IbB/?igsh=MXNreHJsamhqYTZvZg==
                 *****
https://www.facebook.com/100006620980242/posts/4230284123868912/?mibextid=rS40aB7S9Ucbxw6v

*_గత 8 సంవత్సరాలుగా మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ...రామంతాపూర్ లో 26/08/2025 రోజు....Bplkm✍️_*

Saturday, August 23, 2025

తెలంగాణ అవినీతి పోలీస్ అధికారి

Bhukya Rajesh, Inspector of Police, SHO of Dornakal Police Station in Mahabubabad district and his gunman Daravath Ravi, Police Constable were caught by Telangana #ACB Officials for demanding the #bribe of Rs.50,000/- and accepting Rs.30,000/- from the complainant for doing an offical favour "To release the seized vehicle of the Complainant, in a case registered in Dornakal Police Station and to extend the cooperation in that case."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని వాహనాన్ని డోర్నకల్ రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసులో జప్తు చేయగా, దాన్ని విడుదల చేయడానికి మరియు ఆ కేసులో అతనికి సహకారాన్ని అందించడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.50,000/- #లంచం డిమాండ్ చేసి, అందులోనుండి రూ.30,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రక్షకభట నిలయాధికారి & ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - భూక్యా రాజేష్ మరియు అతని గన్ మెన్ & పోలీస్ కానిస్టేబుల్ ధారావత్ రవి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1959253348353446067?t=LQTpLuRk86bq2UQHPfKjOA&s=19