సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం కాక నాగలక్ష్మీ.
డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మధ్యలో రోడ్డు యాక్సిడెంట్లో తండ్రి కాక కృష్ణ మరణం అయినప్పటికీ కూడా అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేసి మరుసటి రోజు ఉదయం ఎగ్జామ్స్ కొరకు ప్రయాణం.
గంగదేవి గుప్ప మారుమూల గ్రామంనుండి సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సీటు సాధించిన తొలి విద్యార్థినీ కాక నాగలక్ష్మి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంగదేవిగుప్ప గ్రామం పాల్వంచ మండలం కి చెందిన కోయ తెగ అమ్మాయి కాక నాగలక్ష్మి ఈమె తండ్రి కాక కృష్ణ వ్యవసాయ కూలీ తల్లి కాక పద్మ వీరి మొదటి సంతానం నాగలక్ష్మి. తండ్రికి చదువు లేకపోతే పదవ తరగతి వరకు చదివిన తల్లి పద్మ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి భద్రాచలం ఐటిడిఎ ద్వారా నడపబడుతున్న గురుకులాలలోని ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేసి అదేవిధంగా కొత్తగూడెంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మహిళలు )డిగ్రీ కాలేజీ లో బి ఏ హెచ్ యి పి లో డిగ్రీను పూర్తి చేసిన కాకా నాగలక్ష్మి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న తరుణంలో వారి నాన్నగారికి రోడ్డు యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మాయి చదువుకి ఇబ్బంది కలుగకూడదని తల్లి పద్మ నిర్ణయం తీసుకొని చివరిదాక తండ్రి మృతి చెందిన విషయం చెప్పకుండా ఎప్పటికప్పుడు డిగ్రీ గురుకులం యాజమాన్యంతో మాటలాడి అదే రోజు తండ్రి అంత్యక్రియలు నిర్వహించి ఉదయాన్నే పరీక్షకుహాజరై గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకుల సూచనలు సలహాతో పరీక్షలకు హాజరై డిస్టింక్షన్ లో డిగ్రీ ఉత్తీర్ణత అవటం జరిగినది.
జాతీయస్థాయి యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం నిర్వహిస్తున్నటువంటి Central Universities Common Entrance Test (CUCET), with the National Testing Agency (NTA) ద్వార నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగినది.
కాక నాగలక్ష్మి గంగదేవి గుప్ప గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ పాల్వంచలోను మరియు పదవ తరగతి భద్రాచలం లిటిల్ ఫ్లవర్ స్కూల్లోనూ అక్కడనుండి అంకంపాలెం గురుకుల కళాశాలలోని ఇంటర్మీడియట్ సిఇసి విభాగంలో పూర్తి చేయడం జరిగినది. తర్వాత డిగ్రీ కొరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో సీటు సాధించి డిగ్రీని పూర్తిచేయడం జరిగినది. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సంకల్పంతో అధ్యాపకుల యొక్క సలహాలు సూచనలతో ఇక్కడ వరకు చేరుకోగలిగింది అని తల్లి పద్మ తెలియచేసింది.
SOURCE by : P. Pradeep kumar
No comments:
Post a Comment