Thursday, December 7, 2023

కడియం ఖబడ్దార్.!

కడియం ఖబడ్దార్.!



● జర్నలిస్ట్ సంఘాల బహిరంగ సవాల్
● ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు..!
● 'కులం' కార్డ్ వెనుక దొర..!
● దొర బాగోతం ఆధారాలతో ఆదివారం ఉదయం బట్టబయలు చేస్తా.!
● దమ్ముంటే ఆ విషయంపై మాట్లాడు.!
● సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?

(అనంచిన్ని వెంకటేశ్వరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయులు, 9440000009)

ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతోంది.? ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటామని బరితెగించి బహిరంగంగా చెప్పటం.. అదీ ఓ సీనియర్ మాజీమంత్రి కడియం ఇటీవల శ్రీహరి వాఖ్యానాలకు ఇది బహిరంగ సవాల్.! దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. లేదంటే నా కలం పదును ఓ 'అణుబాంబు' లాంటిది. దొర పాలన వద్దని మిమ్మల్ని, ప్రజాస్వామ్య పాలన కావాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించారు ప్రజలు. మీకు, కాంగ్రెస్ కు మధ్య నేను అనే అనంచిన్ని వెంకటేశ్వరావు ఉన్నాడు. నన్ను దాటుకొని వెళ్ళగలరా..? దమ్ముంటే ఆపు.! ఫాంహౌస్ లో నిద్రపోతున్న కేసీఆర్ గురించి ఈనెల 10న, ఉదయం 10.00 గంటలకు ట్రైన్ EXCLUSIVE ఛానల్ లో ప్రత్యేక పరిశోధన కథనం ఇస్తా... లింక్ ఇదే...!

https://www.youtube.com/live/XiRyo3HXglk?si=85P6YlYGrD_o-xIO

అసలేం జరిగిందంటే..?:
ఒక్క కేసీయార్ చేశాడని ఏమీ లేదు. దేశమంతా జరుగుతున్నదే.! ఎమ్మెల్యేలు, ఎంపీలు 'అమ్మకపు సరుకు' కావడం ఈ దేశం దౌర్భాగ్యం..! సో, ఫలానా పార్టీ దీనికి అతీతంగా ఉందని ఏమీ చెప్పలేని దురవస్థ..! ఇక కొన్ని విషయాలు చెప్పుకుందాం.!

నేను 'అంత ఘోరంగా పాలించానా..?
మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరీ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కొట్టేస్తే చంద్రబాబు బాగా బాధపడ్డాడు.! నేను 'అంత ఘోరంగా పాలించానా..? ప్రజలకు, రాష్ట్రానికి ఏం నష్టం చేశాను..?' అనేది తన ఆవేదన.! నిజానికి కేసీయార్ కూడా అలా భావించాల్సిందే.! తను ఏ ఆంధ్రులనైతే ద్వేషిస్తూ తన పొలిటికల్ కెరీర్‌ను పీక్స్‌లోకి తీసుకెళ్లాడో, ఆ ఆంధ్రులే ఈరోజు తన వెనుక నిలబడి ఓట్లేశారు… హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కొన్ని ప్రాంతాల సీట్లు వాళ్ల పుణ్యమే.! అవే లేకపోతే కేసీయార్ సీట్లు కూడా ఏ 23 దగ్గరోె ఆగిపోయేవి.! ఇది ఫక్తు రియాలిటీ.!

అది స్వయంకృతం.!
ఏ తెలంగాణవాదాన్ని నమ్మాడో, ఏ తెలంగాణవాసినే నమ్మాడో ఆ తెలంగాణ మనిషే తనను నమ్మడం లేదు. అది స్వయంకృతం.! ఇక్కడ ఆ కారణాల ఏకరువులోకి వెళ్లడం లేదు. కానీ ఆ కారణాల మథనం లేదు ఆ పార్టీలో.. దిద్దుబాటు ప్రయత్నం లేదు.! ఉండదు. పైగా అప్పుడే మొదలు పెట్టేసింది. కేసీయార్ స్వగ్రామం చింతమడక నుంచి వందల మంది ఫామ్ హౌజుకు వచ్చి కేసీయార్‌ను ఓదార్చారు. తను 'అక్కడ పుట్టాడు' అనే కారణంతో ఇంటికి పదీ, పదిహేను లక్షలు ఇచ్చాక ఆ కృతజ్ఞత లేకపోతేనే తప్పు.! ఎవరు తీసుకొచ్చారు, ఈ ఓదార్పు యాత్ర ఎవరు ఆర్గనైజ్ చేశారనేది కాదు ఇక్కడ ప్రశ్న. అప్పుడే మొదలు పెట్టేశాడు కేసీయార్ అనేది గమనార్హం.!

ఓటమిని వినమ్రంగా అంగీకరించలేదు..
ఈరోజుకూ కేసీయార్ తన ఓటమిని వినమ్రంగా ప్రజల ఎదుట అంగీకరించలేదు. హూందాగా గవర్నర్ దగ్గరకు వెళ్లి రాజీనామా సమర్పించలేదు. ఆమెకు మొహం చూపించలేడు కాబట్టి..! ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని, ప్రజాతీర్పును గౌరవిస్తాననీ అనలేదు. పైగా బీఆర్ఎస్ నేతలు అప్పుడే ఏమంటున్నారు..? ‘‘ఆరు నెలలు ఆగండి, ఏడాది ఆగండి, మళ్లీ మేమే…’’ అని.. ఇంకెవరో ముఖ్యనేత ఏదో అన్నాడు.. ‘‘సింహంలా కేసీయార్ బయటికి వస్తాడు త్వరలో..’’ అని..

అసందర్భ వ్యాఖ్యలు
పార్టీ లీడర్ ఒకరు మరణిస్తే, ఆ సంతాప సభలో మాట్లాడుతూ కడియం శ్రీహరి అసందర్భ వ్యాఖ్యలకు దిగాడు. ‘‘మాకు 39 సీట్లు, మా మజ్లిస్ మా పక్షమే.! బీజేపీ కూడా కలిసొస్తుంది. ఇంకొందరు కలిస్తే చాలు ఇక…’’ ఇదీ తన లెక్క.! (నిజానికి ఎన్నికలకు ముందే తను కాంగ్రెస్‌ వైపు వెళ్లే చర్చలు, రాయబారాలు, ప్రతిపాదనలు వేరే కథ...) ఇక్కడ నిజంగా సిగ్గుపడాల్సింది బీజేపీ.! రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎదిగే అవకాశాల్ని చేజేతులా నాశనం చేసుకుంది.! బోలెడు ఎత్తుగడ లోపాలు.!

బీజేపీ తమతో కలిసొస్తుంది..:
అందుకే కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో, రఘునందన్ దుబ్బాకలో, ఈటల హుజూరాబాద్‌లో- గజ్వెల్‌లో, లక్ష్మణ్ ముషీరాబాద్‌లో.. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఓటమి.. ఎంత సతాయించినా సరే మళ్లీ రాజాసింగ్ గెలిచాడు. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపు ఓ చరిత్ర. అంటే జనం స్పష్టంగా బీజేపీ హైకమాండ్‌కు చెబుతున్నారు. ఎవరు పార్టీకి అవసరమో, ఎవరు ఇప్పటికీ నష్టకారకులో.. బీఆర్ఎస్ లీడర్లు బహిరంగంగానే 'బీజేపీ తమతో కలిసొస్తుంది' అని చెబుతున్నారంటే విడ్డూరమే.!

మజ్లిస్, బీజేపీ కలిసి మద్దతునిస్తాయా..? లేదా..?

చూద్దాం గానీ మరి మెజారిటీకి మిగిలిన నంబర్ ఎలా..? ఏముంది..? కాంగ్రెస్ నుంచి లాగేయడమే.! అలవాటైన కూసు విద్యే కదా.! కాంగ్రెస్‌లో లేరా కేసీయార్ కోవర్టులు.! ఈరోజుకూ ఢిల్లీ సంబంధాలతో రేవంత్ చుట్టూ చక్రబంధాన్ని బిగించి, అసలు రేవంత్ సీఎం గాకుండా ప్రయత్నించారు.!

రేవంత్‌రెడ్డికి అనివార్యంగా ఓ సంకేతం
కడియం శ్రీహరి మాటలు, కాంగ్రెస్ సీనియర్లు రేవంత్‌రెడ్డికి అనివార్యంగా ఓ సంకేతం ఇస్తున్నారు. నీ ప్రభుత్వం స్థిరంగా నాలుగురోజులు ఉండాలంటే.. ముందుగా తనదైన ‘బలాన్ని’ సమకూర్చుకోవాలని..! పార్టీలో సీనియర్లు ఎప్పటికైనా ప్రమాదమే… కేసీయార్ ఊరకే కూర్చోడని శ్రీహరి మాటలు చెబుతూనే ఉన్నాయి. సో, బీఆర్ఎస్ నుంచి లేదా బీజేపీ నుంచి. కొందరిని రేవంత్ తనవైపు ఎలాగోలా తెచ్చుకోవాల్సిన అనివార్య స్థితిలోకి తనను నెట్టేస్తున్నారు.!

అదొక అగ్నిపరీక్ష..
ఢిల్లీకి మూటలు తప్పవు, రాబోయే జనరల్ ఎన్నికల ఖర్చు అర్సుకునేది కర్నాటక, తెలంగాణ మాత్రమే.! మరోవైపు పార్టీ ముఖ్యులను మేనేజ్ చేస్తుండాలి. అలవిమాలిన హామీలను అమలు చేయాలి.! అదొక అగ్నిపరీక్ష.. సో, తను పాలనపై ద‌ృష్టి పెట్టాలంటే ముందుగా తను ‘పదిలం’ కావాలి. అదే తన ప్రయారిటీ కావాలి. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ సహా తన పార్టీ సీనియర్లు కూడా తనకు పరోక్షంగా అదే చెబుతున్నాయి..!!

బహిరంగ సవాల్
కడియం శ్రీహరి వాఖ్యానాలకు అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరావు బహిరంగ సవాల్ విసిరారు. ఆరు నెలలు కాదు కానీ ఒక ఏడాది సమయం తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

చివరగా…
కడియం కాంగ్రెస్‌ను ఉసిరికాయల మూటగా వర్ణించాడు. అది మాత్రం నిజం.! ఆ మూటను ఎలా బిగిస్తాడో, ఒక్క కాయ కూడా చెదిరిపోకుండా ఎలా కట్టడిలో పెట్టుకుంటాడో రేవంత్.! మొత్తానికి కడియం రేవంత్‌ను భలే అలర్ట్ చేశాడు.!

వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలి

పత్రిక ప్రకటన.  07.12.2023

కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిగారికి అభినందనలు

వికలాంగురాలికి మొదటి ఉద్యోగం ఇవ్వడం పట్ల హర్షం

 వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలి

 తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏ రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ అభివందనాలు తెలియజేస్తుంది.
 గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రజలు , వికలాంగుల 
సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాం. గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం పట్ల ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు ఆసరా పెన్షన్లు మాత్రమే ఇచ్చి విద్య, ఉపాధి వంటి మౌలిక అంశాలను వికలాంగులకు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల సంక్షేమం కోసం ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతున్నాం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి క్యాడర్ స్రెంత్ ప్రకారం గుర్తించి భర్తీ చేయాలని, పెన్షన్ 6000కు పెంచుతామనే హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది వికలాంగులపై జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు, వివక్షత అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేసే విధంగా కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలలో భాగంగా మరుగుజ్జు వికలాంగురాలు అయిన రజినికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి ఉద్యోగం రజనీకి అందిస్తూ ముఖ్యమంత్రి సంతకం చేయడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం రాబోయే కాలంలో కూడా వికలాంగుల సంక్షేమం కోసం ఇదే విధమైన కృషి చేస్తారని NPRD ఆశిస్తుంది.

కె వెంకట్
 రాష్ట్ర అధ్యక్షులు

యం అడివయ్య
రాష్ట్ర కార్యదర్శి

అర్ వెంకటేష్
 రాష్ట్ర కోశాధికారి

కేసీఆర్ సారు తోడల్లుడు పెద్ద తిమింగిలం

https://x.com/prashantchiguru/status/1732689814775062798?t=6YTLqmFESzmbfNZxuOUV6Q&s=08                                                                                   _*ఇతని పేరు జోగినపల్లి రవీందర్ రావు: ఇతను కెసిఆర్ కి సడ్డకుడు (తోడల్లుడు) ఎంపీ సంతోష్ రావు తండ్రి. 09 ఏళ్ళ బంగారు BRS పాలనలో ఇతను అక్రమ ఇసుక రవాణా మాఫియా అధిపతిగా విజ్రంబించాడు.*_

_*ఒక్కపుడు మూడు పూటలు తినడానికి గతిలేనోడు ... 2005 వరకు ఇతను ( చినిగిన బట్టలతో & లబ్బర్ చెప్పులతో) కరీంనగర్ లో ఒక రైస్ మిల్ లో గుమాస్తా గా పని చేసాడు ఈ రవీందర్ రావు.*_

_*కెసిఆర్ సీఎంగా వున్నపుడు ఇతని రోజువారి ఆదాయం 3 కోట్లు.*_

_*నేరెళ్ల లో అక్రమ ఇసుక రవాణా ను వ్యతిరేకించిన దళితులను హింసించిన ఘాతకుడు ఈ రవీందర్ రావు.*_

_*ఇతని అక్రమ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం #TelanganaCM #RevanthReddycm వెంటనే జప్తు చేయాలి.*_

_*మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు గారి దగ్గర ఇతని అవినీతిని చిట్టా అంతా వుంది.*_                                                                                                   *****---*****---*****                                                                                   
_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*_                       

_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు 🙏*_

_*తెలంగాణ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రిగా భారత #రాజ్యాంగం మీద ప్రమాణం చేసి #ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తాను అని  ప్రమాణస్వీకారం చేసిన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి @TelanganaCMO గారు మీరు మీ మ్యానిఫెస్టో లో చెప్పినట్లుగా గత ప్రభుత్వం లో #అవినీతి చేసిన వారందరిమీద(ప్రభుత్వ అధికారులు, బ్యూరోక్రాట్స్, ప్రజాప్రతినిధులు, దొర బంధువులు.... Etc)చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని 'ప్రజాసంకల్పం' డిమాండ్ చేస్తుంది.*_

*Bplkm🪶*                                                                          https://twitter.com/Praja_Snklpm/status/1732710029671964835?t=LsCTFOWuOOaZRu01hr3gXA&s=19

_"వద్దు బాబోయ్ వైన్స్"_

https://youtu.be/0s4_6wZiz8s?si=3AGAIQK_OdHSkcCd                                                                         
*_"వద్దు బాబోయ్ వైన్స్"_*

*#తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం రామంతాపూర్ లో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు, సిపిఎం, బీజేపీ నాయకులు ధర్నా.*

*@Collector_MDL*
*#TelanganaHighCourt  #TelanganaHRC #TelanganaLokayuktha*

*@TSExcise @Congress4TS @INCTelangana @RachakondaCop @DcpMalkajgiri @uppalps_ @TahsildarUppal @Dc_Ghmc*
*@BplplH*

*#RevanthReddyCM*
*#MalkajgiriMP*
*#Ramanthapur*
*#Wines*
*#HumanRights*
*#PublicVoice*
*#UppalExciseDepartment*                                               https://twitter.com/Praja_Snklpm/status/1732649758270111804?t=f5N3TS8Xx-3bP0NLkM-Yqw&s=19                                                                                                 *****---*****---*****                   https://www.instagram.com/reel/C0itzzfPZJz/?igshid=MzRlODBiNWFlZA==                                                         *****---*****---*****                    https://www.facebook.com/reel/3677717529222814/?app=fbl

శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు

https://x.com/Praja_Snklpm/status/1732677127433240673?t=p8ntTBYHxtObcRviHrqdlA&s=08                                                                    
 _*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_

_*తెలంగాణ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గౌరవనీయులైన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు & శుభాకాంక్షలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం' & Link Media 🎉🙏*_

*Bplkm🪶*
*బాపట్ల కృష్ణమోహన్*
*ప్రజాసంకల్పం ఫౌండర్*

Wednesday, December 6, 2023

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా.... కోదండరాం!

*రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా.... కోదండరాం!*

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ''ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం'' అని కోదండరామ్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల*

#తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులారా మారండి!

*_#తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు (అన్ని శాఖలు) #IAS & #IPS అధికారులతో సహా అందరికి 'ప్రజాసంకల్పం Link Media' విజ్ఞప్తి చేస్తుంది.#రాజ్యాంగం కు గౌరవం ఇచ్చి,#ప్రజాస్వామ్య బద్దంగా  ప్రజలకు జవాబుదారీతనంగా మీరు మీ విధులను నిర్వర్తించండి.#పాలకులకు,#ప్రజాప్రతినిధులకు ఊడింగం చేయకండి. ప్రజాసమస్యల పరిష్కారంలో చట్టాలకు అనుగుణంగా పనిచేయడం నేర్చుకోండి. మీ ద్రుష్టికి ప్రజలు నేరుగా కానీ ప్రభుత్వ అధికారిక మాద్యమాలద్వారా కానీ సమస్యలను తీసుకొచ్చినపుడు వాటిమీద విచారణ చేసి పరిష్కారం చేయండి. అంతేకాని నెలలు తరబడి పెండింగ్ లో పెట్టకండి. RTIA ద్వారా సమాచారాన్ని అడిగినపుడు చట్టాలకు గౌరవం ఇచ్చి సమాచారం ఇవ్వడం నేర్చుకోండి. సోషల్ మీడియా చాలా యాక్టీవ్ గా వుంది అని తెలుసుకోవాలి. ప్రజలపక్షాన ప్రశ్నించే గొంతులు, ప్రజాసంఘాలు, NGO's చాలా ఉన్నాయి అని తెలుసుకోవాలి.ప్రభుత్వాలు, పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రతి 5 సంవత్సరాలకొకసారి మారుతుంటారు. మీరు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయండి. ఇకనుంచి అయినా మారుతారు అని నమ్మకంతో.... Bplkm🪶_*

*NOTE : ప్రభుత్వ అధికారులు #తెలంగాణ  వచ్చినప్పటినుంచి అధికారికంగా అధికారి హోదాలో న్యాయస్థానాల (హైకోర్టు, లోకాయుక్త,మానవహక్కుల కమీషన్, వినియోగదారుల ఫోరమ్... Etc)చుట్టూ ఎందుకు ఎక్కువగా తిరుగుతున్నారు?? మీరే ఆలోచించుకోవాలి.. ఆత్మవిమర్శన చేసుకోవాలి.*