Sunday, August 3, 2025

*శిబు సోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం*

https://x.com/Praja_Snklpm/status/1952258844761186730?t=jgGWIsFIvSOcpXTlL3jiLA&s=19

*#ShibuSoren @TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana #Jharkhand*

*పోరాట యోధుడు గురూజీ.....* *శిబు సోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం*

హైద‌రాబాద్‌:  జార్ఖండ్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లోనూ... గిరిజ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలోనూ మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి శిబుసోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాలు, మాద‌క ద్ర‌వ్యాల వ్య‌తిరేక పోరులోనూ శిబు సోరెన్ త‌న‌దైన ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబుసోరెన్ ఎప్పుడూ మ‌ద్ద‌తు తెలిపేవార‌ని... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి సైతం చివ‌రి వ‌ర‌కు ఆయ‌న మ‌ద్దతుదారుగా నిలిచిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదివాసీ స‌మాజానికి గురూజీ చేసిన సేవ‌లు చ‌రిత్ర‌లో శాశ్వతంగా నిలిచిపోతాయ‌ని సీఎం తెలిపారు. ఎనిమిది సార్లు లోక్‌స‌భ ఎంపీగా, రెండు సార్లు రాజ్య‌స‌భ స‌భ్యునిగా, జార్ఞండ్ ముఖ్య‌మంత్రిగా ఎన‌లేని సేవ‌లు అందించార‌ని సీఎం తెలిపారు.  శిబు సోరెన్ కుమారుడు, జార్ఞండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సానుభూతి తెలియ‌జేశారు.

No comments:

Post a Comment