Tuesday, May 6, 2025

*తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి నియామకం*

*తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి నియామకం*

•గవర్నర్ అనుమతితో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

•మిగిలిన సమాచార కమిషనర్ ల ఎంపిక...త్వరలో.

•సమాచార కమిషనర్ లుగా గవర్నర్ కు పంపిన  పేర్లలోని ఐదుగురిపై... పిర్యాదులు రావడం, రాజకీయ పార్టీల్లో నాయకులుగా,వివిధ పార్టీ పదవుల్లో పని చేసిన వారు ఉండడం అనే కారణాలపై మరింత సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించమని CMO కు ఇంటర్నల్ గా పేర్లను మార్క్ చేసి పంపినట్లు గా ప్రచారం జరుగుతుంది.  

• కేంద్ర ప్రభుత్వ సమాచార కమిషనర్ లుగా సెక్షన్ 12(5), (6) 
•రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్ లుగా సెక్షన్ 15(5),(6) ల లో తెలిపిన విషయాలను అనుసరించి నియామకం ప్రక్రియను పూర్తి చెయ్యాలి.  

•జర్నలిజం వృత్తిలో ఉన్న వారిపై వచ్చిన అభ్యంతరాలను  తోసిపుచ్చే అవకాశాలు ఉండగా,  రాజకీయాల్లో నాయకులుగా వున్న వారిని నియామకం చేస్తే న్యాయ పరంగా తలెత్తే వివాదాలను ఎదుర్కొనడానికి, లేదా మార్పు చెయ్యాలని అనుకుంటే  వారి పేర్ల స్థానంలో అర్హులైన వారి పేర్ల జాబితాను  పంపమని కోరినట్లు గా వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

•నిర్ణయం తీసుకొని నియామకాలు జరగడానికి...కొంత సమయం పడుతుందని ఒక అంచనగా ఉండగా, మూడు,నాలుగు రోజుల్లోపు  నియామకాలు ఉండవచ్చు
(SOURCE)

No comments:

Post a Comment