Saturday, August 30, 2025

*ప్రభుత్వం పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం వరకే ఊరేగింపులు ఆపడానికి కాదు*

*గణపతి నిమజ్జన ఊరేగింపు ఉత్సవాన్ని ఆపివేయాలని వేసిన పిటిషన్ కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు* 

*ప్రభుత్వం పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం వరకే ఊరేగింపులు ఆపడానికి కాదు* 

*దేశంలో గణేశ్ ఉత్సవం కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు*
 
*అది సమైక్యత, ఆనందం, సాంస్కృతిక వైభవానికి ప్రతీక*

*మతం పేరుతో, ప్రార్థనా స్థలాల పేరుతో ఊరేగింపును ఆపడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు*

*తీర్పుపై పలు హిందూ సంఘాలు హర్షం*

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు ఆపివేయాలని కోరుతూ కొంత మంది పిటీషన్ వేశారు.

ఈ మేరకు పిటిషన్ ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది

గత ముప్పై ఏళ్లుగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గణేశ్ నిమజ్జన ఊరేగింపు జరుపుతున్న మార్గం మార్చకూడదని కోర్టు స్పష్టంగా తెలిపింది.

రోడ్లు అన్నీ ప్రజలకే చెందుతాయని, మతం పేరుతో, ప్రార్థనా స్థలాల పేరుతో ఊరేగింపును ఆపడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పోలీసులు చేసే పని ఏమిటంటే – శాంతి భద్రతను కాపాడటం మాత్రమే, ఊరేగింపును ఆపడం కాదనీ స్పష్టం చేసింది

గణేష్ నిమజ్జనం ఊరేగింపు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మత స్వేచ్ఛకు గౌరవం చూపిన చారిత్రక తీర్పుగా నిలిచింది.

ఈ తీర్పుపై పలు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ధర్మానికి మార్గం ఎవరూ మూయలేరని, మత స్వేచ్ఛ అందరి హక్కు అని ఆ హక్కును వినియోగించే క్రమంలో ఇతర మతాల గౌరవాన్ని కాపాడటం అందరి కర్తవ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు... 
SOURCE 

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*


https://x.com/Praja_Snklpm/status/1961780023326818501?t=fHYGLczzaq7xOqBCokSD1w&s=08  
                    *****
https://www.facebook.com/share/p/16EfC5z2AD/

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*రామంతాపూర్ లో కరెంటు షాక్ తో 6గురు మరణించినా అధికారుల & సిబ్బంది పర్యవేక్షణ ఎలా ఉందొ ఈ ఫొటోస్ చూస్తే అర్ధం అవుతుంది.*

*Land Mark : Near bharath nagar community hall, Ramanthapur*
 
*@tgspdcl  @se_op_habsiguda*

*#TelanganaHighCourt*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @Eatala_Rajender @BrsBandari @HRF_Humanrights @IndiaToday @BplplH @GHMCOnline @UppalPS2 @uppalps_ @Dc_Ghmc*

Friday, August 29, 2025

తెలంగాణ రెవిన్యూ అవినీతి అధికారి

A #DisproprtionateAssets (DA) Case has been registered against Bandi Nageswara Rao, Tahsildar of Warangal Fort Mandal in Warangal district by Telangana #ACB Officials.

#ACB Officials conducted searches at 7 locations linked to him and his relatives. Movable and immovable properties including 1- House (1.15 Cr), Agricultural land -17.10 Acres (1,43 Cr), Ornaments (Gold - 70 Tulas & Silver 1.791 Kg), Wrist watches-23 and Vehicles (Four wheelers-2 & Two wheeler-1) along with Household articles were unearthed. The worth of the identified properties about Rs.5,02,25,198/- as per document value. Case is under investigation.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"వరంగల్ జిల్లా లోని వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ - బండి నాగేశ్వర్ రావు పైన #అక్రమఆస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

#అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధం గల 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి 1- భవనం (1.15 కోట్లు), 17.10 ఎకరాల (1,43 కోట్లు) వ్యవసాయ భూమి, ఆభరణాలు (బంగారం - 70 తులాలు & వెండి 1.791 కిలోలు), చేతి గడియారాలు - 23,  వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు - 2 & ద్విచక్ర వాహనం - 1)  మరియు  గృహోపకరణాలు వంటి స్థిర మరియు చరాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించినారు. గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం దాదాపు రూ.5,02,25,198/-. కేసు దర్యాప్తులో ఉన్నది.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1961415148503273713?t=46zz2u8beYE7vzx1Drk_tQ&s=19

Wednesday, August 27, 2025

*_ఈరోజు మా ఇంట్లో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 🙏._*

https://x.com/Praja_Snklpm/status/1960605019658715309?t=OIm1y5zDtawLNMKA-wwA5g&s=08 
                 *****
https://www.instagram.com/p/DN2dco2ZPZY/?igsh=Ynhkajk1bHRoYXZ4
                *****
https://www.facebook.com/100006620980242/posts/4232177663679558/?mibextid=rS40aB7S9Ucbxw6v

*_ఈరోజు మా ఇంట్లో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 🙏._*

*_గత 9 సంవత్సరాలుగా #HMDA & #GHMC సహకారంతో హైదరాబాద్ జిందాబాద్ / ప్రజాసంకల్పం ఆధ్వర్యంలో "శ్రీనిధి మహిళా ఫౌండేషన్" సంస్థ ద్వారా మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నాము...రామంతాపూర్ లో 26/08/2025 రోజు సాయంత్రం 6గంటలకు "Pushpa fashions" & "ప్రజాసంకల్పం"  కలం యోధుల మీడియా కార్యాలయం, RTC కాలనీ  వద్ద విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది._*

*@TelanganaCMO*
*@AndhraPradeshCM*
*@CPRO_TGCM @IPR_AP @IPRTelangana @TelanganaCS @HMDA_Gov @GHMCOnline* *@HyderabadCitiz9 @BplplH @UNTGAPS @RachakondaCop @hydcitypolice @cyberabadpolice*

Tuesday, August 26, 2025

సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం కాక నాగలక్ష్మీ.

సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీటు సాధించిన  ఆదివాసి ఆణిముత్యం కాక నాగలక్ష్మీ.

డిగ్రీ ఫైనల్ ఇయర్  చివరి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మధ్యలో రోడ్డు యాక్సిడెంట్లో తండ్రి  కాక కృష్ణ మరణం అయినప్పటికీ కూడా అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేసి మరుసటి రోజు ఉదయం ఎగ్జామ్స్ కొరకు ప్రయాణం.

గంగదేవి గుప్ప మారుమూల గ్రామంనుండి సెంట్రల్ యూనివర్సిటీలో  పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సీటు సాధించిన తొలి విద్యార్థినీ కాక నాగలక్ష్మి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంగదేవిగుప్ప గ్రామం    పాల్వంచ మండలం కి చెందిన    కోయ తెగ అమ్మాయి  కాక నాగలక్ష్మి  ఈమె తండ్రి కాక కృష్ణ వ్యవసాయ కూలీ తల్లి కాక పద్మ వీరి మొదటి సంతానం నాగలక్ష్మి. తండ్రికి చదువు లేకపోతే పదవ తరగతి వరకు చదివిన తల్లి పద్మ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి భద్రాచలం ఐటిడిఎ ద్వారా నడపబడుతున్న గురుకులాలలోని ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేసి అదేవిధంగా కొత్తగూడెంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మహిళలు )డిగ్రీ కాలేజీ లో  బి ఏ హెచ్  యి పి లో డిగ్రీను పూర్తి చేసిన కాకా నాగలక్ష్మి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న తరుణంలో వారి నాన్నగారికి రోడ్డు యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న   అమ్మాయి చదువుకి ఇబ్బంది కలుగకూడదని తల్లి పద్మ నిర్ణయం తీసుకొని చివరిదాక తండ్రి మృతి చెందిన విషయం చెప్పకుండా ఎప్పటికప్పుడు  డిగ్రీ గురుకులం  యాజమాన్యంతో మాటలాడి అదే రోజు తండ్రి అంత్యక్రియలు  నిర్వహించి ఉదయాన్నే పరీక్షకుహాజరై గురుకుల డిగ్రీ కళాశాల  అధ్యాపకుల  సూచనలు సలహాతో  పరీక్షలకు హాజరై  డిస్టింక్షన్ లో డిగ్రీ ఉత్తీర్ణత అవటం జరిగినది.
జాతీయస్థాయి యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం నిర్వహిస్తున్నటువంటి Central Universities Common Entrance Test (CUCET), with the National Testing Agency (NTA) ద్వార నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగినది. 
కాక  నాగలక్ష్మి గంగదేవి గుప్ప గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని  ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ పాల్వంచలోను మరియు పదవ తరగతి భద్రాచలం లిటిల్ ఫ్లవర్ స్కూల్లోనూ అక్కడనుండి అంకంపాలెం  గురుకుల కళాశాలలోని ఇంటర్మీడియట్  సిఇసి  విభాగంలో పూర్తి చేయడం జరిగినది. తర్వాత డిగ్రీ కొరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో సీటు సాధించి డిగ్రీని పూర్తిచేయడం జరిగినది. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సంకల్పంతో అధ్యాపకుల యొక్క సలహాలు సూచనలతో ఇక్కడ వరకు చేరుకోగలిగింది అని తల్లి పద్మ తెలియచేసింది.
SOURCE by : P. Pradeep kumar 

Monday, August 25, 2025

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం


https://youtube.com/shorts/x9PiET8YqPk?si=sMQLfEGXkm1gHomW 
               *****
https://www.instagram.com/reel/DNxxoPU5IbB/?igsh=MXNreHJsamhqYTZvZg==
                 *****
https://www.facebook.com/100006620980242/posts/4230284123868912/?mibextid=rS40aB7S9Ucbxw6v

*_గత 8 సంవత్సరాలుగా మట్టితో చేసిన వినాయక విగ్రహాల పంపిణీ...రామంతాపూర్ లో 26/08/2025 రోజు....Bplkm✍️_*

Saturday, August 23, 2025

తెలంగాణ అవినీతి పోలీస్ అధికారి

Bhukya Rajesh, Inspector of Police, SHO of Dornakal Police Station in Mahabubabad district and his gunman Daravath Ravi, Police Constable were caught by Telangana #ACB Officials for demanding the #bribe of Rs.50,000/- and accepting Rs.30,000/- from the complainant for doing an offical favour "To release the seized vehicle of the Complainant, in a case registered in Dornakal Police Station and to extend the cooperation in that case."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని వాహనాన్ని డోర్నకల్ రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసులో జప్తు చేయగా, దాన్ని విడుదల చేయడానికి మరియు ఆ కేసులో అతనికి సహకారాన్ని అందించడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.50,000/- #లంచం డిమాండ్ చేసి, అందులోనుండి రూ.30,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రక్షకభట నిలయాధికారి & ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - భూక్యా రాజేష్ మరియు అతని గన్ మెన్ & పోలీస్ కానిస్టేబుల్ ధారావత్ రవి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1959253348353446067?t=LQTpLuRk86bq2UQHPfKjOA&s=19

Friday, August 22, 2025

తెలంగాణ అవినీతి సంయుక్త సబ్ రిజిస్ట్రార్

K. Srinivasa Reddy, Joint Sub Registrar of Adilabad registrations and stamps department was caught by #ACB Telangana Officials for demanding and accepting the #bribe of ₹5,000/- from the complainant for official favour "for the registration of the gift deed pertaining to a house, to the Complainant from the name of his wife ".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి అతని భార్య పేరు మీద గల ఒక గృహాన్ని తనకు బహుమతి డీడ్ క్రింద నమోదు చేయడానికి అధికారిక సహాయం చేసేందుకు" ఫిర్యాదుధారుని నుండి ₹5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడ్డ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ యొక్క సంయుక్త  సబ్ రిజిస్ట్రార్ -  శ్రీనివాస రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1958852150278430900?t=93o5r7pmGX3sug-hWfMvUA&s=19


తెలంగాణ అవినీతి సబ్ రిజిస్ట్రార్

S. Rajesh Kumar, Sub Registrar, Vansthalipuram in Ranga Reddy District was caught by Telangana #ACB Officials for demanding the #bribe of Rs.1,00,000/- and accepting Rs.70,000/- from the Complainant, through K. Ramesh, Typist in a private document Writer's Office & Resident of Nagole, for showing official favour "To process the registration of the property of Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని యొక్క ఆస్తి నమోదు ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.1,00,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో నుండి రూ.70,000/- రంగారెడ్డి జిల్లా నాగోల్ నివాసి & ప్రైవేట్ దస్తావేజు లేఖకుని కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్టు - కె. రమేష్ ద్వారా తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ - ఎస్. రాజేష్ కుమార్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1958864346635018254?t=9LWUrHjOAh48QV6WzHDj4A&s=19

Thursday, August 21, 2025

తెలంగాణ అవినీతి మోటారు వాహన ఇన్స్పెక్టరు

Gurram Vivekananda Reddy, MVI, Armoor of Nizamabad District and his private driver Nelli Thirupathi were caught by #ACB Telangana Officials for demanding and accepting the #bribe of ₹25,000/- from the complainant "for the services rendered like registration of vehicles, renewal of licenses, issuance of learning licenses etc., referred by the complainant and not to keep pending in the future".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ల పునరుద్ధరణ, లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ మొదలైన వాటి కోసం అందించే సేవలకు మరియు భవిష్యత్తులో కూడా ఎలాంటి అతనికి సంబంధించిన దస్తావేజులు పెండింగ్‌లో ఉంచకుండా చేయడానికి" అతని నుండి రూ.25,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌  మోటారు వాహన ఇన్స్పెక్టరు - గుర్రం వివేకానంద రెడ్డి మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ - తిరుపతి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1958510522103664945?t=7-nENhHrzGDp4A9d_AVzuw&s=19

తెలంగాణ అవినీతి గ్రామ పంచాయతీ కార్యదర్శి

A case has been registered against Enjamuri Venkaiah, Panchayat Secretary, Janpahad Village in Palakeedu Mandal of Suryapet District, by Telangana #ACB Officials for demanding #bribe of Rs.20,000/- and accepting Rs.15,000/- (reduced on request) from the complainant as a reward "for the amount sanctioned  as first instalment under the Indiramma Housing Scheme and also to process further instalments".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం క్రింద మొదటి విడతగా డబ్బులు మంజూరు చేసినందుకు మరియు తదుపరి అందాల్సిన వాయిదాలను ప్రాసెస్ చేయడానికి" అతని నుండి కానుకగా మొదట రూ.20,000/- #లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు అట్టి #లంచం ను రూ.15,000/- తగ్గించి తీసుకున్నందుకు గాను సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం, జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి -  ఇంజమూరి వెంకయ్య పైన కేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by :

https://x.com/TelanganaACB/status/1958500439936438465?t=fkfpLDdA__2h0kVxWynL9Q&s=19

Wednesday, August 20, 2025

*విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించండి... భట్టి విక్రమార్క!*

*విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించండి... భట్టి విక్రమార్క!*

*అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం!*

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్‌ వైర్లను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.సచివాలయంలో మంగళవారం ఆయన విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైర్లను తొలగించాలని కేబుల్‌ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.

ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, బలవంతంగా తొలగించే కార్యక్రమం చేపట్టాలని స్పష్టంచేశారు. అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునేవారు విద్యుత్‌ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్స్‌ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

దీనిపై కన్సల్టెంట్‌ సంస్థ ఇచి్చన నివేదికపై ఆయన చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్‌ సరఫరా, వినియోగంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిత్తల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*V.S. జీవన్*

తాండూర్ మున్సిపాలిటీ లో అవినీతి అధికారి

B. Ramesh, Sr. Asst., O/o the Tandur Muncipality in Rangareddy District was caught by Telangana #ACB, for demanding and accepting #bribe of Rs.15,000/- from complainant "to allot House Number to the shed constructed by the Complainant at Tandur".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in ). The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుడు తాండూరులో తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబరును కేటాయించడానికి" అతని నుండి రూ.15,000/- #లంచం  తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా తాండూరు పురపాలక కార్యాలయములోని సీనియర్ అసిస్టెంటు - బి. రమేష్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1957759834616713599?t=JbZEng19xs9zEvey2uXFLg&s=19

Monday, August 18, 2025

*_అధికారులు / స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల 6 గురి ప్రాణాలు పోయాయి_*

https://youtu.be/b187FxUIrfw?si=9QNX4S_rQ8D0I-Qr  
                 *****
https://www.instagram.com/reel/DNhr3P9y9el/?igsh=MW02M3docGx1dXpwaw==
                  *****
https://www.facebook.com/100006620980242/posts/4223946724502652/?mibextid=rS40aB7S9Ucbxw6v

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*అధికారులు / స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల 6 గురి ప్రాణాలు పోయాయి.....ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు అనుకుంటే పౌరసమాజం మేలుకోవాలి బాధ్యతగా వ్యవహరించాలి*

*_ఈ దుర్ఘటనకు కారణం అయిన,నిర్లక్ష్యం వహించిన సంబందిత అధికారులు & కేబుల్ / ఇంటర్నెట్ యాజమాన్యాల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి_*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @OffDSB @Collector_MDL @tgspdcl @CommissionrGHMC @Eatala_Rajender @BrsBandari @N_RamchanderRao @KTRBRS @RamMohanINC @NvssprabhakarM @BplplH*

*_As always we offer our coordination in public interest...._*

 *#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*

*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist* 
*#HumanRightsMember*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1957684849894125705?t=9yD4uY5WMQMZ-_U-tV3TfA&s=19

Friday, August 15, 2025

*కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ – హైదరాబాద్ చరిత్రలో ముద్ర వేసిన ప్రజా నాయకుడు*

*కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ – హైదరాబాద్ చరిత్రలో ముద్ర వేసిన ప్రజా నాయకుడు*

*బాల్యం, విద్యాభ్యాసం*

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు 1894 ఆగస్టు 16న ఔరంగాబాద్‌ (అప్పటి హైదరాబాద్ స్టేట్)లో జన్మించారు. పేద రైతు కుటుంబంలో పుట్టి, కష్టసుఖాల మధ్య పెరిగిన ఆయన చిన్నప్పటినుంచే విద్య పట్ల అపారమైన ఆసక్తి చూపించారు. చాదర్ఘాట్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తరువాత బాంబేలో ప్రచార సాంకేతిక విద్యను అభ్యసించడం ద్వారా, ఆయన జీవితంలో ముద్రణా రంగం ఒక ప్రధానమైన మార్గం అయింది.

*రచన, సంపాదకత్వం*

విద్యను పూర్తిచేసుకున్న తర్వాత కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగినా, ఆయనకు నిజమైన పిలుపు ప్రజాసేవ, రచన, సంపాదకత్వంలోనే కనబడింది. ఆయన కలం ఒక ఆయుధంలా మారి సామాజిక సమస్యలను, ప్రజల గోసలను వెలుగులోకి తెచ్చింది. 1925లో స్వంత పబ్లిషింగ్ సంస్థను స్థాపించి, 1929లో “పిక్టోరియల్ హైదరాబాద్” అనే అపూర్వమైన గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథం హైదరాబాద్ చరిత్రను విశదంగా వివరించిన మొదటి ప్రయత్నాల్లో ఒకటిగా నిలిచి, ఆ కాలంలోనే ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది. తరువాత “History of Hyderabad City”, “Freedom Movement of Goa” వంటి పుస్తకాలు రచించి, చరిత్రకారునిగా, ఆలోచనాపరునిగా తన స్థానం బలపరిచారు.

*రాజకీయ జీవితం*

ప్రజా సేవలోనూ ఆయన కృషి అపారమే. 1925లో బడిబజార్ ప్రాంతం నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై, వరుసగా 25 సంవత్సరాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. 1940 నుంచి 1955 వరకు డిప్యూటీ మేయర్‌గా పనిచేసి, నగర పాలనలో పేదల అవసరాలను ప్రతిధ్వనింపజేశారు. తరువాత 1957-58లో హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికై, మొదటిసారి నగరానికి ఒక సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే పనిని ముందుకు తీసుకెళ్లారు. పేదల కష్టం, కూలీల వేదన ఆయనకు బాగా అర్థం. అందుకే మానవ రిక్షాలను రద్దుచేసి, వాటికి బదులుగా సైకిల్ రిక్షాలను ప్రవేశపెట్టారు. అది కూలీల శ్రమ దోపిడీని తగ్గించే ప్రయత్నం. ఇలాంటి నిర్ణయాల్లో ఆయన వామపక్ష అభ్యుదయ ఆలోచనల జాడ స్పష్టంగా కనబడుతుంది.

*సామాజిక సంస్కర్త*

కృష్ణస్వామి ముదిరాజ్ గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక సామాజిక సంస్కర్త కూడా. నిజాం రైయా ముదిరాజ్ మహాసభను స్థాపించి దాదాపు నలభై సంవత్సరాల పాటు దాని అధ్యక్షునిగా పనిచేశారు. ఈ వేదిక ద్వారా ముదిరాజ్ సమాజాన్ని మాత్రమే కాకుండా, అణగారిన వర్గాలన్నింటినీ ప్రోత్సహించారు. మహిళలకు విద్య ప్రాధాన్యత కల్పిస్తూ హిందీ కన్యా పాఠశాల, రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వంటి విద్యాసంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడం ఆయన జీవితమంతా కొనసాగిన పోరాటం.

*అంబేడ్కర్‌తో అనుబంధం*

డా. బి.ఆర్. అంబేడ్కర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా హక్కులు వంటి అంశాలపై వారిద్దరూ ఆలోచనలు పంచుకున్నారు. అణగారిన వర్గాల స్థితిని మార్చడానికి ఒక మార్గదర్శిగా ఆయన నిలిచారు. హైదరాబాద్ మహానగరంలో కౌలు కూలీలు, చిన్న వ్యాపారులు, రిక్షా కార్మికులు – వీరి హక్కుల కోసం ఎల్లప్పుడూ గళమెత్తిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారు.

*ముగింపు*

1967 డిసెంబర్ 19న ఆయన జీవితానికి తెరపడినా, ఆయన కృషి మాత్రం నేటికీ మన సమాజానికి ప్రేరణ. హైదరాబాదు నగర నిర్మాణం, విద్యాసంస్థల స్థాపన, మహిళల విద్యా ప్రోత్సాహం, పేదల కోసం తీసుకున్న సంస్కరణాత్మక నిర్ణయాలు – ఇవన్నీ కలిపి ఆయనను ఒక ప్రజా నాయకుడిగా, ఒక సంస్కర్తగా నిలిపాయి.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జీవితం మనకు చెబుతున్న పాఠం స్పష్టంగా ఉంది: ప్రజా సేవలో నిజాయితీ, సమానత్వంపై నమ్మకం, అణగారిన వర్గాల అభ్యుదయమే నిజమైన రాజకీయ మార్గం. అధికారానికి దాస్యంగా కాకుండా, ప్రజల హక్కులకు పాదాటిగా నిలవడమే ఒక నాయకుడి గొప్పతనం. కృష్ణస్వామి ముదిరాజ్ ఆ బాటలో నడిచిన స్ఫూర్తిదాయక ప్రజానాయకుడు.
Courtesy / source by : @MudirajVoice 

*_రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కారక్ర్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు._*

https://x.com/Praja_Snklpm/status/1956379796965073281?t=YDEBzC6g9bAw4OIPXhZ9iw&s=08  

*#IndependenceDay*

*_రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కారక్ర్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు._* 

*రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు.*

*@tg_governor @TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS*

*_దుబాయ్ (యూఏఈ) 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు_*

https://x.com/satyan559/status/1956255552897425824?t=CXuJGuerrD0E5VN3woLCNA&s=08  
                   *****
https://www.facebook.com/100006620980242/posts/4219880028242655/?mibextid=rS40aB7S9Ucbxw6v

*_దుబాయ్ (యూఏఈ) 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయంలో జెండా ఆవిష్కరణ పురస్కరించుకుని దుబాయ్ లోని పలు ఎన్నారైలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త జంగం బాలకిషన్, పొన్నం సత్యం🇮🇳_*

*@Praja_Snklpm*
*#indianIndependenceDay2025 #IndependenceDay*

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్

[ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…

భారత ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 

దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకుశిరస్సు వంచి నమస్కరిస్తున్నా

గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. 

అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. 

మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచాం.. 

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో  ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.

ఆనాడు  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి, లక్ష్యం వైపు నడిచేలా చేసింది. 

కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు... ఆ దిశగా కార్యచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు. 

దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్ ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు.

పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. 

ఆ నాటి స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ...  

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం.

స్వాతంత్ర్యం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. 

శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. 

శిఖరాలే లక్ష్యంగా సంకల్పం తీసుకుని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. 

ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో... పదేళ్లలోనో సాధించిన విజయం కాదు. 

దీని వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. 

ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. 

ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. 

వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం మన ముందున్న కర్తవ్యం. 

ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను. 

ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.

2023 డిసెంబర్ 7న  మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. 

ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. 

రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. 

సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. 

కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. 

ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం. 

ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు… అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా.

ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం... 

మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం..

ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. 

మా ఆలోచనలో స్పష్టత ఉంది…అమలులో పారదర్శకత ఉంది. 

అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేం ఎంచుకున్నాం. 

పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం.

తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం. 

కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం. 

గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే... 

శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. 

ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం..

దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది 

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం 

మన బలం హైదరాబాద్… ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్. 

ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. 

అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్ లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. 

ఇటీవల 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. 

దీంతో మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగింది 

దేశంలోనే మొదటి సారి...గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) సదస్సు నిర్వహించాం. 

భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. 

గ్లోబల్ రైస్ సమ్మిట్ ను కూడా మనం హైదరాబాద్ లో నిర్వహించుకున్నాం. 

మన ప్రభుత్వం నిర్వహించిన బయోఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్– 2025 ను మనం హైదరాబాద్ లో నిర్వహించాం. 

ఈ అన్నీ వేదికల నుండి మనం తెలంగాణ విజన్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. 

అదే “తెలంగాణ రైజింగ్ – 2047”. 

వచ్చే డిసెంబర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నాం.

సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన…. దీనికి చరిత్రే సాక్ష్యం. 

70 ఏళ్లుగా PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. 

అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. 

13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. 

ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. 

ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు…. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. 

ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. 

ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంటుంది.

రేషన్ కార్డు... ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. 

ఒక భరోసా...భావోద్వేగం….

ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. 

ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. 

ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 

పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో... రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. 

పాడుబడి, మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. 

పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 

ఇది మేం తెచ్చిన మార్పు.

తెలంగాణ రైతుకు 2022, మే 6న వరంగల్ వేదికగారూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం మాట ఇచ్చాం. 

గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. 

రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. 

ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా... రైతుల విషయంలో రాజీ పడలేదు. 

తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. 

“ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. 

కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 

రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. 

కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. 

పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం. 

7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. 

సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. 

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 

దీని కోసం  రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం.

ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. 

మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం

అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం.

తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 

దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. 

రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.

సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. 

స్థానిక సంస్థలలో...విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నాం.

50 రోజుల పాటు సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టాం. 

దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. 

రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. 

మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. 

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను  మూడు గ్రూపులుగా విభజించాం 

గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం. 

ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని  నిర్ణయించాం.

మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. 

బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 

27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. 

రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం..

మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. 

బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. 

ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. 

ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. 

రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది.

యువత తెలంగాణ శక్తికి ప్రతీక. 

గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. 

ఆ కుట్రను మేం చేధించాం. 

ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. 

ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిశితంగా నిఘా పెట్టింది. 

డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 

20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
[2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 

2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. 

ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’. 

2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా… 

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. 

ఇది కేవలం ప్రణాళిక కాదు… ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.

ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. 

మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది. 

వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను... స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుంది. 

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్  డాక్యుమెంట్ ఇస్తుంది. 

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ... ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. 

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. 

2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం.
[హైదరాబాద్ ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తోంది. 

ఆ ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. 

బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. 

ఆ దుస్థితి హైదరాబాద్ కు  రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. 

ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం.

ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశాం.  

ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను అక్రమణల నుంచి రక్షించింది.  

అంబర్‌పేట్‌ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 

30 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. 

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. 

అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పని చేస్తోంది. 

హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది. 

హైడ్రా... హైదరాబాద్ ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ… 

ఆ వ్యవస్థను కాపాడుకుందామని నేను మీ అందరికి పిలుపునిస్తున్నా.
[యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ రెండు నాకు రెండు కళ్లు. 

తెలంగాణ భవిష్యత్ ను తీర్చిదిద్డడంలో ఈ వ్యవస్థలు అద్వితీయ పాత్ర పోషిస్తుంది. 

మన పిల్లల భవితకు ఇవి కేరాఫ్ అడ్రస్ గా నిలవబోతున్నాయి 

దేశ క్రీడా చరిత్రలో తెలంగాణకు ప్రత్యేక చాప్టర్ ఉంది. 

తెలంగాణను దేశ క్రీడా మైదానంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకున్నాం. 

మేటి క్రీడా కారులను తయారు చేసి... ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాల సాధనే లక్ష్యంగా ఇటీవలే నూతన క్రీడా పాలసీని ఆవిష్కరించాం.

 ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ (YIPESU)’ని నెలకొల్పాలని నిర్ణయించాం. 

ఈ వర్సిటీ నిర్వహణ కోసం కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. 

అదే సమయంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా స్కూళ్లు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 

ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో సర్వ హంగులతో సకల వర్గాల విద్యార్థులు చదువుకునేలా యంగ్ ఇండియా స్కూళ్లు సిద్ధం అవుతున్నాయి. 

ఇవి భారతదేశ విద్య రంగంలో గేమ్ ఛేంజర్లు కావడం ఖాయం. 

ఇప్పటికే ఈ దిశగా 15,600 కోట్ల రూపాయల వ్యయంతో 78 పాఠశాలల నిర్మాణం జరుగుతోంది. 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య రంగం అభివృద్ధికి రూ.39 వేల 575 కోట్ల రూపాయలు వ్యయం చేశాం...  

ఈ మొత్తాన్ని మేం ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నాం.
[శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి. 

దేశంలోనే ది బెస్ట్ అని తెలంగాణ పోలీసులకు పేరుంది. 

ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 ప్రకారం కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలవడం మనకు గర్వకారణం. 

138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమిట్’ (డబ్ల్యూపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకాణం. 

డ్రగ్స్ పై పోరు కోసం  ఈగల్ (Elite Action Group for Drug Law Enforcement) గొప్పగా పని చేస్తోంది.
[మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా రూ.8 లక్షల 21 వేల 651 కోట్ల రూపాయలను అప్పులు బకాయిలుగా మిగిల్చి వెళ్లారు. 

దీనిలో రూ.6 లక్షల 71 వేల 757 కోట్ల రూపాయల అప్పులు, ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.40 వేల 154 కోట్లు…

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1 లక్ష 9 వేల 740 కోట్లు. 

వారు చేసిన అప్పును సర్వీస్ చేయడానికి ఇప్పటి దాకా అసలు రూపేణా రూ.1 లక్ష 32 వేల 498 కోట్లు…

వడ్డీలకు రూ.88 వేల 178 కోట్లను మొత్తం కలిపి 2 లక్షల 20 వేల 676 కోట్ల రూపాయలను డెట్ సర్వీసింగ్ చేశాం. 

ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖ‌రాలవైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేం కృషి చేస్తున్నాం. 

జాతిపిత గాంధీజీ,  న‌వ భార‌త నిర్మాత పండిట్ జవ‌హ‌ర్ లాల్ నెహ్రూల స్ఫూర్తి, ప్రజల ఆదరణతో మేం ముందుకు సాగుతున్నాం.

మాకు విల్ ఉంది... విజన్ ఉంది…. తెలంగాణ రైజింగ్ – 2047 మా విజన్. 

ఆ విజన్ ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం… 

ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టడమే మా విజన్. 

ఇందుకు మీ అందరి సహకారం, ఆశీర్వాదం అవసరం.

Thursday, August 14, 2025

"బ్రాండెడ్ దోపిడీ" చేస్తున్న ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలి*

https://x.com/Praja_Snklpm/status/1955991152823558397?t=QbWOFLE8iQu-D90iRfuDkg&s=08  
                 *****
https://www.facebook.com/100006620980242/posts/4219063744990950/

*_Mr రేవంత్ రెడ్డి "గారు" దండాలు 🙏_*

*ఆదాబ్ హైదరాబాద్ కథనం "బ్రాండెడ్ దోపిడీ"  చేస్తున్న ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలి*

*#TelanganaRising in #corruption*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @DamodarCilarapu @TelanganaHealth*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ 
 
ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ కు రూ. కోటి నగదు ప్రోత్సాహకం అందించిన ప్రభుత్వం 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.

Wednesday, August 13, 2025

వికారాబాద్ కలెక్టర్ గారి కార్యాలయంలో అవినీతి అధికారి

K. Sujatha, Jr. Asst., O/o the District Collector, Vikarabad was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.15,000/- from the complainant "To process the documents of the complainant at Vikarabad Collector's Office and to dispatch the copy of Collector's order to the Nawabpet Tahsildar office for inclusion of the name of Complainant's mother in respect of the land (2 Acr) issued to her by the Govt."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in ) The details of the Complainant / Victim will be kept secret.

" ఫిర్యాదుధారుని తల్లి గారికి ప్రభుత్వం వారు ఇచ్చిన రెండు ఎకరాల భూమికి సంబంధించి, ఆమె పేరును చేర్చడం కోసం వికారాబాద్ కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేయడానికి మరియు కలెక్టర్ గారు జారీ చేసిన అధికారిక సందేశ ప్రతిని పాటుగా నవాబ్‌పేట తహశీల్దార్ వారి కార్యాలయానికి పంపడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ - కె. సుజాత.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1955243596724179226?t=hY5eDvrdyX7QuNexiceVMw&s=08

రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. 

హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, సెక్రటరీ మాణిక్ రాజ్, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్, ఇతర ఉన్నతాధికారులు.

 భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి....

* మ్యుటేష‌న్ల ప్ర‌క్రియ త్వ‌ర‌గా పూర్తి చేయాలి... 
* వినియోగ‌దారుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు
* నెలాఖ‌రులోగా ఇందిర‌మ్మ ఇండ్ల ప్రారంభోత్స‌వం....
* రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో వార‌స‌త్వ‌, ఇత‌ర మ్యుటేష‌న్ల‌కు సంబంధించి స్వీక‌రించిన ద‌రఖాస్తుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సీఎం సూచించారు. లైసెన్డ్ స‌ర్వేయ‌ర్లు స‌ర్వే చేసిన అనంత‌రం రెగ్యుల‌ర్ స‌ర్వేయ‌ర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాల‌ని ఆదేశించారు. కోర్ అర్బ‌న్ ఏరియాలో నూత‌నంగా నిర్మించ‌నున్న 10 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల న‌మూనాల‌ను సీఎం ప‌రిశీలించారు. ప్ర‌తి కార్యాల‌యంలో పార్కింగ్‌, క్యాంటీన్‌, ఇత‌ర మౌలిక వ‌స‌తులు ఉండాల‌ని.... కార్యాయాలూ పూర్తిగా
ప్ర‌జ‌ల‌కు స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో... సౌక‌ర్య‌వంతంగా ఉండేలా చూడాల‌ని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో పెద్ద సంఖ్య‌లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం పూర్త‌యింద‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖ‌రులోగా ఇందిర‌మ్మ ఇండ్ల ప్రారంభోత్స‌వానికి  ఏర్పాట్లు చేయాల‌ని  ముఖ్య‌మంత్రి వారికి సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచ‌ర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శులు వి.శేషాద్రి, కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, సీసీఎల్ఏ కార్య‌ద‌ర్శి డి.ఎస్‌.లోకేశ్ కుమార్‌, రిజిస్ట్రేష‌న్లు, స్టాంపుల ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజీవ్ గాంధీ హ‌నుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వి.పి.గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Wednesday, August 6, 2025

*_కాళేశ్వరం ప్రాజెక్టు.... ద్రోహి కేసీఆర్_*

*_ద్రోహి కేసీఆర్_*
_# కర్త, కర్మ, క్రియ ఆయనే.._
_# ప్రశ్నార్థకం లేదు_
_# ఆశ్చర్యార్థకం లేదు_
_# ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక_

Courtesy/ source by:
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో అంతే భారీగా అక్రమాలు, నేరపూరిత నిర్లక్ష్యం, లెక్కలేనితనం, అవకతవకలు, ప్రజాధన వ్యయం పట్ల అంతులేని తేలికభావం ఉన్నాయి. ఎయ్ కేసీఆర్ విను. రాజకీయంగా విమర్శలు వేరు. బీఆర్ఎస్ మినహా తెలంగాణలోని ప్రతి పార్టీ ఎండగట్టింది. ప్రత్యేకించి కాంగ్రెస్, బీజేపీ. ముసుగు తొలగింది‌. అధికారికంగా కేసీయార్ పాలనపై పడిన తొలి మరక. ఇంకా ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం, విద్యుత్తు ఒప్పందాలు వంటి చాలా ఉన్నాయి.., ఉంటాయ్.! వినండ్రా గులాబీ నీచుల్లారా.! కానీ కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్ల ఖర్చుతో ప్రచారం చేయించుకున్న ప్రచారంలోని డొల్లతనం తేటతెల్లమైంది ఇప్పుడు._*

*_ఇదీ నీ అసలు బతుకు_*
తెలంగాణ సాధించిన నాయకుడిగా తెచ్చుకున్న ఖ్యాతి మసకబారిపోయి, ఇప్పుడిక ఈ మరకలు వెంటాడుతాయి కేసీఆర్. కాళేశ్వరంపై వేసిన కమిషన్ తన నివేదికను ఇచ్చింది. ఎందరో బాధ్యులను గుర్తించింది. అందులో నువ్వు ప్రథమ ముద్దాయి. అగ్గిపెట్టె దొరకని ఇంకో సాలేగాడు 2వ ముద్దాయి.

*_ఇక తప్పదు మరి_*
అల్లాటప్పాగా కాదు, వందల మందిని‌ చివరకు ఈ లోపాలకు, నిర్లక్ష్యాలకు కర్త, కర్మ, క్రియగా చెప్పబడుతున్న కేసీయార్‌ను కూడా విచారించింది. (ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆ నివేదికలోని కొన్ని పాయింట్లను జనానికి చెప్పాయి. తప్పదు కదా.!)

*_అందరూ దొంగలే.!_*
అప్పటి సాగునీటి మంత్రి హరీష్‌రావుతోపాటు, అక్రమాలపర్వంలో కిమ్మనకుండా ఉండిపోయిన అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా నివేదికలో ప్రస్తావించినట్టు మీడియా వార్తలు. ఐతే నివేదిక అవినీతి, ఇతర అక్రమాల జోలికి పోలేదు. అదేదో తేలుద్దాం, సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్. కత్తి తన చేతిలోకి రావాలని.

*_'సిట్' వేసి....:_*
ఏమో, కేబినెట్‌లో ఈ నివేదిక మీద చర్చించాక, అవసరమైతే దీనికోసమే ఓ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తే..! తరువాత క్రిమినల్ కేసు నమోదు చేస్తారా..? ఏసీబీకి లేదా సిట్ వేసి దానికి అప్పగిస్తారా దర్యాప్తును…? తెలియదు..! వెరసి కేసీయార్ అరెస్టు దాకా పోతుందా వ్యవహారం..? కాలం చెప్పాలి…! బీఆర్ఎస్ ఎలాగూ కోర్టులో కొట్లాడుతుంది.

*_ఎవరెవరు  బలి కావాలో.._*
ఇంకా ఏమేం లోపాలను నివేదిక ప్రస్తావించిందో ప్రభుత్వమే అసెంబ్లీకి వివరిస్తుందేమో.! ఇప్పటికే ఏయే ఇంజినీర్లు, అధికారులు బాధ్యులో ఓ రిపోర్ట్ తయారైనట్టు సమాచారం. ఒకరిద్దరు వందల కోట్ల ఆస్తులు బయటపడి జైలులో ఉన్నారు. ఏమో.! ఈ ‘బాహుబలి’ ప్రాజెక్టు ఎవరి బాహువుల వల్ల బలి అయ్యిందో తేల్చే క్రమం. బాహు‘బలి’ ప్రాజెక్టుకు ఎవరెవరు  బలి కావాలో కాలమే తేల్చనుంది. కథ ఇప్పుడే కదా మొదలైంది..!!

ఇప్పుడిక బీజేపీ హైకమాండ్ దీన్ని ఎలా వాడుకుంటుందో చూడాల్సి ఉంది.., వాళ్ల చేతికీ అస్త్రమే కదా… ఎమ్మెల్యేల కొనుగోలు నాటకంతో ఏకంగా పార్టీ జాతీయ కార్యదర్శినే జైలులోకి నెట్టాలని చూశాడు కదా కేసీయార్ అనే ఆర్టిస్టు… మోడీ, షా… పాతవన్నీ గుర్తున్నాయా..? జాతీయ స్థాయిలో బదనాం చేసిన దొరవారి ప్లాన్లు..!?

*_(అంకితం: డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి)_*

బాక్స్ 1:

*_నివేదికలో ప్రధానంగా.._*
1) ఈ బరాజుల నిర్మాణానికి ముందుగా కేబినెట్ ఆమోదం లేదు.

2) తుమ్మిడిహెట్టి దగ్గర నీటిలభ్యత లేదనేది సాకు మాత్రమే

3) బరాజుల నిర్మాణానికి ముందు తప్పకుండా చేయాల్సిన జియో టెక్నికల్, జియో ఫిజికల్ శాస్త్రీయ పరీక్షల్ని అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. బ్లండర్ మిస్టేక్.

4) హరీశ్ రావు మౌఖిక ఆదేశాలు నిర్మాణ ప్రమాణాల్ని ప్రభావితం చేశాయి. 

5) సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ పాత్ర కూడా ఉంది, సాగునీటి శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి కూడా బాధ్యుడే. (స్మిత ఇప్పుడు 6 నెలల సెలవులో వెళ్లిందట.. అదో దొంగ ముసుగు)

6) షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వాడారు, వాటి అమరిక కూడా లోపభూయిష్టమే, అందుకే బరాజ్ కుంగిపోయి పగుళ్లు.,.

7) బరాజులు నీటిమళ్లింపుకు ఉపయోగపడాలి, కానీ నిర్లక్ష్యంగా నిల్వ చేశారు.

8) గేట్ల ఆపరేషన్ షెడ్యూల్, స్టాండర్డ్ కోడ్ కూడా పాటించలేదు.

9) బరాజులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు.

10) పాలనాపరమైన నిర్ణయాలతోపాటు అడ్డదిడ్డం నిర్మాణాలకు ఇంజినీర్లు, ఉన్నతాధికారులు కూడా బాధ్యులే.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులను ఆమోదించాలన్న అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు రాష్ట్రపతి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.

❇️బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లులను ఆమోదించాలన్న అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ ధర్నాలో పార్లమెంట్ లో ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొని ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ సంకల్పానికి మద్దతును ప్రకటించారు.

❇️ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోరుబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాసనసభలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు.

❇️“రాబోవు రోజుల్లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా, రోల్ మాడల్ గా నిలుస్తుంది. ఫిబ్రవరి 4, 2024 రోజున ప్రారంభించి సరిగ్గా ఏడాది కాలంలో 4 ఫిబ్రవరి 2025 నాటికి సర్వే పూర్తి చేసి రిజర్వేషన్లు కల్పిస్తూ పరిష్కార మార్గం చూపించాం.

❇️ఆ రిజర్వేషన్లను సాధించుకోవడానికే సడక్ నుంచి సంసద్ వరకు వచ్చాం. యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. వందేళ్లలో ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రాలను పాలించిన దాదాపు మూడు వందల మంది ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేని సాహసం తెలంగాణ మంత్రిమండలి విజయవంతంగా పూర్తి చేసింది.

❇️తెలంగాణ శాసనసభ చేసిన బిల్లులు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి చేరి నాలుగు నెలలైనా ఆమోదముద్ర పడలేదు. ఆ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం.

❇️తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన బీసీ రిజర్వేషన్లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మద్దతుగా నిలబడ్డారు. జంతర్ మంతర్ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా డిమాండ్ ను ఆమోదించాలి. రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోం.

❇️ఈ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నినదించిన విషయాలను తెలంగాణ గ్రామ గ్రామాన చేరవేయాలి. ఒక గొప్ప లక్ష్యంతో ఢిల్లీ వేదికగా పోరాటం సాగిస్తున్నాం. రాష్ట్రపతి గారు మా బిల్లులను వెంటనే ఆమోదించండి..” అని విజ్ఞప్తి చేశారు.

❇️ఈ ధర్నా కార్యక్రమంలో డీఎంకే, సమాజ్ వాది, ఎన్సీపీ, శివసేన, వామపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని తెలంగాణ సంకల్పించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

❇️ధర్నాలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారితో పాటు మంత్రులు @UttamINC గారు, @DamodarCilarapu గారు, @OffDSB గారు, @Tummala_INC గారు, @jupallyk_rao గారు, @iamkondasurekha గారు, @KomatireddyKVR గారు, @Ponnam_INC గారు, @seethakkaMLA గారు, @INC_Ponguleti గారు, @VivekVenkatswam గారు, @minister_adluri గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
#SocialJustice #BCReservations #CasteCensus 

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1953084115168739454?t=_G6ms_vzf7WyDMTWXN7psg&s=19

Monday, August 4, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు.

❇️జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. కమిషన్ రిపోర్ట్‌ను విశ్లేషించడానికి నియమించిన ఉన్నతస్థాయి కమిటీ అందజేసిన సంక్షిప్త నివేదికపై నీటి పారుదల శాఖ మంత్రి @UttamINC గారు మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

❇️అనంతరం ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu గారితో పాటు మొత్తం మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో దాన్ని శాసనసభ, శాసనమండలి ముందు పెట్టి స్వేచ్ఛగా అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

❇️“#JusticePCGhoseCommission నివేదికలో చెప్పిన అన్ని అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియాకు సమగ్రంగా వివరించడం జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ మార్చి నెల 31 వ తేదీన 665 పేజీలతో కూడిన సుదీర్ఘమైన నివేదికను ప్రభుత్వానికి అందించింది. దానిపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సమగ్రంగా విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక అందించింది. మొత్తం నివేదికతో పాటు అధికారుల కమిటీ సంక్షిప్త నివేదికను మంత్రిమండలి ఆమోదించింది.

❇️మేం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రాజెక్టుపై న్యాయ విచారణ కోసం అనుభవం కలిగిన న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ నియమించాం. మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు గారు, ఆనాటి నీటి పారుదల మంత్రి హరీష్ రావు గారు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో పాటు ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులు, ఎంతో మంది నుంచి సమగ్రమైన సమాచారం సేకరించిన మీదట నివేదిక ప్రభుత్వానికి అందజేశారు.

❇️2007-08 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టగా, రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ఆ ప్రాజెక్టు పేరు, స్థలం మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.

❇️2015-16 లో మొదలు పెట్టిన ప్రాజెక్టు 2018 లో పూర్తయినట్టు ప్రకటించారు. నిర్మించిన మూడేళ్లలోపు 2023 లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలిపోగా, అన్నారం, సుందిళ్ల పగుళ్లు రావడం, దానిపై ఆనాటి ప్రభుత్వ హయాంలోనే సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్ఏ ప్రతినిధి బృందం పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక అందజేసింది.

❇️ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాల పునాదులపై వేసిన ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. కమిషన్ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. పూర్తిగా స్వతంత్ర న్యాయ కమిషన్ ఇచ్చిన నివేదిక. రాజకీయ కక్షలకు తావు లేదు..” అని చెప్పారు.

❇️మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారు, నీటి పారుదల శాఖ మంత్రి గారు (పవర్ పాయింట్ ప్రజెంటేషన్) వివరించిన కొన్ని అంశాలు:

🔸ఈ మూడు బ్యారేజీల నిర్మాణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఏకైక నిర్ణయం.

🔸తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పడం నిజం కాదు.

🔸కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే అవసరం లేదని అప్పట్లోనే నిపుణుల కమిటీ నివేదించగా, ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కిపెట్టారు.

🔸కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, లోపభూయిష్టమైన డిజైన్లు, లోపభూయిష్టమైన నిర్మాణం, ఆపరేషన్ - నిర్వహణ లోపం.

🔸మాన్యువల్స్ లేవు. ఒప్పందాలు లేవు. పూర్తయినట్టు చట్ట విరుద్ధమైన సర్టిఫికేట్ల జారీ. బ్యాంకు గ్యారెంటీల విడుదల

🔸సరైన ప్రణాళికలు లేకపోవడం, తప్పుడు అంచనాలు, చట్ట విరుద్ధమైన ఆమోదాల వంటి ప్రతి దశలోనూ అవకతవకలు.

🔸బ్యారేజీల నిర్మాణంపై నోట్ ఫైల్ తప్ప మంత్రిమండలి ఆమోదం లేదు.

🔸చట్ట విరుద్ధమైన కాంట్రాక్టులు, సవరించిన అంచనాలు.

🔸సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణ వైఫల్యం కారణంగా భారీగా ప్రజాధనం వృధా.

🔸ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులు.

🔸కేసీఆర్ గారితో పాటు ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు కూడా బాధ్యులే.

🔸ప్రాజెక్టు నిర్మాణంలో విచ్చలవిడి అవినీతి, ఆర్థిక పరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయి.

🔸అదనపు పనులన్నీ నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది.

🔸కొందరు అధికారులూ ఇందుకు బాధ్యులే. తప్పుడు సాక్ష్యాలు సమర్పించారు. బాధులైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలి.
@OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Tummala_INC @jupallyk_rao @iamkondasurekha  @Ponnam_INC @INC_Ponguleti @seethakkaMLA  @VivekVenkatswam @Adluri12 #VakitiSrihari 
#KaleshwaramProject #Telangana #Medigadda

https://x.com/TelanganaCMO/status/1952399656295838102?t=rKSS2NtTXK53OQ4bjnH2hw&s=19

జిల్లాల కలెక్టర్లు,అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల  నేపథ్యంలో  అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్ర సచివాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో  తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 

జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సీఎం సూచించారు. 

రానున్న రెండు మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని
అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు.  

ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు.
  
వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో  మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

విప‌త్తు స‌హాయ‌క బృందాలు అందుబాటులో ఉండాల‌ని... త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం ఆదేశించారు.

Sunday, August 3, 2025

*శిబు సోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం*

https://x.com/Praja_Snklpm/status/1952258844761186730?t=jgGWIsFIvSOcpXTlL3jiLA&s=19

*#ShibuSoren @TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana #Jharkhand*

*పోరాట యోధుడు గురూజీ.....* *శిబు సోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం*

హైద‌రాబాద్‌:  జార్ఖండ్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లోనూ... గిరిజ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలోనూ మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి శిబుసోరెన్ మృతిపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీ వ్యాపారుల ఆగ‌డాలు, మాద‌క ద్ర‌వ్యాల వ్య‌తిరేక పోరులోనూ శిబు సోరెన్ త‌న‌దైన ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబుసోరెన్ ఎప్పుడూ మ‌ద్ద‌తు తెలిపేవార‌ని... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి సైతం చివ‌రి వ‌ర‌కు ఆయ‌న మ‌ద్దతుదారుగా నిలిచిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదివాసీ స‌మాజానికి గురూజీ చేసిన సేవ‌లు చ‌రిత్ర‌లో శాశ్వతంగా నిలిచిపోతాయ‌ని సీఎం తెలిపారు. ఎనిమిది సార్లు లోక్‌స‌భ ఎంపీగా, రెండు సార్లు రాజ్య‌స‌భ స‌భ్యునిగా, జార్ఞండ్ ముఖ్య‌మంత్రిగా ఎన‌లేని సేవ‌లు అందించార‌ని సీఎం తెలిపారు.  శిబు సోరెన్ కుమారుడు, జార్ఞండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సానుభూతి తెలియ‌జేశారు.

Friday, August 1, 2025

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించిన అధికారులు.

https://x.com/Praja_Snklpm/status/1951259953701773741?t=LezfQpzJUn3slxBO5F5qKA&s=08
                *****
https://www.facebook.com/100056676656888/posts/1244536110778932/
                *****
https://www.instagram.com/p/DM0BH3zS7yn/?igsh=N3ZpbXp1Znk1M3c5

*_BREAKING_*

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించిన అధికారులు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదికను అందజేసిన అధికారులు. 

నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని నియమించిన ప్రభుత్వం 

నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీ 

నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ కు సమర్పించనున్న కమిటీ.

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS*

తెలంగాణ రెవిన్యూ శాఖ అవినీతి అధికారి

Bala Subramanyam, Revenue Inspector, Bhutpur Mandal, Mahaboob nagar District was caught by Telangana #ACB for demanding and accepting the #bribe of Rs.4,000/- from the complainant "To verify the kalyana laxmi application of the  Complainant's Sister".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని సోదరికి సంబంధించిన కల్యాణ లక్ష్మి దరఖాస్తును ధృవీకరించడానికి" అతని నుండి రూ.4,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ - బాల సుబ్రహ్మణ్యం.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1951240390721376580?t=LH49SydPkqUgSU_Qf4N7MA&s=19