మంత్రి అడ్లూరి తో భేటీ
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ & మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr).
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్‌జెండర్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులో తీసుకొచ్చింది అని . అట్టి సంక్షేమ పథకాలు న్యాయంగా అందరికి చేరేలా కృషి చేస్తున్న మంత్రికి అభినందనలు తెలిపారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ కాలేజీ స్థాయి నుంచి ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది.
No comments:
Post a Comment