భూపాలపల్లి బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్...
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది..
ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ..
తొలి తెలంగాణ, మలి తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు..
తెలంగాణ ఉద్యమంలో కర్త, క్రియా గా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహారించారు..
తెలంగాణ ను సాధించడంలో ముందుభాగంలో నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతపు బిడ్డ..
నల్ల బంగరాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికే ఆదర్శంగా ఉన్నారు..
తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారు..
ఎన్టీఆర్ మొదట భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికితీతకు పునాదిరాయి వేశారు.
భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు..
రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కాని, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కాని ప్రభుత్వ పరిశీలనలో లేవు..
జిల్లా పునర్వీభజన పైన అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చ చేసి న తర్వాత దీని పైన ఆలోచన చేస్తాం.
.
కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారాలు చేస్తున్నవారిని గమనించాలి..
భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు..
తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ అన్ ఫిట్ బోర్డు ను రద్దు చేస్తాం..
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైన కొందరు విష ప్రచారం చేస్తున్నారు..
మెడికల్ బోర్డు పైన విష ప్రచారం చేసే వారిని మోకాలిపైన కూర్చొబెట్టాలి..
సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది..
సింగరేణి కార్మికులు నిండు మనసుతో పనిచేసి కాంగ్రెస్ జెండాను మోయడం వల్లనే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది..
ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులది.. వారికి నష్టం కల్గించే పనిచేయం..
217 డిస్మిస్ కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుంది..
వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు..
డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మాటలు చెప్పాడు..
వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ ఎర్ర వల్లిలో , 100 ఎకరాల్లో జన్వాడ లో కేటీఆర్ , హరీష్ రావు, కవిత, సంతోష్ రావులకు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు..
ఒక్క కేసీఆర్ క్లాస్ మెంట్ జాహంగీర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఏమీ రాలేదు..
టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు కేసీర్ కుటుంబానికి వచ్చాయి..కాని పేదలకు డబల్ బెడ్రూం ఇళ్లు రాలేదు..
యేడాది కి 2 లక్షల ఇళ్లు కడితే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టే అవకాశం కేసీఆర్ కు ఉండేది..
కాని పేదల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదు..పేదలపైన ఆయనకు ప్రేమ లేదు..
భూపాలపల్లి లో రైతు పోరాట బాట, కార్మికుల పోరు బాట నేను గతంలో నిర్వహించాను..
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం.. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం..
వచ్చే బడ్జెట్ లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం..
పేదల ఆత్మగౌరవం పెరిగేలా , ఆడబిడ్డలు ఆశ్వీరధించేలా ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత మంజూరు చేస్తాం..
సరస్వతి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించుకున్నాం..
1000 ఏళ్లు గుర్తుండేలా మేడారం ఆలయం నిర్మించాం..
సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా నిర్మించాం..
జంపన్న వాగు నుంచి రామప్ప చెరువుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
కొండా సురేఖ, సీతక్క మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించారు..
2027 లో రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతంగా 3,4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం..
గోదావరి పరిహాక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం..
10 ఏళ్లు కేసీఆర్ సీఎం గా, మూడు సార్లు ప్రధాని మోదీ గా ఉన్నారు..
కేసీఆర్ , మోదీ చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ చెపుతున్నాయి.. గల్లీలో మోరీలు కేసీఆర్ వచ్చి తీస్తాడా..?
కేసీఆర్, మోదీ బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికి వస్తారు..
పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే సంసారం ఆగం అవుతుంది..
కాంగ్రెస్ కు ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి..
ఎర్రవెల్లి పామ్ హౌస్ లో బోర్లా బొక్కలా పడుకున్న కేసీఆర్ మీకు నిధులు ఇవ్వడు..
పదేళ్లు సీఎంగా ఉండి భూపాలపల్లి కి బై పాస్ రోడ్డు తీసుకురాలేదు..
మోదీ ఏ నాడు భూపాలపల్లికి రాలేదు..
కేసీఆర్, మోదీ ని చూసి ఓటు వేస్తే మోసపోతారు జాగ్రత్త..
తెలంగాణ లో మున్సిపాలిటీలు, కార్పేరేషన్ల కు 17,442 కోట్లు మంజూరు చేశాం..
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ లకు 6116 కోట్లు మంజూరు చేశాం..
భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్ల నిధులు మంజూరు చేశాం..
మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీరు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లుంది ..
కేసీఆర్ ఇంటిల్లిపాలికి పదవులు ఇచ్చుకున్నడు..కాని పేదలకు ఏమీ చేయలేదు..
కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపిస్తే గండ్ర వెంకటరమణారెడ్డి కేసీఆర్ సంకను చేరాడు..
ఎవరకి వారు వాళ్లు తమ సామాజిక వర్గం పేరుతో నన్ను పిల్చుకున్నారు.. ఎవరు ఎలా పిలిచినా సంతోషిస్తా..
కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు గా మారి కేసీఆర్ ను అరెస్టు చేయకుండా అడ్డుపడుతున్నాడు..
నేను ఏమైనా సీఎం నా అరెస్ట్ చేయడానికి అని కిషన్ రెడ్డి అంటున్నాడు.
వేలకోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా, రాహుల్ గాంధీ ని కేసుల పేరుతో సీబీఐ, ఈడీ పేరుతో తిప్పించి అమానించలేదా..?
గాంధీ కుటుంబాన్ని మానసిక క్షోభ కల్గించిన మీకు ఉసురు తగలదా...
రాహుల్ గాంధీ ని ఈడీ, సీబీఐ కేసులతో వేధిస్తున్నారు..
గాందీ కుటుంబంపైన ఈడీ , సీబీఐ ని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరం పైన సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు..
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కాపాడుతుంది మీరు కాదా..
కిషన్ రెడ్డి నల్లికుంట్ల మాటలు మాట్లాడుతున్నాడు..
ఫెవికాల్ బంధం తో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను కిషన్ రెడ్డి కంచె వేసి కాపాడుతున్నాడు..
కేసీఆర్, కేటీఆర్, హరీస్ రావు ను అరెస్టు చేసే వరకు కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తాం..
కేసీఆర్ కు దత్తపుత్రుడు కిషన్ రెడ్డి..
ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీతారలను వదలలేదు..
భార్యభర్తలు ఫోన్లు విన్న పాపాత్ముడు ఎవరైనా ఉంటారా..
వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారు..
వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి మాటలు విని ఆస్తులురాయించుకున్నారని బీజేపీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా చెప్పారు..
ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి..
టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు దోచుకున్నారు..
బీఆర్ఎస్ పార్టీ ఎకౌంట్ లో 1500 కోట్లు ఎవడబ్బ సొమ్ము..
వ్యాపారులను బెదిరించి భూములను రాయించుకున్నారు..
చేసిన పాపాలు ఊర్కే పోవు..చేసిన పాపాల ఊబిలో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుంది..
కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి..
బీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు వేరు వేరు కాదు..
బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు బొమ్మ, బొరుసు లా.. బిల్లా రంగ లా.. కాంగ్రెస్ ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాయి..
భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎగరవేయాలి..
దెబ్బ కు దెబ్బ కొడతాం..
మీ తాతలు.. ముత్తాతలను తీసుకువచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ల సంగతి చూస్తారు..
మా అక్కలు దసర పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు..
బతుకమ్మ చీరలను బాయి కాడ పిట్టలను బెదిదరించడానికి కట్టారు..
ఇందిరమ్మ చీర ను సారె రూపంలో మీ తమ్ముడు పెట్టాడు..
ప్రతి యేడాది ఇందిరమ్మ చీరను సారె గా తప్పకుండా ఇస్తాం..
.
ఆడబిడ్డల ఆశ్వీరాధం ఉంటే మోదీ, కేసీఆర్ తాత వచ్చినా ఓడిస్తాం..
No comments:
Post a Comment