Saturday, February 7, 2026

వికారాబాద్ జిల్లా పరిగిలో “ ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగిలో “ ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…

గత ప్రభుత్వం చేసిన అప్పులను.. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం 

రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లు మోదీ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసిందేం లేదు 

మోదీని చూసి ఓట్లు వేయాలని బీజేపీ నాయకులు అంటున్నారు 

ఎవరైనా పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తారా

మోదీని చూసి ఓటేస్తే గల్లీలో ఉండే బోడిగాడు పనిచేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా? 

బీజేపీ కార్యకర్తలు వాళ్ల బీ ఫామ్ బీఆరెస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నారట 

బీజేపీ, బీఆరెస్ వి చీకటి ఒప్పందాలు

నిజంగా మీరు సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజలు మీకే ఓటేసే వారు 

ఆనాడు నిజంగా కేసీఆర్, మోడీ నిధులు ఇచ్చి ఉంటే వాళ్లకు ఇవాళ ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లు అడగాల్సిన పరిస్థితి  ఎందుకు?

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేస్తే..

రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదని కేసీఆర్ పడావు పెట్టారు 

చేవెళ్ల దగ్గర ఉన్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకం ఇందుకు సజీవ సాక్ష్యం 

రంగారెడ్డి జిల్లాకు 3 టీఎంసీలు గోదావరి జలాలు అందిస్తే వేల ఎకరాలకు సాగు నీరు అందేది 

రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి చెప్పిండ్రు 

మరి చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి అనుమతులు ఎందుకు తీసుకురాలేదు 

మీరు చేసిన ద్రోహానికి ప్రజలను కలిసే అర్హత మీకు ఉందా? 

రోజమ్మ రొయ్యలపులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానన్నాడు కెసీఆర్ … కానీ రంగారెడ్డికి గోదావరి జలాలు ఇస్తానని చెప్పలేదు

లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కు సంబంధించి భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తాం.. ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తాం

కెసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది 

లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళల్లో కూలేశ్వరం అయింది.. 


కాళేశ్వరంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఫామ్ హౌసులు కట్టుకున్నారు…

వాళ్లు వ్యాపారాలు పెట్టుకున్నారు తప్ప రంగారెడ్డి  ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేం లేదు 

గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి,వికారాబాద్ సస్యశ్యామలం చేసే బాధ్యత మాది 

కెసీఆర్ దళితులను మోసం చేస్టే.. మేం దళితులకు స్పీకర్ గా, మంత్రులుగా అవకాశం కల్పించాం 

అందుకే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ముఖం చాటేశారు 

తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాగ్నా నుంచి తాగునీరు అందిస్తాం 

మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాలకు కృష్ణా జలాలు తరలించి 1 లక్ష 50 వేల ఎకరాలకు నీరు అందిస్తాం 

పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు పూర్తి చేయలేదు 

రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోయారు.. ఈ పాపం కెసీఆర్, సబితా ఇంద్రారెడ్డిది కాదా 

కోర్టు కేసులను పరిష్కరించి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు పనులను వేగవంతం చేశాం 

తాండూర్ రోడ్డును కూడా పూర్తి చేసే బాధ్యత మాది 

త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు రాబోతున్నాయి 

వికారాబాద్ ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారబోతోంది. 

రెండేళ్లలో పేదలకు రేషన్ కార్డులు అందించాం, సన్నబియ్యం అందించాం 

రైతు రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూసాం 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం 

పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం 

70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం 

కెసీఆర్, కల్వకుంట్ల కిషన్ రావ్ రాసిపెట్టుకోండి 

రాబోయే ఎనిమిదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది 

శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ నుంచి ఊర్లమీదకు మారీచుడు, సుబాహును పంపించాడు 

వాళ్లు మేం చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు 

కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు 

ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు

కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్ననని నన్ను హరీష్, కెటీఆర్ విమర్శిస్తున్నారు 

కెసీఆర్ దొంగ పాస్ పోర్టుల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా 

కేసీఆర్ పై దొంగనోట్ల కేసు నమోదు అయిందని మీ పక్కనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడు 

మీ దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా 

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దొంగహామీల చరిత్ర నేను చెరిపితే పోతుందా 

మీ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరు 

తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదు 

ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది 

ఇది మన కాలనీల అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు 

మనపై విషం చిమ్మే పాములకు మళ్లీ పాలుపోసి బతికించొద్దు 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

No comments:

Post a Comment