Sunday, April 3, 2022

డ్రగ్స్ కేసు పై పోలీసు అధికారులతో సి వి ఆనంద్ అత్యవసర భేటీ......!

డ్రగ్స్ కేసు పై పోలీసు అధికారులతో సి వి ఆనంద్ అత్యవసర భేటీ......!

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ పట్టుబడటం, అందులో పలువురు ప్రముఖల పిల్లలు ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే, ఈకేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈకేసుకు సంబంధించి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌) రిపోర్టు కోసం పంపారు. పశ్చిమ మండల టాస్క్‌ ఫోర్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు ఈకేసును దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు డ్రగ్స్‌ కేసుపై పోలీసు అధికారులతో నగర సీపీ సీవీ ఆనంద్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్‌ జోన్‌లోని ఆయా పోలీస్‌స్టేషన్లకు చెందిన సెక్టార్స్‌ ఎస్‌ఐలు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు రిపోర్టు చేయాలని సీపీ ఆదేశించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Saturday, April 2, 2022

అర్ధరాత్రి పబ్ పై దాడులు..... పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్......!

*అర్ధరాత్రి పబ్ పై దాడులు..... పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్......!*

హైదరాబాద్ : బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పీఎస్‌కి తరలించారు.అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు పబ్​పై దాడులు నిర్వహించారు. పట్టుబడిన యువకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా వారు స్టేషన్‌లో హంగామా సృష్టించారు. తమను ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంరంటూ ఆందోళనకు దిగారు. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ టాలీవుడ్‌ సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల కుమారులు కూడా ఉన్నారు.

రైడ్స్‌ అనంతరం పబ్‌ నిర్వాహకులు అభిషేక్‌ ఉప్పల్‌, అనిల్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌ను సీజ్‌ చేశారు. కాగా, పబ్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

పోలీస్ అవుతారా..... రాచకొండకు...... రండి

*పోలీస్ అవుతారా..... రాచకొండకు...... రండి*

*ఉచిత శిక్షణ కేంద్రాలకు ఏర్పాట్లు*

హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ, యువకులకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సారథ్యంలో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు, దాతల సహాయంతో ఉచిత కోచింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్‌, ఎల్‌.బి.నగర్‌, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో శిక్షణ కేంద్రాలు తెరవనున్నారు. గతంలో రాచకొండ పోలీస్‌ ద్వారా కోచింగ్‌ తీసుకొని 588మంది పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్‌ 5 సాయంత్రం 6 గంటల్లోపు తమ సమీప పోలీస్‌ స్టేషన్‌లోనూ పేర్లను నమోదు చేసుకోవచ్ఛు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు, ఆధార్‌ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. పురుషులు 167.6 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉన్నవారు మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. స్థానికులకు ప్రాధాన్యం ఉంటుంది.

link Media ప్రజల పక్షం🖋️ 

రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ –

రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ

జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోని మైనారిటీలకు సంబంధించిన పలు అంశాలపై కోవింద్ తో చర్చించినట్టు కమిషన్ చైర్ పర్సన్ షెహజాదీ మీడియోకు తెలిపారు.


సాహసోపేతమైన నిర్ణయాలు కెసిఆర్ ప్రకటిస్తారు..... సంతోష్ కుమార్ శాస్త్రి

*సాహసోపేతమైన  నిర్ణయాలు కెసిఆర్ ప్రకటిస్తారు..... సంతోష్ కుమార్ శాస్త్రి.....!*

హైదరాబాద్: ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఇది ఉద్యోగ నామ సంవత్సరమని, 75 శాతం మంచి ఫలితాలు కనిపిస్తుండగా... 25 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. క్రీడా, రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. అన్ని చోట్లా మహిళలు కీలకంగా మారబోతున్నారని అన్నారు. తెలంగాణ ఐఏఎస్‌లలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ముఖ్య నేతలకు భద్రత పెరుగుతుందని, దేశంలో అలజడులు ఉంటాయని శాస్త్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తుందన్నారు. కొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కేసీఆర్ ది కర్కాటక రాశి అని...సీఎం జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందని తెలిపారు. ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి వెల్లడించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

గాంధీ భవన్ పంచాంగ పఠనం లో సంచలన విషయాలు.... కేంద్రంలో ఒక నాయకుడు మరణిస్తారట

*గాంధీ భవన్ పంచాంగ పఠనం లో  సంచలన విషయాలు.... కేంద్రంలో ఒక నాయకుడు మరణిస్తారట .....*

హైదరాబాద్ : గాంధీభవన్ పంచాంగ పఠనంలో పలు సంచలన విషయాలను వేద పండితులు శ్రీనివాస మూర్తి వెల్లడించారు. కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందని ఆయన వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్నీ చవిచూస్తాయన్నారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోందన్నారు. అక్టోబర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని శ్రీనివాసమూర్తి తెలిపారు.

పంచాంగ శ్రవణం అనంతరం రేవంత్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తరపున సమరోత్సహంతో పని చేస్తామన్నారు. 42లక్షల మెంబర్ షిప్ చేసుకున్నామని వెల్లడించారు. 80లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు వస్తాయని రేవంత్ తెలిపారు. ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం తేవాలన్నారు. పార్లమెంట్‌లో సోనియమ్మ, మీరాకుమార్, సుష్మాస్వరాజ్‌తో తెలంగాణ వచ్చిందన్నారు. అలాంటి తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని రేవంత్ వాపోయారు.

link Media ప్రజల పక్షం 

 

Friday, April 1, 2022

రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.... హాజరైన రాజకీయ ప్రముఖులు

*రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.... హాజరైన రాజకీయ ప్రముఖులు*

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశుభకృత్ నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని.. ఆ వెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజ్‌భవన్‌లో వేడుకలకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు గైర్హాజరయ్యారు. ఉగాది వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి వేడుకలకు హాజరయ్యారు.

link Media ప్రజల పక్షం🖋️