రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.
❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.
❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.
❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.
❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి, ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.
❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.
❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
#Eenadu #RamojiFilmCity
Courtesy / Source by:
https://x.com/TelanganaCMO/status/1990103785851810087?t=HBHXRhcJGMpw35rL6Gx3iQ&s=19
No comments:
Post a Comment