BREAKING
రేపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నెక్లెస్ రోడ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం
కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం
అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని నిర్ణయం
రేపు సెక్రటేరియట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో మాట్లాడనున్న సీఎం.
అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో మొదలు కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ
చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని నిర్ణయం.
తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ.
రేపటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ
రెండవ దశలో మార్చి 1నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
చీరల నాణ్యత విషయంలో రాజీపడకుండా పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.
No comments:
Post a Comment