Sunday, November 30, 2025
Notification for Recruitment of 66 Civil Judge Posts
Friday, November 28, 2025
“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” సీఎం రేవంత్ రెడ్డి
“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ #BharathFutureCity లో జరగనున్న ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
❇️హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.
❇️బ్రిటన్ మాజీ ప్రధాని @TonyBlairEU, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం @anandmahindra, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.
❇️#UAE రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, #RasAlKhaimah ప్రతినిధులు, డుయిష్ బోర్సే (#DeutscheBörse) గ్రూప్ హెడ్ Ludwig Heinzelmann , ఎన్రిషన్ (#Enrission) వ్యవస్థాపక భాగస్వామి #Winston, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ #MandaiWildLife గ్రూప్ సీఈఓ Bennett Neo తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.
❇️‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.
❇️ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో #TelanganaRisingGlobalSummit2025 ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి గారి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.
❇️తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.
లియోనెల్ మెస్సీ..
❇️రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తారు.
❇️తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ #GOAT లయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది. #Messi #Hyderabad
#MessiInHyderabad #TelanganaRising2047
Courtesy / Source by :
https://x.com/TelanganaCMO/status/1994665836997657072?t=R6pvGVQWiKqQttOC1j0mWQ&s=19
corruption in Telangana State Waqf Board
Monday, November 24, 2025
2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు.
2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడుదామని చెప్పారు.
❇️ముఖ్యమంత్రి గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ #HKM వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం @AkshayaPatra ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు.
❇️ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు.
❇️ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నాం.
❇️ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదే విధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నాం. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదు. ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించాం. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నాం.
❇️#Kodangal నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నాం. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియో థెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభించుకోబోతున్నాం.
❇️రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మించుకుంటున్నాం. గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లే విధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం.
❇️కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించాం.
❇️భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయి. రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చాం. లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం.
❇️కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నాం.
❇️ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ కావాలి. అందుకే వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ (వికారాబాద్, పరిగి కొడంగల్ నారాయణపేట్, మక్తల్) నుంచి కర్నాకట రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేశాం. 70 ఏండ్లుగా వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నాం.
❇️ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండలంలో తొందరలోనే సిమెంట్ పరిశ్రమను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబోతున్నాం.
❇️రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పంపిణీ చేయడానికి కోటి చీరెలను సారెగా నాణ్యత కలిగిన చీరలను అందిస్తున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర అందాలి. ప్రతి ఆడబిడ్డ ఇంటికెళ్లి చీర అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
❇️గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలి.. అని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.
❇️నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని 300 కోట్ల రూపాయల చెక్కును అందించారు. అంతకుముందు మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న బస్సుకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు.
❇️ఈ కార్యక్రమాల్లో మంత్రులు @DamodarCilarapu గారు, వాకిటి శ్రీహరి గారు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. #AkshayaPatraFoundation #MidDayMeals #TelanganaRising2047
Courtesy / Source by :
https://x.com/TelanganaCMO/status/1992953586335265274?t=VAFWVW6a6wjjcteOORYeWw&s=19
Sunday, November 23, 2025
*దుబాయ్ రన్ 2025 ఇన్ మోషన్ లో తెలుగువారు*
మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారు.. సీఎం రేవంత్ రెడ్డి
భగవాన్ సత్య సాయిబాబా గారి ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తెలిపారు. సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.
❇️పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో @VPIndia శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, @TripuraGovernor శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, @AndhraPradeshCM శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ @naralokesh గారితో పాటు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.
❇️ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, సాయిబాబా గారి సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ప్రకటించారు.
❇️“సాయిబాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.
❇️సాయి గారు మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వహకుల అందరిలో కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా గారు, వారి ట్రస్టు ద్వారా చేసి చూపించారు. ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
❇️విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నాడు.
❇️పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారు.
❇️మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారు. ఈనాడు 140 దేశాల్లో బాబా గారికి భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారు.
❇️సాయి గారి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
❇️సత్య సాయిబాబా గారి ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది.." అని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి గారు సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా గారి మహాసమాధిని దర్శించుకున్నారు. @CPR_VP #SriSathyaSaiBaba
#100YearsofSriSathyaSai #Puttaparthi
Courtesy / Source by :
https://x.com/TelanganaCMO/status/1992496058765897915?t=LahPXT_CIM-kWge3CbaGqw&s=19
Tuesday, November 18, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అయ్యప్ప మాలలో రెవిన్యూ అవినీతి అధికారులు
Kaluva Kiran Kumar, Mandal Surveyor and Mekala Bhaskar, Chainman, O/o the Tahsildar, Secunderabad Mandal in Hyderabad District were caught by the Telangana #ACB Officials, for demanding the #bribe of Rs.3,00,000/- and accepting Rs.1,00,000/- as first installment from the Complainant "for not to take any adverse action on the notice issued against the property pertaining to the Complainant".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు"
ఫిర్యాదుధారుని నుండి రూ.3,00,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో మొదటి విడతగా రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ - కాలువ కిరణ్ కుమార్ మరియు చైన్ మెన్ - మేకల భాస్కర్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1990799434804797567?t=Dme-Tclsisk7BoT-elQrVg&s=19
Monday, November 17, 2025
🏡 Telangana Tourism – Homestay Applications Invited
Sunday, November 16, 2025
రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు.
రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.
❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.
❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.
❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.
❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి, ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.
❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.
❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
#Eenadu #RamojiFilmCity
Courtesy / Source by:
https://x.com/TelanganaCMO/status/1990103785851810087?t=HBHXRhcJGMpw35rL6Gx3iQ&s=19

Friday, November 14, 2025
*_అందెశ్రీకి అవమానం.!_*
Tuesday, November 11, 2025
అందెశ్రీ గారి అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాడె మోశారు
ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థీవ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి గారు వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు.
❇️అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ ఎన్ఎఎఫ్‌సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది.
❇️అందెశ్రీ గారి సతీమణి మల్లుబాయి గారు, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.
❇️సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు @OffDSB గారు, @jupallyk_rao గారు, @seethakkaMLA గారు, @Ponnam_INC గారు, @INC_Ponguleti గారు, @minister_adluri గారు, ప్రభుత్వ సలహాదారులు @Vemnarenderredy గారు, కే కేశవరావు గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. #AndeSri #JayaJayaheTelangana
Courtesy / Source by :
https://x.com/TelanganaCMO/status/1988184387905855531?t=SzLs7M01dXZFfCSLs6L0sg&s=19
అందెశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు
Tuesday, November 4, 2025
Saturday, November 1, 2025
*_All D best for Indian proud daughters ✊_*
📲 Just scan & share your experience instantly... Collector,Hyderabad
📢 Dear Citizens,
Your feedback shapes better public service delivery!
💡 We’ve launched the QR Code Feedback System at the #Hyderabad Collectorate.
📲 Just scan & share your experience instantly.
💬 Your voice drives change — every opinion counts!
#PeopleFirst #SmartGovernance #Hyderabad
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@harichandanaias
Courtesy / Source by :
https://x.com/Collector_HYD/status/1984130048799219843?t=J8vNbN9FQuuonwc4pjlhbQ&s=19