Thursday, October 9, 2025

అక్రమాలపై వార్త రాసిన విలేకరిని బెదిరించిన మేక రామ్ రెడ్డి


అక్రమాలపై వార్త రాసిన విలేకరిని బెదిరించిన మేక రామ్ రెడ్డి

- సోషల్ మీడియా వేదికగా మానసికంగా, శారీరకంగా కృంగదీసే విధంగా పోస్టులు
-  టార్గెట్ చేస్తూ ఎక్కడ కనబడ్డా ఫోటోలు వీడియోలు తీసి దాడి చేయాలని పిలుపు
-  హుడా లక్ష్మీ నగర్ పాత నేరస్తుడు మేకరామ్ రెడ్డి పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
-  రామ్ రెడ్డి వికృత చేష్టలపై జర్నలిస్ట్ సంఘాలు, దళిత సంఘాల సీరియస్

Courtesy/ source by ⬇️
 అక్షర శోధన న్యూస్ : అక్టోబర్ 10 హైదరాబాద్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ నివాసులు, సీనియర్ పాత్రికేయులు జి కుమారస్వామి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపైన వార్తాలు రాస్తే హుడా లక్ష్మి నగర్ కు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత మేక రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా దాడి చేసిన వైనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు 9 తారీఖు గురువారం మధ్యాహ్నం రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విలేఖరి. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.. ఈ మేరకు కుమారస్వామి మాట్లాడుతూ.. నా వృత్తిలో భాగంగా బోడుప్పల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు అక్రమ నిర్మాణాలపై ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా వార్తలు రాయడం జరుగుతుందని, అదేవిధంగా గురువారం సత్తిరెడ్డి నగర్ 20వ డివిజన్లో ఒక బిల్డర్ తన బిల్డింగ్ కు అడ్డు వస్తున్నటువంటి ఒక పెద్ద వేప చెట్టును నరికేసి,సెట్ బ్యాక్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారని వార్త రాయడం జరిగిందని, దానిమీద వెంటనే స్పందించిన కమిషనర్ ఎంక్వైరీ అధికారులను పంపియగా, కొంతమంది రాజకీయ నాయకులు, కింది స్థాయి అధికారులు తప్పుడు ఎంక్వయిరీ చేసి కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వాట్స్అప్ గ్రూప్లో ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా నేను పోస్ట్ పెట్టడం జరిగిందని, దానికి కౌంటర్ గా ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి హుడా లక్ష్మీ నగర్ నివాసులు, ఒక జాతీయ పార్టీ నేత మేక రామ్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ.. కింది స్థాయి నుండి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక విలేకరిగా 9 సంవత్సరాల కాలంలో ఒక పేపర్ కి ఎడిటర్ గా ఎదుగుతున్న నన్ను మానసికంగా, శారీరకంగా కృంగదీసే విధంగా వాట్సాప్ గ్రూపులో పోస్ట్లు పెట్టి, సంగారెడ్డిలో ఒక విలేకరిని చెట్టుకు కట్టేసినట్లు కట్టేసి దాడి చేస్తామని, చేయిస్తామని, జింతక్ జింతక్ జింతక్..అనే సినిమా డైలాగ్ తీసుకొని నిన్ను చింతపండు చేస్తామని, ఎక్కడ కనబడ్డ ఫోటోలు వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దాడులు చేయాలని ప్రజలకు ఒకరకంగా ఇన్ డైరెక్టుగా సిగ్నల్ ఇచ్చారని, మేక రామిరెడ్డి నుండి నాకు ప్రాణహాని ఉందని, మేడిపల్లి పోలీసులు నాకు రక్షణ కల్పించి, పాత నేరస్తుడైన రామ్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసులను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా హుడా లక్ష్మీ నగర్ 7వ డివిజన్ ,19 డివిజన్లలో మేక రామిరెడ్డి పైన పలు ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో ఆయా పార్టీ నుండి సస్పెండ్ కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి సత్సంబంధం లేకుండా ఒక విషయం మీద ఒక విలేకరి మీద సోషల్ మీడియా వేదికగా మానసికంగా కృంగదీసే విధంగా మాటల దాడి చేయడం పట్ల నన్ను నా కుటుంబాన్ని తొక్కి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు నా కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

No comments:

Post a Comment