Sunday, July 9, 2023

పోరాడండి... తోడుగా ఉంటాం... ఈటల కు మోదీ భరోసా....!

*పోరాడండి... తోడుగా ఉంటాం... ఈటల కు మోదీ భరోసా....!*

వరంగల్‌: ప్రధాని మోదీ ప్రసంగం ముగిశాక సభా వేదికపై ఓ వైపు నిలుచున్న రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ భుజంపై చేయి వేసి పలకరించారు.కాసేపటికి వేదిక వెనక్కి వెళ్లాక కూడా ఈటల భుజంపై చేయి వేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ''మేం అన్ని విషయాల్లో మీకు అండగా నిలుస్తాం. ధైర్యంగా పోరాడండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయండి. పూర్తి సహకారం అందిస్తాం'' అని ఈటలతో ప్రధాని మోదీ పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సమయంలో పొంగులే టిని కూడా మోదీ పలకరించారు. ఇక సభా వేది క వెనకాల ఈటల, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కేంద్ర మంత్రి గడ్కరీ కాసేపు మాట్లాడారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Friday, July 7, 2023

రిఫండ్ రూ. లక్ష దాటితే.... నోటిస్

*రిఫండ్ రూ. లక్ష దాటితే.... నోటిస్*

*తప్పుడు క్లెయిమ్‌ల కుంభకోణంలో ఐటీశాఖ తాజా కార్యాచరణ*
హైదరాబాద్‌: సంచలనం సృష్టిస్తున్న రిఫండ్‌ కుంభకోణంపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.దేశంలో అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తప్పుడు క్లెయిమ్‌లతో రూ.కోట్ల రిఫండ్‌ స్వాహా అయినట్లు తేలడంతో.. అలాంటి వారి బాగోతాల్ని రట్టు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఒక్క మదింపు సంవత్సరంలో రూ.లక్ష కంటే ఎక్కువగా రిఫండ్‌ పొందిన పన్ను చెల్లింపుదారులకు త్వరలో ఈ-మెయిల్‌ ద్వారా నోటీస్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. రిఫండ్‌ పొందేందుకు ఐటీ శాఖకు అందజేసిన క్లెయిమ్‌ల్లోని వివరాలకు సంబంధించిన పూర్తి ఆధారాల్ని సమర్పించాలని కోరనుంది. వాటిని విశ్లేషించిన అనంతరం తప్పుడు ఆధారాలున్నట్లు గుర్తిస్తే కఠినచర్యలకు దిగనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం అంతకంటే తక్కువ రిఫండ్‌లు పొందిన క్లెయిమ్‌ల్లో అనుమానిత లావాదేవీలపై దృష్టి సారించనుంది. ఇలా తప్పుడు క్లెయిమ్‌లు చేసిన పన్ను చెల్లింపుదారులు లక్షల్లోనే ఉంటారని.. అలాగే ఆ తరహాలో కొట్టేసిన రిఫండ్‌ విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుందని అనుమానిస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️

సిట్టింగులకే టికెట్లు: కేసీఆర్

*సిట్టింగులకే టికెట్లు: కేసీఆర్..*

సిట్టింగులు అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని BRS
అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను మార్చే
ఉద్దేశం తనకు లేదని ఇవాల్టి పార్టీ సమావేశంలో నేతలకు
స్పష్టం చేశారు. సర్వేలన్నీ TRSకు అనుకూలంగా
ఉన్నాయని, మరోసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం
ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఎమ్మెల్యే నిత్యం
ప్రజల్లో ఉండాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లోకి
తీసుకెళ్లాలని సూచించారు. 

Thursday, July 6, 2023

@ghmconline is recruiting

@ghmconline is recruiting

-Chief Information Officer (CIO)
-Chief Data Officer &
-Knowledge Managers ( 6 numbers)

Likewise, @HMDA_Gov is recruiting CIO

Details are on their website
Last date is July 15

Your chance to be a part of development story

@KTRBRS

Courtesy by :-

https://twitter.com/arvindkumar_ias/status/1677135527680839680?t=hOJCZKGEXRarJgpXtdu5jg&s=19

Wednesday, July 5, 2023

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలి : KTR

*హైదరాబాద్ కు భారీ వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలి : KTR*

హైదరాబాద్‌: వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. సమస్యలపై వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో తాము స్వయంగా ఫోన్లో మాట్లాడామన్న అధికారులు.. వార్డు కార్యాలయం వ్యవస్థ పట్ల పౌరులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వార్డుల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

సరూర్ నగర్ లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్... పోలీసుల అదుపులో నిందితులు...!

*సరూర్ నగర్ లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్... పోలీసుల అదుపులో నిందితులు...!*

సరూర్ నగర్ : హైదరాబాద్..సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో కిడ్నాప్‌ ఘటన కలకలం రేగింది. ఇద్దరు సీజీఎస్టీ అధికారులను ఓ దుకాణం యజమానితో పాటు ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు.కృష్ణా నగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్‌ చేసేందుకు జీఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్‌ వెళ్లారు. అదే సమయంలో షాపు యజమానితో పాటు ఫార్చ్యునర్‌ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు .. వారిని కిడ్నాప్‌ చేసి దాడి చేసినట్లు ఎల్బీ నగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని.. జీఎస్టీ అధికారులను కాపాడినట్లు వెల్లడించారు.

''కేంద్ర జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసినట్టు ఇవాళ ఉదయం 10:30 నిమిషాలకు ఫిర్యాదు అందింది. ఫేక్ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా మణిశర్మ, ఆనంద్.. ఇవాళ కృష్ణానగర్‌లో స్క్రాప్, వెల్డింగ్ షాప్‌ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో స్క్రాప్ గోడౌన్ నిర్వాహకులు జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులు లాక్కున్నారు. అనంతరం వారిని వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు. అధికారుల ఇద్దరిపై దాడి చేయడంతోపాటు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.మణిశర్మ వెంటనే రూ.5 లక్షల గురించి ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమై వాహనాల తనిఖీ చేపట్టాం. ఘటనాస్థలికి 4 కి.మీ. లోపలే కిడ్నాపర్ల వాహనం ఉన్నట్లు గుర్తించాం. రాజీవ్ చౌక్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకొని సీజీఎస్టీ ఇన్‌స్టెక్లర్లు మణిశర్మ, ఆనంద్‌లను రక్షించాం. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో ఉండగా, నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం. నిందితులకు నేర చరిత్ర ఏమైనా ఉందా? అని ఆరా తీస్తున్నాం'' అని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️