Monday, June 24, 2024

స్వరూపానంద 'హవా' 'సాము'లోరి చూపు 'ఒడిశా'పై సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్'

*_'ఒడిశా'లో శారదా కన్ను_*
_◆ భూములపై 'స్వరూప' ఆపేక్ష_
_◆ నాటి ఒడిశా మంత్రితో ముచ్చట్లు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శారదాపీఠం. స్వరూపానంద స్వామి కష్టంతో 'ఫ్రీ'గా వస్తున్న 'ఆర్థిక' వేగంతో.. దూకుడుగా నాడు వేగంగా దూసుకెళ్ళింది. నాడు తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానంద 'హవా' నడిచింది. ఇక ఆ 'సాము'లోరి చూపు పక్కనే ఉన్న 'ఒడిశా'పై పడింది. సరదాగా అక్కడ ఓ 'కర్చీఫ్' ముందుగానే వేశారు. నాటి ఒడిశా మంత్రి శారదా పీఠానికి 'అత్యంత రహస్యం'గా విచ్చేశారు. అక్కడ ఏం జరిగింది.? ఆ రహస్య భేటీలో ఎవరు..? ఏం మాట్లాడుకున్నారు..?అత్యంత రహస్యంగా జరిగిన ఆ భేటీలో ఏం జరిగింది..? 'దీక్ష' పాఠకుల కోసం అందిస్తున్న సంచలన పరిశోధన కథనం._*

*ఒడిశా 'భూ కథ' నిజమే..!:*
రాబోయే రోజుల్లో ఒడిశాలో శారదాపీఠం సేవలు విస్తరించేందుకు 'స్థలం' కోసం నాటి ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబా కిశోర్‌దాస్‌ తో శారదాపీఠం అధిపతి భేటీ అయ్యారు. ఒడిశాలో శారదాపీఠం ఆధ్యాత్మిక సేవలు, హైందవ ప్రచారాన్ని విస్తృతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది . బట్ 'వర్కవుట్' కాలేదు. అందుకోసం శారదా పీఠాధిపతులు నాటి ఒడిశా మంత్రులతో గత కొద్దిరోజులు సంప్రదింపులు జరిపారు.

*నాటి ఇద్దరు సీఎంల భక్తిని... పిండుకునే పనిలో స్వరూపానంద..!? ఇదో లొల్లి:*
మనసొస్తే మల్లి, లేకపోతే ఎల్లి..! కేసీఆర్, జగన్ లు అంతే. ఆ క్షణాన 'ప్రేమ' పుడితే అలుముకుంటారు. ఎక్కడో 'సందేహం' తలెత్తితే ఆమడల దూరం పెట్టేసి.. నెట్టేస్తారు. పక్కా ఉద్వేగ ఆధారితం. అంతే తప్ప ఏ లెక్కాపత్రం ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పరిపూర్ణానంద ఇంటికి వెళ్లి, కాళ్ల మీద పడి, ఆశీస్సులు తీసుకుని, అవసరమైతే 'భూమి సాయం చేస్తాను' అని హామీ ఇచ్చాడు అప్పట్లో కేసీఆర్. తరువాత అతనిపైనే బోలెడంత కోపం వచ్చింది, ఓ దశలో ఏకంగా నగరబహిష్కారం.! మరీ అవసరమైతే అరదండాలు కూడా వేయించటానికి రెడీ…! మరి తన కాళ్ల మీద పడినప్పుడు ‘నేను ఎలాంటి వ్యక్తి కాళ్లు మొక్కుతున్నాను’ అని ఎందుకు ఆలోచించలేదు..? సేమ్, చినజియ్యర్… తననైతే నెత్తి మీదే పెట్టుకున్నాడు. యాదాద్రి అప్పగించాడు. వందల కోట్ల రామానుజ ఆశ్రమానికి సపోర్ట్ చేశాడు. చినజియ్యర్ ఏది చెబితే అది… అలాంటిది చినజియ్యర్‌ తో కొంతకాలంగా అంతంతమాత్రమే సంబంధాలు… ఆ విధేయత, ఆ భక్తి, ఆ గురి ఇప్పుడు విశాఖ స్వరూపానందపై కుదిరింది… ఎందుకు..? తెలియదు..!

*స్వయంగా పట్టా చేత పట్టుకొని మరీ..:*
తన చుట్టూ తిరుగుతూ, తన క్షేమాన్ని కాంక్షిస్తూ, కొన్నేళ్లుగా తనతో ఉన్న తెలంగాణ స్వాములు, ఆశ్రమాలు తనకు పట్టవు. పరప్రాంత స్వాములయితే ఎనలేని భక్తి, గురి, ప్రేమ… స్వాములకు ప్రాంతీయ బేధాలేమిటి..? ఉండొద్దు… కానీ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 'రెండు ఎకరాల అత్యంత విలువైన భూమిని' ఉత్త పుణ్యానికి ఓ స్వామికి ఇస్తూ, తనే స్వయంగా పట్టాకాగితాల్ని తీసుకుపోయి అప్పగించడం అనూహ్యం… అసాధారణం… వైపరీత్యం… మరి కేసీఆర్‌ కు సదరు స్వామి చేసింది ఏముంది..? ఏమీ లేదు…! ఏమీ ఉండలేదు కూడా…! 'రాజశ్యామల యాగం' అని పైకి ఓ సాకు… ఆ పూజను ఓ సాధారణ పూజారి కూడా చేయించగలడు… అంతకుమించిన పెద్ద పూజలు, హోమాలు ఈ స్వరూపానందుడి వల్ల అయ్యే పనికాదు… ఏ అయుత చండీయాగమో చేయాలంటే ఈ పరిపూర్ణుడి పీఠానికి చేతకాదు, మళ్లీ శృంగేరీ వంటి పీఠం సహకరించాల్సిందే…! పోనీ, ఈయన పీఠానికి ఏమైనా సుదీర్ఘ, చారిత్రక గురుపరంపర ఉందా..? లేదు..! మరి ఈ రెండెకరాలూ ఎందుకు రాసిచ్చేసినట్టు… అంతే మరి… కేసీఆర్ ప్రేమలోని తిక్కకు చాలాసార్లు లెక్కే ఉండదు… (ఇప్పుడు ఈ భూకేటాయింపుపై కేసు ఒకటి హైకోర్టులో ఉంది…) 

*ఇది మరీ ఎక్స్‌ట్రీమ్… :*
అసలు స్వాములు ఎవరినీ తమను తాకనివ్వరు. ఈయన ఏకంగా జగన్‌ను పట్టుకుని, కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుని, నానా హంగామా క్రియేట్ చేశాడు. పైగా జగన్ అంటే తనకు పిచ్చి ప్రేమ అనీ, తన అధికారపీఠం కోసం బోలెడు పూజలు చేశాననీ ఓ డొల్ల ప్రకటన జారీ చేశాడు. ఈ సర్వసంగ పరిత్యాగ స్వాములకు హైప్రొఫైల్ నాయకులు, వ్యాపారులపైన మాత్రమే ఆ 'ప్రేమ' దేనికట.! అయినా జగన్ జైలుకు వెళ్లినప్పుడు, జగన్ 2014లో అధికారసాధనలో ఫ్లాపయినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఫలించలేదు దేనికో మరి..? ఆశ్రమంలో నిర్దిష్ట తంతు ద్వారా జరగాల్సిన తన ఉత్తరాధికారి వారస ప్రకటనను అమరావతిలో ఎంత ఆడంబరంగా, అట్టహాసంగా నిర్వహించాడో గతంలో చూశాం కదా…!

*నాడు 'బంగారు చిలక' బయటకు ఎలా వచ్చింది:*
ఈ సాములోరికి టీటీడీ ఎంత దాసోహం అంటున్నదీ అంటే…? తిరుమలలో ధనుర్మాసం తిరుప్పావై పాశురాలు ఉంటయ్. మూలవిరాట్టు శంఖం ఎడమచేయి వద్ద ప్రతిరోజూ గోదాదేవి స్మారకంగా ఓ ధనుర్మాస బంగారు చిలుకను అలంకరిస్తారు. ఆకులతో చేస్తారు… దాన్ని గర్భగుడి దాటించి, ఏడు కొండలూ దింపి, అలిపిరి దాకా తీసుకొచ్చి మరీ స్వరూపుడికి ఇచ్చారు. అంతా వాళ్ల ఇష్టం… అవసరమైతే ఉత్సవమూర్తినే అలిపిరి దాకా తీసుకొచ్చి స్వాగతం పలికించినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.

*చివరిగా..*
వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలో చెప్పిందే..
"ధర్మో రక్షతి రక్షితః" జరుగుతుంది.

*_కొసమెరుపు:_*
ఈ ఒడిశా భూముల విషయం కూడా త్రిశంఖు స్వర్గంలో ఉంది. మధ్యలో చంద్రబాబు రావడంతో ఈ స్వామీజీ నాలుక మడతపడింది.

పోలీస్ కానిస్టేబుల్ దౌర్జన్యం

https://x.com/Praja_Snklpm/status/1805272874577707402?t=QdvyAP2IyllQeLDkuQlPqQ&s=08                                                                              

_*గత వారం పోలీస్ కానిస్టేబుల్ చేతిలో అకారణంగా దెబ్బలు తిన్న బాధితుడు రమేశ్ ను ఈరోజు @RachakondaCop కమీషనర్  తరుణ్ జోషి IPS సర్ కార్యాలయం కు తీసుకెళ్లి సీపీ సర్ కు మొత్తం వాస్తవాలు తెలియచేయడం జరిగింది.*_
_*సీపీ సర్ స్పందించి  విచారణ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడాలి న్యాయం జరుగుతుందా లేదా!*_

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/ac4jM3Kp7BRhqfhg/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8oEmltvPRX/?igsh=MTB3eGE2ZHVqZDIzaw==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7211231684682203138-kklr?utm_source=share&utm_medium=member_android

Sunday, June 23, 2024

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

https://x.com/Praja_Snklpm/status/1805100463802716386?t=2b5vtFGlej6I3JbxW0lD0g&s=08   

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*#తెలంగాణ లో 2014 జూన్ నుంచి ఈరోజు వరకు @TelanganaCOPs శాఖ లో చాలామంది పోలీస్ అధికారులు సిబ్బంది #రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ప్రజలకు జవాబుదారీ తనంగాపనిచేయలేదు. ఇలాంటి అధికారుల వల్ల మొత్తం తెలంగాణ పోలీస్ శాఖకే చెడ్డపేరు వచ్చింది.ఇలాంటి అధికారులు /సిబ్బంది ఇంకా చాలామంది ఉన్నారు.ఈ అధికారులను సస్పెండ్ చేయడం కాదు శాశ్వతంగా విధులనుంచి తొలగించాలి. నిరుద్యోగులు వెయిటింగ్ లో ఉన్నారు ఉద్యోగంలో జాయిన్ కావడానికి*_

_*#FriendlylPoliceing అంటే ఏమిటి ?*_

_*గత @BRSparty ప్రభుత్వం పోలీస్ అధికారులను తమ స్వప్రయోజనాలకోసం #phonetapping, న్యాయంగా ప్రశ్నించే వారిమీద అక్రమంగా కేసులు పెట్టించడం, మరీ ముఖ్యంగా లాకప్ డెత్ లు చేశారు అన్నీ చూసాము.ఇకనుంచి అయినా తెలంగాణ పోలీసులు #రాజ్యాంగం ను గౌరవించి విధులు నిర్వహించాలని 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' విజ్ఞప్తి చేస్తుంది*_

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaDGP @RachakondaCop @hydcitypolice @cyberabadpolice @CVAnandIPS @SumathiIPS @CPHydCity @spsircilla @spvikarabad @SwatiLakra_IPS @MRAMESHIPS*

*@sudhakarudumula @umasudhir @Bachanjeet_TNIE @RVKRao2 @SrinivasRTIA @marksDudam @RamsGTRK @PrajaPrashna @BplplH @V6News @TeenmarMallanna @Tolivelugu @kalojitv4ts @HRF_Humanrights*

https://www.facebook.com/share/p/TbmDpzb5A3duk6Lb/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8lnntLPZIM/?igsh=dng3dXF2amlmM3lq 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7210886565747650562-s4Lo?utm_source=share&utm_medium=member_android

తెలంగాణ లో విద్య ను మాఫియాకు అప్పచెప్పారు

https://youtu.be/D3WeBfbFMAc?si=HIv4e4_uiJFx2hhq   

_*తoFDknk డ్రులు అందరు ఈ 👆 వాస్తవ విశ్లేషణ చూడాలి*_ 

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*The National Council of Educational Research and Training (NCERT) ఏమి చెపుతుంది కేంద్ర / రాష్ట్రలకు ? #ncert నిబంధనలు అమలు చేస్తున్నాయా ఈ ప్రభుత్వాలు*_

_*#విద్యాహక్కు చట్టం అమలు ఎందుకు చేయడం లేదు ఈ పాలకులు ?*_

_*#తెలంగాణ లో కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల యాజమాన్యాల వల్ల ఇంకెందరు అమాయక విద్యార్థులు చనిపోవాల్సివస్తుందో 😔. మన ప్రభుత్వాలు మాత్రం ఈ మాఫియాను చూసి ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదు.ఇదేనా బంగారు తెలంగాణ అంటే. ఇందుకోసమేనా తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల త్యాగాలు ?*_

_*@IKranthiBandela @inyjparty మీ పోరాటం చూసి @PawanKalyan @JanaSenaParty స్పందించాలి.*_

_*@TelanganaCMO సారు ఇంకెన్నాళ్లు ఈ మరణాలు ?*_

_*ఆకునూరి మురళి IAS, retd గారి సేవలు #తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు ?*_

_*#తెలంగాణ లో పాలకులు ఉచిత పథకాలు ఇచ్చేకన్నా తెలంగాణ ప్రజలకు న్యాయంగా అందాల్సిన ముఖ్యమైనవి #విద్య #వైద్యం #ఉపాధి #రైతన్న ల సంక్షేమం పక్కన పెట్టేసిన ఈ పాలకులు. ప్రతిపక్ష పార్టీలు @BJP4Telangana @BRSparty @aimim_national #CPI/M వీళ్ళు ఈ సమస్యను పట్టించుకోరు ఎందుకు ?*_

*@AnooradhaR @Murali_IASretd @dr_mvreddy @VenkatReddy_MVF @ShanthaSinha1 @rayadasm @inyjparty @RamsGTRK* 
*@HRF_Humanrights*

*@ProfKodandaram @GhantaC @K_Nageshwar @sravandasoju @BplplH @PushpaFashions*  

https://x.com/Praja_Snklpm/status/1804850019276911028?t=F_GaMqKq7xf3tRnpNq3s1g&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/cboRu181Fvv6rUoR/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C8j8Pf3PL55/?igsh=bXlhaGxqNDJjcmwy 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7210650600202489856-zLAF?utm_source=share&utm_medium=member_android

*చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!*

*చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!*

*హిస్టారికల్ తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధి*

AP DGP ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి DGP శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.

 వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.

 HCUలో PG పూర్తి చేశారు.

 ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్ కేడర్కు వెళ్లారు.

 వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Courtesy / Source by : 
'ప్రజల పక్షం'

Saturday, June 22, 2024

#తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను పరిరక్షిస్తుందా?

గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం 282 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయని రిమోట్ సెన్సింగ్ డేటాను బట్టి వెల్లడైంది. మరో 209 చెరువులు, కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయని తేలింది. గ్రేటర్, ఔట‌‌ర్ ప‌‌రిధిలోని చెరువులు, కుంట‌‌ల‌‌పై సంబంధిత అధికారుల‌‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డాక్టర్ అంబేద్కర్ స‌‌చివాల‌‌యంలో శుక్రవారం రివ్యూ చేశారు. 

2014 నుంచి 2023 వ‌‌ర‌‌కూ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గురైన చెరువులు, కుంట‌‌లకు సంబంధించి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌‌న్ సెంట‌‌ర్ (టీజీఆర్ఏసీ) ఇచ్చిన నివేదికపై సమావేశంలో విశ్లేషించారు. దీంతో గ్రేట‌‌ర్ హైద‌‌రాబాద్ ప‌‌రిధిలో 2014కు ముందు 417 చెరువులు, కుంట‌‌లు ఉండగా.. వాటిలో182 చెరువులు, కుంట‌‌లు పూర్తిగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. మ‌‌రో 76 చెరువులు, కుంట‌‌లు పాక్షికంగా కబ్జాలకు గురైన‌‌ట్లు టీజీఆర్ఏసీ త‌‌న నివేదికలో స్పష్టం చేసింది. 

గ్రేట‌‌ర్ నుంచి ఔట‌‌ర్ రింగ్ రోడ్ ప‌‌రిధిలో మొత్తంగా 503 చెరువులు, కుంట‌‌లు ఉండ‌‌గా.. వాటిలో 62 చెరువులు పూర్తిగా ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గుర‌‌య్యాయి. మ‌‌రో 102 చెరువులు, కుంట‌‌లు పాక్షికంగా కబ్జాల‌‌కు గుర‌‌య్యాయి. అలాగే 2014 నుంచి 2023 వ‌‌ర‌‌కూ గ్రేట‌‌ర్ లోని 417 చెరువుల‌‌కు గాను 11 చెరువులు పూర్తిగా, మ‌‌రో 7 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గుర‌‌య్యాయి. ఇక గ్రేట‌‌ర్ నుంచి ఔట‌‌ర్ ప‌‌రిధిలో గల 503  చెరువులలో  27  చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురికాగా మ‌‌రో 24 చెరువులు పాక్షికంగా కబ్జా అయినట్లు తేలింది.

 ఇలా గ్రేట‌‌ర్, ఔట‌‌ర్ ప‌‌రిధిలో మొత్తం 920  చెరువులు, కుంటలకుగాను 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. మ‌‌రో 209 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయినట్లు ఆయా సంవత్సరాల శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ లు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా తేలింది. కాగా, చెరువులు, కుంట‌‌లు ఆక్రమ‌‌ణల‌‌కు సంబంధించిన టోపోషీట్ ల‌‌ను, శాటిలై  ట్ ఇమేజెస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప‌‌రిశీలించారు. ఈ ఆక్రమ‌‌ణ‌‌ల‌‌పై స‌‌మగ్ర క్షేత్ర స్థాయి సర్వే నిర్వహిస్తామని, చెరువులను పూర్వ స్థితికి పునరుద్ధరించడానికి చర్యలు చేపడతామని చెప్పారు.

Courtesy / Source by : V6 వెలుగు మీడియా 

Thursday, June 20, 2024

_*జోహార్లు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు ✊*_

https://x.com/Praja_Snklpm/status/1804019627384779051?t=yVfykyIUBqcCndzPS3xT_Q&s=08  

_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_
*#ProffecerKotthapalliJayShankar*

_*ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారు. విద్య, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ సిద్ధాంతకర్త 'తెలంగాణ జాతిపితగా' పేరుగాంచిన ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆ జన్మ బ్రహ్మచారిగా తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు. "ఏటికైనా మట్టికైనా మనవాడే ఉండాలే" అని గట్టిగా కొట్లాడిన వ్యక్తి. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు గారి వర్ధంతి సందర్భంగా 'ప్రజాసంకల్పం గ్రూప్ Link Media' ఘన నివాళులు అర్పిస్తుంది.*_ 

*@TelanganaCMO* 

*Bplkm✍️*

https://www.facebook.com/share/b78HQXMQhMzSQfJR/?mibextid=oFDknk 
*****----*****----*****----*****
https://www.instagram.com/p/C8d0M4ovta2/?igsh=MTd6MnVubnJmNDByMQ==
*****----*****----*****----*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-on-instagram-https-activity-7209788241707716608-ni9o?utm_source=share&utm_medium=member_android