Thursday, June 4, 2020

రైతు గొప్పదనం

Life!!!
A cradle on yoke 

*ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదు!!!**

బంగారు తండ్రి ... నువ్వు ఆనందంగా ఉండాలి.
*ఈ దేశం నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా*, 
మీ తాత ఆయనకు కుదిరింది చేస్తున్నాడు.

One of the best photos.
@sakshinews plz convey Praja Sankalpam Group regards to the photographer. 

గ్రూప్ link సాక్షి మీడియా సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
04/06/2020

https://prajasankalpam1.blogspot.com/

kerala Elephant Murder 😔

They not only killed the Mother and the baby ,, 
They also killed the TRUST ON HUMANS for ever Shameful
#KeralaElephantMurder
#Elephantdeath 

Praja Sankalpam 
Group @admin  bplkmCS 
Bapatla Krishnamohan 
04/06/2020

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో డాక్టర్స్ కు కరోనా

హైదరాబాద్ : 04/06/2020

*తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా... అధికారుల అత్యవసర సమావేశం!*

వైరస్ పై పోరాటంలో ముందు నిలిచిన వైద్యులు

గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్

తక్షణ చర్యలపై అధికారుల చర్చ


కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిలో డాక్టర్లే ముందు నిలిచివున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లు, తమ ప్రాణాలను పణంగా పెట్టి, వైరస్ సోకిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లకు కూడా వైరస్ సోకుతోంది. ఆ విధంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 31 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్ కు వైరస్ సోకడంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

వీరికి వైరస్ సోకిందని బుధవారం నాడు నిర్ధారణ కావడంతో, రాష్ట్ర వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులే వైరస్ కు హాట్ స్పాట్స్ గా మారుతున్నాయన్న ఆందోళన పెరిగిపోతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఈ సమావేశం నిర్వహించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

కాగా, తాజాగా వైరస్ సోకిన డాక్టర్లు గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిమ్స్, పెట్లబుర్జ్ ఆసుపత్రికి చెందిన వారని అధికారులు వెల్లడించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగంలోని నలుగురు పీజీ రెసిడెంట్స్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్, పెట్లబుర్జు ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు, ఓ ప్రొఫెసర్ కు వైరస్ సోకింది. ఉస్మానియాలో అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న పీజీ డాక్టర్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్స్, నలుగురు హౌస్ సర్జన్లకు వైరస్ పాజిటివ్ వచ్చింది.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన హెల్త్ వర్కర్లు, జూనియర్ డాక్టర్ల బృందం తెలంగాణ వైద్య మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లను కలిసి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీ తుది సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, అందరు హెల్త్ కేర్ వర్కర్లకు తరచూ కరోనా టెస్ట్ చేయించాలని, పాజిటివ్ వచ్చిన వారిని విధుల నుంచి తప్పించి, క్వారంటైన్ లో ఉంచి వైద్య చికిత్సలు అందించాలని వారు డిమాండ్ చేశారు.

గ్రూప్ link Media *ప్రజల పక్షం* సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
04/06/2020.

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణ లో పదవ తరగతి పరీక్షలు

హైదరాబాద్ :04/06/2020

*తెలంగాణాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో కొంతమంది  పిల్లల తల్లితండ్రులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం జరిగింది  మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లో  PIL వేయడం జరిగింది అందరికి తెలిసిందే, ఈరోజు హియరింగ్ ఉండగా అది రేపటికి (05/06/2020)వాయిదా పడింది.*
 
అయితే తెలంగాణ ప్రభుత్వం పరీక్షల విషయం లో కొన్ని మార్గదర్శాలు ఈరోజు విడుదల చెడింది. 

*టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ముఖ్య గమనిక*

బెంచీ, బెంచీకి 4-5 ఫీట్ల దూరం, ఒక్కో గదిలో 15మంది విద్యార్థులే:
* కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.
బెంచీ, బెంచీకి 4-5 ఫీట్ల దూరం. 
ఒక్కో గదిలో 10 -15 మంది విద్యార్థులకే అనుమతి.
* పాత పరీక్షా కేంద్రాలతోపాటు కొత్తగా 346 కేంద్రాలను ఏర్పాటు.
* ఎవరు, ఏ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందన్న వివరాలను డీసీఈబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో.
* ఒకే ప్రాంగణంలోని అదనపు కేంద్రాలకు ఏ, బీ కేంద్రాలుగా విభజన.
* కొత్తగా ఏర్పాటుచేసిన వాటిని పాత కేంద్రాలకు 500 మీటర్ల దూరంలోనే నెలకొల్పారు.
* విద్యార్థులు పాత హాల్‌ టికెట్‌తోనే పరీక్ష రాయవచ్చు.
* ఎవరైనా విద్యార్థులు హాల్‌టికెట్‌ పొగొట్టుకొని ఉంటే ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచన.

విద్యార్థులు చేయాల్సినవి, చేయకూడనివి:
* పరీక్షా కేంద్రాల దగ్గర తోటి విద్యార్థులతో గుమిగూడకుండా ఎవరికి వారు జాగ్రత్త పడాలి.
* పరీక్షకు హాజరయ్యేవారంతా విధిగా ఫేస్ మాస్క్‌ ధరించాలి.
* షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం, ఇతరుల పెన్నులు, పెన్సిళ్లను నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి.
* పరీక్ష రాసి ఇంటికి వెళ్లగానే ప్యాడ్‌తోపాటు పెన్నులను శానిటైజ్‌ చేసుకోవాలి.
* నిత్యం పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి.

సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌:
టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ సందేహాలను 040 - 29701474 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలు సహా ఇతర ఎలాంటి సందేహాలనైనా తీర్చుకునేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాలను సందర్శించి రావడం మంచిదని చెప్పారు.

గ్రూప్ link Media 10tv సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
04/06/2020

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, June 2, 2020

పదవ తరగతి పరీక్షలు తెలంగాణ

అచ్యుత్ రావు సర్ (బాలల హక్కుల సంఘం  గౌరవ అధ్యక్షులు) గారికి  మరియు జీవన్ కుమార్ సర్ (మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త) గారికి నమస్కారం 🙏

సర్ తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు 8వ తారీకు నుండి మొదలవబోతున్నాయి కదా మరి ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా effect రోజు రోజుకు పెరుగుతూ వుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిదికాదు అని చాలా మంది తల్లి తండ్రుల అభిప్రాయం. 

ఆరోగ్యభద్రత మీద ప్రభుత్వం చెపుతున్నట్లు భరోసా కనిపిస్తలేదు. 
నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులకు +ve రావడం అందరికి తెలిసిందే. 
సర్ దయచేసి పరీక్షలు postpone చేసి పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు పెడితే బాగుంటుంది. 
సర్ మీరు కూడా ఆలోచించండి 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
03/06/2020

https://prajasankalpam1.blogspot.com/

Monday, June 1, 2020

President & Prime Minister Wishes Telangana Formation Day

*తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ*

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ‌ ట్విటర్‌ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు.



 



Telangana   
Formation Day 

*తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు*: 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
02/06/2020.

https://prajasankalpam1.blogspot.com/

migrant workers (brick workers)Telangana