Monday, March 23, 2026

మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయం

మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు హామీ ఇచ్చారు.

✅శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి గారు సమాధానమిస్తూ, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సహాయాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

✅మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలను క్షుణ్ణంగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు.

✅హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు, 1 లక్షకు పైగా చ.కి.మీ మేర విస్తరించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన #TelanganaRising2047  దార్శనికతను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సభముందు సమగ్రంగా వివరించారు.

✅“దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితులను గమనంలోకి తీసుకుని చరిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది.

✅నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనా భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసే వారెవరూ ఈ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన చేయరు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి నేతృత్వంలో మంత్రులు @OffDSB గారు, @Ponnam_INC గార్లతో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తాం.

✅ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆ రాష్ట్ర నగరాలు, పెట్టుబడులు, ప్రజల జీవన స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎప్పుడు చర్చ జరిగినా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల గురించి ఎక్కువగా చర్చిస్తారు. హైదరాబాద్ అనగానే ప్రధానంగా ఫార్మా రంగంతో పాటు లివబుల్ సిటీగా గుర్తుచేసుకుంటారు.

✅ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్న ముంబై వర్షాలొస్తే నివసించలేని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం, బెంగళూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు. భారీ వర్షాలొస్తే చెన్నైలో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి.

✅ఆ మహానగరాల్లో ఎదురవుతున్న అనుభవాలను చూసిన తర్వాత అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా విలసిల్లిన చారిత్రాత్మక హైదరాబాద్ ఇప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలు భూ భౌగోళిక పరిస్థితుల కారణంగా తలెత్తినవి కాదు. మానవ తప్పిదాల కారణంగా తలెత్తిన సమస్యలు.

✅కులీకుతుబ్ షాహీల కాలంలో గుల్జార్ హౌజ్, ఫలక్‌నుమా, తారామతి భారాదరి, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు సమావేశాలు నిర్వహించుకుంటున్న శాసనమండలి హాలు.. ఇలా ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన నగరం ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందుల వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది.

✅అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణను #CURE (క్యూర్), #PURE (ప్యూర్), #RARE (రేర్) మూడు ప్రాంతాలుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. 1.34 కోట్ల జనాభా కలిగిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని కోర్ అర్భన్ రీజియన్‌గా గుర్తించి కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్‌లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించాం.

✅తద్వారా ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఈ క్రమంలోనే  హిల్ట్ పాలసీ #HILTP తీసుకొచ్చాం. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి వైపునకు తరలించి, ఇక్కడి పారిశ్రామిక జోన్‌లో ఉన్న భూములను మల్టీయూజ్ జోన్‌లోకి మార్చుతున్నామే, తప్ప యాజమాన్యపు హక్కులు మారవు. మల్టీయూజ్ జోన్‌లోకి మార్చడం వల్ల మధ్య తరగతి నివాస ప్రాంతాలుగా మారుతాయి.

✅పరిశ్రమలను తరలించడం ద్వారా నగరం కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నది మొట్టమొదటి ప్రణాళిక. 20 టీఎంసీ గోదావరి నీటని తరలించి అందులో 17 టీఎంసీ జంటనగరాల తాగునీటి కోసం, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం నీరు ప్రవహించేలా వినియోగిస్తాం.

✅రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం సమగ్రమైన ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నాం. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వండి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయం. వారికి మరిన్ని మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం చేయం..” అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరించారు.

Sunday, March 22, 2026

ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ‘ఉగాది పురస్కారాలు - 2026’: అర్హుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆధ్వర్యంలో..
 
ఉత్తమ తెలుగు జర్నలిస్టు - 2026 పురస్కారాలు

తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టుల ప్రతిభను గుర్తించి, వారిని గౌరవించేందుకు మొత్తం 40 విభాగాలలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆయా విభాగాల వివరాలు మరియు అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

పురస్కార విభాగాలు & అర్హతలు:
1. సామాజిక స్పృహ, బాధ్యత, భద్రత: సమాజం పట్ల బాధ్యతతో హక్కుల రక్షణ కోసం కృషి చేస్తూ, బాధితులకు భద్రత కల్పించిన జర్నలిస్టులు.
2. అగ్రికల్చర్ జర్నలిజం: వ్యవసాయ రంగంపై ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందించే విలేకరులు.
3. విద్యా జర్నలిజం: విద్యార్థులకు స్టడీ మెటీరియల్, బోధనా అంశాలు మరియు పరీక్షల సన్నద్ధతపై కథనాలు రాసేవారు.
4. వైద్య విభాగం (కంటెంట్ రైటర్స్): పేదలకు ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య అవగాహన కల్పించే కథనాలు రాసే వైద్యులు/రచయితలు.
5. క్రైమ్ జర్నలిజం: నేర సంబంధిత వార్తలు కవర్ చేస్తూ ప్రమాదాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న జర్నలిస్టులు.
6. ఫోటో జర్నలిజం: గుర్తింపు పొందిన ప్రెస్ ఫోటోగ్రాఫర్లు (ప్రచురితమైన ఫోటోల ఆధారంగా ఎంపిక ఉంటుంది).
7. సినిమా జర్నలిజం: ఫిల్మ్ రివ్యూలు, కంటెంట్ రైటర్లు మరియు సామాజిక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు (RNI కార్డు తప్పనిసరి).
8. క్రీడా జర్నలిజం: క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, క్రీడారంగంపై ప్రత్యేక కథనాలు అందించే వారు.
9. స్ట్రింగర్/గ్రామీణ విలేకరి: గ్రామీణ సమస్యలపై ప్రత్యేక కథనాలు రాసే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా విలేకరులు.
10. చిన్న పత్రికల ప్రోత్సాహం: RNI గుర్తింపు కలిగి, సామాజిక బాధ్యతతో నడుస్తున్న డైలీ, వీక్లీ, పక్ష, మాస పత్రికలు.
11. సామాజిక చైతన్యం: కళల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టులు.
12. జంతు సంరక్షణ & బాలకార్మికుల నిర్మూలన: జంతువుల రక్షణ, బాలకార్మికుల విముక్తిపై కథనాలు రాసిన జర్నలిస్టులు.
13. మహిళా జర్నలిస్ట్ ప్రత్యేక గుర్తింపు: కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండి, ప్రస్తుతం మీడియాలో కొనసాగుతున్న మహిళా జర్నలిస్టులు.
14. సీనియర్ వీడియో జర్నలిస్ట్: 5 ఏళ్లకు పైగా అనుభవం ఉండి, కీలక వార్తా కథనాలు షూట్ చేసిన వీడియో జర్నలిస్టులు (ID కార్డు తప్పనిసరి).
15. తెలుగు న్యూస్ వెబ్‌సైట్: సొంతంగా వెబ్‌సైట్ నిర్వహిస్తూ కనీసం ఇద్దరు కంటెంట్ రైటర్లకు ఉపాధి కల్పిస్తున్న వారు.
16. యూట్యూబ్ ఛానల్ (సీనియర్ జర్నలిస్ట్): గతంలో సీనియర్ జర్నలిస్టులుగా పనిచేసి, ప్రస్తుతం సొంతంగా న్యూస్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వారు.
17. మానవీయ కోణంలో కథనం: పాఠకుల మనసులను తట్టి, ఆలోచింపజేసే మానవీయ కథనాలను రూపొందించిన వారు.
18. జర్నలిజంలో బహుముఖ ప్రజ్ఞాశాలి: జర్నలిస్టుగా ఉంటూనే కవి, రచయిత, ఎనలిస్ట్ వంటి బహుముఖ నైపుణ్యాలు కలిగిన వారు.
19. ఎడిటోరియల్ విభాగం: RNI గుర్తింపు పొందిన పత్రికల్లో సంపాదకీయాలు, ఎడిట్ పేజీ వ్యాసాలు రాసేవారు.
20. ప్రజాదరణ పొందిన పత్రిక: ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ మరియు ప్రజల ఆదరణ కలిగిన పత్రికలు.
21. పరిశోధనాత్మక పాత్రికేయులు: వ్యవస్థల్లోని అవినీతిని, దాగి ఉన్న నిజాలను వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.
22. వెటరన్ జర్నలిస్ట్: జర్నలిజం రంగంలో అపారమైన అనుభవం, పట్టు కలిగిన సీనియర్లు.
23. న్యూస్ రీడర్: కేబుల్/న్యూస్ ఛానల్స్‌లో వార్తలు చదివే విధానంలో ప్రత్యేకత కలిగిన వారు.
24. ట్రావెల్ జర్నలిజం: చారిత్రక కట్టడాలు, కొత్త ప్రాంతాల విశేషాలను సోషల్ మీడియా/మీడియా ద్వారా అందించే వారు.
25. పౌర జర్నలిజం: వృత్తిపరమైన జర్నలిస్టులు కాకపోయినా, న్యూస్ యాప్స్ ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన పౌరులు.
26. ఆర్ట్స్ జర్నలిజం: కార్టూన్స్, పెయింటింగ్, గ్రాఫిక్స్ మరియు సాంస్కృతిక విభాగాల్లో పనిచేసే వారు.
27. పొలిటికల్ రిపోర్టింగ్: రాజకీయ అంశాలను ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే రిపోర్టర్లు (3 క్లిప్పింగ్స్ జతచేయాలి).
28. పర్యావరణ పరిరక్షణ: పర్యావరణాన్ని కాపాడే దిశగా కథనాలు రాసిన వారు (3 క్లిప్పింగ్స్ జతచేయాలి).
29. టాబ్లాయిడ్ జర్నలిజం: ప్రధాన పత్రికల అనుబంధ విభాగాల్లో (వసుంధర, ఫ్యామిలీ, చెలి వంటివి) ప్రత్యేక కథనాలు రాసేవారు.
30. స్ట్రింగ్ ఆపరేషన్ జర్నలిజం: రహస్య కెమెరాల ద్వారా అవినీతిని, అక్రమాలను సాహసోపేతంగా బయటపెట్టిన వారు.
31. సమీక్షా జర్నలిస్టులు: ప్రధాన వార్తలను లోతుగా విశ్లేషిస్తూ సోషల్ మీడియా/ఛానల్స్ ద్వారా వివరించే వారు.
32. బిజినెస్/ఎకనామిక్ జర్నలిజం: ఆర్థిక అంశాలు, స్టాక్ మార్కెట్, బడ్జెట్ విశ్లేషణ చేసే నిపుణులు.
33. డేటా జర్నలిజం: గణాంకాలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా వార్తలను విశ్లేషించే వారు.
34. ఫ్యాక్ట్ చెకింగ్ & సైన్స్: తప్పుడు వార్తలను అరికట్టే వారు మరియు సైన్స్ & టెక్నాలజీ అంశాలను వివరించే వారు.

*35.జర్నలిస్ట్ & కథా రచయిత*
      జర్నలిస్ట్ అయ్యిండి, ప్రత్యేక విషయాలు, సంఘటనలు,చారిత్రక కధనాలు మరియు వార్తా కధనాలు బై లైన్ ఆధారంగా ప్రచురణ కాబడి ఉన్నవారు.

*36. ది బెస్ట్ న్యూస్ ఎడిటర్ (కేబుల్ టీ.వి)*:
      కేబుల్ టీవీ రంగంలో సిటీ కేబుల్,ఇతర కేబుల్ టి.వి లలో న్యూస్ ఎడిటర్స్ కొరకు, న్యూస్ బులెటిన్స్ ఆధారంగా ఎంపిక.

*37.మహిళలకు ప్రత్యేక ఎంపిక*
         న్యూస్ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్,వాయిస్ ఓవర్.

*38.ది బెస్ట్ న్యూస్ డిబేట్ నిర్వాహకులు*
       సామాజిక విషయాలపై మంచి మంచి డిబేట్స్ నిర్వహించే  ఛానల్స్.


39. ది బెస్ట్ ప్రెస్ క్లబ్: జర్నలిస్టుల సంక్షేమం కోసం వివాద రహితంగా పనిచేస్తున్న రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్‌లు.
40. జీవిత సాఫల్య పురస్కారం: 25-30 ఏళ్ల నిరంతర సేవ, మచ్చలేని వ్యక్తిత్వం మరియు కొత్త తరానికి మార్గదర్శకులుగా నిలిచిన వారు.



📅 నామినేషన్ చివరి తేదీ:
👉 05 ఏప్రిల్ 2026

🌐 వెబ్‌సైట్:
👉 www.tjss.co.in
 
నామినేషన్ పత్రాలు పంపించండి :

పూర్తి చేసిన నామినేషన్ పత్రాలు వాట్సప్ ద్వారా గానీ, ఇమెయిల్ ద్వారా గానీ, పోస్టల్ అడ్రస్ కు గానీ పంపించగలరు.

#గడ్డం సత్యనారాయణ
C/O తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 
ప్లాట్ నంబర్. 81, రోడ్డు నంబర్. 2, శుభోదయ కాలనీ, కుంట్లూర్ రోడ్డు, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా,  తెలంగాణ 501505.
ఫోన్ : 9505021222


📩వాట్సప్ : 7036602022

ఇమెయిల్ ఐడి : tjss6602022@gmail.com


పత్రికా ప్రకటన :

*ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ‘ఉగాది పురస్కారాలు - 2026’*: 

అర్హుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం

తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు ఇది సువర్ణావకాశం

దరఖాస్తుకు చివరి తేదీ: 05-ఏప్రిల్ -2026

అమరావతి/హైదరాబాద్:
ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ, అక్షరాయుధాలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టులను  గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు పేర్కొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన జర్నలిస్టులకు ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాలు  అందజేయనున్నట్లు  గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ.. "కేవలం నిరసనలు, పోరాటాలకే పరిమితం కాకుండా, వృత్తిపరంగా జర్నలిస్టులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2023లో ఈ పురస్కారాల ప్రక్రియను ప్రారంభించాం. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ నగరాల్లో విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించాం. అదే స్పూర్తితో ఈ ఏడాది (2026) కూడా ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం" అని వెల్లడించారు. సమాజాన్ని తన అక్షరాస్రాలతో చైతన్యపరిచే కలం యోధులకు ఈ పురస్కారాలు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటాయని అశాభావం వ్యక్తం చేసిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టులు ఈ సువర్ణావకాశం  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల నుంచి 40 విభాగాలలో వివిధ రకాల ఉత్తమ తెలుగు  జర్నలిస్టులను ఎంపిక చేసి పురస్కారాలు అందించబడతాయని, అందుకు అర్హులైన తెలుగు జర్నలిస్టుల నుండి నామినేషన్ పత్రాలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.  
 అందిన దరఖాస్తులను ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారిని విజేతలుగా ఎంపిక చేయనున్నట్లు వివరించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేయబోతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు తమ దరఖాస్తులను, సంబంధిత ఆధారాలను జత చేస్తూ.. వాట్సప్ ద్వారా గానీ, ఇమెయిల్ ద్వారా గానీ, పోస్టల్ చిరునామా ద్వారా గానీ,  *ఏప్రిల్ 05, 2026 సాయంత్రం 7 గంటల లోపు* పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే  దరఖాస్తుదారులు తాము ఏ విభాగానికి పోటీ పడుతున్నారో నామినేషన్ పత్రం పై స్పష్టంగా రాయాలని సూచించారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగిన జర్నలిస్టులకు ఈ పురస్కారాలు మరింత ఉత్తేజాన్నిస్తాయని రంగనాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇట్లు..,
మీడియా కోఆర్డినేటర్,
*తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం*.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ. 7036602022.

Friday, March 20, 2026

*_తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27_*

*తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27*

*తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి,  ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు.*

రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

మూలధన వ్యయం - రూ. 47,267 కోట్లు

రెవెన్యూ వ్యయం - రూ. 2,34,406 కోట్లు

వ్యవసాయ శాఖ - రూ. 23,179 కోట్లు

విద్యుత్ శాఖ - రూ. 21,285 కోట్లు

పౌరసరఫరాల శాఖ - రూ. 7,366 కోట్లు

పశుసంవర్ధక శాఖ - రూ. 1,529 కోట్లు

విద్యా శాఖకి 26, 674 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు

కార్మిక శాఖకు 998 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు

షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు

షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు

వెనక బడిన తరగతులకు 12511 కోట్లు 

మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు

రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు

గృహ నిర్మాణానికి 7430 కోట్లు

ఐటీ శాఖకు 875 కోట్లు

పరిశ్రమల శాఖకి 3490 కోట్లు

చేనేత శాఖకు 258 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు 

ఇరిగేషన్ కు 22,615 కోట్లు

రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు

న్యాయ శాఖకు 2367 కోట్లు 

పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు 

హోం శాఖకు 11,907 కోట్లు

గోదావరి పుష్కరాలకు 500 కోట్లు

పర్యాటక శాఖకు 1224 కోట్లు

6 గ్యారంటీలకు 50,713 కోట్లు

రైతు భరోసాకు 18,000 కోట్లు

చేయుతకు 14,861 కోట్లు

ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు

మహాలక్ష్మికి 4,305 కోట్లు 

సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు

గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) 2,080 కోట్లు

రాజీవ్ ఆరోగ్య శ్రీ 1,143 కోట్లు

మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ 723 కోట్లు

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 600 కోట్లు 

పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు

బియ్యం సబ్సిడీ 3,000 కోట్లు

కల్యాణలక్ష్మి / షాది ముబారక్ 3,683 కోట్లు

విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు

స్కాలర్‌షిప్‌లకు 4,343 కోట్లు

తప్పనిసరి కార్యాలయ ఖర్చులు 2,323 కోట్లు

 పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 6416 కోట్లు

హ్యాంమ్ రోడ్లకు 3053 కోట్లు

రీజనల్ రింగ్ రోడ్డుకు 1525 కోట్లు

రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు 

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000 కోట్లు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు 

పంట బీమా పథకానికి 1886 కోట్లు 

మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్లు

CURE ఏరియా అభివృద్ధికి 2654 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు 

ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056 కోట్లు

ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు

*ఈ బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క*

 *రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమాను జూన్ 2 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*

Thursday, March 19, 2026

As a retired IPS officer, I raise this matter with genuine concern

Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu,

Dear Sir,

I hope this message finds you in good health and high spirits.

I am writing via @X prompted by the second extension in service beyond superannuation granted to Sri K. Ramakrishna Rao garu, Chief Secretary to the Government of Telangana.

As a retired IPS officer, I raise this matter with genuine concern for the long-term health and morale of the civil services in our State.

Every civil servant joins with a natural and legitimate aspiration: to advance steadily through the ranks and reach the highest positions before superannuation. This ambition drives officers across all services (IAS, IPS, IFoS, and State cadres) to perform consistently, maintain integrity, and contribute meaningfully throughout their careers.

However, extensions beyond the prescribed superannuation age disrupt this progression and send a deeply demoralising signal across the bureaucracy.

Such extensions foster the perception that certain individuals are “indispensable,” even though civil servants are not irreplaceable specialists or scientists possessing unique innovative capabilities. In a well-functioning system, no single officer is indispensable. There are always several equally competent contemporaries ready to assume key roles with the same efficiency and dedication.

While I have no personal acquaintance with Sri K. Ramakrishna Rao garu and absolutely no reason to doubt his competence or integrity, the principle involved is far larger than any individual. The Telangana IAS cadre undoubtedly has other senior officers who are equally capable and fully deserving of the Chief Secretary’s post. Overlooking them in favour of an extension risks breeding resentment, stagnation, and a widespread sense of injustice among serving officers.

I therefore urge you to adopt, as a matter of clear policy, a consistent position: extensions of service beyond superannuation in any civil service cadre (IAS, IPS, IFoS, or State services) should be granted only in the most extraordinary and rare circumstances.

These might include acute emergencies, national security needs, or genuine situations where no suitable alternative exists. But such cases should remain exceptional, fully transparent, and publicly justifiable, never routine.

A firm policy along these lines would:

(i) Restore confidence in merit-based progression and timely career advancement;

(ii) Boost morale and motivation among mid- and senior-level officers;

(iii) Prevent perceptions of favouritism or arbitrariness;

(iv) Strengthen institutional discipline and effective succession planning.

I sincerely hope you will consider this suggestion in the right spirit and take appropriate steps to safeguard the morale of civil servants who remain indispensable to effective governance and development.

With warm regards

M. Nageswara Rao IPS (Retired)
Former Director, CBI

Sunday, March 15, 2026

_తాండూర్ మాజీ ఎమ్ఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో ఏమి జరుగుతుంది??_

https://x.com/i/status/2033114989889003682

*_మీడియా టుడే :జాతీయ తెలుగు దినపత్రిక_*

*_గత పది సంవత్సరాలుగా తెలంగాణ లో డ్రగ్స్ కేసులు ఎన్నో చూశాము.ఈ కేసులలో ప్రజాప్రతినిధులు / బడాబాబులు, వాళ్ళ పిల్లలు ఉన్నారు.వీళ్ళు అందరు డ్రగ్ మాఫియా లో 'భాగస్వామ్యులు' అని అంటే కరెక్ట్.మొత్తంగా కొన్ని రోజుల హడావిడి తరువాత షరామామూలే... గతంలో నమోదు అయిన కేసులు ఏమయ్యాయో ఎవరికి తెల్వదు.ఎవరిమీద కేసులు బుక్ అయ్యాయో వాస్తవాలు చెప్పరు. చివరకు బడుగుబలహీన వర్గాల యువత భవిష్యత్ నాశనం... కారణం పాలకుల నిర్లక్ష్యం & చట్టాలను చుట్టాలుగా చేసుకుంటున్న డ్రగ్ మాఫియా... మౌనంగా ఉన్న పౌర సమాజం...ఇది నిజం.... Bplkm✍️_*
*#drugs #drugsfreetelangana #gun #firing #farmhouse #Cocaine #Informal #AddictiveDrug*

*#SayNoToDrugs*
*@narcoticsbureau*
*@CVAnandIPS*

*@TelanganaCMO @Bhatti_Mallu*
*@TelanganaDGP @cyberabadpolice*
*@CPRO_TGCM @IPRTelangana @DigitalMediaTG @BRSparty*

https://www.facebook.com/share/p/1Ac3Swe91N/

Tuesday, March 10, 2026

*_జర్నలిస్టులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం._*

https://x.com/i/status/2031573586226663602

*_మీడియా టుడే:జాతీయ తెలుగు దినపత్రిక_*
*#AWJA #MEDIATODAY #KkrAWJA*

*_జర్నలిస్టులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం._*

*@TelanganaCMO @DamodarCilarapu @CPRO_TGCM @IPRTelangana @DigitalMediaTG @PIBHyderabad @PressClubHyd*

https://www.facebook.com/share/p/17EdncLMb6/       
                *****                                                                          https://www.instagram.com/p/DVuvf2xkcEF/?igsh=MTg5M3NidHdseGFzag==

Sunday, March 8, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు.



అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు.

“దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి.


హైదరాబాద్ :దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అనుముల వెల్లడించారు.కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.#InternationalWomenDay సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.“దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి. వర్షాలొస్తే ముంబయ్ అతలాకుతలమవుతోంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, వరదలొచ్చినప్పుడు చెన్నై ప్రమాదకర పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం.సమీప భవిష్యత్తులో #Hyderabad నివాసయోగ్యం కాని నగరంగా మారే పరిస్థితులు రావొద్దు. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్‌ నగరానికి తలెత్తకూడదనే ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్‌లో వాయు నాణ్యత(AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయనో, మూసీలో కాలుష్యం పారుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టకుండా అది ఎలా సాధ్యం. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దు.సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012 లో నిబంధనలు రూపొందించారు. నాలా అయితే బఫర్ జోన్ ఎంతుండాలి. చెరువులైతే ఎంతుండాలి. నదులైతే ఎంతుండాలన్నది ఖరారు చేశారు. ఆ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.కాలుష్య కారక మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో నిర్వాసితులకు ప్రభుత్వం సరైన సహాయం అందిస్తుంది. ప్రాజెక్టును అడ్డుకోవడంకన్నా బాధ్యత కలిగిన వారంతా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం లేదా వారికి మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వంతో చర్చించవచ్చు.గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించింది.మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1 లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 5 వేల కోట్లు, పది వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ది మొత్తంగా 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.
ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికపై ఈ నెల 13 న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం.
కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతాం. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాం.
డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నూటిని నూరు శాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతాం. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చాం.నగరంలో 2 లక్షల ఆటోలున్నాయి. డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధన ఆధారంగా నడుస్తున్న ఈ ఆటోలను రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నాం. నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నాం.దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం మేరకు దోహదపడుతున్న నేపథ్యంలో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించాం. 2047 నాటికి దేశ జీడీపీలో పది శాతం తెలంగాణ నుంచి దోహదపడాలి. ఈ లక్ష్యసాధనలో మహిళలు సంపూర్ణంగా సహకరించాలి.మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే చోట మహిళలకు రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం. రక్షణ కల్పించడమే కాకుండా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు.మహిళలు ఆర్థికంగా ఎదిగిన కారణంగానే కొన్ని దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా నిలబడ్డాయి. సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలంటే మహిళల శక్తిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలి. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదు. కష్టపడే వారికి గుర్తింపునివ్వాల్సిన బాధ్యత అందరిపైనా ప్రభుత్వాలపైనా ఉంది.
దేశంలో అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలన్న లక్ష్య సాధనలో మహిళా జర్నలిస్టుల సహకారం ఉండాలి. మహిళలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చుకుందాం..” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు మంత్రులు @INC_Ponguleti గారు, @iamkondasurekha గారు, @Ponnam_INC గారు, @azharflicks గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు, @IPRTelangana కమిషనర్ సీహెచ్ ప్రియాంక గారితో పాటు మహిళా జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు
SOURCE :TelanganaCMO 

Friday, March 6, 2026

ఆకునూరి మురళి నివేదిక - పౌరసమాజం

https://x.com/i/status/2030171275998687394

*మీడియా టుడే :➡️జాతీయ తెలుగు దినపత్రిక*

*#TrendingNow #AkunuriMurali #report #telanganaeducation #teachers salary employees civilsociety facts*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu @TelanganaCS* *@Murali_IASretd @edu_commissionTG @IPRTelangana @DigitalMediaTG @GhantaC* *@sravandasoju @TeenmarMallanna*

https://www.facebook.com/share/p/1ASujrRyMP/
                 https://www.instagram.com/p/DVkuLMiEZ_N/?igsh=MTYxYmN4MHp1Nmg1OA==

Meeting with Minister Adluri Laxman Kumar

Meeting with Minister Adluri Laxman Kumar
Dr. K. Koteswara Rao (KKR), Chairman & Managing Director of Media Today National Newspaper, Media Today TV, and N24 News, and National President of the All India Working Journalists Association (AWJA), paid a courtesy visit to Telangana Minister Adluri Laxman Kumar at the Minister’s Quarters.

On this occasion, he congratulated the Telangana State Government for introducing several welfare schemes for SCs, STs, minorities, persons with disabilities, senior citizens, and transgender communities. He appreciated the minister for his efforts to ensure that these welfare schemes reach all eligible beneficiaries fairly.

Minister Laxman Kumar has been active in politics since his college days. He served as NSUI President, Karimnagar District General Secretary, and as the AP Youth Congress General Secretary from 1996 to 2001. He also served as the Chairman of the united Andhra Pradesh State SC Corporation. With his vast political experience, he has now been appointed as a minister in the government led by Anumula Revanth Reddy.

మంత్రి అడ్లూరి తో భేటీ

మంత్రి అడ్లూరి తో భేటీ

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా టుడే జాతీయ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ & మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr).

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్‌జెండర్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులో తీసుకొచ్చింది అని . అట్టి సంక్షేమ పథకాలు న్యాయంగా అందరికి చేరేలా కృషి చేస్తున్న మంత్రికి అభినందనలు తెలిపారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ కాలేజీ స్థాయి నుంచి ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది.

Wednesday, March 4, 2026

*_ఇక రండి.. విచారణ ఎదుర్కోండి_* _# 'అనంచిన్ని' చేతిలో జాబితా_

*_ఇక రండి.. విచారణ ఎదుర్కోండి_*
_# 'అనంచిన్ని' చేతిలో జాబితా_

*_న్యాయస్థానంలో  చార్జ్ షీట్ దాఖలు చేసిన కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులపై 'నాన్ బెయిలబుల్ వారెంట్ ' జారీ చేసే విధంగా డిజీపి కార్యాలయం కసరత్తులు. ఇందులో అంతరాష్ట్ర నిందితులు, సాప్ట్ వేర్, ఆర్థిక, జర్నలిజం ముసుగులో ఉన్నవారు, సోషల్ మీడియాలో రెచ్చిపోయే మహిళలు ఉండటం గమనార్హం._*

*_మార్చి 9న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ Crime No: 191/2020_*
CC NO: CC/2403/2021
CNR No: TSKH030090112021

II Additional Junior Civil Judge -cum- II Additional Judicial Magistrate of First Class, Khammam నందు కేసు కలదు సార్.

ఈ కేసులో పట్నాయక్, సంకసర్ల సువర్ణ, ఎస్.కే.గౌస్ పాషా, బిరుదులు దేవరాజులకు సమ్మన్స్ ఇవ్వగలరు సార్..
(పట్నాయక్ ఫోన్ నెంబర్: PATNAYAK NEW NUMBER 
+91 l7997465678, 9000975405), సంకసర్ల సువర్ణ (ఫోన్ నెంబర్: 9959703779 ), ఎస్.కే.గౌస్ పాషా (ఫోన్ నెంబర్:  7731000786 ), బిరుదులు దేవరాజు (ఫోన్ నెంబర్: 8099662345)
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻

*_13/04/2026న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి Crime No: 166/2020_*
CC No: CC/2377/2021
CNR No: TSKH030089052021

I Additional Junior Civil Judge -cum- Special Judicial Magistrate of First Class (Juvenile Court), Khammam

🤝🤝🤝🤝🤝🤝🤝

*_ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్_* 
Crime No: 212/2020
CC NO: CC/3164/2021
CNR No: TSKH030171672021
*_Next Date: 13/04/2026న_* పట్నాయక్ కు సమ్మన్స్ ఇవ్వగలరు సార్.. ఈ కేసులో పట్నాయక్ ఒక్కడే నిందితుడు సార్...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*_June 18న ఖమ్మం ఖానాపూరం పోలీస్ స్టేషన్ లో_* 
Crime No: 167/2020
CC NO: CC/2372/2021
CNR No: TSKH030089362021
*_Next Date: 18/06/2026న_* 
II Additional Junior Civil Judge -cum- II Additional Judicial Magistrate of First Class, Khammam నందు 
కేసు కలదు సార్.

ఈ కేసులో పట్నాయక్, సంకసర్ల సువర్ణ, ఎస్.కే.గౌస్ పాషా, బిరుదులు దేవరాజులకు సమ్మన్స్ ఇవ్వగలరు సార్..

👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
సంకసర్ల సువర్ణకు నోటీసులు ఇవ్వాలంటే... 

25/03/2026
XIV Addl. Chief Metropolitan Magistrate

CC NO: CC/678/2023
CNR NO: TSHM010007532023
FIR NO: 693/2022


Tuesday, March 3, 2026

సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చేశారు

సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు...

ఆషామాషీగా IAS కాలేరు.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది 

క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. 

కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు  ప్రజల సమస్యలు అర్థం కావు 

కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నా. 

ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..

కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి. 

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలి. 

గ్రామాలవారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు,లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి. 

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి 

ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలి

ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందే.

కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి 

ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి 

పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. 

వంద నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి  ఒక మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం 

ఆరుట్ల తరహాలో అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నాం 

ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదిక అందించాలి. 

వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. 

భవిష్యత్ లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నాం.

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 

బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్  ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి 

అలాంటి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయి.

మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే. 

మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిందే 

ఇసుక మాఫియా , అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం. 

ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది 

మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది 

వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీ పనితీరు తెలుసుకుంటాం. 

జూన్ లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.