Friday, June 13, 2025

జర్నలిస్టులకు అండగా టిడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్టులకు అండగా టిడబ్ల్యూజేఎఫ్ 

 ఘనంగా టిడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలు 

 ఏకగ్రీవంగా హనుమకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

 అధ్యక్ష కార్యదర్శులుగా టీవీ రాజు గౌడ్, అంతడుపుల శ్రీనివాస్ 

 తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యుజేఎఫ్ అండగా ఉంటుందని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షు కార్యదర్శులు మామిడి సోమయ్య బి బసపు   అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోనే గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ మహాసభలు జరిగింది. ఈ సభకు హనుమకొండ టీ డబ్ల్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు టీవీ రాజు గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిడి సోమయ్య, బి బసవ పున్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క ఫెడరేషన్ టిడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మిగతా రెండు యూనియన్ల కన్నా మా టిడబ్ల్యూజేఎఫ్  యూనియన్ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొందరు యూనియన్ నాయకులు మా యూనియన్ బలపడుతుందని ఈర్షతో మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ రెండు యూనియన్ల గత ప్రభుత్వానికి వంతపడితే ప్రస్తుత ప్రభుత్వానికి మరొక యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని టీ డబ్బులు జేఏఫ్ యూనియన్ బలోపాతం చేస్తున్న జిల్లా నాయకులకు అభినందించారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు గత ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రిడేషన్ ఇవ్వకుండా మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్ల పేరుతో కాలాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా వెంటనే జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు జారీ చేసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజే జాతీయ కార్యదర్శి ఆనందం మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి డబ్బులు జేయఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ పై 
అనుచిత వ్యాఖ్యలు చేసిన  వివిధ సంఘ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.
తెలంగాణ వర్కింగ్  జర్నలిస్ట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ 

 అధ్యక్షులు టీ.వీ.రాజు,
కార్యదర్శి అంతడుపుల శ్రీనివాస్, కోశాధికారి  ఈసంపల్లి రమేష్, ఉపాధ్యక్షులు  దామెర రాజేందర్, సంయుక్త కార్యదర్శి మండ రాజేష్,
ఈర్ల తిలక్, కార్యవర్గ సభ్యులు కొండ్రు దయాకర్, ఎల్లంకి జగపతిరావు, మారుపట్ల శంకర్, కే. ప్రవీణ్, డి. రవీందర్, ఏకు రవికుమార్, ఎం. ఎస్. రావు, సయ్యద్ అలీ, 
బొల్లపల్లి రాజు ఏకగ్రీవంగా  నియమించారు. దీనితోపాటుగా 
నేషనల్ కౌన్సిల్ సభ్యులు 
 చుంచు ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొక్క దయ సాగర్, పోలమారి గోపాల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షులు  గూడెల్లి నాగేందర్, కార్యదర్శి  దాసరి విజయ్ కుమార్, కోశాధికారి బానోత్ దేవేందర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా గిరెడ్డి అనిల్ రెడ్డి కార్యదర్శి దామర వెంకటేష్ కోశాధికారి గూగులోతు 
హుస్సేన్ నాయక్ నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య ప్రకటించారు.
(Source )

No comments:

Post a Comment