Saturday, June 21, 2025

*డీఐ ఇద్దరు కానిస్టేబుల్ల సస్పెన్షన్*

*డీఐ ఇద్దరు కానిస్టేబుల్ల సస్పెన్షన్*

హైదరాబాద్...రాంగోపాల్‌పేట్‌: వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూళ్లు చేసిన కేసులో మహంకాళి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు క్రైం కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.వివరాలలోకి వెళితే...డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసాద్, క్రైమ్‌ కానిస్టేబుళ్లు శ్యాం, మహేష్‌లు గత నెల 31వ తేదీన కడపకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి నుంచి జనరల్‌బజార్‌లో కోటి రూపాయల విలువ చేసే వజ్రాలను స్వా«దీనం చేసుకున్నారు. సదరు వ్యాపారి వజ్రాలను తీసుకుని వచ్చి నగరంలోని వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు.

ఈ మేరకు వజ్రాలకు సంబంధించిన అన్ని బిల్లులు చూపించినప్పటికీ వినకుండా కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ఈ కేసుకు సంబంధించి రూ.6 లక్షలు ఇస్తానని సదరు వ్యాపా రి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే వ్యాపారి అకౌంట్‌ నుంచి డీఐకి చెందిన స్నేహితుడి ఖాతాకు రూ.6 లక్షలు జమ అయ్యాయి. అయితే పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన వ్యాపారి వెంటనే తన అకౌంట్‌ నుంచి తన ప్రమే యం లేకుండా రూ.6 లక్షలు డ్రా అయ్యాయని బ్యాంకులో ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు దీని గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిగా ఆధారాలు సేకరించిన అనంతరం డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వైకే ప్రసాద్, క్రైం కానిస్టేబుళ్లు శ్యాం, మహే‹Ùలను సస్పెండ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే డీఐ ప్రసాద్‌ తాను పని చేసే చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో సస్పెండ్‌ అయ్యాడు. ఈ కేసు విచారణ అనంతరం మహంకాళి పోలీస్‌స్టేషన్‌కు ఆయనను అటాచ్‌ చేశారు.

*V.S. జీవన్*

No comments:

Post a Comment