భాజపా నేత మేక రాంరెడ్డిపై కేసు నమోదు
- కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కేసు బుక్ చేసిన మేడిపల్లి పోలీసులు
- న్యాయం గెలిచిందంటున్న సీనియర్ జర్నలిస్ట్ జీ కుమార స్వామి
- మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ నర్సింగ్ తిరుపతయ్యలకు కృతజ్ఞతలు..
అక్షర శోధన న్యూస్ : అక్టోబర్ 17 హైదరాబాద్
అక్టోబర్ 9 తారీకు ఉదయం సోషల్ మీడియా వేదికగా సీనియర్ జర్నలిస్ట్ జి కుమార స్వామిని బెదిరించిన భాజపా నాయకుడు మేక రామ్ రెడ్డి పైన మేడిపల్లి పోలీసులు కోర్టు పర్మిషన్ తో 352 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సదరు వ్యక్తికి నోటీసులిచ్చి చార్ షీట్ వేసి కోర్టుకు పంపిస్తామని తెలిపారు.
ఈ మేరకు స్పందించిన బాధితుడు కుమారస్వామి మాట్లాడుతూ.. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని, మేడిపల్లి పోలీసుల మీద నమ్మకం ఉంచి సుమారుగా వారం రోజులపాటు వేచి చూడడం జరిగిందని, కోర్టు పర్మిషన్ తో సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేసి న్యాయం చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇలాంటి వ్యక్తుల మీద నిఘా కూడా ఏర్పాటు చేసి మాలాంటి వారికి రక్షణ కల్పించాలని కోరారు. అదేవిధంగా అతని నుండి మాకు ప్రాణహాని ఉందని, సిటీ పరిధిలో ఎక్కడ, ఎప్పుడు ఏమైనా సదరు వ్యక్తే కారణమని మీడియాతో తెలియజేశారు. ఈ కేసు విషయంలో మాకు సహకరించిన మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు, నా తోటి జర్నలిస్టు మిత్రులకు, అదేవిధంగా దళిత సంఘాలు నాయకులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(SOURCE)
No comments:
Post a Comment