Sunday, April 30, 2023

బాణసంచా వెలుగుల్లో కాంతులీనిన కొత్త సచివాలయం..

బాణసంచా వెలుగుల్లో కాంతులీనిన కొత్త సచివాలయం..

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది..

సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి..

రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్‌ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.. 

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన.... సీఎం కేసీఆర్....!

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన.... సీఎం కేసీఆర్....!*
హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించిన ఆయన..
తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వాస్తుపూజ నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు చేరుకొని పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు పెద్ద సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్ద ముఖ్యమంత్రిని వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతించి ఆశీర్వచనాలు పలికారు.

నూతన సచివాలయంలో మొత్తం 6 ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. వీటిలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం యాదాద్రి టేబుల్‌ బుక్‌ను కేసీఆర్‌ ఆవిష్కరించారు. తన ఛాంబర్‌లో ఆసీనులైన సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు పాదాభివందనం చేశారు. మరోవైపు మంత్రులు కూడా సుముహూర్త సమయంలో తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ తదితరులు నిర్ణయించిన సమయానికి తమ సీట్లలో ఆసీనులయ్యారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, April 29, 2023

నా భర్తతో పాటే నన్నూ...చితిపైకి చేరిన అమర జవాన్ భార్య

*నా భర్తతో పాటే నన్నూ...చితిపైకి చేరిన  అమర జవాన్ భార్య*

భోపాల్‌: ఏప్రిల్‌ 26వ తేదీ బుధవారం ఛత్తీస్‌గఢ్‌ దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దుశ్చర్య.. యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.యాభై కేజీల మందుపాతరతో పది మంది డీఆర్‌జీ జవాన్లు, ఓ డ్రైవర్‌ బలిగొన్నారు మావోయిస్టులు. ఈ ఘటనలో అమరలైన జవాన్లకు ప్రభుత్వం తరపున గౌరవవందనం అందగా.. అనంతరం అయినవాళ్ల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అయితే.. దంతేవాడ మావోయిస్టుల దాడిలో అమరుడైన డీఆర్‌జీ జవాన్‌ భార్య.. ఆత్మాహుతికి సిద్ధపడింది. భర్తతో పాటే తననూ చితి మీద కాల్చేయండంటూ గ్రామస్తులను, బంధువులను బతిమాలుకుందామె. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టింది. చివరికి ఆమెను అంతా బలవంతంగా చితిపై నుంచి బయటకు లాక్కొచ్చారు. భర్త మరణంతో తన బతుకు చీకట్లోకి కూరుకుపోయిందని, ఇంక తాను ఎవరి కోసం బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోందామె.

అమర జవాన్‌ లఖ్మూ మార్కం అంత్యక్రియలకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. షాహీద్‌ జవాన్‌.. అమర్‌ రహే అంటూ కన్నీటి నినాదాలతో అంతిమ యాత్ర నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణం పొగొట్టుకున్నందుకు నివాళి.. ఊరంతా లఖ్మూ మృతదేహాన్ని తాకి నివాళులర్పించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, April 28, 2023

జేఈఈ మెయిన్ ఫలితాలు.... హైదరాబాద్ విద్యార్థికి మొదటి ర్యాంక్!

*జేఈఈ మెయిన్ ఫలితాలు.... హైదరాబాద్ విద్యార్థికి మొదటి ర్యాంక్!*

దిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి.ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్‌లో హైదరాబాద్‌ (Hyderabad) విద్యార్థి సింగారపు వెంకట్‌ కౌండిన్య మొదటి ర్యాంక్‌ సాధించాడు. 300/300 మార్కులు స్కోర్‌ చేశాడు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్‌ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని కౌండిన్య తెలిపాడు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

లాకప్ డెత్ (ఆరోపణ) HRF పత్రిక నివేదిక

Thursday, April 27, 2023

హైదరాబాద్ లో లాకప్ డెత్(ఆరోపణ)కేసు

https://youtu.be/WrVvTpKcYPA                                                          
**తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ కేసులో మరణించిన ఎరుకల యువకుడు చిరంజీవి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. ఈ సందర్బంగా చాలా "నమ్మలేని నిజాలు" కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. మొత్తం వ్యవహారం మీద మానవహక్కుల వేదిక(HRF) త్వరలో ఒక నివేదిక ఇస్తుంది అని తెలిపారు.*   *@TelanganaCMO*
@mahmoodalibrs
@TelanganaCS
@KTRBRS
*@TelanganaDGP* @TelanganaCOPs @CPHydCity *@CVAnandIPS @hydcitypolice @DCPNorthZone @acpgopalapuram
*@HRF_Humanrights* *@RSPraveenSwaero* *@Murali_IASretd*
@dr_mvreddy *@zson_bakka*
@RaviVattem @SrinivasRTIA
*@Kalojitv1*   @shotukaramgate                                                             https://twitter.com/Praja_Snklpm/status/1651539467931652097?t=zhEGK64KZauyyPYGhu281g&s=19
*Bplkm🪶*

సిట్టింగ్ ఎమ్మేల్యేలు జాగ్రత్తగా పని చేయకపోతే "తోకలు" కట్ చేస్తా

*ఎమ్మేల్యేలు జాగ్రత్తగా పని చేయకపోతే తోకలు కట్ చేస్తా*

*సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్*

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు.

తీర్మానాలు ఇవే..

-- దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బిఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం..

- దేశానికి సాగునీటి విధానం రూపొందించాలి...

- వ్యవసాయానికి పెట్టుబడి సాయం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని..

- భారత ప్రజలను ఏకం చేసి బలీయమైన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముందుకు వెళ్లాలని..

- బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు సమగ్ర సాగునీటి విధానం రూపొందించాలని..

- తెలంగాణలో వున్న రైతు రాజ్యం దేశం అంతటా స్థాపించాలని..ఇందుకోసం అలుపెరుగని పోరాటం దిశగా బిఆర్ఎస్ ముందుకు వెళ్ళాలని..

- కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించాలని..

- నూతన విద్యుత్ విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని...

- దళిత బంధు పధకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని..

- దేశంలో మౌళిక వసతుల కల్పన చేయాలని...

- కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని...

- మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో తీర్మానాలు చేశారు.

*సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్*

కాగా ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్‌ చేస్తానని హెచ్చరించారు. కాగా ముందుగా కే కేశవరావు ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, April 25, 2023

తెలంగాణా రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతోంది

తెలంగాణా రాష్ట్ర  గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతోంది  - 1 

Courtesy by :
కన్నెగంటి రవి ,
రైతు స్వరాజ్య వేదిక , 
ఫోన్: 9912928422 
-----------------------------------------------
రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2021 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా ( 3 కోట్ల 80 లక్షలు ) లో 60 శాతం జనాభా  గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుండీ పట్టణాలకు, నగరాలకు వలసలు కొనసాగుతున్నా , రాబోయే కాలంలో కూడా కనీసం సగం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే ఉండబోతున్నది. ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతంలో వయసుల వారీ జనాభా అంచనా మాత్రమే ఉంది . 2011 నాటి  SC, ST కులాల జనాభా వివరాలు అందుబాటులో ఉన్నాయి కానీ,  మిగిలిన కులాల వారీ జనాభా సంఖ్య,ఇతర వివరాలు  అందుబాటులో లేవు .గ్రామీణ ప్రజలు ఎక్కువగా పంటల సాగు , కూలీ పని, పశు పోషణ, గృహ పరిశ్రమలు, చిన్నవ్యాపారాలు , ఇతర వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఆయా వృత్తులపై ఆధారపడిన వారి వివరాలు సమగ్రంగా అందుబాటులో లేవు. 
గ్రామీణ సహజ వనరులంటే సాగు భూమి, చెరువులు ,అడవి , కొండలు, గుట్టలు, ఉమ్మడి భూములు,ఖనిజ సంపద. ఈ సహజ వనరులపై స్థానికులకు హక్కులు ఉండాలి.  కానీ ఈ సహజ వనరులపై స్థానిక ప్రజలలో ఎక్కువ మందికి ఇప్పటికీ చట్టబద్ధ హక్కులు లేవు. ప్రభుత్వాలు గత 7 దశాబ్ధాలుగా అనేక అభివృద్ధి  ప్రణాళికలు వేసినా, స్థానిక ప్రజలకు వనరులపై హక్కులు దక్కక పోగా, వారికి ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా వివిధ కారణాల వల్ల వారి చేతుల్లో మిగలడం  లేదు. మరీ ముఖ్యంగా గత మూడు దశాబ్ధాలుగా సహజ వనరులు, ముఖ్యంగా భూమి జీవనోపాధి వనరుగా కాకుండా, ఆస్తిగా, మార్కెట్ సరుకుగా మారిపోతున్నది . ఒక్క గ్రామీణ వ్యవసాయ దారులు తప్ప, సమాజంలో ఆస్తి పర వర్గాలు, ఇతర ఆదాయ వనరులు ఉన్న వాళ్ళు  సాగు భూములను పెద్ద ఎత్తున కొనుగోలు  చేస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగిద్దమని భావించే గ్రామీణ పేదలు ,తమకున్న కొద్దిపాటి ఆదాయంతో ఎప్పటికీ  సాగు భూములు  కొనుక్కోగలిగిన  పరిస్థితి లేదు. 
గ్రామీణ ప్రాంతాలలో లక్షలాదిమందికి ఉపాధి కల్పించే బీడీ, చేనేత లాంటి గృహ పరిశ్రమలున్నాయి. కానీ ఈ రంగాల కార్మికులకు ఆదాయాలు అతి తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు , స్వయం ఉపాధి ద్వారా కూడా కొంత మందికి ఉపాధి లభిస్తున్నది. గ్రామానికి దగ్గరలో ఉన్న నగరాలు, పట్టణాలలో అసంఘటిత కార్మిక రంగంలో జీవనోపాధి అవకాశాలు పొందడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కానీ భవన నిర్మాణ రంగంలో వేగంగా పెరుగుతున్న యాంత్రీకరణ ఈ ఉపాధి అవకాశాలను కూడా తగ్గిస్తు న్నది. 
రైతులను అన్నదాతలుగా కీర్తించే పాలకులు , తాము రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు, ప్రైవేట్ సంభాషణల్లో  ఇప్పుడు కోనసాగుతున్న అభివృద్ధి  నమూనాలో గ్రామాల ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి  చేయడం సాధ్యం కాదనీ,  అవసరం కూడా లేదనీ, గ్రామాల ప్రజలు, గ్రామాలను వదిలి, పట్టణాలకు,నగరాలకు వలస వెళ్లాలనీ , పారిశ్రామిక, సేవా రంగాలలో పనులు వెతుక్కోవాలనీ, అప్పుడే వారి సమస్యలు పరిష్కారమై ,ఆదాయలు,  జీవన ప్రమాణాలు మెరుగై, గ్రామీణ సంక్షోభం సమసి పోతుందనీ ప్రకటిస్తుంటారు. నిజానికి తమ ఆచరణతో, ప్రభుత్వాలు ,అధికార గణం,కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఈ భావాలను నిజం చేస్తున్నాయి.  
ఈ ధోరణికి మూలాలు భారత దేశంలో 1991 నుండీ ప్రభుత్వాలు అమలు చేసిన  ప్రపంచ బ్యాంక్ అజెండా లో ఉన్నాయి. 2015 నాటికి 40 శాతం ప్రజలు  మాత్రమే గ్రామాలలో ఉండాలనీ, మిగిలిన వాళ్ళు ఇతర రంగాలలోకి ,పట్టణీకరణ చెందాలనీ ఈ అభివృద్ధి  నమూనా సూచించింది. ప్రపంచబ్యాంకు అజెండా కు దేశంలో, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చిన ప్రతిఘటన ఈ పరిణామాన్ని ఆలస్యం చేసింది. 
గ్రామీణ ప్రాంత భూమి సంబంధాలలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో స్వంత భూమి లేని కుటుంబాల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న  భూమి కూడా వివిధ కారణాల వల్ల  మరింత చిన్న కమతాలుగా మారుతున్నదీ. లేదా వారి చేతుల్లోంచి క్రమంగా జారిపోతున్నది. ఫలితంగా జీవనపాధి కోసం వ్యవసాయం  చేసే కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మరో వైపు భూ గరిష్ట పరిమితి  చట్టంతో సంబంధం లేకుండా వందల ఎకరాల భూములను కొద్ది మంది వ్యక్తులు,చట్టంలో ఉన్న మినహాయింపులను వాడుకుని వివిధ పేర్లతో కొనుగోలు చేస్తున్నారు . 
ఒక వైపు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ భూములు ,వ్యవసాయేతర అవసరాలకు , ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పేరుతో పెద్ద ఎత్తున  మళ్లించబడుతున్నాయి. ఈ ధోరణి అన్ని జిల్లాలలో మండల కేంద్రాలు , జిల్లా కేంద్రాల చుట్టూ ఎక్కువగా కనపడుతున్నది. ఫలితంగా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనుషుల, మొత్తంగా సమాజ సుస్థిర అభివృద్ధికి ఏ మాత్రమూ తోడ్పడని స్పెక్యులేటివ్  మార్కెట్ ధోరణి ఇది. 
మరో వైపు  ప్రభుత్వ వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం రైతు బంధు సహాయం  అందుకుంటున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరిగిపోతూ సుమారు  1,55,00,000 ఎకరాలకు చేరుకున్నది. ఇది నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మిరాకిల్ మాత్రమే. ఏ దేశం లోనూ ,రాష్ట్రం లోనూ కనపడని విచిత్రమిది. 
2011 జనాభా లెక్కల ప్రకారం 31,00,000 మంది సాగుదారులు ఉండగా, ఇప్పుడు రైతు బంధు లబ్ధిదారుల  గణాంకాల  ప్రకారమే 63,00,000 మంది రైతులుగా నమోదై   రైతు బంధు సహాయం పొందుతున్నారు. ధరణి పోర్టల్ సమస్యల వల్లా (పార్ట్ బి ) ,  సాదా బైనామా డాక్యుమెంట్లు రెగ్యులరైజ్ కాకపోవడం వల్లా ఇంకా లక్షలాది ఎకరాల భూమి సాగు భూమిగా రికార్డులలో నమోదు కాలేదు. ఈ భూములన్నీ రెగ్యులరైజ్ అయితే, రాష్ట్రంలో సాగు భూముల విస్తీర్ణం మరింత పెరుగుతుంది. రైతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. 
మామూలుగా అభివృద్ధి చెందిన దేశాలలో , పారిశ్రామిక, సేవా రంగాలు విస్తరించిన కొద్దీ, వ్యవసాయం పై ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం సర్వ సాధారణం. కానీ మన రాష్ట్రంలో భిన్నంగా జరుగుతూ, రైతుల సంఖ్య పెరుగుతున్నది. పట్టా భూమి పై ఆధారపడి ప్రభుత్వాలు వ్యవసాయ రంగ పథకాలు రూపొందిస్తున్నందున భూ యజమానులు కుటుంబంలో ఉన్న కొద్ది పాటి భూమిని , ఇతర కుటుంబ సభ్యుల పేరుకు మార్చడం రైతుల సంఖ్య పెరగడానికి ఒక కారణమైతే,  వ్యవసాయంతో రోజు వారీ సంబంధం లేని వ్యవసాయేతర వృత్తుల వారు చిన్న, చిన్నరియల్ ఎస్టేట్  ప్లాట్లుగా వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ, రైతులుగా నమోదవడం మరో కారణం. 
ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ  చేయడం లేదు. ఖాళీల సంఖ్య ప్రతి నెలా పెరగిపోతుంటుంది. కానీ సకాలంలో నోటిఫికేషన్ లు వెలువడవు. జాబ్ క్యాలండర్ కూడా లేదు. ఒక వేళ ఆన్ని పోస్టులనూ నింపినా, చదువుకున్న అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు లభించడం కష్టం. ఇంటికో ప్రభుత్వం ఉద్యోగం అని ఏ పార్టీ హామీ ఇచ్చినా అది మోసం చేయడమే.  E సేవ, మీ సేవ లాంటి ఫీజు చెల్లింపు ఆధారిత సర్వీస్ సెంటర్ లతో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల పనులను ప్రైవేట్ పరం చేసిన విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. నిజంగా మరిన్ని ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగాలను (విద్య, వైద్యం, వ్యవసాయం) అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వానికి ఆసక్తి లేదు.  
ఇవాల్టి పరిస్థితులలో పారిశ్రామిక ,సేవా రంగాలలో ఉపాధి కల్పనకు  కొన్ని పరిమితులు ఉన్నాయి. భారీ యాంత్రీకరణ , కృత్రిమ మేధో సంపత్తి ( AI ) ఆధారంగా కంప్యూటరీకరణ ,ఉపాధి అవకాశాలను తగ్గించేస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడుతున్న ప్రైవేట్ సంస్థల, పరిశ్రమల  యజమానులు అతి తక్కువ కూలీ  రేట్లకు పనిచేసే , ఏ హక్కులూ అడగని కార్మికులనే పనిలోకి తీసుకుంటున్నారు. ఏ జిల్లాలో ఏ సంస్థా , పరిశ్రమా వచ్చినా, స్థానికులకు కాక, ఇతర రాష్ట్రాల నుండీ వలస వచ్చిన వారికి యజమానులు ఉపాధి కల్పించడానికి ఇదే కారణం.

Sunday, April 23, 2023

మే 15 కల్లా ఇంటర్, టెన్త్.... ఫలితాలు

*మే 15  కల్లా ఇంటర్, టెన్త్.... ఫలితాలు*

*పూర్తయిన మూల్యాంకనం*

*ఇంటర్‌ మార్కుల క్రోడీకరణ వేగవంతం*

*సాంకేతిక అంశాలపై కొనసాగుతున్న పరిశీలన*

*టెన్త్‌ మార్కులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు..*

హైదరాబాద్‌: లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న టెన్త్, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు మే 15 కల్లా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది, టెన్త్‌ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ మూల్యాంకన ఇప్పటికే ముగిసింది.

మార్కులను మరోసారి పరిశీలించి, కంప్యూటర్‌ ద్వారా ఇంటర్‌ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్‌ ప్రక్రియ కూడా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మే రెండోవారం అంటే.. 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం దాదాపు ముగిసింది. కొన్ని పెద్ద కేంద్రాల్లో అక్కడక్కడా కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్‌ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా, టెన్త్‌ ఫలితాలను వచ్చే నెల 10లోగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెపుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

అమిత్ షా తెలంగాణ పర్యటనపై.... మంత్రి KTR కౌంటర్....!

*అమిత్ షా తెలంగాణ పర్యటనపై.... మంత్రి KTR కౌంటర్....!*

హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న భాజపా పాలిత రాష్ట్రం ఒక్కటైనా చూపగలరా?అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఐటీఐఆర్‌ మంజూరు చేయలేదని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మెట్రో రెండో దశ, ఐఐఎం ఏర్పాటు చేయలేదని వంగ్యాస్త్రం సంధించారు. ఐఐఎస్‌ఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయాలు, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు.. ఇవన్నీ మంజూరు చేయలేదని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కేసీఆర్.....ప్రధాని సీటు ఖాళీగా లేదు.... అమిత్ షా....!

*కేసీఆర్.....ప్రధాని సీటు ఖాళీగా లేదు.... అమిత్ షా....!*

చేవెళ్ల: సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.. ప్రధాని సీటు ఖాళీగా లేదని కేసీఆర్‌ తెలుసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని పేర్కొన్నారు. కేసీఆర్‌ ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజల నుంచి సీఎం కేసీఆర్‌ దూరం చేయలేరని అన్నారు. భాజపా పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ భారాస పేరుతో దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కారు స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతుల్లో ఉందని, మజ్లిస్‌కు భాజపా భయపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లిస్‌కు భయపడే భారాస ప్రభుత్వం.. తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించట్లేదన్నారు.

''టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్లు లీకవుతున్నాయి. లీకేజీలపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడరు. యువకుల జీవితాలతో సీఎం ఆటలాడుతున్నారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. పేపర్‌ లీకేజీపై ప్రశ్నించిన బండి సంజయ్‌ను జైల్లో పెట్టారు. 24 గంటల్లో సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కానీ, వారికి సాధ్యం కాలేదు. జైళ్లకు వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు భయపడరు. మిమ్మల్ని గద్దె దించేవరకు మా కార్యకర్తలు విశ్రమించరు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే దొంగలను జైల్లో వేస్తాం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. కేసీఆర్‌కు మళ్లీ చెబుతున్నా.. మావాళ్లు జైళ్లకు భయపడరు. ఈ లీకేజీల ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా? టీఎస్‌పీఎస్సీ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి'' అని అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, April 22, 2023

"పద్మశ్రీ"కి ఫించన్ పడలే.!

*_'పద్మశ్రీ'కి ఫించన్ పడలే.!_*
_★ వనజీవి రామయ్యకు ఘోర అవమానం.!_
_★'డబ్బులు ఇప్పించడయ్యా..!' అంటూ పడిగాపులు_
_★ చెట్లు నాటుతుండగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదం_
_★ కాలికి గాయతోనే ప్రదక్షిణలు_
_★ ఖమ్మం కలెక్టరేట్ అవాంఛనీయ దృశ్యం_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_జీవితాన్ని త్యాగం చేసి నిస్వార్థ సేవలు చేసిన మహానుభావుల రుణం తీర్చుకోగలమా.? అలాంటి వ్యక్తులకు భారత ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత అవార్డులలో పద్మశ్రీ ఒకటి. అంతటి పురస్కారం పొందిన అరుదైన వారిలో వనజీవి రామయ్య ఒకరు. చెట్లను నాటడంలో ఆయన చేసిన కృషికి నాడు పద్మశ్రీ వస్తే... నేడు ఆయన తన పెన్షన్ అందలేదని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు రావడం బంగారు తెలంగాణాలో జరిగిన ఈ అవాంఛనీయ 'విషాద అంకం'పై 'ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న సంచలన కథనం._*

*_జీవితాన్నే త్యాగం చేసి.._*
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య జూలై 1వ తారీఖు 1937లో బాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. సినీ తారలకు అభిమానులు ఎలా బిరుదులు ఇస్తారో... ఈ రియల్ హీరోకు ప్రజలు ఇచ్చిన బిరుదు 'వనజీవి రామయ్య'. పర్యావరణ పరిరక్షణలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 30, 2017న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో దరిపల్లి రామయ్యకు నాటి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పద్మశ్రీ ప్రధానం రామయ్యగారూ..! హాట్సాఫ్. చేశారు. హాట్సాఫ్

*_ఎలా మొదలైంది..?_*
సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో వాహన ఖర్చుల కోసం రూ. 1500లతో ఈ సదుపాయం మొదలైయింది. అది అంచెలంచెలుగా పెరిగింది. 1995 సేవా అవార్డు, 2005 వనమిత్ర అవార్డు, 2015 జాతీయ ఆవిష్కరణలు, అత్యుత్తమ సాంప్రదాయ నాలెడ్జ్ అవార్డు, 2017 పద్మశ్రీ అవార్డులు ఆయన ముంగిట వాలాయి. దీంతో పాటు గౌరవ వేతనం కూడా ఇప్పుడు సుమారు 40 వేలకు చేరింది. ఈ మొత్తం కూడా ఆయన వృక్ష సంబంధిత విషయాలకే వాడటం గమనార్హం. కాలికి కట్టుతో.. కలెక్టరేట్ కు వచ్చి... నెలనెలా తన అకౌంట్లో పడాల్సిన డబ్బులు పడటం ఆలస్యం కావడంతో పద్మశ్రీ వనజీవి రామయ్య కలెక్టరేట్ లోని డీఆర్డీయే కార్యాలయానికి వచ్చారు. తిరగడానికి, మొక్కల సంరక్షణకు ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పారు. రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని అధికారులు చెప్పారు.

*_ఇటీవలే వరుస రోడ్డు ప్రమాదాలు_* రోడ్డు ప్రమాదంలో వనజీవి రామయ్య కాలికి గాయమైంది. కాలికి సర్జరీ చేయాలని కూడా వైద్యులు సూచించారు. ఇదిలా ఉండగా మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. 2019 మార్చిలో వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మార్చి 30న తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తున్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో వనజీవి రామయ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రామయ్య కోలుకొన్నారు.

*_పద్దతి మారాలి_*
జీవితంలో ఓ ఆశయం కోసం, సమాజ శ్రేయస్సు కోసం అన్నీ త్యాగం చేసిన వనజీవి రామయ్య జరిగిన అవమానం మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 'ఆదాబ్ హైదరాబాద్' డిమాండ్ చేస్తోంది. వనజీవి రామయ్య ఈ రాజకీయులను క్షమించు.

వేళ కాని వేళ పుష్కరస్నానాలు ఏల.?

*_ఎక్కడి గంగా పుష్కరాలు..? ఇక్కడ మంజీరలో ఆ పుష్కరాలేమిటి..? స్నానాలేమిటి..?_*
_★ గంగా పుష్కరాల మద్య_
_★గరుడగంగ పుష్కరాలట.!_
_★ వేళ కాని వేళ పుష్కరస్నానాలు ఏల.?_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు‌, 9440000009)_

*ఇది పద్దతి:*
నది అంటే విడిగా ఉండే ప్రవాహం కాదు. ఉపనదులను కలుపుకునే ప్రవహించి, అంతిమంగా సాగరంలో కలుస్తుంది. అన్ని నదులకూ ఉన్నట్టే నదులకూ పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలు వస్తాయి. ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది. ఎన్నో వందలేళ్లుగా ఆ లెక్కల ప్రకారమే పుష్కరాలు వస్తున్నాయి. పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఇది ఒక పద్ధతి.

*_ఇదో విడ్డూరం_*
గోదావరి కూడా అంతే.! దాని ఉపనదులకు వేరేగా, ప్రధాన నదికి వేరేగా పుష్కరాలు ఉండవు. ఉండకూడదు. అది శాస్త్ర సమ్మతం కాదు. సో, గోదావరికి పుష్కరాలు వచ్చినప్పుడే దాని ఉపనది మంజీరాకు కూడా వచ్చాయి, వస్తాయి. నో, నో, ఎప్పుడు వీలయితే అప్పుడు, ఏదో పురాణం చెప్పేసి, ఉపనదికి విడిగా, ప్రధాన నదికి విడిగా… ఏదో పేరు పెట్టేసి పుష్కరాలు చేయిస్తామంటే.. డబ్బులు, హడావుడి కోణంలో వోకే.!

*_కానీ పుష్కరుడు అంగీకరించడు…_* అంగీకరించకపోవడానికి ఆయనెవరు..? నువ్వు 'మంజీర' అనే ఉపనదికి 'ఎప్పుడు వస్తావో మాకు తెలుసా..? నీకు తెలుసా' అని దబాయించే సెక్షన్ వచ్చేసింది. నిజానికి వాళ్లు చెప్పినట్టు వినడం తప్ప పుష్కరుడికి కూడా వేరే చాయిస్ ఏముంది..? మంజీర కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో ప్రవహించే ఓ అంతర్రాష్ట్ర ఉపనది. సింపుల్‌గా చెప్పాలంటే గోదావరిలో కలిసిపోయే ఓ పాయ.

*_గరుడగంగ పుష్కరాలట..🤦🏻‍♂️_*
ఇప్పుడు హఠాత్తుగా మంజీరకు గరుడగంగ పుష్కరాలు నిర్వహిస్తారట.! మెదక్ జిల్లా, 2011లో కేసీయార్ ఈ ఆనవాయితీకి శ్రీకారం చుట్టాడట.! ఆయనదేముంది…? రాజ్యాంగాన్నే మార్చేయాలంటాడు, ఆఫ్టరాల్ పుష్కరాల విధివిధానాలను మార్చిపారేయలేడా..? కానీ ఒక వ్యక్తి చెబితే యావత్ పండితలోకం తలవంచుకుని, తలదాల్చడమే ఒక వింత.! ఇదో ఖర్మ.! అవసరమైతే తననే ఓ పుష్కర పురుషుడిగా భావించి జేజేలు కొడతారు. (మారండి...)

*_అబ్బో... ఓ యబ్బో.._*
తొలిరోజు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుష్కరఘాట్‌కు పూజలు చేస్తే, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పుష్కర స్నానాలు ఆచరించారట.! మంజీర పునీతం అయిపోయి ఉంటుంది. సేమ్ ఇలాగే గత ఏడాది గోదావరి మరో ఉపనది ప్రాణహితకూ పుష్కరాలు చేయించినట్టు గుర్తు.

*_గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి_*
నిజానికి ప్రస్తుతం గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గంగ అంటే గంగే… ఈ హిమానీనదం అనేక ఉపనదులను కలుపుకుని ప్రవహిస్తూ, ఈ దేశ ఆర్థిక, ఉద్వేగ, ఆధ్యాత్మిక, వ్యవసాయిక, పర్యావరణ, సామాజిక అంశాలన్నింటితోనూ అనుసంధానమై ఉన్నది.

*_వేళ కాని వేళ పుష్కరస్నానాలు ఏల.?_*
దాదాపు 5 వేల కిలోమీటర్ల ప్రవాహం… ప్రపంచంలోని 8.5 శాతం ప్రజలకు నివాసస్థలి ఈ గంగ-యమున పరీవాహకం… దాని పవిత్రత వేరు, దాని విశిష్టత వేరు… ఎక్కడో గంగ… కానీ ఇక్కడ తెలంగాణలో గరుడగంగ పేరుతో ఓ పుష్కర విన్యాసం… ప్రజల బుర్రలకు గంతలు కట్టడం దేనికి..? ఎంచక్కా గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడే మంజీరలోనూ మునకలు వేయొచ్చు కదా…! వేళ కాని వేళ పుష్కరస్నానాలు దేనికి..?

*_బానిస నిశ్శబ్ధం.._*
మెదక్‌ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల పేరూరు శివారులో ఉన్న గురుడగంగ సరస్వతీ ఆలయ ఆదరణ కోసం ఈ ప్రయాస… ఇది సరస్వతీ ఆలయం… కానీ నాగదేవతగా భక్తులు కొలుస్తారట… నదీస్నానాలు మంచివే… ఎవరూ కాదనరు… ఆలయ సందర్శనం కూడా మంచిదే… ఎవరూ వ్యతిరేకించరు… కానీ ప్రధాన నదికి భిన్నంగా, ఎక్కడో ఉన్న గంగ పేరు జెప్పి ఈ పుష్కరుడిని లాక్కొచ్చి 12 రోజులపాటు ఇక్కడ కట్టేయడం దేనికి..? తెలంగాణలోని పండితోత్తములకు ఇవన్నీ పట్టవు… కేసీయార్‌కు కోపమొచ్చే ప్రమాదముంది కదా… నిశ్శబ్ధం…

*_రాజు తలుచుకుంటే..._*
జగిత్యాల, మంథని, ధర్మపురి తదితర ప్రాంతాల వాళ్లకు గోదావరే గంగ… గంగ అనే పిలుస్తారు… అంతెందుకు మా ఊరి పక్కన పారే ఒర్రెను మేం కూడా గంగ అనే పిలుస్తాం… పిలుస్తున్నాం కాబట్టి గంగ అయిపోదు… ఎప్పుడో వీలు చూసుకుని మేమూ పుష్కరాలు స్టార్ట్ చేస్తామంటే కుదరదు… పుష్కరుడేమీ తరలిరాడు… అది సత్యం… ఐనా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో తరతరాలుగా పండితులదే ప్రథమస్థానం… ఇప్పుడు ఈ విషయాల్లో కూడా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయారు… హతవిధీ…

ఒట్టేసే అవసరం నాకు లేదు.... రేవంత్ సవాల్ పై స్పందించిన ఈటల

*ఒట్టేసే అవసరం నాకు లేదు.... రేవంత్ సవాల్ పై స్పందించిన ఈటల*

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌పై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ కించపరచలేదన్నారు.తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందని.. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని చెప్పారు. దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని స్పష్టం చేశారు. దీనిపై తగిన సమయంలో జవాబిస్తానని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారాస భారీగా డబ్బు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు.మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు భారాస డబ్బులు పంపిందని భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. భారాస నుంచి, సీఎం కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదన్నారు. ఈ వ్యవహారంపై భాగ్యలక్ష్మి అమ్మవారిపై తాజాగా రేవంత్‌ ప్రమాణం చేశారు. ''అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశాను. దేవుడిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలను ఉపసంహరించుకోవాలి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన దిగజారి మాట్లాడుతున్నారు. తాను విసిరిన సవాల్‌ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేశాను. ఈటల తన ఆరోపణలను నిరూపించుకోవాలి'' అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఈ వ్యవహారం తాజాగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

రాజీపడటం నారక్తంలో లేదు భయం నా ఒంట్లో లేదు.... రేవంత్!

*రాజీపడటం నారక్తంలో లేదు భయం నా ఒంట్లో లేదు.... రేవంత్!*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ తన రక్తంలోనే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్‌ రూ.25 కోట్లు ఇచ్చారంటూ భాజపా నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. 'ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది' అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. భారాస, భాజపాలు భారీగా డబ్బులతో బరిలోకి దిగితే.. కాంగ్రెస్‌ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపిందని గుర్తు చేశారు. '' మునుగోడు ఉపఎన్నిక కోసం భారాస, భాజపా భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ.25 కోట్లు తీసుకున్నట్లు విమర్శించారు. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు. నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్‌ సర్వం దారబోసినా రేవంత్‌ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.'' అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, April 21, 2023

టీ - సేవ్ నిరాహార దీక్షకు.... హైకోర్టు ఓకే

*టీ - సేవ్ నిరాహార దీక్షకు.... హైకోర్టు ఓకే*

హైదరాబాద్‌: టీ-సేవ్‌ నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందిరాపార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టే నిరాహార దీక్షకు షరతులతో కూడిన అనుమతిచ్చింది.నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువ పాల్గొనవద్దని.. దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ దీక్ష సాగనుంది.

నిరుద్యోగ యువతకు మద్దతుగా నిర్వహించదలచిన అఖిలపక్ష నిరాహార దీక్షకు అనుమతి మంజూరు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 17న నిర్వహించదలచిన నిరాహార దీక్షకు అనుమతిని నిరాకరిస్తూ పోలీసులు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ షర్మిల పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో.. నిరుద్యోగ యువతకు మద్దతుగా ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష నిరాహార దీక్షకు అనుమతిని కోరుతూ పోలీసులకు వినతిపత్రం సమర్పించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, April 20, 2023

కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు

*_కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు_*
_★ భిక్షాటనతో సేకరించిన చిల్లరతో నామినేషన్‌ సమర్పణ_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

'దేశంలో ఏ ఎన్నికల్లో నిలబడాలి' అన్నా స్థాయిని బట్టి నోట్ల ఖర్చు మారుతుంది. అయితే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. గురువారం నామపత్రం సమర్పించారు. ఇందుకు భిక్షాటనతో పోగు చేసిన రూ.10 వేలను డిపాజిట్‌గా చెల్లించారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గంలో తిరుగుతూ యాచించారు. అలా సేకరించిన నాణేలనే గురువారం ఎన్నికల అధికారికి ఇచ్చారు. 2 గంటలు శ్రమించి చిల్లరంతా లెక్కించి, నామినేషన్‌ స్వీకరించినట్లు అధికారి తెలిపారు. అనంతరం యంకప్ప మాట్లాడుతూ.. ‘నేను ఎందుకు పోటీ చేస్తున్నానో ప్రజలకు చెప్పా. వారి నుంచే డిపాజిట్‌ డబ్బూ సమీకరించా’ అని తెలిపారు. పగలు భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే యంకప్ప రాత్రిళ్లు ఆలయాల లోగిళ్లలో పడుకుంటారు. 

Wednesday, April 19, 2023

తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ.... రద్దు

*తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ.... రద్దు*


*ఈసారి నుంచి శాశ్వతంగా తొలగింపు*
*ఎంసెట్‌* *మార్కులతోనే ర్యాంకు*
*జీఓ జారీ చేసిన ప్రభుత్వం*

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందిఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు ...అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్‌, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్‌ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్‌ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు కబ్జా

https://youtu.be/mtXxhfGEYbc                                                           
*ఆదిత్రీ హౌసింగ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ అమీన్పూర్ పెద్ద చెరువు పక్కన బఫర్ జోన్ లో తూములను మూసేసి మరి చదును చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.*
*మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవిన్యూ శాఖలు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ ఉండడం చాలా దురదృష్టకరం. ఇరిగేషన్ వారు వారి నిస్సహాయ స్థితిని వెళ్లబుచ్చుతున్నారు ఎందుకంటే రెవెన్యూ శాఖకు ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా అక్రమంగా అనుమతులు ఇస్తున్నారు.*
*జిల్లా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఈ అక్రమ కట్టడాల పైన, చెరువుల కబ్జా పైన ఫిర్యాదులు చేసిన ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం.*
*ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, ప్రకృతితో మనము ఆటలాడుకుంటే ప్రకృతి ఆట మొదలుపెట్టినప్పుడు తట్టుకోవడం మానవ మాత్రునికి సాధ్యమయ్యే పని కాదు.*

*వి. రవికృష్ణ*
*న్యాయవాది*                                                       *COPY TO GROUP LINK MEDIA*                                                                                                                  http://prajasankalpam1.blogspot.com

టిఆర్ఎస్ ను వీడు తానన్న వార్తల్లో....వాస్తవం లేదు.....!

*టిఆర్ఎస్ ను వీడు తానన్న వార్తల్లో....వాస్తవం లేదు.....!*

*తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌*

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ మంగళవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నేపథ్యంలో పద్మారావు కూడా పార్టీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది.

పద్మారావుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ కావడం ఈ వార్తలకు ఊతం ఇచ్చింది. అయితే తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఉద్యమ సమయం నుంచి ఉన్న అనుబంధం కొనసాగుతుందని ఈనెల 16న పద్మారావు ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు పద్మారావుగౌడ్‌తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పద్మారావుగౌడ్‌ కూడా పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

*సుజీవన్ వావిలాల*🖋️

Monday, April 17, 2023

కొడుకు పోయిన భాధ ఎలావుంటుందో తెలుసు

*కొడుకు పోయిన భాధ ఎలావుంటుందో తెలుసు....హత్విక్ ను దత్తత తీసుకుంటా... MP కోమటి రెడ్డి*

నల్గొండ: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్‌ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయినరేశ్‌ స్వగ్రామం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయిన నరేశ్‌ పెద్ద కుమారుడు హాత్విక్‌ను దత్తత తీసు కుంటానని భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ సైదులుతో హాత్విక్‌ పేరిట బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్‌ చేయించారు. ఖర్చుల నిమిత్తం నరేశ్‌ తల్లిదండ్రులకు రూ.25వేలను అందజేయించారు. నరేశ్‌ తల్లిదండ్రులను ఫోన్‌లో ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నరేశ్‌ కొడుకును ఇంటర్నేషనల్‌ స్కూ ల్‌లో చదివిస్తానని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, ఢిల్లీ నుంచి రాగానే, గ్రామానికొచ్చి కలుస్తానని నరేష్‌ కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

విగ్రహం మంచిదే,విధానాల మాటేమిటి?

విగ్రహం మంచిదే,
విధానాల మాటేమిటి?
-----------------------------------------------
Courtesy by : కన్నెగంటి రవి, సామాజిక కార్యకర్త 
-----------------------------------------------

ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర సచివాలయ నూతన భవనానికి కూడా  డాక్టర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. ఈ ఘటనలు రెండూ అణగారిన వర్గాల ప్రజలకు, మొత్తంగా  శ్రామిక ప్రజలకు సంతోషాన్ని  కలిగిస్తున్నాయి. తెలంగాణా సమాజం మొత్తంగా వీటిని స్వాగతిస్తున్నది.  
భారత దేశంలో ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక న్యాయం సాధించడం , కుల నిర్మూలన సాధించడం, మను ధర్మం బోధించే తప్పుడు  విలువలను ప్రజల జీవితాల నుండీ పార దోలడం,  ప్రభుత్వాలు ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందించడం చుట్టూ సాగిన ఆయన కృషి , రచనలు అపురూపమైనవి.  
దేశంలో కుల నిర్మూలనకు , మొత్తంగా దోపిడీ, పీడనల నుండీ ప్రజల విముక్తికి సంబంధించిన రాజకీయ, సైద్ధాంతిక విషయాలలో సమాజంలో భిన్న ఆలోచనలు సహజంగానే ఉంటాయి. వాటిని ఎప్పటికైనా ఓపికగా సాగించే చర్చల ద్వారా,  ప్రజల హక్కుల కోణంలో సమిష్టి కార్యాచరణ ద్వారా  పరిష్కారం చేసుకోవాల్సిందే.  
డాక్టర్ బాబా సాహెబ్ స్పూర్తి తో ,  ప్రజా సంఘాలు, దళిత, ఆదివాసీ సంఘాలు, వెనుక బడిన వర్గాల ప్రజల సంఘాలు , మత పరమైన మైనారిటీ సంఘాలు  పరస్పరం దుమ్మెత్తి పోసుకోకుండా , ఈ సందర్భంగా అటువంటి ఆరోగ్యకరమైన చర్చకు ప్రాణం  పోస్తాయని ఆశిద్దాం. 
అమరుల స్థూపాలు, మహనీయుల విగ్రహాలు ఎప్పుడూ ప్రజలకు స్పూర్తి ఇస్తాయి. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రేరణ ఇస్తాయి. అయితే ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకోసం నెలకొల్పుతున్నారన్న ప్రశ్న మనం ఎప్పుడూ వేసుకోవాలి. 
ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమం చేస్తున్నది ప్రజలను చైతన్య పరిచే లక్ష్యంతోనా, ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే లక్ష్యం తోనా అన్నది చూడాలి. ఈ భారీ విగ్రహాన్ని నెలకొల్పుతున్న , ప్రభుత్వ భవనాలకు పేర్లు పెడుతున్న రాష్ట్ర పాలకులకు  మహనీయుడు అంబేడ్కర్  బోధించిన విలువల పట్ల  ఉన్న నిబద్ధత ఎంత అన్న ప్రశ్న  కూడా అంతే  ముఖ్యమైనది. 
ఎందుకంటే , గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణాలో పరిపాలన డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సాగడం లేదు. రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందడం లేదు. రాజ్యాంగం లో పొందు పరిచిన ప్రాధమిక హక్కులు ప్రజలకు దక్కడం లేదు . రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన ఆదేశిక సూత్రాలు ఏవీ , ప్రజలకు హక్కులుగా అందుబాటులోకి రాలేదు.
ప్రజాస్వామిక విలువల పై ఏ మాత్రమూ గౌరవం లేని నిరంకుశ పాలకులు, డాక్టర్ అంబేడ్కర్ పేరు పదే పదే పలుకుతున్నారంటే, అది ఆయా వర్గాల ప్రజలను మోసం చేయడానికి మాత్రమే . సమాజంలో బుద్ధి జీవులు, రచయితలు, కవులు, కళాకారులు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని సాధారణ ప్రజలను జాగరూకులను చేయాలి. 
తరుముకు వస్తున్న ఎన్నికల ప్రయోజనాల సాధన లక్ష్యం తోనూ, ఇచ్చిన హామీలు ఉల్లంఘించిన పాలకులపై అణగారిన ప్రజలలో నెలకొన్న ఆగ్రహాన్ని చల్లార్చే లక్ష్యంతోనూ,  విగ్రహాలు నెలకొల్పడం, భవనాలకు పేరు పెట్టడం  లాంటి ఒకటి, రెండు ఘటనలు సృష్టించే  పాలకుల నిజ స్వభావాన్ని దాచి పెడుతూ, వారిని  దళిత జనోద్ధరకులుగా కీర్తించే  పోకడలు కొంతమంది మేధావుల వైపు నుండీ వ్యక్తం కావడం అత్యంత బాధాకరం . 
తెలంగాణా రాష్ట్రంలో చాలా గ్రామాలలో ఇప్పటికీ ప్రజలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పాలని అనుకుంటే , ఆయా గ్రామాల లోని ఆధిపత్య శక్తులు అడ్డుకుంటున్నాయి. దళిత కుటుంబాలపై సమాజంలో కుల వివక్ష, అణచివేత  కొనసాగుతూనే ఉంది . 
గ్రామాభివృద్ధి కమిటీ (VDC ) ల పేరుతో ఉత్తర తెలంగాణా లో  ఇప్పటికీ ఇంకా కొన్ని ఆధిపత్య శక్తులు, దళిత కుటుంబాలకు  గ్రామ బహిష్కార శిక్ష విధిస్తూనే  ఉన్నాయి.  కులాంతర,మతాంతర వివాహాలు చేసుకుంటున్న సందర్భంలో దళిత యువకుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి.  
ఈ ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నా,  చాలా సందర్భాలలో ప్రభుత్వం వీటి పట్ల మౌనంగా ఉంటున్నది. లేదా నిందితుల పట్ల మెతకగా వ్యవహరిస్తున్నది. బాధితులకు భరోసా ఇవ్వడం లేదు. ఎస్‌సి,ఎస్‌టి లపై అత్యాచార నిరోధక చట్టం అమలు కూడా అత్యంత బలహీనంగా ఉంది. 
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే అధికార పార్టీ, ప్రస్తుత ప్రభుత్వం దళితులకు అనేక హామీలను ఇచ్చాయి. కానీ వాటి అమలులో పూర్తి వైఫల్యం చెందాయి.  
దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు కదా, భూమి లేని దళిత కుటుంబాలకు గత తొమ్మిదేళ్లలో ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన మూడెకరాల భూమి కూడా దక్కలేదు. కనీసం మూడు లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని ఈ ప్రభుత్వమే జీవో నంబర్ 1 లో చెప్పింది. కనీసం ఎకరానికి 7 లక్షల రూపాయల చొప్పున  ఖర్చు చేసి మూడు ఎకరాలు (21 లక్షలు) కొనుగోలు చేసి ఇస్తామన్న పథకాన్ని ఈ ప్రభుత్వం ఆపేసింది.  కుటుంబానికి 10 లక్షల రూపాయలతో దళిత బంధు పేరుతో జీవనోపాధి కల్పించే కొత్త పథకాన్ని తెచ్చింది. దాని అమలు కూడా పూర్తి అవినీతితో నత్తనడకన  సాగుతున్నది. 
ఎస్‌సి ,ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టం క్రింద ప్రత్యేక అభివృద్ధి నిధులను (SDF)  ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తున్నప్పటికీ, ఆచరణలో  వాటిలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులను, చట్ట స్పూర్హికి భిన్నంగా ఈ ప్రజలకు ఏ సంబంధమూ లేని రోడ్లు, , మెట్రో రైళ్లు  పేరుతో పక్కదారి పట్టిస్తున్నారు. 
తెలంగాణాలో అత్యధిక మంది దళితులు స్వంత భూమి లేని వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. లేదా కౌలు భూమి సాగు దారులుగా ఉన్నారు . వ్యవసాయేతర రంగాలలో అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారు. ఈ కుటుంబాలకు ఆదాయ బధ్రత లేక పేదరికంలో ఉన్నాయి. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఈ కుటుంబాలకు సహజ  వనరులపై హక్కులు కల్పించలేదు. కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడం లేదు. వారి వ్యవసాయానికి సహాయమూ చేయదమూ లేదు. ఈ కుటుంబాలకు రైతు బీమా లాంటి సాంఘిక బధ్రత (సోషల్ సెక్యూరిటీ) కూడా కల్పించలేదు. అసంఘటిత కార్మికులకు గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో కనీస వేతనాలు కూడా పెంచలేదు.  
తెలంగాణా లో ఇప్పటికీ  ప్రభుత్వ విద్యా సంస్థలలో దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఈ విద్యా సంస్థలను  విధ్వంసం చేసింది. ఈ సామాజిక వర్గాల పిల్లలలో విద్యా సామర్ధ్యాలు, నైపుణ్యం పెరగకుండా ఈ ప్రభుత్వమే అడ్డుపడుతున్నది. 
పెరుగుతున్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ స్కూల్స్ సంఖ్య  పెంచకుండా , రేషనలైజేషన్ పేరుతో  ఉన్న స్కూల్స్ ను కూడా మూసి వేస్తున్నది. డాక్టర్ బాబా సాహెబ్ ఆశించిన కుల నిర్మూలన వైపు అడుగులు వేసే విధంగా విద్యా రంగంలో కామన్ స్కూల్స్, హాస్టల్స్ కాకుండా , కులాల వారీగా ఈ ప్రభుత్వం ఏర్పరిచిన గురు కులాలు కూడా సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. విద్యార్ధుల వసతి గృహాలకు  కూడా మౌలిక సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది.  
దళిత యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలకు అందించాల్సిన కార్పొరేషన్ రుణాలు కూడా పూర్తిగా అందడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలలో , సంస్థలలో వేలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల, రిజర్వేషన్లు అమలు కావడం లేదు. సామాజిక న్యాయం సాధించే దిశగా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ల ప్రసక్తే ఉండడం లేదు . 
రాజ్యాంగం పరిధిలో దేశ కార్మికులకు హక్కులు కల్పించడానికి డాక్టర్ బాబా సాహెబ్ నిరంతరం కృషి చేశారు. కానీ తెలంగాణా పాలకులు , ఆయా రంగాలలో కార్మిక సంఘాల ఉనికినే ప్రశ్నిస్తున్నారు. ఆర్‌టి‌సి కార్మిక సంఘాల పట్లా, కార్మికుల సమ్మె పట్లా కే‌సి‌ఆర్ వ్యవహరించిన తీరు మన కళ్ల ముందు ఉంది. ఇప్పటికీ ఆర్‌టి‌సి లో కార్మిక సంఘాలను గుర్తించడానికి ఈ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. 
రాజ్యాంగం లో  5 వ షెడ్యూల్ ఆదివాసీల హక్కులను నిర్వచించింది. కానీ తెలంగాణా లో అడవిపై ఆదివాసీలకు వ్యక్తిగత ,సాముదాయక హక్కులు కల్పించడానికి ఈ ప్రభుత్వం ఇప్పటికీ మీన మేషాలు  లెక్క పెడుతున్నది. పైగా 1/70 చట్టానికి భిన్నంగా బయ్యారంలో ప్రైవేట్ పెట్టుబడి దారులతో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడానికి చర్చలు కొనసాగిస్తున్నది. 
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ రాష్ట్రంలో తీవ్ర ఉల్లంఘన జరుగుతున్నది. కనీసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ప్రజలు నిరసన వ్యక్తం  చేయడానికి కూడా అనేక ఆంక్షలు ఎదురవు తున్నాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా బహిరంగం గా మాట్లాడడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజరిక పోకడలతో ముఖ్యమంత్రి ,ఆయన తనయుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఆయా ప్రాంతాలలో  ప్రజా సంఘాల కార్యకర్తల ముందస్తు అరెస్టులు జరగడం ఇందుకు పరాకాష్ట . 
ఈ ప్రభుత్వ ప్రస్తుత పరిపాలనా తీరు , డాక్టర్ బాబా సాహెబ్ ఆశయాలకు,ఆలోచనలకు భిన్నమైనది. దానిని మార్చుకోకుండా, రాజ్యాంగ బద్ధంగా , రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సాగించకుండా, కేవలం బాబా సాహెబ్ విగ్రహావిష్కరణ తోనే,సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతోనే , ప్రజలను సంతృప్తి పర్చాలనుకుంటే ఆయన స్పూర్తికి  తూట్లు పొడవడమే.  
ప్రభుత్వం ప్రస్తుత తన ధోరణి నుండీ బయట పడడానికి , రాబోయే  కాలంలో డాక్టర్ బాబా సాహెబ్  విగ్రహం , సచివాలయం ఉన్న ప్రాంతాన్ని కేవలం టూరిస్ట్ ప్రాంతంగా,  పోలీస్ నిషేదాజ్ఞలు ఉండే ప్రాంతంగా మార్చకుండా , ప్రజల గొంతు ప్రభుత్వానికి వినిపించేలా, ప్రజల సమావేశాలకు, నిరసనలకు ఆ స్థలంలో అవకాశం ఇవ్వాలి . 
దేశమంతా బీసీ జనగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో చేపట్టాలి.l

అతీక్‌ సోదరుడి చివరి మాట అతడి పేరే.

_ఎవరీ గుడ్డూ ముస్లిం..?_
*_అతీక్‌ సోదరుడి చివరి మాట అతడి పేరే..!_*

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_హత్యకు ఒక్క క్షణం ముందు గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ సోదరుడు అష్రాఫ్‌ తమ ప్రధాన బాంబ్‌ స్పెషలిస్టు గురించి ఏదో ప్రస్తావిస్తూ.. ‘‘అసలు విషయం ఏమిటంటే.. గుడ్డూముస్లిం’’ అని ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో అత్యంత సమీపం నుంచి హంతకులు అతీక్‌ను కాల్చేశారు. అష్రాఫ్‌ ఆ షాక్‌ నుంచి తేరుకొనేలోపే.. అతడిపై కూడా తూటాల వర్షం కురిసింది. దీంతో అతీక్‌ సోదరులిద్దరూ అచేతనంగా నేలపై పడిపోయారు. వారు ఏం చెప్పబోతున్నారు.. అసలా బాంబు స్పెషలిస్టు 'గుడ్డూముస్లిం ఎవరూ..?' అనే అంశంపై ఇప్పుడు చర్చజరుగుతోంది. ఉమేశ్‌పాల్‌ హత్య కేసు నిందితుల జాబితాలో అతడి పేరు ఉంది._*

*చిన్న కేసుల నుంచి..*
1990ల్లో గుడ్డూ ముస్లిం ప్రయాగ్‌రాజ్‌లో మెల్లగా పాపులారిటీ సంపాదించడం మొదలుపెట్టాడని 1977 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, ఒకప్పటి యూపీ డీజీ బ్రిజ్‌లాల్‌ పేర్కొన్నారు. అతడు పాఠశాల విద్యను అభ్యసించే సమయంలో పశ్చిమబెంగాల్‌ వెళ్లి అక్కడ బాంబుల తయారీ, వాటి వినియోగం నేర్చుకొని వచ్చాడు. అందరూ అతడిని ‘గుడ్డూ బంబాజ్‌’, ‘గుడ్డూ ముస్లిం’ అని పిలిచేవారు. నాటు బాంబులు తయారీలో సిద్ధహస్తుడు. బైక్‌పై ప్రయాణిస్తూ లేదా పరిగెడుతూ కూడా అప్పటికప్పుడు నిమిషంలో నాటు బాంబు తయారు చేసి ప్రయోగించగలడు. అతడి వద్ద ఎప్పుడూ బాంబు తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్‌ సిద్ధంగా ఉండేదని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు.  ఈ విషయమే అతడిని యూపీ గ్యాంగ్‌స్టర్ల సర్కిల్‌లో బాగా పాపులర్‌ చేసింది. ఒక్కసారి బాంబు నిపుణుడిగా పేరువచ్చాక గుడ్డూ ఈ నేరసామ్రాజ్యంలో వెనుదిరిగి చూడలేదు.

*వ్యాయామ శిక్షకుడి హత్యతో..*
వాస్తవానికి గుడ్డూ ముస్లిం నేరప్రస్థానం 1977లో మొదలైంది. ఆ ఏడాది గుడ్డూను అతడి తండ్రి లఖ్‌నవూ యూనివర్శిటీలో చేర్పించారు. లా మార్టినియర్‌ కాలేజీలో ఫెడ్రిక్‌ గోమేస్‌ అనే పీటీ (ఫిజికల్‌ ట్రైనింగ్‌) శిక్షకుడిని హత్య చేశాడు. పోలీసులు ఈ కేసు నేరనిరూపణలో విఫలమయ్యారు. ఆ తర్వాత గుడ్డూ అప్పట్లో ఫైజాబాద్‌లోని సత్యేంద్ర సింగ్‌ అనే హిస్టరీ షీటర్‌ గ్యాంగ్‌లో చేరాడు. 1996లో శ్రీప్రకాశ్‌ శుక్లాతో జరిగిన ఓ గ్యాంగ్‌వార్‌లో సత్యేంద్ర హతమయ్యాడు.  శుక్లాతో కూడా కలిసి గుడ్డూ పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్లు గోరఖ్‌పూర్‌లోని పర్వేజ్‌ టాడా అనే మాఫియా నాయకుడితో కలిసి పనిచేశాడు. అతడికి నాటు బాంబులను సరఫరా చేసేవాడు.  

*అతీక్‌ అహ్మద్‌ గ్యాంగ్‌ వయా బిహార్‌..*
1998లో శ్రీప్రకాశ్‌ శుక్లా ఎన్‌కౌంటర్‌ తర్వాత గుడ్డూ ముస్లిం బిహార్‌కు వెళ్లిపోయాడు. అక్కడ ఉదయభాన్‌ అనే డాన్‌ గ్యాంగ్‌లో చేరాడు. నేరాలు చేయడానికి తరచూ ఉత్తరప్రదేశ్‌కు వచ్చేవాడు. 2001లో ఓ కేసులో యూపీ పోలీసులు అతడిని పట్నాలో అరెస్టు చేశారు. కానీ, ఆ కేసులో బెయిల్‌ దొరకడంతో యూపీలోని అతీక్‌ అహ్మద్‌ ముఠాలో చేరాడు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్యకేసులో గుడ్డూ కూడా నిందితుడే. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్‌పాల్‌ హత్య జరిగే సమయంలో గుడ్డూ ముస్లిం బైకుపై ప్రయాణిస్తూ బాంబులు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై రూ. 5 లక్షల రివార్డును ప్రకటించారు. అతీక్‌ అహ్మద్‌ గ్యాంగ్‌ మొత్తాన్ని ఓ రకంగా ఇతడే నడిపిస్తున్నాడు. ఈ గ్యాంగ్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదగాలన్న ఆశ కూడా అతడికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

*నాసిక్‌లో ఉన్నాడా..?*
ఉమేశ్‌ హత్య కేసులో కీలక నిందితుడైన గుడ్డూ కోసం పోలీసులు వేట తీవ్రతరం చేశారు. మీరట్‌, అజ్మీర్‌, ఝాన్సీ, నాసిక్‌లలో అతడి లొకేషన్‌ను ప్రత్యేక బృందాలు గుర్తించాయి. కానీ, అతడు వేగంగా తన స్థావరాలను మార్చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. నాసిక్‌లో అతడిని అరెస్టు చేసినట్లు వార్తలు కూడా గుప్పుమన్నాయి. కానీ, తాము అరెస్టు చేసిన వ్యక్తి గుడ్డూ ముస్లిం కాదని నాసిక్‌ పోలీసులు వివరణ ఇచ్చారు.

మాజీ విలేకరిని కిడ్నాప్‌ చేసి చంపేశారు.

*దారుణం..*
*_మాజీ విలేకరిని కిడ్నాప్‌ చేసి చంపేశారు.._*

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_కిడ్నాప్‌కు గురైన మాజీ విలేకరి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.._* మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ (29) ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవాడు. కొద్దినెలల క్రితమే మానేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు.

*_కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్‌ చేసి.._*
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వస్తుండగా మార్గంమధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డిపై దాడి చేసి కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుడిని కిడ్నాప్‌కు గురైన కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

*_ప్రజాప్రతినిధితో విభేదాలే కారణమా?_*
కొత్తూరు మండల స్థాయి ప్రజాప్రతినిధి, కరుణాకర్‌రెడ్డిది ఒకే ఊరు. ప్రజా ప్రతినిధి వద్ద ప్రధాన అనుచరుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి.. విభేదాల కారణంగా అతడికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరిగి కేసులు కూడా నమోదయ్యాయి.  సదరు ప్రజాప్రతినిధి అనుచరులు, సొంత తమ్ముళ్లే.. కరుణాకర్ రెడ్డిని అపహరించి దారుణంగా హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బంధువులు పేర్కొన్నారు. కిడ్నాప్‌ జరిగినప్పటి నుంచి ప్రజాప్రతినిధి, అతడి అనుచరుల ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Saturday, April 15, 2023

స్పందించిన.... మంత్రి హరీష్ రావ్....!

నిజామాబాద్ ఆసుపత్రి ఘటనపై స్పందించిన.... మంత్రి హరీష్ రావ్....!

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియోపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు.తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు. వీలైనంత త్వరగా నిజానిజాలు తేల్చి నివేదిక అందజేయాలని అన్నారు.

ఓ రోగిని ఇద్దరు సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రోగి రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

దీనిపై నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ వివరణ ఇచ్చారు. వీల్‌ఛైర్‌ తీసుకొచ్చేలోపు లిఫ్ట్‌ రావడంతో రోగి తల్లిదండ్రులు అతని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. ఇది చూసి సిబ్బంది వారించి.. వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారని స్పష్టం చేశారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

బలగం - ఒక పరిశీలన

* బలగం - ఒక పరిశీలన *.

ఈ మధ్య విడుదలైన చిత్రాలలో 'బలగం' చిత్రానికి విశేష మైన ప్రజాదరణ లభిస్తూ ఉన్నది. చాలా తెలంగాణ గ్రామాలలో గ్రామ సర్పంచ్ లే ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ప్రజల్లో ఒక రకమైన సానుకూల అభిప్రాయం ఈ చిత్రం పట్ల వ్యక్తమౌతున్నది. దీనికి కారణం సడలిన మానవ సంబంధాలకు తిరిగి జావం పోసే ప్రయత్నం చేయటమే. మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు  క్రమంగా తగ్గిపోవటం, వ్యక్తిగత అహం కారణంగా మానవ సంబంధాలు క్షీణించటాన్ని  నిజాయితీగా చిత్రించటం, పాత్రలన్నీ మన రోజువారీ జీవితంలో ఎదురయ్యేవిగా ఉండటం, ఈ చిత్ర విజయానికి కారణాలుగా  చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రం గురించి ఇంతలా చర్చించు కోవటానికి కారణం, వివిధ కారణాల వల్ల దూరమైన మనషులు ఎంత ప్రేమని కోల్పోతారో, వారి మనసులు ఎంతలా వేదన చెందుతాయో, వారంతా ఒక్కటైనప్పుడు దొరికిన ఊరట మనసుల్ని ఎంత శాంత పరుస్తుందో అన్న 'take home' అంశం . ' నిజానికి ఈ చిత్రంతో ప్రజలు Connect ' కావటానికి ఇదొక కీలకమైన అంశం. ఈ చిత్రాన్ని ప్రజలు, ఆదరిస్తున్నారంటే, వారి, మనసుల్లో సైతం దూరమౌతున్న బందాలను దగ్గర చేసుకోవాలని, శిధిలమౌతున్న మానవ సంబంధాలను పునరుజ్జీవింపచేసుకోవాలన్న ఆకాంక్ష
దాగి ఉండటమే.  
మరి ఈ చిత్రం ప్రజల ఆకాంక్షను నిజాయితీగా నెరవేర్చే ప్రత్యామ్నాయాల్ని, పరిష్కారాల్ని చూపిందా? కొమురయ్య అనే సాదా సీదా మధ్యతరగతి
వృద్ధుడి మరణంతో చిత్రం ప్రారంభం అవుతుంది. అప్పట్లో అతని కూతురు 'అల్లుడి పట్టింపు కారణంగా ఇరవై యేళ్లు పుట్టింటికి దూరం అవుతుంది. ఎట్టకేలకు తండ్రి మరణం ఆమెను పుట్టింటికి
రప్పిస్తుంది. మాట పట్టింపుల కారణంగా అల్లుడికి, కొమురయ్య కొడుకులకి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఘర్షణ ముదరటానికి మూడోదినం నాడు కొమురయ్యకు పెట్టిన పిండాన్ని "పిట్ట మట్టక పోవటం"  ఒక కారణమౌతుంది. దీన్ని కారణంగా చూపి అల్లుడు, కొమురయ్య పెద్ద కొడుకును 
నిందించటం, "ఐదొద్దుల" నాడు అల్లుడు పెట్టిన పిండాన్ని కూడా పిట్ట ముట్టక పోవటం
వారి
మధ్య ఘర్షణ    కొనసాగటానికి కారణం అవుతుంది. చివరికి కొమురయ్య మనవడికి అప్పటికే ఒప్పందం చేసుకున్న పెళ్లి సంబంధాన్ని
పరిగణించకుండా కొమరయ్య మనవరాలి(కూతురి కూతురు) తో పెళ్ళి ఖాయం చేసుకోవటంతో ఆ రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. దాంతో 'పదొద్దుల' నాడు 'పిట్ట ముట్టటం' తో చిత్రం పరిసమాప్త మౌతుంది.

ఈ చిత్రీకరణలో భావోద్వేగాల్ని స్పందింప చేసే రెండు మూడు సన్నివేశాలు ప్రజల హృదయాల్ని ద్రవింప చేసేలా ఉండటం, సినిమాతో వారు connect కావటానికి కారణం.

అయితే దర్శకుడు వేణు కథాగమనంలో చూపిన అనేక సన్నివేశాలు గ్రామీణ జీవితాన్ని యదాతథ స్థితిలో కొనసాగటానికి దోహదపడేలా ఉన్నాయే తప్ప మార్పుకు దోహదకారి గా లేవు. చనిపోయిన కొమరయ్య కాకి లో ఉన్నాడన్న
అశాస్త్రీయ అంశాన్ని, సంప్రదాయం పేరుతో అతిగా సాగదీయటం, ఒక అసంబద్ధ అంశం. అంతకన్నా ఘోరమైన మరో విషయం ఏమిటంటే 'దాని అసంతృప్తి' కారణంగానే ఊళ్ళో ఇద్దరు, ముగ్గురికి అనారోగ్యంగా ఉందని చూపటం, ఇదే కారణంతో ఊరి పెద్ద మనుషులు సైతం పదొద్దుల నాడు పిండాన్ని పిట్ట ముట్టకపోతే కొమురయ్య కుటుంబాన్ని వెలివేస్తా మనటం, వంటి అంశాలు మధ్యయుగాల సంప్రదాయాన్ని తలపించాయి. కొమురయ్యది సాదా సీదా బి సి  (కొమురయ్య దశదిన కర్మ కార్డు మీద పేర్లను బట్టి పద్మశాలి) వర్గానికి చెందిన కుటుంబంగా కనిపిస్తుంది.ఒకవేళ ఆ ఊళ్ళో ఒక ధనిక, అగ్రకుల కుటుంబంలోనే ఇలాంటి ఘర్షణ జరిగి ఉంటే, అక్కడ సైతం 'కాకి ముట్టక' పోయి ఉంటే, అదే గ్రామపెద్దలు
ఆ కుటుంబాన్ని వెలివేస్తా మని చెప్పి ఉండేవారా? అన్న సందేహం రాక మానదు.  ఇక పోతే  నిజంగానే కాకి చనిపోయిన వారి
ఆత్మ అని, వారితో మాట్లాడగలదన్న మూఢ విశ్వాసాన్ని వారంతా గాఢంగా నమ్మటం ఒక ఎత్తయితే, దానికి శాస్త్రాల ఆధారాన్ని ఓ బాపనయ్య తో చెప్పించటం  మరో విషాదం. వాస్త వాన్ని వాస్తవంగా చూపటం
ఎంత అవసరమైనా, సమాజ ప్రయాణం ఎటువైపు సాగాలో చూపాలని ఆశించటం అత్యాశ కాదు కదా? పిట్ట ముట్టటాన్ని సాగదీసిన దర్శకుడు
దానితో సమానంగా వల్లు పట్టటాన్ని కూడా చూపించి మరో మూఢ నమ్మకానికి సైతం దోహద పడ్డాడు. అశాస్త్రీయ, అహేతుక భావాలకు అతి ప్రాధాన్యతను ఇవ్వటం అటుంచినా,
సంప్రదాయికంగా కొనసాగుతున్న కుటుంబ సంబంధాలను కూడా ఎంతమాత్రం ప్రశ్నించకుండా కొనసాగించాడు  బలగం దర్శకుడు.

గ్రామీణ నేపథ్యంలో సాధారణంగా అల్లుడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న కారణంగా కినుక వహించిన అల్లుడు, కొమరయ్య కూతురు ను
తీసుకొని పోతాడు. అట్లా వెళ్ళిన కూతురు ఇరవై ఏళ్ల పాటు పుట్టింటికి రాదు. ' హూ నడువ్ ' అని భర్త హూంకరించినప్పు 
డల్లా కంట నీరుపెట్టు కుని, తలవంచుకుని భర్తవెంట వెళ్ళిపోవడమే తప్ప స్వతంత్రించి ఒక్కమాట మాట్లాడదు. భర్తకు కోపం వస్తే అతని మాట జవదాటకుండా  ముసలుకుంటుంది కొమురయ్య కూతురు. స్త్రీ పాత్రను ఇంత పేలవంగా ఈ 21 వ శతాబ్దంలో చూపటం ద్వారా చిత్రం సాధించదల్చుకున్నది ఏమిటో?
ఇకపోతే  ఇరవై ఏళ్ల పాటు దూరమైన మేనత్త  ఇంటిని చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనౌతుంది కథానాయక పాత్ర అయిన 'సాయిలు' పాత్ర. అయితే చిత్ర ప్రారంభంలోనే సాయిలుకు పెళ్ళి
కుదిరి ఉంటుంది. కొమురయ్య చనిపోయినప్పుడు ఆకుటుంబం కూడా వస్తుంది. కాని తన మేనత్త ఆస్తి పాస్తులకు ఆశపడి, అంతకు ముందే తనకు జరిగిన పెళ్ళి ఒప్పందాన్ని గూర్చిన ప్రస్తావనను ఎంతమాత్రం తేకుండానే మేనత్త కూతుర్ని  చేసుకోవాలన్న ఆశతో తన చిన్నతాత తో ఆ ప్రతిపాదన చేయిస్తాడు. ఆమోదం పొందుతాడు.
మరి తను గతంలో పెళ్ళి కుదిరిన అమ్మాయితో చేసిన ఫోను సంభాషణలన్ని, ఆత అమ్మాయికి తాను ఇచ్చిన ప్రాధాన్యాన్ని చప్పున మర్చి పోగలుగుతాడు. మరి ఆ అమ్మాయి, సాయిలు మార్చుకున్న అభిప్రాయం విషయంలో ఏమనుకుటుందో నన్న చర్చే లేదు చిత్రంలో. ఇది యువకుడు అయిన సాయిలు కు ఉన్న ఆశ అయితే ఫరవాలేదు గాని, ఇంట్లోని పెద్దవాళ్ళు సైతం ఆవిషయాన్ని ప్రసావనకు తేరు. 

స్త్రీ పాత్రలకు చిత్రంలో ఇచ్చిన " సముచిత " స్థానం ఇది. 
ఇన్ని వైరుద్ధ్యాలను పరిష్కరించకుండా, అసంబద్ధ విషయాల్ని ఏమార్చి చివరికి కుటుంబ సభ్యులందరిని ఏకం చేస్తాడు దర్శకుడు. మనుషులు అంతా ఏకం కావటానికి , మానవ సంబంధాల్ని బలోపేతం చేయటానికి ఏ ప్రయత్నమైనా చేయవచ్చు గానీ 
అది సమాజాన్ని వెనక్కి నడిపించ వద్దు కదా? మార్పును కోరుకోవటం అంటే ముందుకు సాగటమే గాని వెనక్కి కాదుకదా?
అయినా మనుషుల మధ్య మానవీయ విలువలు పతనం కావటానికి కేవలం వ్యక్తిగత అహంభావాలే కారణం అన్నట్లుగా, రాజకీయార్థిక కారణాలేవీ
లేవన్నట్లుగా చిత్ర కథనం కొనసాగుతుంది? నిరుద్యోగి అయిన కథానాయకుడు, తను నిలదొక్కుకోవటం కోసం చేసిన అప్పు, చెల్లించలేని వడ్డీ, అసలు సమస్యలు కాకుండా దర్శకుడు జాగ్రత్త పడతాడు. సరే
దర్శకుని ఉద్దేశ్యం ఆ విషయాన్ని చూపటం కాదనుకున్నా , పెళ్ళి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులతో 
అప్పు తీర్చవచ్చు నన్న ఆలోచనను కూడా సహజంగానే చూపుతాడు దర్శకుడు.

కళ్ళకు పచ్చిగా కనిపించే వైరుధ్యాలను ఎంతమాత్రం ముఖ్యమైనవి కావన్నట్లు, పనికి మాలిన అంశాల్ని, మూఢనమ్మకాల్ని అతిగా చూపి, మనుషుల్ని, కుటుంబాన్ని కలపటానికి మధ్యయుగాల సంప్రదాయాల్ని మూఢనమ్మకాలని ఆధారం చేసుకోవటం ద్వారా ఈ చిత్రం మనల్ని హతాశల్ని చేస్తుంది. నిజానికి ఇలాంటి 
అసందర్భ సన్నివేశాలతో, అశాస్త్రీయ విషయాలను ప్రోత్సహించే అనేక రకాలైన చిత్రాలు గతంలో వచ్చి ఉన్నాయి.  వాటన్నింటి గురించి మాట్లాడుకోకుండా  కేవలం ఈ బలగం చిత్రం గురించి చర్చించుకోవడానికి గల కారణం ఈ చిత్రం పట్ల ప్రజలకు ఉన్న సానుకూల అభిప్రాయమే. నిజానికి ఈ చిత్రం నుంచి నేర్చుకోదగ్గది ఏదో ఉందన్న ప్రజాభిప్రాయం దీనికి ఇంత ఆదరణ లభించడానికి కారణం అవుతూ ఉన్నది. అయితే ఈ చిత్రం చూపిన విషయాలలో ఎన్నో అశాస్త్రీయ విషయాలు ఉన్నప్పటికీ ముగింపు ప్రజలకు ఎంతో ఊరట కలిగిస్తూ ఉన్నది. దీని నుంచి ఏదో ఒక టేక్ హోమ్ అంశం ఉన్నదన్న భావన తోటే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. కేవలం ఆ కారణం వల్లనే ఈ చిత్రాన్ని సమీక్షించు కోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది.లక్ష్యం మంచిదైతే సరిపోదు కదా మార్గం కూడా మంచిది కావాలి. అయినా విడిపోయిన మనుషులు, ఎడబాటుకు గురియైన మనసులు  కలిసి పోతే లభించే  'మాధుర్యం' మాత్రం ప్రజల్ని మత్తు గొలుపుతుంది. ఏదిఏమైనా 
శాస్త్రీయ విలువలు, సమానత్వ భావనలపై నిర్మించబడే ఐక్యతే కలకాలం నిలబడుతుంది"

Courtesy by : టి .హరికృష్ణ
మానవ హక్కుల వేదిక

Friday, April 14, 2023

జులై 1 నుంచి... అమర్ నాథ్ యాత్ర

జులై 1 నుంచి... అమర్ నాథ్ యాత్ర*

జమ్మూ: దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు  వెల్లడించారు.ఏప్రిల్‌ 17 నుంచి యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మనోజ్‌ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీ అమరనాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేశంలో యాత్ర షెడ్యూలును నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎల్జీ షెడ్యూలును ప్రకటిస్తూ.. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, యాత్ర సాఫీగా సాగేలా చూస్తామన్నారు.

యాత్రికులకు వైద్యసేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇటు అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం ట్రాక్‌ నుంచి, అటు గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ నుంచి యాత్ర సమాంతరంగా మొదలవుతుందన్నారు. భక్తుల కోసం ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలను యాప్‌లో చూడవచ్చు.

*సుజీవన్ వావిలాల*🖋️

Thursday, April 13, 2023

హైదరాబాద్ కు చేరుకున్నా అంబేద్కర్ మనవడు

*హైదరాబాద్ కు చేరుకున్నా అంబేద్కర్ మనవడు, మాజీ ఎంపి ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్*

తెలంగాణ సచివాలయం సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జరగనుండగా ఈ కార్యక్రమనికి  ముఖ్యఅతిథిగా అంబేద్కర్ మనవడు,మాజీ ఎంపి ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొననున్నారు.ఈ రోజు
6 ఈ 2486 విమానంలో ముంబయి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్  చేరుకున్న ప్రకాష్ అంబేద్కర్ కు శంషాబాద్ ఎయిర్పోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ పూల బొకే శాలువాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రకాష్ అంబేద్కర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.

 Courtesy by : link Media 

రాహుల్ గాంధీపై మరో పరువునష్టం... కేసు!

*రాహుల్ గాంధీపై మరో పరువునష్టం... కేసు!*

ముంబయి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తాజాగా మరో పరువు నష్టం కేసు నమోదవ్వటం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఆయన లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వీర్‌ సావర్కర్‌ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి

ఈ వ్యాఖ్యలకు స్పందించిన సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌  బుధవారం పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత నిరాధారంగా తన తాత సావర్కర్‌పై ఆరోపణలు చేశారని సత్యకి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప వ్యక్తిపై రాహుల్‌ తప్పుడు ఆరోపణలు చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నిజమని కోర్టులో నిరూపించాలని సవాల్‌ విసిరారు. 'మోదీ' ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌ అగ్రనేతపై ఇప్పటికే పరువు నష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. సూరత్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించటంతో.. ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. ఇదే విషయంలో ఇటీవల పట్నాలోనూ ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పట్నా కోర్టు రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, April 11, 2023

తలవంచడం కాదు.... జనమే సర్కార్ మెడలు వంచుతారు.... జూపల్లి....!

*తలవంచడం కాదు.... జనమే సర్కార్ మెడలు వంచుతారు.... జూపల్లి....!*

మహబూబ్‌నగర్‌: తనకు కూడా భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని.. తప్పు చేసినప్పుడు స్వపక్షమైనా ప్రశ్నించే బాధ్యత ఉంటుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. మూడేళ్ల నుంచి తనకు పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వలేదని.. పార్టీ బాధ్యతలే ఇవ్వకుండా సస్పెండ్‌ చేశామని ఎలా అంటారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడారు.

''తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతను నేను. తెలంగాణ వద్దన్న నేత వద్దకు వెళ్లి సభ్యత్వం తీసుకోవాలా? ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించాను. నా సహకారం వల్లే రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయి. కేసులతో నా అనుచరులను ఇబ్బంది పెట్టారు. మంత్రి కేటీఆర్‌ సహా అందరికీ సమస్యలు వివరించాను. నాపై ఎన్ని దాడులు జరిగినా ఏ ఒక్కరిపైనా కేసులు పెట్టలేదు. ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా కేసులు పెడుతున్నారు. తలవంచడం కాదు.. జనమే సర్కారు మెడలు వంచుతారు'' అని జూపల్లి వ్యాఖ్యానించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత....!

**బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత....!*

ఇటీవల విడుదలైన బలగం చిత్రంలో ఫేమస్‌ అయిన మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య వరంగల్ జ్లిలా వాసి.ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. కాగా.. తన భర్తకు వైద్య సాయం అందించి.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇటీవల విడుదలైన బలగం మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. మొగిలయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️


సీఎం కేసీఆర్ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిండు

కేసీఆర్ ఊరూరా దొంగలను తయారు చేస్తుండు: ఆకునూరి మురళి
బీఆర్ఎస్ నేతలు గాదరి కిషోర్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లు ఉద్యమకారులు కాదని..ఉద్యమ ద్రోహులు, దోపిడీ దొంగలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ఇతర దేశాలకు పంపి అక్కడ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో ఊరూరా దొంగలను తయారు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను.. విద్యావంతులు, స్టూడెంట్స్ ఊరూరా తిరుగుతూ ప్రజలకు తెలియజేయాలని కోరారు ఆకునూరి మురళి.

రాష్ట్ర అభివృద్ధికి రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నారు. కానీ తొమ్మిది సంవత్సరాలలో విద్యారంగానికి సీఎం కేసీఆర్ ఖర్చు చేసింది నామమాత్రమే అన్నారు ఆకునూరి మురళి. సీఎం కేసీఆర్ విద్యను కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నారు వ్యాఖ్యానించారు. పేదలకు ప్రభుత్వ విద్య అందకుండా సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంపద అంతా కొంత మంది చేతిలో బందీగా ఉందని దుయ్యబట్టారు.

తెలంగాణ పేద రాష్ట్రం కాదు..పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఫైర్ అయ్యారు అకునూరి మురళి. రాష్ట్ర సంపదను ప్రజలకు అందకుండా చేస్తున్నారు..నిరుద్యోగులు ఎన్ని కష్టాలు వచ్చినా చదవటం వదిలిపెట్టవద్దు. ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రభుత్వం బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తోందని ఆకునూరి మురళి అన్నారు.

 Courtesy by : SDF 

Monday, April 10, 2023

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..!!

*జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.... ఓ రాజకీయ పార్టీకీ ఎలాంటి అర్హతలు ఉండాలి...?*

న్యూఢిల్లీ: సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగిఉండాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి. వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.

*ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు*
ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ,ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజ యం సాధించింది.

1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది.

జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది.

శరద్‌పవార్‌ 1999 లో కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

పోలీసులకు జీతాలు పడలేదు!

https://twitter.com/RSPraveenSwaero/status/1645320162298544128?t=XOehuQpURJtKUVZp21W7dQ&s=08                                           
*చాలా జిల్లాల్లో నేటికీ(April 10) పోలీసులకు జీతాలు పడలేదు! ఇప్పటికీ చాలా నెలల నుండి సరెండర్ లీవులు, టీఏలు రావడం లేదు.భద్రత లోన్లు నిరాకరిస్తున్నరు. పెంచిన డీఏ అరియర్స్ రావడం లేదు!*
*పోలీసులు మాత్రం మీమీద ఈగ వాలకుండ చూడాలె. మీరు మాత్రం నెలకు మొదటి తారీఖునే జీతాలెత్తండ్రి.* *#StepDown*                                                                      https://prajasankalpam1.blogspot.com/

BRS నుండి మాజీ MP మాజీ మంత్రి... సస్పెండ్....!

*BRS నుండి మాజీ MP మాజీ మంత్రి... సస్పెండ్....!*

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. నిన్న కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంతో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, కుటుంబ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మూడో సారి సీఎం కావాలనుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడే కేసీఆర్ గాడి తప్పారని అన్నారు. కేసీఆర్ శకం ముగియబోతోందని చెప్పారు. జూపల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ పేరుతో దేశానికి చెత్త పాలన ఇస్తారా?

అని ప్రశ్నించారు. సాగునీటి టెండర్లలో మాయాజాలం ప్రదర్శిస్తూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. వీరి వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరిపై వేటు వేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, April 9, 2023

పత్రిక ప్రకటన

*పత్రిక ప్రకటన*                                                                                                                                   *మీడియా మిత్రులు అందరికీ నమస్కారం.*
డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గారికి అక్రమ మైనింగ్ కి సంబంధించి నేను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణజరుపుటకు
రేపు ఉదయం  అనగా *11-04-2023,* 10:30 నిమిషాలకు అసిస్టెంట్ మైన్స్ ఆఫీసర్ తో పాటు సంగారెడ్డి జిల్లా ADM&G మరియు సర్వేయర్ తోపాటు లగ్డారం గ్రామానికి  విచ్చేయనున్నారు, కావున మీడియా మిత్రులందరూ లగ్డారం గ్రామానికి 10:30 కల్లా రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

*వి రవికృష్ణ*
న్యాయవాది
సామాజిక కార్యకర్త
అమీన్పూర్.
9618531012 

తెలంగాణ గడ్డపై భాజాపా ను అడుగు పెట్టినివ్వం... సిపిఐ -సీపీఎం....!

*తెలంగాణ గడ్డపై భాజాపా ను అడుగు పెట్టినివ్వం... సిపిఐ -సీపీఎం....!*

హైదరాబాద్‌: భాజపా నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు చేస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాష్ట్రంలో భారాసతో కలిసి సాగుతామని, తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వమని కమ్యూనిస్టులు నినదించారు. ప్రజా సమస్యలపై విడివిడిగా పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి సహా ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మొట్టమొదటి సారిగా సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సంయుక్తంగా సమావేశం నిర్వహించడం విశేషం.

రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల సీతారాం ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు భాజపాయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఏచూరి ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని కాపాడుకోవాలంటే మోదీ సర్కారును గద్దె దించాలన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మారాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేర్వేరుగా ఉంటాయన్న డి.రాజా.. ఆ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సహా తమిళనాడు, కేరళలో గవర్నర్‌ను ఒక సాధనంగా కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. గతేడాది విజయవాడలో ఉద్యమ పునరేకీకరణ జరగాలని ప్రతిపాదించగా ఇప్పటికి అది సాధ్యమవుతోందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, April 8, 2023

వందేభారత్ రైలును ప్రారంభించిన.... ప్రధాని మోదీ...!

*సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన.... ప్రధాని మోదీ...!*

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై జెండా ఊపి ప్రారంభించారు.ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఉన్నారు.

ఈ రైలులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.. నేరుగా వందేభారత్‌ రైలు ఎక్కారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం చేర్యాల పెయింటింగ్‌ను రైల్వే శాఖ మంత్రి ప్రధానికి అందించారు.

అంతకుముందు ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమర్‌ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి ఎస్పీజీ దళాల ప్రత్యేక కాన్యాయ్‌ పర్యవేక్షణలో మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది.ఈ రైలులో టికెట్ల ధరలను పరిశీలిస్తే..

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..

ఛైర్‌ కార్‌

• సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470

• సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865

• సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075

• సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270

• సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు

• సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900

• సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620

• సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045

• సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455,

• సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080... ఈ ఛార్జీలకు టికెట్‌ బుకింగ్‌ కన్వీనియెన్స్‌ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, April 7, 2023

సినీ దర్శకులను వెనక్కి నెట్టిన.... బలగం వేణు....!

*యూకే యూఎస్ లను       సినీ దర్శకులను వెనక్కి నెట్టిన.... బలగం వేణు....!*

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక సినిమా విజయం సాధించాలంటే మంచి కంటెంట్‌ ఉంటే చాలని.. కథలో సరైన భావోద్వేగాలు పండిస్తే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించిన చిత్రం 'బలగం' చిన్న ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమాకి అంతటా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ దీని హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ - ఆమ్‌స్టర్‌డామ్‌ కార్యక్రమంలో మరో అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని అందుకున్నారు. యూకే, యూఎస్‌, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన చిత్రాలు, దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక, 'బలగం' ఇప్పటికే 'వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌', 'ఒనికో ఫిల్మ్‌ అవార్డు' వంటి పలు విదేశీ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన అవార్డుతో 'బలగం' ఖాతాలో ఏకంగా తొమ్మిది అవార్డులు చేరాయని దర్శకుడు వేణు పేర్కొన్నారు. ఈ సక్సెస్‌ను తనకు అందించిన సినీ ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి - సంప్రదాయాల నేపథ్యంలో 'బలగం' రూపుదిద్దుకుంది. కుటుంబ పెద్ద చనిపోయాక ఏర్పడిన పరిస్థితుల చుట్టూ ఈ కథను నడిపించారు. రక్త సంబంధాలు, బంధుత్వ విలువలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై దిల్‌రాజు కుమార్తె, అల్లుడు హన్షీత, హర్షిత్‌ దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️