Wednesday, November 30, 2022

దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం

*దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం*

*రామంతపూర్ లో దేవాదాయ శాఖ భూములు పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్*
రామంతపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములను స్థానిక కార్పొరేటర్ *శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్ రావు గారి* ఆధ్వర్యంలో బుధవారం దేవాదాయ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తాసిల్దార్ సునీత అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ మల్లికార్జున స్వామి దేవాలయం కార్యనిర్వాహన అధికారి నరేందర్ శ్రీనివాస్ రావు తదితరులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉన్న దేవదాయ శాఖ భూములను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మాట్లాడుతూ రామంతపూర్ లోని దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు దేవాదాయ శాఖ భూములను సర్వే చేయించి పూర్తిస్థాయిలో హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మల్లికార్జున స్వామి దేవాలయం పక్కనే ఉన్న గ్రామ కంఠం స్థలాన్ని పార్కింగ్ కోసం ఉపయోగిస్తామని ఆమె తెలిపారు. ఇందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థల యజమానులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రామంతపూర్ శ్రీరామ కాలనీలోని సర్వేనెంబర్ 91/1, 91/2 లోని 33 గుంటల స్థలంలో కళ్యాణ మండపం నిర్మిస్తామని ఇందులో ఆరు గుంటల స్థలంలో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు అదేవిధంగా భగయాత్ లోని సర్వే నెంబరు 1 లోని ఒక ఎకరా 12 గుంటల స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని, గడ్డి భూములను వేలం వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన పలు విషయాలను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు .

ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, సంకూరి కుమారస్వామి, వంగాల సంతోష్ గుప్తా, పరి శ్రీనివాస్, శైలేందర్ , మామిండ్ల సుధాకర్ యాదవ్ ,పలువురు కాలనీవాసులు స్థానిక నేతలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Courtesy by : బీజేపీ పార్టీ రామంతాపూర్ డివిజన్ అధ్యక్షులు 

Tuesday, November 29, 2022

లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ!!

కామ్రేడ్ అమ్మ వస్తోంది..!*
*_కన్నీళ్లు తుడవరా.!_*
_◆ ఎదురుచూపులే జీవితం_
◆_ కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_
_◆ పోరుబాటలో కొడుకులు_
_◆ పూరి గుడెసెలో జీవనం_
_◆ అన్నీ 'చావు' దెబ్బలే.!_
_◆ లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_తెలంగాణలో తల్లుల దర్పణ ముఖచిత్రం అదృశ్యమైయింది. ఓ తెలంగాణ తల్లి కానరాని లోకాలకు తరలిపోయింది. భర్త పోరాటానికి సన్మానం. కొడుకుల పోరాటానికి 'ఎన్ కౌంటర్స్' బహుమానం. ఎవరీ పెద్దపల్లి పెద్దవ్వ.. మల్లోజుల మధురవ్వ.. వాళ్లింటి పేరు పోరాటం..!_*

*_ఎవరీమె.._*
మధురమ్మ చనిపోయిందట.. ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే.! అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం. నక్సలైట్ల ఉద్యమంలో 'తెగిన పేగులు బోలెడు.. పుస్తె పోగులు బోలెడు..' కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి 'వచ్చిపోతే' బాగుండననే ఎదురుచూపులు..! ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు.! ఎందుకంటే తెలంగాణలో ప్రతి అమ్మది కనిపించని పోరాటమే.! కానీ మధురమ్మది కాస్త భిన్నమైన విచిత్ర అనుభవం.!

*_ఎదురుచూపులే జీవితం_*
నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే..! ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే 'ఏడుపులు..' ఇక 'ఎవరూ రారు' అని మళ్లీ మనసు నిమ్మలం చేసుకుని ముసుగు తన్ని పడుకోవడం.! ఈమె ఎవరంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతిల తల్లి. ఆమె మంగళవారం కన్నుమూసింది. ఇదీ వార్త. ఆమె గురించి తెలిసినవాళ్లకు ఓ విషాదం.!

*_భర్త వెంకటయ్య పోరాటం_*
అప్పట్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం. భర్త వెంకటయ్య రజాకార్లతో పోరాడుతున్న సందర్భంలో భర్త కోసం రజాకార్లు వచ్చి వేధించేవాళ్లు. ఓరకమైన నిర్బంధం, ఆమె మీద నిఘా.! రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన రెండురకాల పోరాటాల్లో ఆమె వేదన ఉంది. ఆవేదన ఉంది. భిన్నమైన అనుభవముంది. ఆమె పడిన కష్టముంది… అవమానాలున్నయ్.!

*_కాళ్ళు మొక్కిన కలెక్టరమ్మ_*
ఆనాడు అవస్థలపాలైనా స్వాతంత్య్ర సమరయోధుడి భార్యగా ప్రభుత్వం నుంచి సన్మానం అందుకుంది.! ప్రతి గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాన గౌరవాన్ని పొందుతూనే ఉంది. ఆమధ్య నాలుగేళ్ల క్రితం కావచ్చు పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు 'పాదాభివందనం' కూడా చేసింది. ఇంతా చేస్తే ఆమె భర్త రాజ్యానికి, అనగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవాడే.

*_పోరుబాటలో కొడుకులు_*
కట్ చేస్తే... తొలి ముగ్గురు తనకు దక్కకుండా కన్నుమూశారు. ఆ తరువాత పుట్టిన కొడుకులు అడవి బాట పట్టారు. నక్సలైట్లయ్యారు.! ఉద్యమానికి నేతలయ్యారు.! కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు. వాళ్లు కూడా రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్లే.! తండ్రి నెత్తురే.! వాళ్ల ఆచూకీ కోసం మధురమ్మను పోలీసులు అనేకసార్లు వేధించారు.! సేమ్, అప్పట్లో రజాకార్లు వేధించినట్టుగానే.! ఆమె జీవితంలో వ్యక్తులు మారారు..కాని సమస్యలు మాత్రం మారలేదనేది నడుస్తున్న చరిత్రకు నిదర్శనం.

*_పూరి గుడిసెలో.._*
ఆ ఇద్దరి ఆచూకీ కోసం తల్లి, తండ్రి, సోదరుడైనా ఆంజనేయ శర్మకు వేధింపులు తప్పలేదు. వాళ్ల సోదరుడు అక్కడే పౌరోహిత్యం చేసుకుంటాడు. 1987లో డీఎస్పీ బుచ్చిరెడ్డి హత్య జరిగింది. ప్రతీకారంగా పోలీసులు వందల ఇళ్లను కూల్చేశారు. అందులో మధురమ్మ ఇల్లు కూడా కూలిపోయింది. దాంతో నాలుగైదేళ్లు ఓ పూరి గుడిసే దిక్కయింది ఆమెకు.!

*_అన్నీ 'చావు' దెబ్బలే.!_*
అగ్రస్థానాల్లో ఉన్న నక్సలైట్లు ఎవరినైనా చూడటానికి రావాలంటే ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. కానీ పెద్ద కొడుకు కోటేశ్వరరావు 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆమె కుంగిపోయింది. చిన్న కొడుకైనా బాగుంటే చాలు అనుకుంది. సహజం కదా..! అదే తెలంగాణ తల్లుల అనుభవం కదా.!

*_లక్ష మెదళ్ళను కదిలించిన లేఖ_*
ఆ సోదరులు ఓసారి అమ్మకు బహిరంగ లేఖ రాశారు. *_''అమ్మా, మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు.. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేం ఈ విప్లవబాట ఎంచుకున్నాం, తిరుగుబాటు నాన్న రక్తం నుంచే వచ్చింది..''_ ఇలా సాగిపోయింది ఆ లేఖ..! అప్పట్లో ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ లేఖ లక్షలమందిని చదివించింది.! కదిలించింది. దాదాపు నూరేళ్లు బతికిన ఆమె ఇక జీవనాన్ని చాలించింది. మంగళవారం కన్నుమూసింది.

*_చివరిగా..._*
కిషన్‌జీ, స్వర్గానికి అమ్మ వస్తోంది, ఇప్పుడైనా కళ్లారా చూసి, ఆమె కన్నీటిని తుడువు కామ్రేడ్..!

Monday, November 28, 2022

తెలుగు రాష్ట్రాల్లో రూ.1100 కోట్లు

*_గొలుసుకట్టు బద్మాష్ లు_*
_● తెలంగాణలో రూ 200 కోట్లు_
_● తెలుగు రాష్ట్రాల్లో రూ.1100 కోట్లు_
_● బొట్టుబిళ్లలు, వత్తులంటూ హైదరాబాద్ లో కుచ్చుటోపీ_
_● యంత్రాలు విక్రయించి రూ.కోట్లలో వసూలు_
_● గొలుసు కట్టు పథకాలతో దోపిడీ_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944)000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_ఇద్దరూ అనామకులే.! ప్రజల ఆశలే వారికి పెట్టుబడి. ‘కోటీశ్వరుడయ్యే అవకాశం పిలుస్తోంది రా.. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పేదవాడు ధనవంతుడు అవడం కేవలం సంకల్ప్‌ మార్ట్‌తోనే సాధ్యం’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు సంకల్ప్‌ మార్ట్‌ నిర్వాహకులు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.1,100 కోట్లు వసూలు చేశారు. ఇక హైదరాబాద్ కేంద్రంగా బొట్టుబిళ్లలు, వత్తులంటూ కుచ్చుటోపీ పెట్టాడు._*

బాక్స్1
*_‘సంకల్పసిద్ధి’కి సంకెళ్లు_*
_ఐదుగురు నిందితుల అరెస్టు_

*_ఇప్పటి వరకు 170 కోట్ల వసూలు_*
‘సంకల్పసిద్ధి’ పేరిట ఆర్థిక మోసాలకు తెరదీసిన నిర్వాహకుల చేతులకు విజయవాడ పోలీసులు సంకెళ్లు వేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన సంకల్పసిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ అధినేత గుత్తా వేణుగోపాలకృష్ణను అరెస్టు చేశారు. ఆయనతోపాటు భార్య గంజాల లక్ష్మి, వేణు చెల్లెలు మావూరి వెంకట నాగలక్ష్మి, చిన్నాన్న కుమారుడు కర్ణాటక రాష్ట్రం బళ్లారి విద్యానగర్‌కు చెందిన గుత్తా కిశోర్‌, గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన డ్రైవర్‌ సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కాంతిరాణా సోమవారం వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా వేణుగోపాలకృష్ణ కొన్నాళ్ల కిందట కర్ణాటకలోని హోస్పేటకు వలస వెళ్లారు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి, హోటల్‌లో సర్వర్‌గా, లారీ క్లీనర్‌గా, స్వీపర్‌గా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఎన్‌మార్ట్‌, ఫ్యూచర్‌మార్ట్‌ వంటి మనీ సర్క్యులేషన్‌ కంపెనీల్లో చేరారు. ఇక్కడే మల్టీలెవర్‌ మార్కెటింగ్‌ స్కీంలపై అవగాహన పెంచుకున్నాడు. తర్వాత సొంతంగా ఒక మల్టీలెవర్‌ మార్కెటింగ్‌ సంస్థను నెలకొల్పాలని భావించి, హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడ ‘ప్లాంట్‌ ఎన్రిచ్‌ ఎంటర్‌ప్రైజస్‌’ అనే మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థను నెలకొల్పారు. కొన్నాళ్ల తర్వాత విజయవాడలో సంకల్పసిద్ధి సంస్థను ఏర్పాటుచేశారు. కరోనా సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్న సందేశాన్ని ప్రచారం చేశారు. సంకల్పసిద్ధి సంస్థకు గుత్తా వేణుగోపాలకృష్ణ డైరెక్టర్‌గా, ఆయన చిన్నాన్న కుమారుడు గుత్తా కిశోర్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ్‌సలో ఎగుమతులు, దిగుమతులు నిర్వహించే కేటగిరిలో రిజిస్ర్టేషన్‌ చేయించారు.

*_మోసానికి ఐదు మెట్లు:_*
ప్రజల నుంచి డబ్బులు వసూలుకి వేణుగోపాలకృష్ణ 5 మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో పథకానికి ఒక్కో పేరుపెట్టి ప్రచారం చేశారు.

■ ‘సూపర్‌ మార్కెట్‌’ పథకంలో ఒక వ్యక్తి రూ.3 వేలు చెల్లిస్తే సంకల్పసిద్ధి మార్ట్‌ నుంచి 28 రకాల నిత్యావసర సరుకులు ఇస్తారు. రోజుకు రూ.10 చొప్పున 300 రోజులపాటు క్యాష్‌బ్యాక్‌ ఇస్తారు.

■ ‘బంగారం’ పథకంలో ఒక వ్యక్తి రూ.లక్షతో 2 సవర్ల బంగారం కొనుగోలుచేస్తే, దీనికి 30ు క్యాష్‌బ్యాక్‌ ఇస్తారు. రోజుకు రూ.100 క్యాష్‌బ్యాక్‌గా వ్యాలెట్స్‌లో జమ చేస్తారు.

■ ‘ఓపెన్‌ ప్లాట్‌’ పథకం కింద ఒక వ్యక్తి రూ.5లక్షలతో ఒక సెంటు భూమి కొనుగోలు చేస్తే దానిని రిజిస్టర్‌ చేయడంతోపాటు 300 రోజులపాటు 30ు సొమ్మును వ్యాలెట్‌లో వేస్తారు.

■ ‘ఎర్రచందనం’ పథకంలో ఒక్కొక్క మొక్కను రూ.6 వేలకు కొనుగోలు చేస్తే, 15ఏళ్ల తర్వాత ఆ మొక్కపై సభ్యుడికి రూ.5 లక్షలు చెల్లిస్తారు. + ‘నగదు’ పథకంలో సభ్యుడు కొంత మొత్తాన్ని చెల్లించి సంస్థలో చేరితే రోజుకు 1ు చొప్పున 300 రోజులపాటు చెల్లిస్తారు. ఆ సభ్యులు ఎవరినైనా చేర్పిస్తే కమీషన్‌ ఇస్తారు.

*_కొద్ది నెలల నుంచి బ్రేకులు:_*
వివిధ పథకాల ద్వారా 300 రోజులపాటు కమీషన్లు, క్యాష్‌బ్యాక్‌లు ఉంటాయని చెప్పిన వేణుగోపాలకృష్ణ మూడు నెలల నుంచి వేగం తగ్గించారు. కొంతమందికి చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయిస్తే, మరికొందరు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను ఐదు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా ఉంచారు. నిందితుల నుంచి పోలీసులు రెండు కార్లు, 10 సెల్‌ఫోన్లు, 728 గ్రాముల బంగారం, 9.5 కిలోల వెండి వస్తువులు, రూ.51.60 లక్షల నగదు, 4 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేశారు. బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింపజేశారు. వేణుగోపాలకృష్ణ ఇంట్లో దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినా, మరికొందరు పరారీలో ఉన్నారు.

*_నిందితుడి నేపథ్యమిది..._*
కర్ణాటకకు చెందిన వేణుగోపాలకృష్ణ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. విజయవాడకు వచ్చి చిన్నచిన్న పనులు చేసేవాడు. లారీ క్లీనర్‌గా పనిచేస్తూనే మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌లలో ఏజెంట్‌గా పనిచేస్తూ దానిపై అవగాహన పెంచుకున్నాడు. 2021 అక్టోబరులో విజయవాడ దుర్గాఅగ్రహారంలో ‘సంకల్ప్‌మార్ట్‌’ను ప్రారంభించాడు. 2022 మే నెలలో ‘సంకల్ప్‌ సిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ స్థాపించి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, మార్కెటింగ్‌ వ్యాపారానికి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి అనుమతి పొందారు. ఆ ముసుగులో చట్టవిరుద్ధమైన మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌ నడిపారు. సభ్యులుగా చేరిన వారు మరికొందరిని చేర్పిస్తే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని నమ్మించాడు. సూపర్‌మార్కెట్‌, బంగారం, ఓపెన్‌ ప్లాట్లు, ఎర్రచందనం మొక్కల ఆశ చూపుతూ రూ.కోట్లు సేకరించాడు. వ్యాపారం చేయకుండానే రొటేషన్‌ పద్ధతిలో పరిమితంగా తిరిగి చెల్లిస్తూ డబ్బును దారి మళ్లించాడు. చెల్లింపులు ఆలస్యం కావటంతో ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల విచారణలో పోలీసులు కొన్ని ఆస్తులను గుర్తించారు. నిందితుల పేరుపై ఉన్న బ్యాంకు ఖాతాలు, కొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వారు స్తంభింపజేశారు. నిందితులతోపాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు కీలక భాగస్వాములు ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంపైనా చర్చ సాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు.

బాక్స్ 2:

*_బొట్టుబిళ్లలు, వత్తులంటూ కుచ్చుటోపీ_*
_● యంత్రాలు విక్రయించి రూ.కోట్లలో వసూలు_

 ‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు. సరకు కిలోల లెక్కన తనకు విక్రయిస్తే లాభాలు ఇస్తానంటూ నమ్మించి నిండా ముంచాడు. రూ.కోట్లలో మోసానికి పాల్పడి బోర్డు తిప్పేసిన ఆ ఘరానా మోసం ఏఎస్‌రావు నగర్‌లో వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు కుషాయిగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

*_ఆర్మీలో పనిచేసినట్లు చెప్పి..:_*
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రావులకొల్లు రమేశ్‌ ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(గోయింగ్‌ టుగెదర్‌) పేరుతో ఏఎస్‌రావునగర్‌లో గతేడాది కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించే ఇతడు ఇంటి దగ్గరే ఉంటూ బొట్టు బిళ్లలు, వత్తుల తయారీ ద్వారా రూ.వేలల్లో సంపాదించవచ్చంటూ వీడియోలు పోస్టు చేసేవాడు. ముడి సరకు ఇస్తామని తయారు చేసిన ఉత్పత్తిని తానే కొంటామని నమ్మించాడు. రూ.30 వేల లోపు ఉండే వత్తుల తయారీ యంత్రాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షలకు, బొట్టు బిళ్లల యంత్రాన్ని రూ.2.80 లక్షలకు విక్రయించి.. మూడు సంవత్సరాలకు ఒప్పందం చేసుకునే వాడు. దూది కిలో రూ.250 చొప్పున అమ్మి.. వత్తుల్ని రూ.550కి కొనేవాడు, బొట్టుబిళ్లల సరకును రూ.2 వేలకు ఇచ్చి.. రూ.2,600 కొంటానని ఒప్పందంలో పేర్కొనేవాడు.

*_మొత్తం 1400 మంది_*
ఏడాది కాలంలో రమేశ్‌ 842 మందికి వత్తుల తయారీ, 600 మందికి బొట్టు బిళ్లల యంత్రాలు అమ్మాడు. కొన్నవారిలో నాలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కొత్తవారిని చేరిస్తే కమీషన్లు ఇచ్చాడు. తొలి రెండు నెలలు ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించిన రమేశ్‌.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా ఉత్పత్తులను తీసుకోవడం నిలిపేయడం, చెల్లింపులు ఆపడంతో కొందరు నిలదీశారు. డబ్బు తర్వాత ఇస్తామంటూ కార్యాలయంలో పనిచేసే సుధాకర్‌, రామారావు సర్దిచెప్పేవారు. అనుమానం వచ్చిన బాధితులు ఆదివారం కార్యాలయానికి వెళ్లగా రమేశ్‌ కనిపించలేదు. దీంతో  ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌ ఒకరు తన ఆటోపై లోన్‌ తీసుకుని డబ్బు కట్టారు. కొందరు మహిళలు డ్వాక్రా రుణాలను ఇందుకు ఖర్చు చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు..... బండి సంజయ్ పేరు చెప్పాలని వేదిస్తున్నారు....!

*ఎమ్మెల్యేలకు ఎర కేసు..... బండి సంజయ్ పేరు చెప్పాలని వేదిస్తున్నారు....!*

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌ ఆరోపించారు.సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్‌ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు.సిట్‌ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్‌ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీస్‌ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్‌తోపాటు ఇద్దరు సిట్‌ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్‌ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్‌ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్‌లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు.వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్‌ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, November 27, 2022

తెలంగాణలో తొమ్మిది మంది అధికారులు విలవిల.!

*_వలపువలలో ఐఏఎస్_*
_★ 10 లక్షలు వదిలించుకున్న వైనం_
_★ అదే బాటలో విదేశాంగ మంత్రిత్వ శాఖ డ్రైవర్‌..!_
_★ తెలంగాణలో తొమ్మిది మంది అధికారులు విలవిల.!_
_★ మహిళా జర్నలిస్ట్ ముసుగులో మున్సిపల్ కమిషనర్ కు 'స్కెచ్'_
_★ అదే యువతి ఓ సిఐతో అసభ్య సంభాషణలు.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)

*_ఓ మహిళా ఉద్యోగి విసిరిన వలపు వలలో చిక్కుకొని, ఆమె ఫోన్ రికార్డుల్లో ఇరుక్కొని విలవిలలాడిన ఒక ఐ.ఏ.ఎస్ అధికారి నిర్వాకం బయటపడింది. కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద ఓ డ్రైవర్ కూడా'హనీ' ట్రాప్ లో చిక్కుకొని కటకటాల్లోకి వెళ్ళాడు. ఇదిలా ఉండగా ఓ మహిళా జర్నలిస్ట్ ముసుగులో ఓ సిఐకి, ఓ మున్సిపల్ కమీషనర్ కు ఓ 'కి‌లేడి' ఉచ్చు బిగించబోయింది. ఇద్దరూ తృటిలో తప్పించుకున్నారు. 'హనీట్రాప్' పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై 'తెలంగాణ వాచ్' స్పెషల్ ఫోకస్._*

*_అసలేం జరిగిందంటే..?:_*
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పేదరిక నిర్మూలన శాఖలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళతో అనుకోకుండా ఏర్పడిన పరిచయం కాస్తా ప్రణయంగా మారిందట! డే అండ్ నైట్ ఫోన్లో పలకరింపులతో మొదలై... వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ చివరికి బ్లాక్ మెయిలింగ్ దందాకు దారి తీసినట్లు వినికిడి. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల నడుమ జోరుగా జరుగుతున్న ఈ చర్చ రోజు రోజుకు రచ్చగా మారుతోంది. పరోక్ష పేర్లతో ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరగడం గమనార్హం.

*_అంతా నిజం:_*
జరిగిన ఈ తతంగం ఎపిసోడ్ నిజమేనని సదరు శాఖ ఉద్యోగులంతా చెప్పుకుంటున్నట్లు తెలిసింది. అందం మత్తులో... తానొక ఐ.ఏ.ఎస్ అధికారి అనే విషయం మర్చిపోయి, సందు దొరికినప్పుడల్లా ఆ మహిళా ఉద్యోగితో గంటల తరబడి సెల్ ఫోన్లో సొల్లు పురాణం కొనసాగించేవారట! సీన్ కట్ చేస్తే.. ఫోన్ రికార్డులన్నీ భద్రంగా దాచుకున్న ఆ మహిళా ఉద్యోగి కొద్ది రోజుల తర్వాత ఐ.ఏ.ఎస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టి, భారీ డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

*_మహిళ రివర్స్ గేర్:_*
డబ్బుల సంగతి దేవుడెరుగు.. సదరు మహిళా ఉద్యోగి ఈ విధంగా రివర్స్ గేరు వేయడంతో, ఒక్కసారిగా జడుసుకున్న ఆ అధికారికి చుక్కలు కనపడ్డాయి. ఆమెతో ఈయన ఫోన్లో మాట్లాడిన రికార్డులన్నీ ఆయనకే ఆ మహిళా ఉద్యోగి తిరిగి పంపడంతో, ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారికి ముచ్చెమటలు పట్టాయి. 'బతుకు జీవుడా.!' అంటూ ఓ మహిళా ఉన్నతాధికారిని సంప్రదించి, ప్రాధేయపడడంతో సంబంధిత మహిళా అధికారి ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం వహించి, సదరు మహిళా ఉద్యోగికి నచ్చ జెప్పే ప్రయత్నం చేయబోగా జరిగిన దానికి నష్టపరిహారంగా మహిళ ఉద్యోగి తరపు వారు 10 లక్షల డిమాండ్ చేసినట్లు వినికిడి. ఇరు కుటుంబాలు రోడ్డున పడితే ఇజ్జత్ పోతుందని సర్ది చెప్పి, ఇందుకు పరిహారంగా 5 లక్షలు ఐఏఎస్ అధికారి నుండి ఇప్పించినట్లు తెలుస్తోంది.

*_మత్తులో..:_*
కైపు మత్తులో కన్ను మిన్ను కానకుండ తాను ఒక ఉన్నత అధికారి అనే విషయం మరిచి, వలపు వలలు ఇరుక్కొని, తనకు తానే తన స్థాయిని దిగజార్చుకొని.. పడరాని పాట్లు పడి, తన రాసలీల భాగోత బంధాన్ని తెంపుకొని అదృష్టవశాత్తు ఈ మధ్యనే జిల్లా నుండి బదిలీ అయి వెళ్లిపోయాడు ఆ మన్మధుడు.

బాక్స్ 1:
*_గూఢచర్యం ఆరోపణలపై_*
విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద పనిచేస్తోన్న డ్రైవర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ భవన్‌ నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక పాకిస్థాన్‌ వ్యక్తికి పత్రాలు, సమాచారాన్ని చేరవేస్తున్నాడని, అందుకు బదులుగా డబ్బు తీసుకుంటున్నట్లు ఆ ఆరోపణల సారాంశం. ఆ డ్రైవర్ వలపు వలలో చిక్కుకున్నాడని క్రైమ్ బ్రాంచ్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడిని అరెస్టు చేసినట్లు చెప్పాయి. ఆ పాకిస్థాన్‌ వ్యక్తి ఒక మహిళ అని తెలుస్తోంది. పూజ, పూనమ్‌ శర్మ పేర్లతో అతడికి గాలం వేసినట్లు సమాచారం.

బాక్స్ 2:
*_మహిళా జర్నలిస్ట్ ముసుగులో..:_*
అవిడ ఓ కన్వర్టెడ్ క్రిస్టయన్ (ఎస్సీ ముసుగు, ఆ మేరకు ఆ దేశ 'ముదురు' మహిళ కేసులు కూడా పెడుతుంది.) మొదట్లో బతుకుదెరువు కోసం టైలరింగ్ వృత్తి ఎంచుకుంది. (అది చెప్పుకోవడానికి సిగ్గు.) తరువాత ప్యాషన్ డిజైన్ అంది. అవసరాన్ని బట్టి లాడ్జీలకు వెళ్ళి 'సంక' నాకుతుంది. ఎంజాయ్ చేస్తోంది. భర్తకు అభ్యంతరం లేదు కాబట్టి అది ఆవిడ ఇష్టం. ఆ తర్వాత ఒనమాలు తెలియకుండానే.. జర్నలిస్ట్ ముసుగు వేసుకొని 'హస్కీ మాటలు. ఫేస్ బుక్ లో దేశాన్ని ఉద్దరిస్తున్నట్లు హడావుడి. ఈవిడ 'గుంత'లో ఓ సిఐ, ఓ ఎస్ఐ పడి బయట పడ్డారు. వాయస్ రికార్డులు కూడా సామాజిక మాధ్యమాలలో ఆ మధ్య హల్చల్ చేశాయి. ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని ఓ మున్సిపల్ ఉన్నతాధికారి కూడా 'వలపు వల'లో పడ్డాడు. ఈ సంక బంగారానికి ఇంకా ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో... వెలికి తీసే పనిలో పోలీసులు పడ్డారు. ఛీ దీని బతుకు చెడ.

Saturday, November 26, 2022

ఇదిగో ఆధారాలు.. కళ్ళప్శగించి చూడండి సార్..!

*_మంత్రి మల్లారెడ్డి అన్నా...    గిట్ల బుక్కయినవా...?_*

_● ఏందీ రోత పంచాయతీ.!_
_● ఇఃత చీఫ్ పనులు ఏల.?_
_● 'న్యాక్'కు అందిన ఫిర్యాదులతో కదలిక_
_● ఐటీ శాఖ నాలుగైదు నెలల ప్లానింగ్_
_● ఆ విద్యాసంస్థల్లో ఉద్యోగులుగా ఐటీ సిబ్బంది_
_● తనిఖీలకు కొద్ది రోజుల ముందే.వారు రాజీనామాలు_
_● గుట్టుమట్లన్నింటినీ రాబట్టి.. ఆపై పక్కా తనిఖీలు_
_● తేలని 'ల్యాప్ టాప్' రాద్దాంతం_
_● ఇదిగో ఆధారాలు.. కళ్ళప్శగించి చూడండి సార్..!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009, 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల దృష్టి పడటానికి ముఖ్య కారణం ఆధారాలతో 'తెలంగాణ వాచ్' సంపాదించింది.తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం మొదలయింది. అయితే... ఆయన తెరాస హయంలో భారీగా డబ్బు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. మల్లారెడ్డి స్వతహాగా కష్టజీవి. సమీప బంధువుల కారణంగా అదనపు అభియోగాలు మూటగట్టుకున్నారు. మల్లారెడ్డి వ్యాపారాలకు సంబంధించి.. మరీ ముఖ్యంగా విద్యా సంస్థల కారణంగా ఐటీశాఖ ఆయనపై దృష్టి పడినట్లు తెలుస్తోంది. నాలుగైదు నెలల ముందు నుంచే ఐటీ అధికారులు పక్కా ప్లాన్ చేసుకున్నారు. అందుకం అనుగుణంగా తమ నమ్మకస్తులైన ఉద్యోగులను మల్లారెడ్డి విద్యా సంస్థల్లో చేర్చింది. గుట్టుమట్లన్నింటినీ రాబట్టిన అనంతరం... తనిఖీలకు కొద్ది రోజుల ముందు వారంతా రాజీనామాలు చేశారు. వేదికలు ఎక్కి సొల్లు కబుర్లు చెప్పటం కాదు.. అప్పుడప్పుడు కొంచెం బుర్ర వాడాలి..ఐటీశాఖ లాగా..! ఇదీ మాటర్..!_*

*_అసలేం జరిగిందంటే...?_*
హైదరాబాదులోని కొంపల్లిలో ఉన్న  మల్లారెడ్డి కాలేజ్ అఫ్  ఇంజినీరింగ్ పై నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్ సైట్ లో అప్పట్లో ప్రకటించింది. ఆదో పెద్ద రాద్దాంతం. వివరాల్లోకి వెళ్తే,  మల్లారెడ్డి కాలేజ్ అఫ్  ఇంజినీరింగ్  కి 2018 విద్యా సంవత్సరంలో న్యాక్ బీ++ గ్రేడ్ ను కేటాయించింది. అయితే, ఈ గ్రేడ్ ను అధిగమించి మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశంతో కాలేజీ మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. న్యాక్ బెంగళూరుకు నకిలీ డాక్యుమెంట్లను పంపారు. ఈ విషయాన్ని పసిగట్టిన న్యాక్ కౌన్సిల్ అధికారులు  కాలేజ్ యాజమాన్యం మోసానికి పాల్పడిందని చర్యలు చేపట్టారు. అక్రిడేషన్ విషయంలో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇదే విషయాన్ని తన వెబ్ సైట్ లో న్యాక్ పొందుపరిచింది.

*_అదనపు ఫిర్యాదులు_*
అదే సమయంలో ఈ ఇంజనీరింగ్ కళాశాలపై ఫిర్యాదుతో పాటు మరికొన్ని వివరాలను, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు కూడా వెళ్ళాయి. అయితే ఆ ఫిర్యాదులను ఎవరికి పంపాలనే విషయంలో అంతర్గతంగా పలు సమావేశాలు జరిగినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఆ ఫిర్యాదులను ఐటీశాఖకు 'లోపాయకారి'గా కొందరు పెద్దలు పంపినట్లు తెలుస్తోంది.

బాక్స్:

*_ఒడవని 'ల్యాప్ టాప్' లొల్లి_*
_● ఎటూ తేలని ల్యాప్టాప్ సంగతి_
_● ఇంతకూ ఐటీ అధికారుల ల్యాప్టాప్ ఎక్కడుంది?_

మంత్రి మల్లా రెడ్డి నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటి హైడ్రామాలో కీల కంగా నిలిచిన ల్యాప్ టాప్ అంశం శుక్రవారం కూడా ఎటూ తేలలేదు. బోయినపల్లి పీఎస్ లో ఉన్న ల్యాప్ టాప్ అటు మంత్రి సంబంధీ కులు గానీ, ఇటు ఆదాయపన్ను అధికారులు గానీ తీసుకెళ్లలేదు. దీంతో శనివారం ల్యాప్ టాప్ ను సైబరాబాద్ పోలీసులకు అప్పగిస్తా మంటూ ఠాణా సీఐ రవికుమార్ తెలిపారు. మొదటి సారి తెచ్చిన ల్యాప్ టాప్ తమది కాదని ఐటీ అధికారులు చెప్పారు. రెండోసారి తెచ్చిన ల్యాప్టాప్ ను ఐటీ అధికారులు పరిశీలించినా... అది తమదేనని చెప్పలేదు. ఎత్తుకెళ్లిన వారు. రెండోసారి తెచ్చిన వారూ ఒకటి కాదని మాత్రం పేర్కొంటూ సీఆర్ పీఎఫ్ బలగాలతో కలిసి వెళ్లిపోయారు. మరోవైపు స్టేషన్ గేటు ముందే ఉండి సీఐ రవికుమార్ సీజ్ చేసి. భద్రపరిచారు. కాగా, శుక్ర వారం రాత్రి దాకా ఐటీ అధికారులు, మల్లారెడ్డి అనుచరులు ఎవరూ రాకపోవడంతో అసలు ఆ ల్యాప్టాప్ ఎవరిది..? అధికారుల నుంచి లాక్కెళ్లింది ఎవరు..? తిరిగి మరోటి తెచ్చింది ఎవరు..? సీఆర్పీఎఫ్ హెచ్చరికతో వెళ్లిపోయి.. ఇంకో 
ల్యాప్ టాప్ తెచ్చినదెవరు? వీటన్ని టికీ మించి అసలు ల్యాప్ టాప్ లో ఏముంది? అనేది తేలాల్సి ఉంది.

*_సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నా..:_*
ల్యాప్ టాప్ తెచ్చిన వ్యక్తుల ముఖాలు సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా ఉన్నా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించలేదు. అసలు దీంతో ఈ విషయంలో మంత్రికి, ఐటీ అధికారులకు మధ్య 'ఏం జరుగుతోంది.?' అనేది మిస్టరీగా ఉంది. పోలీసులు విచారణ జరిపి సాంకేతిక నిపుణుల సాయంతో ముందుకెళ్తే ఆ ల్యాప్ టాప్ ఎవరిది? దాంట్లో ఏముంది? అనేది తెలిసే అవకాశం ఉంది.

నియంతలకు పట్టినగతే కేసీఆర్ కు పడుతుంది..... గద్దర్

*నియంతలకు పట్టినగతే కేసీఆర్ కు పడుతుంది..... గద్దర్*
హైదరాబాద్: నియంతలకు ఏ గతి పట్టిందో కేసీఆర్‌ (KCR)కు అదే గతి పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ వ్యాఖ్యలు చేశారు. శనివారం  మాట్లాడుతూ...
రాజకీయ నాయకులు ఏకనామికల్ ప్రామిస్ చేస్తారని... కేసీఆర్  మాత్రం పొలిటికల్ ప్రామిస్ చేశారని అన్నారు. ప్రజల ఆలోచనలు కేసీఆర్ అర్థం చేసుకోవాలని హితవుపలికారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలని అన్నారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు అనేక పొలిటికల్ ప్రామిసెస్ చేశారని గుర్తుచేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు ఆ మాటపై నిలబడలేదని ప్రశ్నించారు. మూడు ఎకరాల భూమి పక్కన పెట్టి దళితబందు ఎందుకు తెచ్చాడో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్‌ను కేసీఆర్ తన జాతీయ ఎజెండాలో చేర్చాలని గద్దర్ పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, November 25, 2022

భారత రాజ్యాంగ పీఠక

భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;

ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;

అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో

వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;

మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

రూ.3వేల కోట్ల లావాదేవీలపై అనుమానం.!

*_మల్లారెడ్డీ...మాట్లాడదాం రా..!_*
_◆ రంగంలోకి ఈడీ_
_◆ మంత్రి మల్లారెడ్డికి ఐటీ 'షాకింగ్' నోటీసులు_
_◆ ఆ 16 మందికి కూడా_
_◆ 15-18 డాక్యుమెంట్లు స్వాధీనం_
_◆ రూ.3వేల కోట్ల లావాదేవీలపై అనుమానం.!_
_◆ కబ్జాల కథనాలపై మరో దృష్టి_
_◆ ఐటీశాఖ గుర్తించిన అక్రమాలివే.!_
_◆ డొనేషన్ల కిందనే రూ.135 కోట్లట.!_
_◆ పరస్పరం కేసులు_
_◆ పోలీస్టేషన్ లో రివర్స్ సీన్_ 
_◆ ప్లీజ్..ఫీజుల విషయం చెప్పకండి: ఫోన్ లో బతిమాలుడు_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఓ మంత్రిపై ఐటీ శాఖ దాడులు చేసి మరీ నోటీసులు పంపింది. అర్థరాత్రి వరకు హైడ్రామా చోటుచేసుకుంది. పరస్పరం కేసులు. జీరో ఎఫ్ఐఆర్ ల నమోదు. తమ అధికారిని ఇబ్బంది పెట్టిన వైనంపై ఐటిశాఖ సీరియస్ గా ఉంది. సోమ, మంగళవారాలలో ఈ కేసుల విషయంలో కీలక సన్నివేశాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కోట్లాది రూపాయల లావాదేవీల విషయంలో విదేశాలకు నగదు తరలిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)రంగంలోకి దిగే అవకాశం ఉంది._*

*_బాక్స్_*
*_{ రేపటి పరిశోధన కథనం: మంత్రి మల్లారెడ్డి ఎక్కడ..? ఎప్పుడు..? ఎలా ఇరుక్కున్నాడు..? }_*

*_ఐటీ ఏం చెప్పిందంటే..?_*
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరిగిన ఆదాయ పన్నుశాఖ సోదాల్లో దాదాపు రూ.15కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 22వ తేదీ ఉదయం మొదలైన ఐటీ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి. రెండున్నర రోజులపాటు కొనసాగిన సోదాల్లో మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి.

*_డొనేషన్ల కిందే రూ.135 కోట్లు..!_*
మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్టు ఐటీశాఖ తెలిపింది. ఐటీ వర్గాలు వెల్లడించిన ప్రాథమిక సమాచారం మేరకు మెడికల్‌, డెంటల్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఆసుపత్రులు, స్థిరాస్తి వ్యాపారం తదితర ఆస్తులపై మల్లారెడ్డి సంస్థలకు చెందిన కార్యాలయాలు, సీఈవోలు, డైరెక్టర్లు, మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు క్రాంతి బ్యాంకు ఛైర్మన్‌ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలు తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మల్లారెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయని ఐటీశాఖ వెల్లడించింది. 400 మందికి పైగా ఐటీ సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి.. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున  అధికారులను ఐటీ శాఖ రప్పించింది. మరోవైపు సోదాలు ముగియడంతో ఈనెల 28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులకు ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సమన్లు ఇవ్వాల్సి ఉండటంతో మరికొందరికి వేరే తేదీల్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

*_రూ.28లక్షలు మాత్రమే దొరికాయాని బొంకుడు_*
మల్లారెడ్డి సంస్థల్లో రూ.15 కోట్లు స్వాధీనంచేసుకోగా.. ఐటీశాఖ పలు అక్రమాలను గుర్తించింది. అనేక డాక్యుమెంట్లతో పాటు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, హార్డ్ డిస్క్ లు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి తరలించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి... తనపై కుట్ర పూరితంగా ఐటీ సోదాలు చేసిందని ఆరోపించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, ఉద్యోగులు అందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. తాను చాలా క్లియర్‌గా ఉన్నానని, కట్టిన పన్నులు, లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయన్నారు. రూ.100కోట్లు అవకతవకలు అనేది అవాస్తవమని కొట్టిపారేశారు. తన ఇంటితో పాటు కుమారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో  కేవలం రూ.28 లక్షలు మాత్రమే దొరికాయన్నారు. వాటికి కూడా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తామోదో దొంగల్లాగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు నిలువరించారన్నారు. 

*_పరస్పరం కేసుల హైడ్రామా_*
గత రాత్రి ఐటీశాఖ, ఇటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఫిర్యాదులు చర్చనీయాంశమయ్యాయి.
రూ.100కోట్లు డొనేషన్ తీసుకున్నారని రాసి వాటిపై బలవంతంగా సంతకం తీసుకున్నారని, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా..384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తనపై దుర్భాషలాడి, ల్యాప్ టాప్, సెల్‌ఫోన్‌  తీసుకుని విధులకు ఆటంకం కలిగించాడని ఐటీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 379, రెడ్‌విత్‌ 34 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన మల్లారెడ్డి మెడికల్ కాలేజి దుండిగల్ పరిధిలో ఉండటంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సైబరాబాద్ పరిధిలోని దుండిగల్‌కు బోయిన్ పల్లి పోలీసులు బదిలీ చేశారు. డీడీఐటీ రత్నాకర్‌ను మంత్రి మల్లారెడ్డి ఇబ్బంది పెట్టడంపై ఐటీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.

బాక్స్:

*_డొనేషన్‌ కట్టలేదని చెప్పండి ప్లీజ్‌.. కాలేజీల నుంచి ఫోన్లు_*
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. కళాశాలల్లో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల యాజమాన్యాలు.. తాము డొనేషన్‌ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

*_లెక్కలోకి రాకుండా.. రూ.లక్షల్లో వసూలు_*
నగర శివారులోని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రవేశాల కోసం ఏకంగా రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయి. కళాశాల స్థాయి, బ్రాంచిని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు బీటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.12-15 లక్షలు వసూలు చేశాయి. మిగిలిన ఫీజులన్నీ దీనికి అదనం. ఒకే దఫాగా నగదు రూపంలో వసూలు చేసిన డొనేషన్‌ మొత్తాలకు పక్కా రసీదులివ్వరు. ఇవన్నీ కళాశాలల లెక్కల్లో కనిపించవు. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి.

బాక్స్:

*_సీన్ రివర్స్_*
అర్థరాత్రి 1.50 సమయంలో మల్లారెడ్డి, అధికారుల మధ్య పరస్పర కేసుల నమోదు విషయంలో ఓ సీన్ రివర్స్ అయినట్లు కనిపించింది. సహజంగా పోలీసులు ఎవరినైనా భయం కంపితులను చేయాలని భావిస్తే... ఇంట్లోకి వచ్చి హడావుడి చేయడం, ఫోన్ ఎత్తనీయకపోవటం సహజంగా చేస్తారు. దీంతో సున్నిత మనస్కులు భయపడతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పోలీసు అధికారులు ఈసారి మరో కోణం రుచి చూశారు. కేసుల నమోదైన కాసేపటికే పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్‌ బలగాలు బోయినపల్లి పిఎస్ కు చేరుకున్నారు. ఠాణాను తమ అధీనంలోకి తీసుకున్నంత పనిచేశారు. లోపలికి ఎవరినీ రానీయొద్దంటూ వారు సూచించడంతో బోయిన్‌పల్లి పోలీసులు స్టేషన్‌ గేటుకు తాళం వేశారు. కేసుల నమోదు సమయంలో సీఐకి మంత్రి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్‌కాల్‌ను సీఆర్పీఎఫ్‌ బలగాలు మాట్లాడనీయలేదని సమాచారం. ఔరా..! ఏమీ విధి వైపరీత్యం.

Wednesday, November 23, 2022

ఇప్పుడు మీకు తెలుస్తుందా..?

*_మా కుటుంబాల బాద...తెలంగాణలో జర్నలిస్టులను, ఆర్.టి.ఐ. ఉద్యమ కారులను, సామాజిక వేత్తలను, ప్రశ్నించే గొంతులను నులిమినప్పటి 'నొప్పి'...._*

*_ఇప్పుడు మీకు తెలుస్తుందా..?_*
_● గుండెలు బాదుకుంటున్న గులాబీలు౼
_● నాడు ప్రజల ఆక్రందనలు విన్నారా.?_
_● త్యాగాలతో 'మీం'_
_● డబ్బు సంచులతో 'మీరు'_
_● అదే జైళ్ళు నోరు తెరుచుకుంటే.. మీ బతుకులు.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*

*_తెలంగాణలో బుధవారం ఓ హైడ్రామా. 'నీవు నేర్పిన విద్యే నీరజాక్ష' అంటూ కేంద్రం వ్యూహాత్మక దాడులు గులాబీ నేతల గుండెల్లో ఒకటే గుబులు..టెన్షన్... తెల్లవారితే ఎవరికి..? ఏం జరుగుతోందన్న భయం. ఇవే క్షణాలు గతంలో జర్నలిస్టులను కిడ్నాప్ చేసినప్పుడు, ఆర్.టి.ఐ. ఉద్యమ కారులను అక్రమంగా అరెస్టులు చేసినప్పుడు.. సామాజిక వేత్తలను, ప్రశ్నించే గొంతులను నులిమినప్పుడు వచ్చిన ఆక్రందనలే..! అప్పుడు అధికార మదంతో పోలీసుల భుజంపై గన్నులు పెట్టి 'పెన్నుల'పై 'వీరంగం' చేశారు. జస్ట్ ఇప్పుడు మీ మీద జరుగుతుంది సరికొత్త 'వీరంగం.!' అప్పుడు ప్రశ్నించే గొంతుకల దగ్గర దొరికింది సెల్ ఫోన్స్ మాత్రమే.! మరి ఇప్పుడు మీ దగ్గర కోట్లాది రూపాయలు, సంచుల కొద్దీ బంగారం, భూ పత్రాలు. మా మండే గుండెలు ఎప్పుడు చల్లారతాయో.. తెలుసా..? మీరు, మీ కుటుంబ సభ్యులు జైళ్ళకు న్యాయంగా వెళ్ళినప్పుడు..మాత్రమే..! తథాస్తు..!!_*

*_అసలేం జరిగిందంటే..?_*
మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడులతో మంగవారం షాక్ లో ఉండగా... బుధవారం నుంచి గుండెలు బాదుకునే కార్యక్రమం చేపట్టారు. కొడుకు...కూడా ఎమ్మెల్సీ రమణలాగే బెడ్ ఎక్కేశాడు. నా కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి శివాలెత్తాడు. అక్కడ విచారణ అంతా (మల్లన్న సినిమాలో లాగా) కెమెరాలలో నిక్షిప్తమై ఉందనే లాజిక్ మరిచాడు. ఓకే..!

*_వ్యవస్థలను నిర్వీర్యం చేసి.._*
సోదర పోలీసులను ఇక్కడ తప్పు పట్టం.. ఎందుకంటే అధికారం క్రింద పనిచేసే వాళ్ళు కనుక. చదరంగం ఆటలో పావులను ఎలా తప్పు పట్టగలం.. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను కిడ్నాప్ లు చేసి మరీ అకృత్యాలు చేశారు కదా..! ఇప్పుడు సేమ్ సీన్..రివర్స్ గేర్ పడింది. టైం అంటే అదే.! 

*_సిబిఐ రావచ్చు..!_*
తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దంటూ ప్రభుత్వం హుకుం గుట్టుగా జారీ చేసింది. ఇది భయంతో చేసిందని భాజపా నేతల ఆరోపణ. నేర విస్తరణ, తీవ్రతను బట్టి సిబిఐ వచ్చే వీలుందనే సుప్రీంకోర్టు తీర్పును తాజాగా కమలం నేతలం బయటకు తీశారు.. సో..! సిబిఐ అరెస్టుల పర్వం తెలంగాణలో ఉండవచ్చు. ఇక పాత కేసులతో ఉన్న లింక్ లపై సిబిఐ నేరుగా వచ్చే అవకాశం ఉంది.

బాక్స్:

*_ఎంత 'సొత్తు' దొరిందంటే..?_*
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రూ.8.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మంగళవారం జరిపిన సోదాల్లో రూ.4.80 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా దొరికిన మొత్తంలో త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2.80 కోట్లు, మర్రిరాజశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, మల్లారెడ్డి బావమరిది కొడుకు సంతోష్‌రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాగా మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్‌ కాలేజీలు, నాలుగు మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీతోపాటు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న నేపథ్యంలో.. వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు గత మూడేళ్లలో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, వాటికి డబ్బును ఎక్కడెక్కడి నుంచి చెల్లించారు? అన్న విషయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవరయాంజాల్‌, శామీర్‌పేట, జవహర్‌నగర్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, కీసరలో మల్లారెడ్డి కుటుంబానికి లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్లు చెబుతుంటారు. ఇక మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపులోనూ అవకతవకలు చోటుచేసుకున్నట్లు, చాలా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బాక్స్ :
*_అక్కడ నోబెల్ - ఇక్కడ నో బెయిల్_*
_★ రవిప్రకాష్ 23 రోజులు_
_★ అనంచిన్ని వెంకటేశ్వరరావు 79 రోజులు_
_★ గంజి రఘు 13 రోజులు_
_★ తీన్మార్ మల్లన్న 71 రోజులు_
_★ జైల్లో నరకం_

అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలా ఉంది.? ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అధికారికంగా ప్రకటించిన మహిళా ప్రధాని. నేడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణరాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది.?  ఫిలిఫీన్స్, రష్యాలలో ఎలా ఉంది.? ఆ,యా దేశాలలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అత్యున్నత నోబెల్ పురస్కారాలు. మరి ఇక్కడ నో'బెయిల్'  సత్కారాలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసులు, కిడ్నాప్ 'అరెస్టులు... ఆ,యా జర్నలిస్టులకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న అధికార వర్గాలు. ఇప్పటి వరకు ముగ్గురు ప్రముఖ పాత్రికేయులను జైళ్ళల్లో 'మగ్గ' పెట్టారు. ఇప్పుడు వారే చేయాల్సిన వారిని 'ఫ్రై' చేస్తున్నారు. 

*_రవిప్రకాష్_*
దేశంలో ఎలక్ట్రానిక్ మీడియాను వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృషించాడు. పాతిక కోట్ల ప్రస్థానాన్ని రూ. 450 కోట్లకు చేర్చాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల 'ఆత్మహత్య' సంఘటనపై నోరు తెరిచిన కొద్ది గంటల్లోనే యాజమాన్యం విషం గక్కింది. ఆయన్ని బయటకు పంపింది. నాడు లాభాల బాటలో ఉన్న టివి9 ఇప్పుడు ఆనాటి ఆర్థిక ప్రాభవం కోల్పోయింది. చంచల్ గూడలో 23 రోజులు అక్రమంగా కేసులు పెట్టి బెయిల్ రాకుండా వేధించిన వైనం చరిత్ర.

*అనంచిన్ని వెంకటేశ్వరరావు*
పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర. 'విజయవిహారం' చేస్తూ ఏ అవినీతి పరుడికి లొంగని తీరు. అక్రమాలను వెలికి తీయడంలో అరడజను ముఖ్యమంత్రుల వైభోగాలను అలవోకగా రాసిన అక్షర మాంత్రికుడు. నిజాలను నిక్కచ్చిగా చెప్పే దమ్మున్న జర్నలిస్ట్. ఇక వార్తలు రాయడమే ముఖ్యం కాదు. 'స్టైల్' మార్చి అందర్నీ మాట్లాడించే తర్ఫీదు ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. పలు ప్రజాసంఘాలతో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ.. 'ఫాంహౌస్' పడుకున్న వాళ్ళను బయటకు రప్పించి మరీ మాట్లాడిస్తున్నాడు.
3 సార్లు కిడ్నాప్ డ్రామా.! కేవలం వార్తలు రాసినందుకే నల్గొండలో 8, హైదరాబాద్ చర్లపల్లి సింగిల్ బారెక్ లో 53, చంచల గూడలో 18 మొత్తం 79 రోజులు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం తర్వాత వార్తలు రాసినందుకు అత్యధిక రోజులు జైలులో పెట్టిన అద్భుతమైన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిదే..! 

*_గంజి రఘు_*
యువ జర్నలిస్ట్. పేదోళ్ళ మధ్య తిరుగుతూ.. వాళ్ళ సమస్యలపై 'యాంకరింగ్' చేస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో  పోలీసులు సగర్వంతో చేసిన కిడ్నాప్ అరెస్ట్. పాపం సిసి ఫుటేజ్ వల్ల తెలంగాణ పోలీసుల ప్రతిభ అందరికీ తెలిసింది. వారికి ధన్యవాదాలు. హుజురాబాద్ జైలు నుంచి నల్గొండ జైలు వరకు 13 రోజుల హైడ్రామా. వెరసి బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్ట్ 'తలకొరివి ఎలా పెట్టవచ్చు.?' అనే విషయంలో 'మాస్టర్'గా మారాడు.

The collector who is captive in the hands of the leaders..?

The collector who is captive in the hands of the leaders..?

 * The Mayor Buchi Reddy has complained many complaints that corruption and irregularities are happening in Boduppal Municipal Corporation.

 * Several corporators have complained that the Mayor Jakka Venkat Reddy is selling parks and roads in Peerjadiguda Municipal Corporation.

 * Deputy Mayor Kurra Sivakumar Goud has filed many complaints since last year about illegal constructions in ponds and buffer zones and occupation of ceiling lands worth crores of rupees.

 * Complaints of various political parties on the corruption and illegal constructions that have been going on since the last three years in Twin Municipal Corporation s.


 Medchal District "Prajavani and Task Force Committee under the direction of the Collector" will not go away... Has the Collector system, which is supposed to be accountable to the people, also become a puppet in the hands of the elite..!  Thousands of complaints are filing up in the collector's office.  Is it not possible to solve them?  When the mayor, deputy mayor, corporators, and leaders of various political parties do not address the grievances, do they care about the grievances of the common man..!  Isn't this a big example of deceiving the poor in the name of "Prajavani"...where in the district have we seen corruption, illegalities, land grabbing and these can't be ignored...
 Why Prajavani..?  Why task force committee..?
 Why the original collector system..?
 When there is no justice for the poor, why do they get lakhs of rupees as salary allowances in the form of taxes?
 Or to save the corruption, illegalities and land grabs done by the ruling party..?
 Yes, if all this looks like a movie before the eyes of the common people, how can people have faith in the collector system.  How about respect for the government?

 Medipalli: 20 November (Aadab Hyderabad) In the twin municipal corporations of Medchal district Medipalli mandal, since three years of formation of the ruling class, they have been in perpetual corruption, occupying roads, ponds, buffer zones, temple lands, parks and finally even cemeteries by constructing multi-storeyed buildings without any permits and hugely for the government's income.  They are scolding. Various political parties have been protesting, dharna and blockade of the offices on a large scale against the corruption and illegalities going on in Janta Municipal, no matter how many complaints have been made to the local authorities and the Collector, there is no response.
  In Peerjadiguda Municipal, Mayor Jakka Venkat Reddy has sold park land in his ward, encroached roads and encouraged illegal constructions and committed corruption and illegalities. Twenty corporators have come together to complain to the collector and explained the problems and complained that no action has been taken till now.
 The Deputy Mayor of Peerjadiguda said that since last year, the Collector, who has complained many times about the corruption of the Mayor, has not moved.  Presently Parvathapuram Salarjung has complained that the mayor is swallowing ten pits of ceiling land worth Fifty crore rupees in the name of 118 JV in benami names. In Peerjadiguda Municipal, Mayor's 50 Crores Scam is being headlined every day in various daily papers, the Collector is not seeing the allegations of corruption...
 He said that transactions worth crores of rupees are being done in the name of Haritaharam in Boduppal Municipality, and despite the absence of tenders, the officials colluded with the corporators and misused the public funds by building roads, but there was no result.  He said that roads are being laid nightly in the FTL area, illegal constructions are being carried out in the FTL and buffer zones without permission, he explained to the collector in writing and complained many times in public, but he did not pay attention to his pain.
 When the grievances of the people's representatives of the ruling party and the leaders of various political parties are not heeded in the twin municipals and the solution to the grievances of the common people becomes a mirage in the desert... People will lose faith in the government and TRS Party will have to pay a heavy price.

Courtesy by :         
Mekala Mallesham, Reporter Medchal District. ✍️

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో భారీగా పట్టు బడ్డ గంజాయి

*షాద్ నగర్ పట్టణంలో భారీగా పట్టు బడ్డ గంజాయి*

*రాయికల్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్. ఓ. టి. పోలీసులు మరియు షాద్ నగర్ పోలీసులు కలిసి పట్టు కున్న గంజాయి*

*దాదాపుగా ఏడూ లక్షల విలువ చేసే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఎల్లంపల్లి కుర్వ రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన పోలీసులు*

*గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టు కున్న పోలీసు సిబ్బందిని అభినందించిన షాద్ నగర్ ఏసిపి*

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు మరియు షాద్ నగర్ పోలీసులు కలిసికట్టుగా  గంజాయ్ స్మగ్లింగ్ చేస్తున్న ఎల్లంపల్లి కి చెందిన కుర్వ రమేష్  తన కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు వచ్చిన సమాచారం తో అతని పై కొన్ని రోజుల నుండి నిగా పెట్టి  నిన్న రాయికల్ టోల్  ప్లాజా భద్రాచలం అటవీ ప్రాంతం నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి నీ సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ sot పోలీసులతో పాటు షాద్ నగర్ పోలీసులు రాయికల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని  అపి తనిఖీ చెయ్యగా 110 కిలోల గంజాయి పట్టుబడింది షాద్ నగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అని వ్యక్తి ఈ గంజాయి నీ భద్రాచలం నుండి టోల్  ప్లాజా లు లేని రహదారుల ద్వారా హైదరాబాద్ కు ఈ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు, గంజాయి తరలించే క్రమంలో పట్టుబడకుండా ఉండడానికి నిందితుడు  వాహనం లో ప్రతేక ఏర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు, పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్ లో 7 లక్షల వరకు ఉంటుందని తెలిపారు షాద్ నగర్ ఎసిపి కుషాల్కార్ తెలిపారు.

--------------------------------------------------------------

ఇక వివరాల్లోకి వెళ్తే షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పరిధిలో రంగ సముద్రానికి చెందిన  కురువ రమేష్ వయసు 30 సంవత్సరాలు మరియు వరంగల్ జిల్లా  నర్సంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన వీరన్న మరియు భద్రాచలం జిల్లాకు చెందిన సోము రాజు ముగ్గురు కలిసి గంజాయిని భద్రాచలం నుండి హైదరాబాద్ కి రవాణా చేస్తూ పట్టుబడ్డారు
నిందితుడు కురవ రమేష్ వరంగల్ కు చెందిన వీరన్న భద్రాచలం వెళ్లి అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి అతని ద్వారా 110 కిలోల గంజాయిని  చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసుకొని కురువ రమేష్ కు చెందిన TATA TS10 EM10 7999 గల వాహనం వెనుక భాగంలో ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఎవరికి అనుమానం రాకుండా భద్రాచలం నుండి హైదరాబాద్ కు వెళ్తూ ఎక్కడైనా పోలీసు లు పట్టుకుంటారేమోనని తెలివిగా గుంటూరు- కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో  షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర నిన్న రాత్రి 7 గంటల సమయంలో పక్క సమాచారంతో శంషాబాద్ డిసిపి మరియు షాద్నగర్ ఏసిపి గారి పర్యవేక్షణలో రాజేశ్వర్ రెడ్డి STO శంషాబాద్,మరియు షాద్నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ మరియు కానిస్టేబుల్. షాద్నగర్ టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడం జరిగిందని ఏ సి పి కుశాల్కర్ మీడియాకు తెలపడం జరిగింది.ఇట్టి చేదనలో చాకచక్యంగా వ్యవహరించిన షాద్నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ కుమార్ మరియు  ఎస్ ఓ టి రాజేశ్వర్ రెడ్డిని అభినందించి వీరికి తగిన రివార్డులను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని అన్నారు

       *మహేష్ బైరమోని*

Tuesday, November 22, 2022

మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్.....!

*మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్.....!*

హైదరాబాద్‌:తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు సీజ్‌ చేశారు. త్రిశూల్‌ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతుండగా ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

*మంత్రి సెల్‌ఫోన్‌ స్వాధీనం...!*
కాగా మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏక కాలంలో మొత్తం 50 బృందాలుగా అధికారులు. మంత్రితోపాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లోనూ విస్త్రృత దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, సోదరుడు, వియ్యంకుడు ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. మంత్రి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

*కొత్త విషయాలు వెలుగులోకి...!*
మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుపుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్‌ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. జైకిషన్‌, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్‌ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు. సీఎంఆర్‌ స్కూల్స్‌లో నరసింహ యాదవ్‌, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్‌, జైకిషన్‌ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుపుతోంది.

14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌ చైర్మన్‌ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ లావాదేవీలు గుర్తించారు. అలాగే కన్వీనర్‌ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మెడికల్‌ కాలేజీల లావాదేవీల పరిశీలిస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

సాయంత్రం ప్రగతిభవన్ లో సీయం కేసీఆర్....అత్యవసర సమావేశం....!

*సాయంత్రం ప్రగతిభవన్ లో సీయం కేసీఆర్....అత్యవసర సమావేశం....!*

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ (CM KCR) అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు  ఎమ్మెల్యే లు హాజరుకానున్నారు.ఈడీ (ED), ఐటీ (IT) దాడుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ సూచించారు.

కాగా ఐటీ, ఈడీ దాడులతో టీఆర్‌ఎస్‌ నేతల్లో అలజడి మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం అయ్యారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది.

*సుజీవన్ వావిలాల*🖋️

అయ్యప్ప భక్తులకు.... శుభవార్త.....!

*అయ్యప్ప భక్తులకు.... శుభవార్త.....!*

ఢిల్లీ : అయ్యప్ప స్వామి భక్తులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌-బీసీఏఎస్‌ శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది.విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని క్యాబిన్‌ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. అన్ని తనిఖీల తర్వాత... అయ్యప్ప భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల సెక్యురిటీ సిబ్బందికి బీసీఏఎస్‌ మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 20 వరకూ విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకూ అవకాశం కల్పిస్తూ... బీసీఏఎస్‌ డైరక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు ఇచ్చారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయం

*అందరికి 🙏*

*#GHMC ఉప్పల్ సర్కిల్ #రామంతాపూర్ డివిజన్ చిన్న చెరువు కట్ట క్రింద వున్న శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం కబ్జా & అభివృద్ధి గురించి కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆటివారికి హెచ్చరిక ఈ అంశం న్యాయ పరిధిలో వుంది కావున ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే #చట్టపరమైన చర్యలు తీసుకోబడును.... Bplkm🪶*

Monday, November 21, 2022

ఆదాయానికి మించి ఆస్తుల బాగోతంపైనే దృష్టంతా

*_మంత్రి మల్లారెడ్డికి ఐటీ షాక్.!_*
_● మొత్తం 50కి పైగా ప్రాంతాల్లో_
_● కొడుకు, అల్లుడు ఇళ్ళల్లోనూ_
_● బంధువులపై కూడా_
_● విద్యాసంస్థలను వదలని వైనం_
_● ఆదాయానికి మించి ఆస్తుల బాగోతంపైనే దృష్టంతా.._

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 000 000 9 'తెలంగాణ వాచ్"' ప్రత్యేకం)_*

*_తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి , అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై, కోంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ ఈ ఐటి దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు._*

*_సమీప బంధువుల ఇళ్ళల్లో.._*
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం యాభై చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలో సోదాలు కొనసాగుతున్నాయి.

*_పట్టించిన ఐటి రిటర్నస్:_*
ఇంకా మల్లారెడ్డి కూతురు, కొడుకు అల్లుడు నివాసాలతోపాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరాతీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు.

*_ప్రచారంలో చురుగ్గా.._*
గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మల్లారెడ్డి బాగా ప్రచారం చేశారు.

*_మందు పార్టీ.. మస్త్ హవా.._*
టీఆర్ఎస్ గెలుపు కోసం ఎక్కువగా శ్రమించిన నేతల్లో మల్లారెడ్డి కూడా ఒకరిని చెప్పాలి. అక్కడి స్థానికులకు మందు పార్టీలు ఇచ్చారని, ఆయనే స్వయంగా మందు పోస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sunday, November 20, 2022

పవన్ రాజకీయ జీవితంపై....చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

*పవన్ రాజకీయ జీవితంపై....చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు*

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''నా మనస్సు నుంచి రాకపోతే దేనిఅంతూ నేను చూడలేను.నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని వెనక్కి వచ్చేశాను. రాజకీయాల్లో రాణించాలంటే సెన్సిటివ్‌ గా ఉండకూడదు. రాజకీయాల్లో మొరుటుతేలాలి.. బాగా రాటుతేలాలి. ఇతరులను మాటలు అనాలి.. అనిపించుకోవాలి.. ఇది నాకు అవసరమా?.. దానికి పవన్‌కల్యాణ్  తగినవాడు.. తాను అంటాడు.. అనిపించుకుంటాడు. పవన్‌కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో పవన్‌ ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో ఉంటాడు'' అని చిరంజీవి జోస్యం చెప్పారు.మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు సినిమాల్లో సంచలనం. ఆయనకు విజయవంతమైన నటుడిగా గుర్తింపు ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూణాళ్ల ముచ్చటగానే ప్రయాణం సాగింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాల్లో బిజీ అయిపోయారు. రాజకీయ వివాదాలకు చిరంజీవి దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో '' నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. తాజాగా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమనే భావనకు ఆయన వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

నకిలీ జీఎస్టీ అధికారులు.... అరెస్ట్

*నకిలీ జీఎస్టీ అధికారులు.... అరెస్ట్*

రూ. 28 కోట్ల మోసం

నిందితులపై పీడీ యాక్ట్‌

హైదరాబాద్/జీడిమెట్ల: జీఎస్టీ, కస్టమ్స్‌ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించి పలువురు వ్యాపారులను మోసం చేసి రూ.28 కోట్ల వసూళ్లకు పాల్పడిన ముఠాను బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.20 వేల నగదు, మూడు సెల్‌ ఫోన్లు, కారు, బంగారం కొనుగోలు చేసిన రసీదులు, ఏటీఎం కార్డులు, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌ డీసీపీ గోనే సందీప్‌ శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బురుజుకింది నారాయణగౌడ్‌(57) నగరంలోని బోడుప్పల్‌లో ఉంటున్నాడు. ఇతడు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడు. నాంపల్లిలోని జీఎస్టీ కార్యాలయంలో కార్లను అద్దెకు నడుపుతోన్నాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న అధికారుల ఐడీ కార్డులు దొంగిలించి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు.

వరంగల్‌ జిల్లాకు చెందిన మేరుగు శైలజ (37) ప్రైవేట్‌ ఉద్యోగి. కాప్రాలో నివాసముంటోంది. ఆమె పేరు మీద కూడా జీఎస్టీ కమిషనర్‌గా ఐడీ కార్డు సృష్టించాడు. ఇద్దరూ బంగారం, స్టీలు, సిమెంట్‌ దుకాణ యజమానులు, బిల్డర్లతో మాట్లాడి జీఎస్టీ లేకుండా చూస్తామని నమ్మించి మోసం చేశారు. అనంతరం మొఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. నకిలీ అధికారులుగా గుర్తించి నారాయణగౌడ్‌, శైలజను అరెస్ట్‌ చేశారు. వీరిపై పేట్‌బషీరాబాద్‌, దుండిగల్‌, పహాడీషరీఫ్‌, ఎల్‌బీనగర్‌, నర్సాపూర్‌, మీర్‌పేట్‌, మేడిపల్లి, ఉప్పల్‌, కరీంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 13 కేసులు ఉన్నాయి. వీరు దాదాపు 50మంది నుంచి రూ.28 కోట్ల మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టనున్నట్టు డీసీపీ సందీప్‌ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌వోటీ సైబారాబాద్‌ ఏడీసీపీ పి.నారాయణ, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ జేమ్స్‌బాబు, సిబ్బందిని అభినందించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తొలివెలుగు'పై 10 కోట్ల పరువు నష్టం దావా

*_యశోద వెర్రి చేష్టలు.!_*
_★ 'తొలివెలుగు'పై 10 కోట్ల పరువు నష్టం దావా_
_★ రమ్య మృతికి సంబంధం లేదంటూ వీడియో_
_★ తన కూతురి ప్రాణానికి 20 కోట్లు ఇవ్వాలంటున్న తండ్రి_
_★ సోషల్ మీడియా ద్వారా బాధితుల ఆవేదన_
_★ మీడియా గొంతు నోక్కే ప్రయత్నం_
_★ రాక్షస ఆనందం: జర్నలిస్ట్ రఘు_
_★ యశోద కొవ్వు కరిగించాలి: టిజేఎస్ఎస్_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, 9440000009)_*

*_యశోద హాస్పిటల్ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తెలంగాణ ప్రజల సొత్తును 'జలగ' లాగా పీలుస్తూ.. డబ్బు మదం, కొవ్వుతో యశోద ఆసుపత్రి కొట్టుమిట్టాడుతోంది. కార్పొరేట్ వ్యవస్థ ఆగడాలపై వార్తలు రాయొద్దా? ప్రసారం చేయొద్దా? ఎన్ని ఘోరాలు చేసినా కళ్లు మూసుకుని కుర్చోవాలా? ప్రశ్నిస్తే.. 'పరువు పోయింది' అంటూ దావాలు వేస్తారా? కార్పొరేట్ తీరు చూస్తుంటే బాధితులకు 'అండగా నిలబడొద్దు' అనేలా ఉందని జర్నలిస్ట్ సంఘాలు అంటున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే 'ఎక్స్ పార్టీ ఆర్డర్స్' తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన మీడియాని గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్ రంగం.. సోషల్ మీడియాను కూడా తన కంట్రోల్ లో ఉంచుకోవాలని చూస్తోందని మండిపడుతున్నాయి._*

*_ఏం జరిగిందంటే?_*
డెంగ్యూతో బాధపడుతున్న 21 ఏళ్ల రమ్యను దిల్ సుఖ్ నగర్ ప్రాణహిత్ హాస్పిటల్ లో చేర్చించారు ఆమె తండ్రి సత్యనారాయణరెడ్డి. ఆరోగ్యం విషమించడంతో గత నెల 12న మలక్‌ పేట యశోద హాస్పిటల్‌ లో (ఐపీ నెం.336592) చేర్పించారు. దురదృష్టవశాత్తు 14వ తేదీన రాత్రి 11.29 గంటలకు రమ్య చనిపోయింది. ఆమె మృతిని కన్ఫామ్ చేసి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ, బిల్లు మాత్రం 15వ తారీఖు కూడా వేశారు. కుటుంబసభ్యులు కూడా డీటెయిల్స్ చూసుకోకుండానే మొత్తం బిల్లు కట్టారు. తర్వాత బిల్లుల్ని పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. డెత్ సర్టిఫికెట్ లో 14న చనిపోయిన యువతికి 15న రకరకాల టెస్టులు చేసినట్లు బిల్లులో ఉందని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాన్నే తొలివెలుగు హాస్పిటల్ దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అయితే.. యశోద యాజమాన్యం 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి.

*_మీ బతుకులు చెడ.!_*
యశోద హాస్పటల్ ఆగడాలు తరచూ ఎక్కడో ఒక చోట బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను కూడా ఆధారాలతో, బాధితుల ఆవేదనలు వేయరాదంటూ అడ్డు తగులుతున్నారు.

*_బాధితులంతా ఏకం_*
కాసుల కోసం రక్తం తాగుతున్న యాజమాన్యాన్ని కడిగి పారేసేందుకు బాధితులంతా ఓకే వేదిక మీదకు రాబోతున్నారు. వారి గోడు చెప్పడానికి తొలివెలుగు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టిజేఎస్ఎస్) అండగా ఉంటుంది. జరిగిన నష్టం ఏంటో కళ్లకు కట్టేలా చూపించబోతోంది. బాధితులు వినియోగదారుల ఫోరంలో కేసులు వేయబోతున్నారు. హైకోర్టుని ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు.

బాక్స్:
*_తప్పు లేకుంటే.. ఖరీదులు ఎందుకు కడుతున్నారు: టిజేఎస్ఎస్_*
అప్పటికప్పుడు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న కేసులను కూడా ఇప్పుడు బయటకు తీసుకురాబోతున్నాం. తమ తప్పే లేకపోతే.. హాస్పటల్ వారు లక్షలకు లక్షలు చనిపోయిన బాధిత కుటుంబాలకు ఎందుకు ఇచ్చారు. ప్రభుత్వం అండదండలతో ఎన్ని అరాచకాలు చేసిందో..? అనాది కాలంలోనే వేల కోట్లకు ఎలా ఎదిగారో..? క్విడ్ ప్రో కో ఎక్కడ జరిగిందో..? అన్నింటినీ 'తొలివెలుగు' ఆధ్వర్యంలో బట్టబయలు చేస్తాం. యశోద ఆస్పత్రి యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉందని చెబుతుంటారు. అయితే.. హాస్పిటల్ తీరుపై సర్కార్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

బాక్స్:
*_మానవహక్కుల కోసం పోరాటం_*
బాలిక తండ్రి పేద రైతు. కూతురిని బతికించుకుందామని తనకున్న వ్యవసాయ భూమిని అమ్మి డబ్బులు చెల్లించాడు. రూ. 6 లక్షల లెక్క సరిచేయడానికి రమ్యకు మరణించిన తర్వాత చికిత్స కొనసాగించారని రమ్య తండ్రి ఆరోపించారు. ఈ మేరకు యువతి తల్లిదండ్రులు మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా రోగులు చనిపోయిన తర్వాత కూడా బిల్లులు వసూలు చేసిన యశోద హాస్పిటల్ పై, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన ప్రాణహిత హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.

బాక్స్:
*_రాక్షస ఆనందం: జర్నలిస్ట్ రఘు_*
'తొలివెలుగు', జర్నలిస్ట్ రఘుకు యశోద యాజమాన్యం రూ.10 కోట్లకు పరువునష్టం దావా పంపింది. దీనిపై జర్నలిస్ట్ రఘు స్పందించారు. బాధితుల ఆవేదనలను బయట ప్రపంచానికి చూపటం తప్పా.? ఇటీవల ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువయ్యాయని, ఇదొక రాక్షస ఆనందగా మారిందని, జైళ్ళు నోరు తెరిచినప్పుడే భయపడలేదని, ఇలాంటి నోటీసులకు 'తొలివెలుగు' బెదరదని, తాము న్యాయపోరాటం చేస్తామని స్పష్టంగా తేల్చి చెప్పారు.

Friday, November 18, 2022

బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు....!

*బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు....!*

హైదరాబాద్‌: బీజేపీ (BJP), టీఆర్ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ-టీఆర్ఎస్‌ కలిసి తెలంగాణను కలుషితం చేస్తున్నాయని దుయ్యబట్టారు.అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను నమ్ముకుని సీఎం కేసీఆర్‌  రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు తనకు ఆఫర్‌ చేశారని ఎమ్మెల్సీ కవిత  ఒప్పుకున్నారని, దీనిపై కూడా హైదరాబాద్ సీపీ ఆనంద్‌ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కవిత స్టేట్‌మెంట్‌ను సీపీ ఆనంద్‌ రికార్డ్‌ చేయాలని, ఆమెకు ఎవరు ఆఫర్‌ ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఈడీ విచారణకు ఎమ్మెల్సీ రమణ..... అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు....!

*ఈడీ విచారణకు ఎమ్మెల్సీ రమణ..... అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు....!*

హైదరాబాద్‌: క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. క్యాసినో విషయంలో ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని తెరాస ఎమ్మెల్సీ ఎల్‌ రమణకు గతంలోనే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఆడేందుకు ఎల్ రమణ విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం రమణ హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోదరులు మహేష్‌యాదవ్‌, ధర్మేందర్‌ యాదవ్‌లను హైదరాబాద్‌ ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు.
*కళ్లు తిరిగి నీరసంగా*
ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎల్ రమణ.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రమణ గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విచారణ నిమిత్తం వచ్చిన ఆయన.. అక్కడి భవనంలో మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ వినియోగించకుండా మెట్లు ఎక్కి వెళ్లారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన వెంటనే అధికారులను రమణ మంచినీరు అడిగినట్లు సమాచారం. కళ్లు తిరిగి నీరసంగా అనిపించడంతో విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చాలా సేపటివరకు రమణ పరిస్థితి అలాగే ఉండడంతో అధికారులు స్పందించి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ నీరసంగా కనిపించడంతో క్యాసినోపై రమణను అధికారులు పెద్దగా ప్రశ్నించలేకపోయారని సమాచారం.

క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై నాలుగు నెలల క్రితం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జూద ప్రియులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్‌ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసి పలువురిని విచారించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో సోదాలు నిర్వహించి వారిని విచారించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఈటలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ నిర్మాణాలు.....!

*ఈటలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ నిర్మాణాలు.....!*

*పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులకు కూడా..*

*దేవరయాంజాల్‌'లో* *1350 ఎకరాలు దేవాదాయ శాఖవే!*

*ఆ భూముల్లో గోదాములు, పరిశ్రమలు*

*సర్కారుకు నివేదిక అందించిన త్రిసభ్య కమిటీ*

మేడ్చల్‌, : దేవరయాంజాల్‌లోని 1350 ఎకరాలు దేవాదాయ శాఖకు చెందినవేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మునిసిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్‌ సీతారామచంద్రస్వామి ఆలయ భూములు 1350 ఎకరాలు దేవాదాయ శాఖవేనని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావు నేృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. అయితే ఈ భూముల్లో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు గోదాములు, పరిశ్రమలు తదితర నిర్మాణాలను చేపట్టినట్లు కమిటీ పేర్కొంది. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎ్‌సలో ఉన్నంత వరకూ ఈ భూముల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆలయ భూములను గుర్తించే పని చేపట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ.. ఆలయ భూములతో పాటు అందులో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించింది. ఎట్టకేలకు 1350 ఎకరాలు దేవాదాయ శాఖవేనని తే ల్చింది. ఈ భూముల్లో ఈటలతో పాటు అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈటలకు చెందిన గోదాముల్లో ఉన్న ప్రభుత్వ మద్యం డిపోలను కూడా అప్పట్లో సర్కారు ఖాళీ చేయించింది. ప్రస్తుతం ఈ గోదాములు ఖాళీగానే ఉన్నాయి. దేవరయాంజాల్‌లో సర్వే నంబర్లు 55 నుంచి 63 వరకు, 639, 641, 656, 657, 660, 682, 686, 718లో ఆలయ భూములున్నాయి. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవేనని నివేదిక అందించడంతో అక్క డ నిర్మాణాలు చేపట్టిన వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ఆందోళనలో ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, November 17, 2022

2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

*2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం*

2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
సాధారణ సెలవులు

01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్
14/01/2023 – శనివారం – భోగి
15/01/2023 – ఆదివారం – సంక్రాంతి 
26/01/2023 – గురువారం – రిపబ్లిక్ డే
18/02/2023 – శనివారం – మహాశివరాత్రి
07/03/2023 – మంగళవారం – హోలీ
22/02/2023 – బుధవారం – ఉగాది
30/03/2023 – గురువారం – శ్రీరామ నవమి
05/04/2023 – బుధవారం – బాబు జగ్జీవన్ రాం జయంతి
07/04/2023 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే
14/04/2023 – శుక్రవారం – డా.బీఆర్ అంబేద్కర్ జయంతి
22/04/2023 – శనివారం – రంజాన్
23/04/2023 – ఆదివారం – రంజాన్ మరుసటి రోజు
29/06/2023 – గురువారం – బక్రీద్
17/07/2023 – సోమవారం – బోనాలు
29/07/2023 – శనివారం – మొహర్రం
15/08/2023 – మంగళవారం – ఇండిపెండెన్స్ డే
07/09/2023 – గురువారం – కృష్ణాష్టమి
18/09/2023 – సోమవారం – వినాయక చవితి
28/09/2023 – గురువారం – మిలాద్ ఉన్ నబీ
02/10/2023 – సోమవారం – మహాత్మా గాంధీ జయంతి
14/10/2023 – శనివారం – ఎంగిలి పూల బతుకమ్మ
24/10/2023 – మంగళవారం – దసరా
25/10/2023 – బుధవారం – దసరా మరుసటి రోజు
12/11/2023 – ఆదివారం – దీపావళి
27/11/2023 – సోమవారం – గురు నానక్ జయంతి
25/12/2023 – సోమవారం – క్రిస్మస్
26/12/2023 – మంగళవారం – బాక్సింగ్ డే

లిక్కర్ స్కామ్‌లో ‘కనిక’ట్టు

*_లిక్కర్ స్కామ్‌లో ‘కనిక’ట్టు_*
_● ప్లైట్ లో లిక్కర్ సొమ్ము.!_
_● సుమారు రూ 500 కోట్లు తరలించారని అనుమానం.!_
_● కనికా విమానాల్లోనే రూ.కోట్లు తరలించారా?_
_● సంస్థ వివరాలు కోరిన ఈడీ_

Courtesy by: (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_*

*_దేశ రాజధాని దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం. హైదరాబాద్ నుంచి డబ్బు.. అదేనండీ కోట్లు, కోట్లు బస్తాల్లో ఎలా తరలించారనే కోణంలో  ఈడీకి బలమైన ఆధారం దొరికింది._*

*_అసలేం జరిగిందంటే..?_*
 గత నెల 17న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ రాబిన్‌ గుప్తా రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన శరత్‌చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివాల్‌ నడుపుతున్న ‘జెట్‌ సెట్‌ గో’ విమానయాన సంస్థ వివరాలు, ప్రత్యేక సర్వీసుల రాకపోకలపై వివరాలు ఇవ్వాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది.

*_పూర్తి వివరాలు పంపండి_*
కనికా టేక్రివాల్‌ ‘జెట్ సెట్ గో’ పేరుతో ప్రైవేటు జెట్ చార్టర్డ్‌ విమాన సర్వీసులు నడుపుతున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో చేతులు మారిన రూ.కోట్ల నగదు కనికా ఏర్పాటు చేసిన విమానాల్లోనే తరలించినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. కనికా సీఈవోగా నిర్వహిస్తున్న ‘జెట్‌ సెట్‌ గో’ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి లేఖ రాసిన తేదీ వరకు నడిపిన అన్ని ఛార్టర్డ్‌ విమానాల వివరాలు, ఆ ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు, విమాన మేనేజర్ల జాబితా అందించాలని ఈడీ లేఖలో పేర్కొంది. తాము అడిగిన సమాచారానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు పంపాలని స్పష్టం చేసింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం జరుగుతున్న విచారణలో భాగంగా ఈ వివరాలు కోరుతున్నట్టు ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ లేఖలో వెల్లడించారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో పెనక శరత్‌ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఆరోపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే అయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Wednesday, November 16, 2022

*పత్రికా ప్రకటన*

*పత్రికా ప్రకటన*

*ముందుగా #జాతీయపత్రికాదినోత్సవం సందర్భంగా #ప్రింట్ అండ్ #ఎలక్ట్రానిక్ #మీడియా మిత్రులందరికి  హృదయపూర్వక శుభాకాంక్షలు...Bplkm🪶*

*మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA బేతి సుభాష్ రెడ్డి బహుజనులను అవమానపరచాడు*

*#ప్రజాసంకల్పం (గ్రూప్ మీడియా) స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు బాపట్ల కృష్ణమోహన్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన & చట్టపరమైన హక్కులకు అనుగుణంగా నిస్వార్థంగా ప్రభుత్వ అధికారులు / ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం ప్రజల సమస్యలను పరిష్కారం చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది.ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి మద్దత్తుగా ఎప్పుడు అండగా లేదు #ప్రజాసంకల్పం*

*ప్రజల తరపున ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజల అభిప్రాయంతో వినతి పత్రం ఇవ్వడానికి తేది 15/11/2022 నాడు ఉప్పల్ MLA ఆఫీస్ (ప్రభుత్వంకు సంబందించిన అధికారిక కార్యాలయం)హుబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 కు వెళ్లడం జరిగింది.అప్పుడు సమయం సుమారు ఉదయం 11:50am to 12:15pm మధ్యలో. ఆ సమయంలో MLA గారు ప్రభుత్వము ఇచ్చిన  చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కుల పంపిణీ అయిపోయాక MLA గారికి వినతిపత్రం ఇవ్వడానికి కార్యాలయం లోపలికి వెళ్లడం జరిగింది. అక్కడ హాల్ లో వున్న MLA గారి PA ను కలిసి ప్రజలు ఇచ్చిన వినతిపత్రం చూపించడం జరిగింది. అతను ఆ వినతిపత్రం చూసి MLA గారికి ఇవ్వండి అని చెప్పాడు. పక్కన వున్న రూములో MLA గారు మరియు కొంతమంది కూర్చొనివున్నారు మేము ఆ రూములో వెళ్లి MLA గారికి వినతిపత్రం ఇవ్వబో్తుండగా MLA గారు అహంకారంతో మీరు చెప్పులు బయట వదిలి రావాలి అన్నాడు. నేను షాక్ అయ్యాను ఎందుకంటే నాకు మర్యాద తెలుసు. రూములో కూర్చున్న MLA & మిగితా వారు షూస్ / చెప్పులతో వున్నారు కదా అని చూసి మేము లోపలకి వెళ్ళాము.మరి మమ్మల్ని ఎందుకు బయట వదిలిరమ్మన్నాడు  ?? మేము బయటకు వెళ్లి మా చెప్పులను వదిలి లోపలకు వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.మరి లోపల వున్న వాళ్ళు షూస్ / చెప్పులు ఎలా వేసుకుని కూర్చున్నారు ??మేము వెళ్ళింది MLA కు ప్రభుత్వం ఇచ్చిన కార్యాలయంలో , అంతేకాని MLA గారి సొంత ఇంటికి వెళ్ళలేదు.ఒక బాధ్యత పదవిలో ఉండి అహంకారంతో బహుజనులము అయిన మమ్మల్ని అవమానపరిచినందుకు భేషరత్తుగా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA క్షమాపణ చెప్పాలి.*

Bplkm🪶

*COPY TO* :
*All Print & Electronic Media & YouTube News Channels & Social Media*

*@TelanganaCMO*
*@MinisterKTR*
*@KTRTRS*

*Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, November 15, 2022

#కేసిఆర్ సారు నిఘా ప్రజలు పెట్టారు ఎప్పుడో

*#కేసీఆర్ సారు #ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA మీద నిఘా పెట్టండి.... అతని పనితీరు గురించి #ప్రజాసంకల్పం ను సంప్రదించండి  మీ #ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ కన్నా అసలైన రిపోర్ట్ మేమే మీకు వాస్తవాలతో తెలియచేస్తాము.... Bplkm🪶*  *Copy to Group link Media*  prajasankalpam1.blogspot.com 

నాలుగో స్తంబమూ.... కూలిపోయింది.....!

*నాలుగో స్తంబమూ.... కూలిపోయింది.....!*

*తొలి తరంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌.. మలి దశలో కృష్ణ, శోభన్‌బాబు*

*ఎన్టీఆర్‌ తరహాలో అన్ని పాత్రలూ పోషించిన సూపర్‌ స్టార్‌ కృష్ణ*

తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం హీరోలెవరంటే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌..! వీరిలో ఎన్టీఆర్‌ పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలతో అలరించగా.. ఏఎన్నార్‌ రొమాంటిక్‌, కుటుంబ ప్రాఽధాన్య చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీరి స్థానాలను మలి తరంలో కృష్ణ, శోభన్‌బాబు భర్తీ చేశారు.

కృష్ణ.. ఎన్టీఆర్‌లా అన్ని తరహా పాత్రలతో రంజింపజేశారు. దీనికితోడుగా సాహసోపేత ప్రయోగాలతో దూసుకెళ్లారు. శోభన్‌బాబు కుటుంబ కథానాయకుడిగా, మహిళల అభిమాన హీరోగా మన్ననలు పొందారు.

అలా ఈ నలుగురూ తెలుగు సినీ సౌధానికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. సినిమా కథాంశాల్లోనే కాక సంఖ్యలోనూ వీరి మధ్య పోలికలున్నాయి. నలుగురిలోనూ కష్ణనే ఎక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌, కృష్ణ ఇద్దరూ 300 పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణ స్కోరు 350పైనే. ఏఎన్నార్‌ 255, శోభన్‌బాబు 230 సినిమాలు చేశారు. కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచిన నలుగురూ వెళ్లిపోయినట్లుయింది.

*సుజీవన్ వావిలాల*🖋️

షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి

*టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై స్ప‌ష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాల‌ని సీఎం సూచించారు. మ‌ళ్లీ పాత వాళ్ల‌కే టికెట్లు ఇస్తామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌య‌మే ఉంది. బీజేపీతో పోరాడాల్సిందే అని చెప్పారు. ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు*. 

Monday, November 14, 2022

సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు

*_ఇక సెలవు_*

*_దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.._*
*_‘సూపర్‌స్టార్‌’ కృష్ణ ఇకలేరు_*

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు)_

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు.

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

*_తేనె మనసులతో మొదలుపెట్టి.._*

డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్‌ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది.

*_గూఢచారి 116 సక్సెస్‌తో.. 20 సినిమాల్లో ఛాన్స్‌_*
రెండో సినిమా ‘కన్నె మనసుల్లో’ నటిస్తుండగానే ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అంతేనా.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంద్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢచారి 116తో ఆయన ఇమేజ్‌ అమాంతం పెరగడమే గాక.. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్‌బాండ్‌ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజిని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటిచిత్రం కూడా ఇదే.

*_ఏడాదిలో 18 సినిమాలు.._*
70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు.

*_కొత్త సాంకేతికతను పరిచయం చేసి.._*
నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్‌లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరిండ్‌ అండ్‌ డాషింగ్‌’ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్‌లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే.

*_రాజీవ్‌గాంధీ స్నేహంతో రాజకీయాల్లోకి.._*
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగుదేశం, ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 2016లో వచ్చిన ‘శ్రీ శ్రీ’ కృష్ణ నటించిన చివరి చిత్రం.

*_పురస్కారాలు_*
సినీరంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి.  ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి.

Sunday, November 13, 2022

దళితబంధు లాంటి పథకం ఇతర కులాలకు!!

https://youtu.be/FWo_Qw62bwo
  *రాజు లాంటి కుటుంబాలు తెలంగాణ లో చాలా వున్నాయి. కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల న్యాయమైన అవసరాలను కనుక్కోవడంలో నిర్లక్ష్యం చేశాయి.#ఉచితపథకాలు అర్హులైన వారికంటే అర్హులు కాని వారు అడ్డదారిలో పథకాలు పొందుతున్నారు ఇది వాస్తవం.*                                                                                                                        *NOTE* : *దయచేసి అందరు ఈ వీడియో అన్ని గ్రూప్ లలో / సోషల్ మీడియా లో #SHARE చేయగలరు.... Bplkm🪶*

Saturday, November 12, 2022

చదువులో టాపర్లు....మత్తుకు బానిసలు....!

*చదువులో టాపర్లు....మత్తుకు బానిసలు....!*

*పోలీసుల కౌన్సిలింగ్‌లో కన్నపేగు ఆవేదన*

హైదరాబాద్‌: ''మా అబ్బాయి.. చదువులో టాపర్‌.చాలా బుద్ధిగా ఉంటాడు. కొద్దిరోజుల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాలి. ఇప్పుడు మా వాడు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతుంటే నమ్మలేకపోతున్నాం. పోలీసు కేసుల్లేకుండా నా బిడ్డతో అలవాటు మాన్పించండి' ఓ కన్నతల్లి ఇటీవల హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులకు చేసిన వేడుకోలు ఇది. ఇంటా.. బయటా బుద్ధిగా ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా మత్తు ఉచ్చులో చిక్కుకున్న బిడ్డల భవిష్యత్తుపై కన్నపేగు కలవరపడుతోంది. ప్రస్తుతం కౌన్సిలింగ్‌ పొందుతున్న బాధితుల్లో సుమారు 20-30 మంది విద్యార్థులున్నారు. వీరంతా క్యాంపస్‌ ఉద్యోగాలు పొందినవారు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైనవారే కావడం గమనార్హం.

*1200 మందికి నోటీసులు....!*
10 నెలల వ్యవధిలో నగర పోలీసులు మాదకద్రవ్యాల సరఫరాపై సుమారు 40-50కు పైగా కేసులు నమోదు చేశారు. నగరానికి డ్రగ్స్‌ చేరవేస్తున్న 10 మంది కీలక సూత్రధారులను అరెస్ట్‌ చేశారు. వీరి జాబితాలో ఏపీ, తెలంగాణలో 2000 మంది వరకూ మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. 1200 మందికి నోటీసులు జారీచేశారు. వీరిలో మొదటి దఫా 287, రెండో సారి 172 మంది మత్తు బాధితులను సైకాలజిస్టుల వద్దకు కౌన్సిలింగ్‌కు పంపారు. తాజాగా 58 మంది డ్రగ్స్‌ వాడకం దారుల నుంచి నమూనాలు(శాంపిల్స్‌) సేకరించి వైద్యపరీక్షలకు పంపారు.

*అమ్మో... ఆడపిల్లలు..*
గంజాయి గుప్పిట చిక్కుతున్న జాబితాలో 50 శాతం మంది ఆడపిల్లలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సున్నితమైన అంశం కావడంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారికి మనస్తత్వ నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నట్లు వివరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

తెలంగాణలో మరో పార్టీ

*_తెలంగాణలో మరో పార్టీ_*
_◆ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో.._
_◆ పార్టీ పేరు, జెండా రూపకల్పనపై కసరత్తులు_
_◆ రాజకీయ బాటలో మాజీ ఐఏఎస్ లు_
_◆ ఇప్పటికే బీఎస్పీలో చేరిన మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్_
_◆ లోక్ సత్తా పేరుతో ఓట్లు చీల్చిన జయప్రకాష్ నారాయణ్_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 000 0009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సర్వే వార్తల నేపథ్యంలో తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. గతంలో 'లోక్ సత్తా' పేరుతో జయప్రకాష్ నారాయణ ఓట్లను భారీగా చీల్చటం జరిగింది. తాజాగా మరో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నూతన పార్టీని పెట్టబోతున్నారు. ఆయన గత కొంత కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రశ్నిస్తు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న రాజకీయ పార్టీకి జెండా, ఎజెండా ఖరారు చేసే.దిశలో మురళి కసరత్తులు చేస్తున్నారు._*

*_ప్రస్తుతం...:_*
ఆకునూరి మురళి తన సొంత రాష్ట్రమైన తెలంగాణలో ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లో దూకుడు పెంచారు.

*_జయప్రకాష్, ప్రవీణ్ బాటలో..:_*
ఇప్పుడు ఆకునూరి మురళి కూడా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రవీణ్ కుమార్ బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

*_మునుగోడుపై ఫిర్యాదు:_*
ఇటీవల మునుగోడు ఉపఎన్నిక సమయంలోనూ ఆయన స్పందించారు. ఉప ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఆయన లేఖ కూడా రాశారు.

*_బలమైన పార్టీల మధ్యలో..:_*
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. ఇప్పడు మిగతా పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆకునూరి మురళి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో తప్పకుండా మార్పులు చోటు చేసుకుంటాయి.

బాక్స్:
*_గతంలో ఆయన..:_*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, స్టేట్ ఆర్కివ్స్ సంచాలకుడిగా పని చేశారు. ఇంకా పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన స్వచ్చంద పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీలోని జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారులుగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.