Saturday, March 30, 2024
*రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండొద్దు... సీఎం రేవంత్ రెడ్డి*
Friday, March 29, 2024
#DrugsFreeHyderabad అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
కెసిఆర్ పై @TelanganaDGP కు ఫిర్యాదు
Tuesday, March 26, 2024
భుజంగారావు...భూదందాలు, సెటిల్మెంట్ లు..అక్రమ ఫోన్ ట్యాపింగ్
Monday, March 25, 2024
అధికారమే పరమావధిగా నేతల జంపింగ్‌లు...
Sunday, March 24, 2024
*రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన... సీఎం రేవంత్ రెడ్డి*
Friday, March 22, 2024
Supreme Court Rebukes Telangana Police
https://www.livelaw.in/supreme-court/supreme-court-rebukes-telangana-police-again-says-preventive-detention-must-not-be-applied-routinely-without-application-of-mind-253186?utm_source=social&utm_partner=livelaw&utm_campaign=sticky-share&utm_medium=twitter
Thursday, March 21, 2024
*_కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. దిల్లీలో టెన్షన్ టెన్షన్_*
Tuesday, March 19, 2024
ప్రస్తుత రాజకీయాలు - ఎత్తుగడలు
బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.
Continue illegal Business between BRS Leaders - officials.
- బీఆర్ఎస్ లీడర్స్ యే బ్రోకర్స్.
- మున్సిఫల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కుమ్మక్కు.
- పాలన మారి 100 రోజులు దాటిన వారికే ప్రాముఖ్యత.
- నిజాంపేట్ ఏసీపీతో పాటు బీఆర్ఎస్ నేత రాములు అరెస్ట్.
- అధికారులకు డబ్బులు వసూలు చేసి ఇచ్చేది వీళ్లే.
- కాంగ్రెస్ నేతలు పిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార ఘనం.
- అక్రమ మైనింగ్ తో మట్టిలో నుంచి ఇసుక దందా.?
- రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కోనసాగుతున్న బీఆర్ఎస్ నేత అక్రమాలు.
- కార్పోరేషన్స్, మున్సిపాల్టీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.
- ముడుపులే ముఖ్యమంటున్న ఆఫీసర్స్.
- మాజీ మంత్రుల కన్నుసన్నలోనే కలెక్టర్స్.
- ఇంకా ఆగమాగంగానే అడ్మినిస్ట్రేషన్ పై
- ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.
Courtesy / Source by :
Devender Reddy
9848070809.
తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్ తో బొందల గడ్డలగా మారుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు తెర లేపుతున్నారు. అధికారంలో ఉన్నప్పటి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బరి తెగించారు. ఇప్పుడు ఎదైనా పైసలతో కొట్టి పని చేయించుకుంటున్నారు. మధ్యవర్తులుగా ఈ బీఆర్ఎస్ నేతలే ఉంటున్నా.. అధికార పార్టీ నేతలు ఇంకా కళ్లు తెరవడం లేదు. కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ అవినీతిని చూడలేని వారు అధికారులను ప్రశ్నించినా.. ఆ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఎదో వంక చెప్పి తప్పించుకోవం అలవాటుగా చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో చేతికి మరక అంటకుండా భారీగా డబ్బులు వస్తుండటంతో ఎవ్వరితో మాకేంటి అంటూ విచ్చల విడితనం పెరిగిపోతుంది. అందుకు ఉదహారణ నిజాంపేట్ కార్పోరేషన్ ఏసీపీ శ్రీనివాస్ రావు వ్యవహారమే. ఒక్క టీ స్టాల్ ని రోడ్డుకు అడ్డగా ఉంచేందుకు అక్షరాల 1 లక్ష 50 వేలు డిమాండ్ చేయడం, బీఆర్ఎస్ నేత రాములు వాటిని తీసుకెళ్లి ఇవ్వడంతో ఇలాంటి అంశాల పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. నిజాం పేట్ నుంచి బాచుపల్లి వరకు అక్రమ నిర్మాణాలతో నిత్యం ట్రాఫిక్ తో ప్రయాణికులు కొట్టుమిట్టులాడుతున్నారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడే లేడు. పైగా ఆ వంకతో లక్షల రూపాయలు బీఆర్ఎస్ నేతల నుంచి చేరుతున్నాయి.
లే-అవుట్స్ కబ్జా చేసినా పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగిన నిజాంపేట్ ఏసీపీ శ్రీనివాస్ రావు రేణుకా ఎల్లమ్మ కాలనీ భూమిని కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే రైజ్ డెవలఫర్స్ కి ఒత్తస్సు పలికి అక్రమ నిర్మాణాలను ప్రొత్సహిస్తున్నారు. తహాశీల్దార్ ని అడిగితే కమిషనర్ ని కమిషనర్ ని అడిగేతే హెచ్ఎండీఏ ని ఇలా ఒక్కిరి పై ఒక్కరు నిందలు వేసుకుంటూ ప్రజా అవసరాల కోసం ఉండే 800 గజాలను కబ్జాకు ప్రొత్సహించారు. నిజాం పేట్ లో ఎన్నో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడానికి కారణం ఈ ఏసీపీ శ్రీనివాసరావుయే నని అంటున్నారు.
మైనింగ్ పై మౌనమేళ.
బీఆర్ఎస్ నేతల రెండో అక్రమ సంపద ఇల్లీగల్ మైనింగ్ యే . పఠాన్ చెరువు ఎమ్మెల్యే సొదరుడు గూడెం మధుసుధన్ రెడ్డిని అక్రమంగా క్రషర్ మైనింగ్ జరిపారని అరెస్ట్ చేశారు పోలీసులు. పఠాన్ చెరువు నియోజక వర్గం మొత్తం అక్రమ మైనింగ్ యే నడుస్తుంది. హీరో ప్రభాస్ దత్తత తీసుకున్న 1800 ఎకరాల్లోను మైనింగ్ మాఫీయా రాజ్యమేలుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో మట్టి తీసుకెల్లుతున్నారు. అక్రమ మొరం మట్టితో మోటర్స్ సహాయంతో మట్టిలో నుంచి ఇసుకను తీస్తున్నారు. ఇసుకకు భారీగా డిమాండ్ ఉండటంతో మట్టి ఇసుకనే భయట మార్కెట్ లో అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా గులాబీ నోట్లకు ఆశ పడి మౌనంగానే ఉంటున్నారు. సహాజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి పైనా ఉంది.
అక్రమ నిర్మాణాల్లోను అదే చేతివాటం.
నిజాం పేట్ , దుండిగల్, పోచారం, మీర్ పేట్, నార్సింగ్, రాజేంద్రనగర్, అమీన్ పూర్ ఇలా నగర శివార్లలో ఉన్న పాతిక మున్సిపాల్టీలలో అక్రమ నిర్మాణాలు యద్దేశ్చగా కొనసాగుతున్నాయి. చట్టాలు, హైకోర్టు తీర్పులు ఎన్ని ఉన్నా.. అధికారులతో కుమ్మక్కైనా బీఆర్ఎస్ నేతలు మాముళ్లను ఇప్పించడంతో అటూ వైపు కూడా చూడటం లేదు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు పిర్యాదు చేసినా.. పూర్తి అయ్యిపోయాయి మేము ఎమి చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నారు. జీ+1 అంటూ 5 ఏండ్ల క్రితం గ్రామ పంచాయితీ నుంచి తీసుకున్న ఫేక్ అనుమతులతో ఒక్కొక్క ప్లాట్ కి లక్ష ల్లో వసూలు చేసి ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
మాజీ మంత్రుల కనుసన్నలోనే కలెక్టర్స్,
సిద్దిపేట్ జిల్లాలో అధికారులు అంతా మాజీ మంత్రి కనుసన్నల్లోనే పనులు చేస్తున్నారు. అక్రమాలు , అవినీతి అంతా వారి చేతులు మీదిగానే జరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెల్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వీటన్నింటి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Friday, March 15, 2024
ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యుల కమిటీ
రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి @revanth_anumula ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు.
ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు. @ProfMKodandaram
#Telangana #StateGovernmentEmployees
#TNGO
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1768641679165358168?t=NzvjwNScKm-Y4UGbc0Mayg&s=19
Thursday, March 14, 2024
Yashodha Hospitals donated Rs 162 crore to Electoral Bonds.
My Home Cements 156 acres Bhoodan lands encroached
Tuesday, March 12, 2024
మహిళల భద్రత కోసం..T-SAFE
మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి @revanth_anumula మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్ రూపొందించినట్టు పోలీసులు వివరించారు.
@mpponguleti @Tummala_INC @seethakkaMLA @KMuraliSurekha @TelanganaCS @TelanganaDGP @Shikhagoel_IPS
#TelanganaPolice #WomenSafetyWing #TSAFE
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1767504890136498385?t=ZHtn7fcwPMEujNagqARg7g&s=19
Monday, March 11, 2024
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు
ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి @revanth_anumula సంకల్పించారు. అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి పాఠశాలలంటే ప్రజల్లో పూర్తి విశ్వాసం కల్పించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన అంశంపై ఎంసీఆర్‌హెఆర్డీలో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వేసవి సెలవులు ముగిసేలోగా వసతులు మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులకు నిర్ధేశించారు.
📕ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి చర్యల వల్ల పాఠాశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడం, టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు చెప్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.
📕రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు, న్యాక్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం వంటి చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టం తీసుకొచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి @Min_SridharBabu , ప్రభుత్వ సలహాదారు @Vemnarenderredy , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCS @TSEduDept #SchoolEducation #TelanganaGovernment #elearning #SelfHelpGroups #DigitalClasses
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1766895342895972369?t=DnpD7WDR4n_O922Sji6ISw&s=19
దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు
Sunday, March 10, 2024
మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది
ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి @revanth_anumula తెలిపారు. ఆదివారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. "మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్భంధాలతో పాలన కొనసాగిస్తామనుకోవడం భ్రమ, మా ప్రజా ప్రభుత్వం చర్చలు, సంప్రదంపులకు అవకాశం కల్పిస్తుంది. మీలో విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపాం" అని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం ఆయా సంఘాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల పోరాటాలతోనే సిద్దించింది. తామే సాధించామని ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుంది. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు చెల్లించినా ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. 11 వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. @Min_SridharBabu #TelanganaGovernment #EmployeeUnions
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1766895472499953958?t=qqw1rrMRS6nk9pDG8w4PBw&s=19
ఈ పోరాటం భవిష్యత్ తరాలకోసం Bplkm🪶
Saturday, March 9, 2024
అన్నదాతలకు శాపంగా మారిన కందుకూరు రెవిన్యూ కార్యాలయం
Friday, March 8, 2024
రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి
Wednesday, March 6, 2024
చెరువును పూడ్చి కళాశాల
Courtesy / Source by :
https://www.dishadaily.com/telangana/another-big-shock-for-brs-mla-marri-rajasekhar-reddy-demolition-of-illegal-buildings-video-306056
మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం....రేవంత్ రెడ్డి
Tuesday, March 5, 2024
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంటిలిజెన్స్ అధికారి సస్పెండ్
బీఆర్ఎస్ పాలనలో చట్టానికి విరుద్దంగా ఎలాంటి పనులైనా చిటికలో చేశారు. ఆనాటి ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, ఏ ఆప్ లో చాట్ చేసినా ఇట్లే ఫోన్ టాప్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారు. వారి వీక్ నెస్ తెలుసుకుని పార్టీలోకి వలసల పర్వం కొనసాగించారు. ఇదంతా అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ, రిటైర్డ్ ఆఫీసర్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరి అరాచకాలు ఒక్కొక్కటి భయటపడుతున్నాయి.
ప్రయివేట్ సైన్యం నడిపించారు.
బీహార్ రాష్ట్రంలో అనాధికార వ్యవహారాలు నడిపించినట్లు.. బీహార్ కి చెందిన అల్ ఇండియా అధికారులు, బీఆర్ఎస్ పార్టీని నడిపించారని అరోపణలు ఉన్నాయి. అందుకు అప్పటి సీఎం కి చెందిన సామాజిక వర్గాన్ని గ్రిప్ లో ఉంచుకున్నారు. సీఎంఓలో పని చేసే వారితో పాటు ఇంటలిజెన్స్ లో పని చేసేవారు ఉన్నారు . అందుకు ప్రభాకర్ రావు పదవి కాలం ముగిసినా కొనసాగించి అత్యంత కీలకమైన ఎస్ఐబీ అప్పగించారు. ఇది మావోయిస్టుల కదలికల పై దృష్టి పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ . కాని ఈ పేరుతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతల ఫోన్స్ టాప్ చేశారు. నిజాం రాజు కంటే అత్యంత కఠినంగా నిర్బయించారు. రాత్రికి రాత్రి తలుపు బద్దలు కొట్టి తీసుకెళ్లారు. అదే కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయివేట్ చాట్ కూడా తెలుసుకున్నారు. చట్టం వారి చుట్టంగా మలుచుకుని ఇష్టానుసారంగా వ్యవహారించారు. అయితే ఈ ఫోన్ టాపింగ్ నే నమ్ముకున్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆరాచాకాలకు తెర లేపింది. సెంట్రల్ యాక్ట్ కి విరుద్దంగా వ్యవహారించారు. ప్రతిపక్షాల ఫోన్ నెంబర్స్ మావోయిస్టుల అనుచరుల పోన్ నెంబర్స్ గా చేర్చి మరి ఫోన్ టాపింగ్ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు, ఆనాటి ప్రభాకర్ రావు ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయి. అందుకు మొదటి అడుగే పోలీస్ చరిత్రలో ఓ ఇంటలిజెన్స్ అధికారి సస్పెండ్ వ్యవహారం.
sexual harassment at work place by 5 male officers
Monday, March 4, 2024
మట్టిలో మాణిక్యం
Sunday, March 3, 2024
అసైన్డ్ భూమిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనను మార్చుకోవాలి
Hard Work, Commitment, and Success:
Saturday, March 2, 2024
Billionaire MPs: The richest Rajyasabha MP is from Telangana
Billionaire MPs: The richest Rajyasabha MP is from Telangana
Dr Bandi Partha Saradhi Reddy of Bharat Rashtra Samithi tops in the country among Rajyasabha Members of Parliament with Rs 5300 crore assets.
Alla Ayodhya Rami Reddy of Yuvajana Sramika Rythu Congress Party from Andhra Pradesh has assets worth Rs 2577 crore assets and stands number 2 in the country among Rajyasabha MPs.
The total assets for 7 MPs analysed from #Telangana is Rs 5,821 crores, followed by 11 MPs analysed from Andhra Pradesh is Rs 3,934 crores
5(45%) out of 11 MPs from Andhra Pradesh, 4 (57%) out of 7 MPs from Telangana are Billionaire MPs with declared assets worth more than Rs 100 crores.
11 YSRCP Rajya Sabha MPs have average assets worth Rs. 357 crores. The total assets of 11 YSRCP MPs analysed is Rs 3,934 Crores
4 BRS Rajya Sabha MPs have average assets worth Rs. 1383 crores. The total assets of 4 BRS MPs analysed is Rs 5,534 Crores.
71 per cent of Rajayasabha MPs from Telangana are facing criminal cases.
4(36%) out of 11 Rajya Sabha MPs from YSRCP are facing criminal cases.
Source: Association for Democratic Reforms
@adrspeaks
medicines made of chalk powder
Friday, March 1, 2024
త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్లు
పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.
✅ రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం
✅ త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం
✅ మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది
✅ ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నాం
✅ పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నాం
✅ గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశాం
✅ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం
✅ కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాం
✅ రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నాం
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1763557094446580086?t=oIRPCxzOldRgvzpBddi9UA&s=19