Wednesday, July 31, 2024
𝗝𝗼𝘂𝗿𝗻𝗮𝗹𝗶𝘀𝘁𝘀 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗰𝗼𝗺𝗲 𝗶𝗻𝘁𝗼 𝗽𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀..! (Unanimous Resolution in Hyderabad Round Table Meeting)
పాత్రికేయులు రాజకీయల్లోకి రావలసిందే..!
హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్.... స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
Tuesday, July 30, 2024
*_పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం_*
Sunday, July 28, 2024
Telangana Father Mourns Daughter Who Died in Delhi IAS Coaching Centre Flood
*కల్వకుర్తి TO హైదరాబాద్ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తాం.... సీఎం రేవంత్ రెడ్డి*
Saturday, July 27, 2024
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశాలకు ఆoక్షలు ఎందుకు?
Friday, July 26, 2024
పేదింటి పిల్లల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత
సిద్దిపేట బిడ్డ ఆర్యన్ రోషన్ ఐఐటీలో చేరుతాడిక..
🟩 సెమిస్టర్ ఫీజుతోపాటు ల్యాప్ టాప్ అందించిన కలెక్టర్
🟩 పేదింటి పిల్లల చదువులకు ప్రజాప్రభుత్వం చేయూత
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటీలో సీటు సాధించాడు. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి @revanth_anumula గారి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం స్పందించింది.
@Collector_SDPT మను చౌదరి గారు విద్యార్థి ఆర్యన్ రోషన్ ను శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో సీటు పొందిన ఆర్యన్ రోషన్ కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు. అలాగే చదవు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్ ను కూడా కొనిచ్చారు.
భవిష్యత్తులోనూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని, ఐఐటీలోనూ రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థి ఆర్యన్ రోషన్ కు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ @Garimakagrawal గారు, ఇతర అధికారులు కూడా ఉన్నారు.
#Siddipet #Telangana
Courtesy / Source by : https://x.com/CPRO_TGCM/status/1816850369999438214?t=2sDcDV6bS2BMWxfAU0mGiw&s=19
*ఉత్తమ తెలుగు జర్నలిస్టు లు -2024 జాబితా విడుదల*
Thursday, July 25, 2024
తెలంగాణ బడ్జెట్ లో విద్య వైద్య రంగానికి తీవ్ర అన్యాయం
*_అసెంబ్లీ పాస్ లు అడుక్కోవాలా..?_*
అవినీతి చేప (SHO) సబ్ ఇన్స్పెక్టర్ - బాణాల రాము.
#ACB Officials caught Banala Ramu, S.I. of Police, Palvoncha Town Police Station of Bhadradri Kothagudem district for he demanded and accepted the #bribe amount of Rs.20,000/- from an Advocate to do official favour to the accused in a Case.
#AntiCorruptionBureau #Justice #Telangana @CVAnandIPS
ఒక నేరములో నిందితుడయిన వ్యక్తికి సాయం చేయడం కోసం అడ్వకేట్ నుండి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారుల చేతికి చిక్కిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ (SHO) సబ్ ఇన్స్పెక్టర్ - బాణాల రాము.
#అవినీతినిరోధకశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1816442989490659786?t=wHfo-pqTyLFhujIuoLyibA&s=19
Wednesday, July 24, 2024
_*పాలమూరు కు పండుగ సాయన్న నామకరణం*_
Haffizpet Land Scam 1000Cr
Haffizpet Land Scam 1000Cr
బీఆర్ఎస్ భూ మాఫియాను అధికారులు కంటిన్యూ చేస్తున్నారా..?
హాఫిజ్ పేట్ పాయిగా ల్యాండ్ రికార్డులో మార్పులు.
జూన్ 14 వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న 1000 కోట్ల ఆస్తి.
జూన్ 17 నాటికి పట్టా ల్యాండ్ గా మార్చిన రంగారెడ్డి కలెక్టర్.
దశల వారిగా హైకోర్టుకు తప్పుడు సమాచారం.
అనుకూలమైన వారిపై అప్పిల్ కి వెళ్లని వైనం.
వివవాదస్పదమైన టైటిల్ పై మ్యూటేషన్.
జస్టిస్ నవీన్ రావు, ఎంఎస్ ఆర్ తీర్పుల్లో ఎంతో తేడా..?
అప్పటి కలెక్టర్ శ్రీధర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమైంది. ?
విచారణ పూర్తి ముగియకుండానే 10 ఏండ్ల క్రితం ఫైల్ మ్యూటేషన్ చేసేశారు.
మూడు రోజుల్లో 24 ఎకరాలు పట్టాగా మార్చేశారు.
800 మంది ప్లాట్ ఓనర్స్ కి లోయర్ కోర్టు ఆర్డర్స్ మర్చిపోయారా..?
చర్చి జాగాలో లార్డ్ ఇక్బాల్ అలీఖాన్ ఫోర్జరీ సంతకాలేంటీ?
పీఎస్ రెడ్డి భార్య విజయరెడ్డికి చేసిన అసైన్మెంట్ డీడ్ లో జరిగిందేంటి.?
హాస్తం పార్టీ అధికారంలోను ఆ ఆఫీసర్స్ అదే దందాలు కొనసాగిస్తున్నారు..?
ఎవ్వరి ఒత్తిళ్లు పనిచేశాయి.?
లక్షల కోట్ల వివాదస్పద భూముల పై రియల్ మాఫియా పట్టుసాధిస్తుందా..?
హాఫీజ్ పేట్ ల్యాండ్స్ లాస్ట్ అప్డెట్స్ పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనం.
Courtesy / Source by :
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (9848070809), Lands & Records.
హైదరాబాద్ భూములంటే బంగారు బాతులాంటివి. నాయకులు ఒక్క సెటిల్మంట్ తో వందల కోట్లు పోగేసుకుంటారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ని కోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తూ భూ దందాలు చేస్తుంటారు. నేతలు చెప్పినట్లు అధికారలు వినడంతో తలకొంత పంచుకుంటూ విలువైన భూములపై వేల కోట్ల వ్యాపారం చేస్తుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 3 లక్షల కోట్ల వివాదస్పద భూములను క్లియర్ చేసుకున్నారు. రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖ సహాకారాలతో వారి చేసిందే చట్టంలా వ్యవహారించారు. వేల కోట్ల భూముల సమస్యలకు పరిష్కారం చెప్పుతూ ఫర్సెంటెజీలు పంచుకున్నారు. అద్దాల భవంతులు నిర్మించి అమ్మేసుకున్నారు. వారు చేసిన భూ అక్రమణల పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇప్పుడు అదే దందాలు అధికారుల సహాకారంతో కొంత మంది చేస్తున్నట్లు కనిపిస్తుంది. హాఫీజ్ పేట్ లోని వెయ్యి కోట్ల విలువచేసే 24 ఎకరాల 35 గుంటల పై రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చూస్తే ఇట్లే తెలిసి పోతుంది.
హిస్టరీ ఇదే.
హిఫీస్ పేజ్ సర్వే నెంబర్ 77 లోని 64 ఎకరాలు 1981లో హిందుస్తాన్ ఏరో నాటికల్ లిమిటెడ్ సోసైటీ కొనుగోలు చేసింది. ఇందులో కల్వరి టెంపుల్ లార్డ్ అలీఖాన్ ఫోర్జరీ సంతకాలతో 20 ఎకరాల వరకు అక్రమించుకుంది. మరో 25 ఎకరాల్లో వెదిరి ఎస్టేట్ వాళ్లు చుట్టు రేకులు పెట్టేశారు. ఈ భూ వివాదం సీఎస్ 14/1958కి చెందింది. 813 మంది ఉద్యోగులు కలిసి సోసైటి పెట్టుకుని భూమి తీసుకున్నారు. ప్రభుత్వం- పాయిగా ల మధ్య కోర్టు కేసుల్లో నలుగుతుంది. పాయిగా ఫ్యామిలీలో నుంచి కొంత మంది డిఫెండెండ్స్ వద్ద నుంచి కొనుగోలు పూర్తి అయింది. అయినా చాలా మందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వెదిరి ఎస్టేట్ అక్రమించుకున్న 25 ఎకరాల్లో టైటిల్ లేకుండానే ఇప్పుడు మ్యూటేషన్ పూర్తి అయింది. అగష్టు 16, 2004లో పుత్తి సదాశివ రెడ్డి (పీఎస్ రెడ్డి) చనిపోయారు.. జూన్ 10, 2005లో ఆయన భార్య విజయారెడ్డి కు టైటిల్ లేకుండానే అసైన్మెంట్ డీడ్ ప్రకారం వెదిరి ఎస్టేట్ కి సెల్ డీడ్ చేశారు. జూలై 6, 2002న చేసిన అసైన్మెంట్ డీడ్ కి ఇండియాన్ రిజిస్ట్రేషణ్ యాక్ట్ 1908. సెక్షన్ 23 ప్రకారం 4 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాని ఎప్రిల్ 4, 2005లో అమె పేరు మీదికి వ్యాలుడేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత జూన్ 10,2005న వెదిరికి అమ్మేయడం చట్టవిరుద్దమని అసలు పీఎస్ రెడ్డికి అసైన్మెంట్ డీడీ చేయాడంలో అమ్మినవారికి టైటిల్ లేదని అప్పటి కలెక్టర్ శ్రీధర్ హైకోర్టుకు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక అధారంగానే జస్టిస్ నవీన్ రావు రిట్ పిటిషన్ 27045 ఆఫ్ 2013 ఆర్డర్ లో ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 81,82,83 ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ ని క్యాన్సల్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీని పైనే మళ్లీ మ్యూటేషన్ చేయాల్సిందిగా రిట్ నెంబర్ 15056/2014 లో వెదిరి ఎస్టేట్ వాళ్లు పిటిషన్ దాఖలు చేశారు. అన్ రిజిస్ట్రర్డ్ అసైన్మెంట్ డీడ్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం చేయాలని గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను, ఫ్లాటింగ్ జరిగిన వ్యవహారాన్ని దాచిపెట్టి సైరస్ ఇన్వెస్టిమెంట్, ఎంతో మంది ఉన్న ఢిపెండెట్స్ వద్ద నుంచి అగ్రిమెంట్లు చేgసుకున్నామని కోర్టుకు తెలిపి 2015లో మ్యూటేషన్ చేసేలా కలెక్టర్స్ కి అదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మరో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అప్పటి నుంచి 2023 వరకు ఆ భూమిని మ్యూటేషన్ కాలేదు. ఆనాటి రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు పై కంటెప్ట్ ఆఫ్ కోర్టు పై కేసులు వేశారు. కలెక్టర్ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఆయన పై ఉన్న కోర్టు దిక్కరణ కేసుల పై తీర్పు ఇచ్చింది.
జస్టిస్ ఎమ్మెస్సార్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈ ఏడాది జనవరి 23న సీసీ నెంబర్ 131 ఆఫ్ 2024ని దాఖలు చేశారు. వేదుల వెంకట్ రమణ పిటిషనర్ తరుపున వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ మహ్మాద్ ఇమ్రాన్ ఖాన్ కంప్టెట్ తీర్పును అమలు చేస్తామని ఒప్పేసుకోవడంతో.. మూడు రోజుల్లోనే అంటే 17-06-2024న వెదిరి ఎస్టేట్ పై మ్యూటేషన్ చేస్తూ పాస్ బుక్స్ ఇష్యూ చేస్తున్నారు. దీంతో వెయ్యి కోట్ల భూమి ఇట్లే క్లియర్ అయిపోయింది. ఇదే పాయిగా భూముల్లో ఇప్పటికి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. HAL ఎంప్లాయిస్ ఓ.ఎస్ నెంబర్. 359/2001 లో 2008లో టైటిల్ పై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది రంగారెడ్డి కోర్టు. నాలుగు వాయిదాల్లోనే అడిషనల్ అడ్వకేట్ కంటెప్ట్ పై ఉన్న తీర్పును అమలు చేస్తామని కోర్టుకు తెలియచేస్తాను. సుప్రీం కోర్టులో ఇదే భూముల పై ఎస్ ఎల్ పీ 2844/2021 సుఖేష్ గుప్తా భూమి పై ఇప్పటికి విచారణ కొనసాగుతుంది. ఇలా అనేక కేసులను మేర్జ్ చేసి టైటిల్ తో పాటు భాగస్వామ్యం చేసిన ప్రాపర్టీస్ పై అడ్వకేట్ కమిషన్ నివేదికలు పటాపంచల్ అవుతున్నాయి. నవీన్ మిట్టల్ కి హైదరాబాద్ ల్యాండ్స్ ని తెలివిగా చేతికి మట్టి అంటకుండా ఎలా చేయాలో వెన్నతో పెట్టిన విద్య. అందుకే అయన డైరెక్షన్ లోనే ఓ మంత్రి, మరో కీలక నేత ఈ తతంగం ముందు ఉండి నడిపించినట్లు తెలుస్తుంది. మరిన్ని భూములను క్లియర్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తి కాకుండానే అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకున్నట్లు ఈ ప్రభుత్వం వాడేసుకునేందుకు సిద్దమయినట్లు తెలుస్తుంది.
*@TelanganaCMO @TelanganaCS*
*@PrlsecyMAUD*
*@CPRO_TGCM @IPRTelangana @CollectorRRD @ACLB_Rangareddy @GHMCOnline @HMDA_Gov @CommissionrGHMC*
https://x.com/Praja_Snklpm/status/1816077013876392117?t=lX_JQToWx2Azy-Tri-_lfQ&s=19
Tuesday, July 23, 2024
ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావు ఎక్కడ?
Monday, July 22, 2024
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula కేంద్ర జల శక్తి మంత్రి @CRPaatil ను కోరారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రి శ్రీ @UttamINC లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.
* కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా వివరించారు.
* రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
* జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని వివరించారు.
* జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తుచేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు.
* తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. @DoWRRDGR_MoJS
#Telangana #MusiRiverFrontDevelopment
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1815352859975917781?t=R6ek7Gg_dtoUqAMM38lyMg&s=19
“Smitha apologise publicly in 24 hours” Bala Latha gives ultimatum
Sunday, July 21, 2024
మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు
మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు #HYDRAA అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
* గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు.
* #Hyderabad అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
#MusiRiverFrontDevelopment
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1814610096267382881?t=I-_swUvAxvM3SkJtmvFF_g&s=19
Saturday, July 20, 2024
*హైదరాబాదులో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత నలుగురి అరెస్ట్*
Friday, July 19, 2024
విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం
విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం
🔹3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన
🔹4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం
🔹విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు
హైదరాబాద్ :
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం గారికి సీఎం సూచించారు.
ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు.
అంగన్ వాడీలకు సింగిల్ టీచర్
చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్ వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.
రెసిడెన్షియల్స్ కు రవాణా సదుపాయం
3వ తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు.
విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయడానికంటే ముందే విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు.
సీఎస్ఆర్ ఫండ్స్ తోనూ..
పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సీఎస్ఆర్) ఫండ్స్ పైనా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
#IntegratedResidentialSchools #Telangana
Courtesy / Source by : https://x.com/CPRO_TGCM/status/1814252415975383142?t=fVy-8qbmfz0J4RNAlSiFNQ&s=19
#ACB officials#caught Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet
#ACB officials# caught Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet while accepting the #bribe amount of ₹25,000 for issuing the Fishing Rights Document for a Fisherman Co-Op. Society.
#AntiCorruptionBureau #Justice #Telanagna @CVAnandIPS
మత్స్యకారుల కో-ఆపరేటివ్ సొసైటీకి చేపలు పట్టుకోవడానికి సంబంధించిన హక్కుల పత్రం జారీ చేసేందుకు "ఇరవై ఐదు వేల రూపాయల" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు చిక్కిన సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి - "ఠాకూర్ రూపేందర్ సింగ్"
#అవినీతినిరోధకశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1814248896073515487?t=6tTPx_whccwjRTjSLSEUuw&s=19
*****---*****---*****---*****---*****
2014 జూన్ నుంచి 2024 డిసెంబర్ వరకు #తెలంగాణ లో #అవినీతి ప్రభుత్వ అధికారుల హవా నడిచింది.
ప్రస్తుతం తెలంగాణ లో #అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న @CVAnandIPS సారు & @TelanganaACB అధికారులు.
@TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM
#FishermenSociety
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1814250784835723716?t=2ndn7aAn3IzhS5q7bNc7Vw&s=19
Thursday, July 18, 2024
దేశభక్తుడైన ప్రతి ఒక్కడూ ఇప్పుడు రవిప్రకాశ్ వెన్నంటి ఉండాలి
*_జర్నలిస్టుల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి: అనంచిన్ని వెంకటేశ్వరరావు_*
Wednesday, July 17, 2024
కలం యోధుల మీడియా కార్యాలయం
భూస్వాములను కొట్టి పేదలకు అన్నం పెట్టిన దేవుడు
Tuesday, July 16, 2024
ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదు.. రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో @TelanganaDGP , #Exise, @TG_ANB అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.
* కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో రోజంతా జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల కాపాడటంలో తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రిగారు దిశానిర్ధేశం చేశారు.
* పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
* కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
* అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజనులకు ఆదాయం పెంచాలి.
* ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటునకు స్థలాలు ఎంపిక చేయాలి.
* కలెక్టర్లు విధిగా పాఠశాలలను తనిఖీ చేయాలి. డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం శ్రీ @Bhatti_Mallu తో పాటు మంత్రివర్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TelanganaProgress #GovernanceReview
#TelanganaPrajaPrabhutwam
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1813235497935806804?t=SfOc66bQxvd6_DZStCNoyg&s=19
కలెక్టర్ అంటే కుటుంబసభ్యుడిగా ప్రజలు భావించాలి
పారదర్శకంగా ప్రజాహిత పాలన అందించండి
🔷కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశనం
🔷అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు చేరవేయాలి
🔷ఆగస్టు 15లోగా ధరణి సమస్యలు పరిష్కరించాలి
🔷ఆర్టీసీలో అద్దె బస్సులు నిర్వహించుకునేలా మహిళా సంఘాలకు అవకాశం
🔷రేషన్ కార్డు లేకున్నా పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించాలి
🔷పటిష్టమైన నిఘాతో ప్రభుత్వ భూములు, ఆస్తులను పరిరక్షించండి
🔷జిల్లాల కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీచేసిన సీఎం
హైదరాబాద్ :
పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి @revanth_anumula స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి @Bhatti_Mallu , మంత్రివర్యులు @OffDSB , @Ponnam_INC , @IKondaSurekha , @seethakkaMLA , @KomatireddyKVR , @mpponguleti , @Tummala_INC , @DamodarCilarapu , @UttamINC , @jupallyk_rao , ముఖ్యమంత్రి సలహాదారు @Vemnarenderredy , @TelanganaCS శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాజకీయ ఒత్తిళ్లు లేవు.. నిబద్ధతతో పనిచేయండి..
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని సీఎం గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారధులు.. సారధులు మీరేనని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేపట్టామన్నారు. ఐఏఎస్ అధికారుల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని సీఎం అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు.
కలెక్టర్ అంటే కుటుంబసభ్యుడిగా ప్రజలు భావించేలా..
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కలెక్టర్లు ఏ జిల్లాలో పని చేసినా.. అక్కడి జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని, తాము పని చేసే ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని అందుకునేలా పని చేయాలని సీఎం అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం టీచర్లకు ప్రమోషన్లతో పాటు బదిలీలు చేసిందని, కొన్నిచోట్ల టీచర్లు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు సొంత కుటుంబసభ్యుడిలా స్పందించారు. వాళ్లకు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మీడియాలో చూసినట్లు సీఎం చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు ఉండాలని అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజలు కలెక్టర్ ను బదిలీ చేయకుండా అడ్డుకునేంత అనుబంధాన్నిసంపాదించుకోవాలని ఉదాహరణగా చెప్పారు.
ప్రజాప్రభుత్వం మార్కు కనబడాలి..
వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారని, విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, భాషతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని, ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఐఏఎస్‌లు పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని.. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని అన్నారు. తాము చేపట్టే ప్రతి పని.. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి..
జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85వేలు ఖర్చు పెడుతుందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడాలని, అక్కడికక్కడ పరిష్కారమయ్యే చిన్న చిన్న పనులను వెంటనే పరిష్కరించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.
"గతంలో పది పెద్ద జిల్లాలుండేవి. అప్పడు పది మంది కలెక్టర్లే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారు. అప్పటితే పోలిస్తే ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గిపోయింది. అప్పటితో పోలిస్తే కలెక్టర్ల అధికారాలు, బాధ్యతల్లో తేడా ఏమీ లేదు. అప్పుడు పది మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది కలెక్టర్లు కలిసికట్టుగా ఎందుకు చేయలేరు..? ఎవరికివారుగా మీ ఆలోచనలు, మీ పనితీరును సమర్థతను చాటుకోవాలి. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీదే..." అని సీఎం కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్‌లో ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరుకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.
అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు గృహజ్యోతికి 5.89 లక్షల మంది, అయిదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
ఆగస్టు 15లోపు ధరణి సమస్యల పరిష్కారం
పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్నికూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు.
ప్రభుత్వ భూములు, ఆస్తులపై పటిష్ట నిఘా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెర్వులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి.. ప్రభుత్వ భూములపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు.
రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ సేవలు..
అందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు..
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు పారితోషికం అందించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చెప్పారు. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యం తీసుకొని వాటి నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని, మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.
Courtesy,/ Source by : https://x.com/CPRO_TGCM/status/1813199830258491439?t=TEHLWYjR5phT-EvevLIpHA&s=19