Monday, October 31, 2022

తెరాసతో పొత్తు ప్రసక్తేలేదు.....రాహుల్ గాంధీ...!

తెరాసతో పొత్తు ప్రసక్తేలేదు.....రాహుల్ గాంధీ...!*

తిమ్మాపూర్‌: తెరాసతో ఎలాంటి అవగాహన లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రస్తక్తే లేదని..ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. 'భారత్‌ జోడో యాత్ర'లో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. తెరాసతో పొత్తు ఉండొద్దన్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయమని.. దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

''వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఉండబోతున్నాయి. భాజపా, తెరాస ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి. ఉప ఎన్నికకు రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? భాజపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరుతుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోరాటంపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటా. భారత్‌ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాం. యాత్ర పొడవునా అందరూ చెప్పే మాటలు వింటా'' అని రాహుల్‌ అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, October 30, 2022

ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు.... సీఎం కేసీఆర్.....!

*ఢిల్లీ బ్రోకర్లు  తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు.... సీఎం కేసీఆర్.....!*

చండూరు: కొందరు దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికలు రాగానే లొల్లి మొదలవుతుంది. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ చేస్తారు.. విచిత్ర వేషధారులందరూ ఎన్నికలప్పుడు వస్తారు. ఎవరు ఏమి చెప్పినా నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది. ఆలోచించి ఓటు వేస్తే మన ఊరు, మునుగోడు, మన జిల్లా, మన దేశం బాగుపడుతుంది. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ కావొద్దు. కరిచే పాములను మెడలో వేసుకునేందుకు సిద్ధపడతారా?  *చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి...*
కొందరు దిల్లీ బ్రోకర్‌లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు మేం తెలంగాణ బిడ్డలమని నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ బావుటా ఎగురవేశారు. రోహిత్‌రెడ్డి, బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగా కాంతారావు లాంటి ఎమ్మెల్యేలే దేశానికి కావాల్సింది. రూ.100 కోట్లు ఇస్తామని ఆశ చూపితే.. గడ్డిపోచలా విసిరేశారు. దిల్లీ నుంచి వచ్చి దుర్మార్గమైన పని చేసిన వారు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది. దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా... రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి? ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్ధిరావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..... ఇక రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ.....!

*తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..... ఇక రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ.....!*

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది.గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30న జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.

ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

భారత విద్యార్థులకు భారీ...... ఊరట

*భారత విద్యార్థులకు భారీ...... ఊరట*

*అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటున్న భారత విద్యార్థులకు భారీ ఊరట లభించింది.*

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో (United States) ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటున్న భారత విద్యార్థులకు (Indian Students) భారీ ఊరట లభించింది. యూఎస్ ప్రభుత్వం శనివారం భారీ సంఖ్యలో స్టూడెంట్ వీసా (F-1 Student Visa) స్లాట్లను విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎంబసీతో పాటు హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నైలోని అన్ని కాన్సులేట్లు ఏకకాలంలో స్లాట్లను విడుదల చేశాయి. దాంతో ఇంటర్వ్యూ సమయాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ ఒక్కసారిగా ప్రయత్నించటంతో సంబంధిత సైట్లు నెమ్మదించాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభకానున్న అగ్రరాజ్యంలోని పలు యూనివర్శిటీల తరగతులకు అనుగుణంగా తాజాగా భారత విద్యార్థుల కోసం అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాల స్లాట్లను (Studen Visa Slots) విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై, ఆగస్టుతో ముగిసిన విద్యా సంవత్సరంలో దాదాపు 82వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను (F-1 Visas) యూఎస్ జారీచేసిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students)కు అమెరికా ఇంత భారీ మొత్తంలో వీసాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతేగాక త్వరలో ప్రారంభంకానున్న విద్యా సంవత్సరంలోనూ ఇదే మాదిరిగా భారీగానే వీసాలు జారీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక వీసాల జారీలో చోటు చేసుకుంటున్న ఆలస్యాన్ని నియంత్రించేందుకు యూఎస్ గవర్నమెంట్ పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించి ఇంటర్య్యూ అధికారులుగా ఇటీవలే ఇండియాకు పంపించింది. తాజాగా వారు కాన్సులేట్ ఆఫీసుల్లో విధుల్లో చేరటంతో శనివారం భారీగా స్లాట్లు విడుదల చేయడం జరిగింది. కాగా, స్లాట్లు విడుదలైన క్షణాల్లోనే నవంబర్ నెల కోటా పూర్తికావడం విశేషం. నవంబర్ రెండోవారంలో మరోదఫా మరికొన్ని స్లాట్లు విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇలా రెండు దఫాలుగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెప్లిన్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Saturday, October 29, 2022

కేసీఆర్... కేటీఆర్ అపవిత్రం చేశారు తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి.... బండి సంజయ్

కేసీఆర్... కేటీఆర్ అపవిత్రం చేశారు తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి.... బండి సంజయ్*

మునుగోడు: ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వ్యవహారం నేపథ్యంలో భాజపా, తెరాస నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు.అమిత్‌ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రి ఆలయంలో దేవుడి పాదాలు తాకడం పాపం, వెంటనే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. మునుగోడులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ''పవిత్రమైన తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ మోసపూరిత వాగ్ధానాలు చేసి అపవిత్రం చేశారు. ఆ సంప్రోక్షణ కోసమే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. కేటీఆర్‌ నోరు హద్దుల్లో పెట్టుకుని మాట్లాడాలి. మీరు ఒకటి అంటే మేం వంద అంటాం. మీ ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతిభవన్‌లో ఎందుకు దాచిపెట్టారు. యాదాద్రి ఆలయం చాలా పవర్‌ఫుల్‌ టెంపుల్‌. తప్పు చేసిన వాళ్లు తడి దుస్తులతో గుడికి వెళ్లరు. మేం తప్పు చేయలేదు కాబట్టే తడి దుస్తులతో వెళ్లి ప్రమాణం చేశా. దేవుడి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. తప్పకుండా వారికి డ్రగ్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తాం. 31వ తేదీ మునుగోడు నియోజవకర్గంలోని తొమ్మిది మండలాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం'' అని బండి సంజయ్‌ తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు.....?

*ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు.....?*

    *రేవంత్ రెడ్డి*
హైదరాబాద్: తెరాస, భాజపా.. సమన్వయంతో పనిచేసుకుంటూ మునుగోడు ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ లేనట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఆ రెండు పార్టీలూ వ్యూహాత్మకంగానే వివాదాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

''మునుగోడు ఉపఎన్నిక, జోడో యాత్రల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే భాజపా, తెరాస నాటకాలు ఆడుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం వ్యవహారంలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదు? ఏసీబీ పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ఈ తతంగమంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అలాగైతే ఈ కేసులో కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా చేర్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలి. దర్యాప్తు సంస్థలపై మాకు నమ్మకం లేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ చేయించాలి'' అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, October 28, 2022

MLA పైలెట్ రోహిత్ రెడ్డికి..... భద్రత పెంపు

*MLA పైలెట్  రోహిత్ రెడ్డికి..... భద్రత పెంపు*

హైదరాబాద్‌: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రోహిత్‌ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్ ఫాంహౌస్‌పై దాడులు చేసిన పోలీసులు.. నిందితులను రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూర్‌ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. కాగా, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డితో నిందితులు జరిపిన ఫోన్‌ ఆడియోలు రెండు విడుదలైన విషయం విధితమే.

*సుజీవన్ వావిలాల🖋️*

అధికారులు వివరణ ఇవ్వాల్సిందే

అధికారులు వివరణ ఇవ్వాల్సిందే


అధికారులు వివరణ ఇవ్వాల్సిందే
  • సిఫారసులపై చర్యలు చేపట్టాలి
  • కేసులపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి సమీక్ష
హైదరాబాద్‌, అక్టోబర్‌28(నమస్తే తెలంగాణ): తాము చేసే సిఫారసులపై ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాకిటి సునీతా లక్ష్మిరెడ్డి కోరారు. ఆయా సిఫారసులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారో వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె కమిషన్‌ పరిధిలోకి వచ్చే కేసులపై సమీక్షించారు. ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులపై మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని, అవి కమిషన్‌ పరిధిలోకి రావని సునీతారెడ్డి చెప్పారు. లైంగిక దాడికి గురైన బాధిత మహిళలకు రావాల్సిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని అధికారులను కోరారు. మహిళలు తమకు జరిగే అన్యాయంపై కమిషన్‌ దృష్టికి తేవాలని సూచించారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ @SCWTelangana లేదా telangana statewomenscommission@gmail.com, హెల్ప్‌లైన్‌ 181, వాట్సాప్‌ నంబర్‌ 9490555533కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు షహీన్‌ అప్రోజ్‌, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, రేవతీరావు, కార్యదర్శి కృష్ణకుమారి పాల్గొన్నారు.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 

మంత్రి జగదీశ్ రెడ్డికీ ఈసీ నోటీసు.... వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు

*మంత్రి జగదీశ్ రెడ్డికీ ఈసీ నోటీసు.... వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు*

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది.ఈనెల 25న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగంపై భాజపా నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది. తెరాసకు ఓటుకు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని భాజపా నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జగదీశ్‌రెడ్డి చేసిన ప్రసంగం నోట్‌ను కూడా జిల్లా ఎన్నికల అధికారి పంపారు.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం .. ప్రాథమికంగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. దీనిపై రేపు సాయంత్రం 3గంటల్లోపు జగదీశ్‌రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

మన ఊరు-మన బడి'లో స్కాముల పాఠాలు_

*_రూ.600 కోట్లకు టెండర్.!_*

_◆ అప్పుడు.. ఇప్పుడు.. ఒకే తంతు..!_
_◆ 'మన ఊరు-మన బడి'లో స్కాముల పాఠాలు_
_◆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ సిస్టమ్స్ కోసం బిడ్డింగ్_
_◆ సెల్ కాన్ కంపెనీకి దక్కేలా పక్కా ప్లాన్..!_
_◆ అన్నీ తానై నడిపిస్తున్న ఆ మంత్రి.?_
_◆ 'తొలివెలుగు' ప్రయత్నం అభినందనీయం_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 00 00 009, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_'వడ్డించేవాడు మనోడైతే.. విందులో ఎక్కడ కూర్చుంటే ఏమిటి.?' అనే సామెతకు ఈ రూ.600 కోట్ల టెండర్ వ్యవహారం సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో ఓపెన్ బిడ్డింగ్ టెండర్ ఏదైనా.. భలేగా అనుకున్న వారికే వస్తుంది. అందుకు ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 'మన ఊరు-మన బడి' టెండర్ల స్కాంని గతంలో 'తొలివెలుగు' దర్జాగా బయటపెట్టింది. హైకోర్టులో విచారణకు రాగానే మొత్తం టెండర్లు రద్దు చేసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు._*

*_మీం ఇంతే చేస్తాం.._*
మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టే ప్రయత్నాన్ని ఆనాడు ఎండగట్టి ప్రజల ముందు ఉంచింది తొలివెలుగు. ఇక అడ్వటైజింగ్ స్కాంలోనూ ఇదే తంతు కొనసాగింది. ఆంధ్రాకు చెందిన కంపెనీలకు అన్నీ అడ్డంగా కట్టబెట్టారు. వందల కోట్లు చేతులు మారాయి. కేసీఆర్ 'ప్రొటీన్ కిట్స్' విషయంలోనూ అంతే. ముందే నిర్ణయించుకున్న కంపెనీకి 'బ్యాక్ డోర్' ద్వారా లబ్ది పొందే పనులు అప్పగించారు. 'టెక్నికల్ గ్రౌండ్స్' అంటూ మెలికలు పెట్టి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చోటు ఇవ్వ లేదు. పెద్ద కంపెనీలను 'లోకల్ వర్క్స్' అంటూ తప్పించుకుని రానివ్వడం లేదు. ఎన్ని జిమ్మిక్కులు చేసైనా.. అనుకున్న వారికి ఇవ్వడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా...డిజిటల్ క్లాస్ రూంల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూం టెండర్స్ లోనూ అదే ప్లాన్ ను అమలు పరిచారు.

*_'సెల్ కాన్' కోసం బరితెగింపు..!_*
స్మార్ట్ క్లాస్ రూమ్స్ కోసం కంపూటర్స్ సప్లై, ఇన్ స్టాలేషన్ అండ్ కమిషనింగ్ కోసం ఈ నెల 20న ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లు పిలిచారు. 27న ప్రీ బిడ్డింగ్ ఏర్పాటు చేశారు. క్లోజింగ్ డేట్ వచ్చే నెల 10 వరకు ఉంది. మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. 4,660 పాఠశాలల్లో 8, 9, 10 తరగతి గదులలో అన్నీ బిగించాలి. యూపీఎస్ నుంచి ల్యాన్ కేబులింగ్ చేయాలి. ఇందుకు టెక్నికల్ గా పెద్ద మొత్తంలో పని చేయాలని ప్లాన్ చేశారు.

*_పక్కా ప్లానింగ్_*
ఈ ఒక్క కంపెనీకి మాత్రమే సరితూగే విధంగా టెండర్లు తయారు చేశారని కాంట్రాక్టర్స్ ఆరోపిస్తున్నారు. సెల్ కాన్ కంపెనీకి 600 కోట్ల ప్రాజెక్ట్ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూ మంత్రంగానే ప్రీ బిడ్డింగ్ మీటింగ్ జరిగిందని.. కాంట్రాక్టర్స్ వారి అనుమానాలను వ్యక్తపరిచినా ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పట్టించుకోనట్లే వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

*_మళ్లీ కోర్టు గుమ్మంలోకి.._*
మన ఊరు-మన బడి, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ టెండర్స్ విషయంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు 'మన ఊరు-మన బడి'లో భాగమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ ఒక్క కంపెనీకే ఇచ్చే కుట్ర చూస్తుంటే మళ్లీ న్యాయస్థానం వైపే అడుగులు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

*_అన్నీ తానై నడిపిస్తున్న ఆ మంత్రి.?_*
ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి హస్తం ఉందని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరెన్నో సంగతులు 'తొలి వెలుగు'లో చూడనున్నాయి. అప్పుడు మెయిన్ మీడియా ఈ విషయంపై గుండెలు బాదుకుంటూ అరుస్తుంది.

Thursday, October 27, 2022

తాండూర్ ప్రజలు ఆలోచించండి

https://youtu.be/V2MsWZ16SQk  *హ్యాట్సాఅఫ్ #కాళోజి మీడియా వారికి 👍*                                                                   

 *తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు #ప్రజాసంకల్పం గ్రూప్ మీడియా నమస్కారం తెలియచేస్తుంది.#కాళోజి మీడియా వారు ఈరోజు తాండూర్ MLA పైలట్ రోహిత్ రెడ్డి గారి గురించి కొన్ని వాస్తవాలు తెలియచేశారు. మీరు అందరు చూడాలి మీ MLA గురించి వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ వీడియో విశ్లేషణ ప్రతిఒక్కరికి చేరేలా #SHARE చేయండి 🙏....#ప్రజాసంకల్పం గ్రూప్ మీడియా ద్వారా #తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఓటు వేసేముందు బాగా ఆలోచించి ఓటు వేయండి 🙏....Bplkm🪶*  prajasankalpam1.blogspot.com

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు.... హైకోర్టులో బిజెపి పిటిషన్.....!

*మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు.... హైకోర్టులో బిజెపి పిటిషన్.....!*

హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బీజేపీ గురువారం ఒక రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.

రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని కోరింది. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్‌లో బీజేపీ అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురిచేసే క్రమంలో భారీ ఆపరేషన్‌ను చేపట్టినట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్.

బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పిటిషనర్‌ పేర్కొనగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, October 26, 2022

ట్రాప్ డ్రామా అట్టర్ ప్లాప్_

*ట్రాప్ డ్రామా అట్టర్ ప్లాప్_*

_◆16 భేతాళ ప్రశ్నలు_
_◆ రూ. 400 కోట్ల డీ‌ల్ అట.!_
_◆ అదనంగా కాట్రాక్టులు కూడా  నట.!_
_◆ అంత నగదు ఎక్కడిది.?_
_◆మెగా, మైహోం మీడియాల్లోనే ఎందుకీ లీకులు_
_◆ డబ్బు కట్టల విషయాన్ని నిర్థారించని పోలీసులు_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 00 00 009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_తెలంగాణ రాజకీయాల్లో కుదుపు. అధికార పార్టీ తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే అంశం ఒక్కసారిగా గుప్పుమంది. పక్కా స్క్రిప్ట్..! చివరలో ఎవరిదో 'డబుల్ గేమ్'..! మొత్తం ప్లాన్ 'ఉల్టా పల్టా'...? ఈ తతంగంలోని వ్యవహారాలను ఎంత పరిశీలించినా అర్థం కాని భేతాళ ప్రశ్నలు కొన్ని అలాగే ఉండిపోయాయి. వాటికి జవాబులు తెలిస్తే తప్ప అసలు ఈ స్కామ్ ఏమిటో.? స్కీమ్ ఏమిటో.? అంత తొందరగా అంతు పట్టదు. అంతు చిక్కదు._*

బాక్స్
*_జవాబులు లేని భేతాళ ప్రశ్నలు_*

_1) జస్ట్, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..? అబద్ధం.!_

_2) ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ ఫాయిదా ఏమైనా ఉంటుందా..? ఏమీలేదు.!_

_3) మరి బీజేపీ ఆ నలుగుర్ని కొనేయడానికి అంత భారీ రేట్లతో ఎందుకు ప్రయత్నించినట్టు..? ఇది నిజమేనా అసలు..? అయినా రాజీనామాలు చేయించి గానీ బీజేపీ చేర్చుకోదు కదా, మరి ఇదేమిటి..?_

_4) ఒక్కొక్కరికీ వంద కోట్లు అట..! సరే, నలుగురికీ కలిసి అడ్వాన్స్ 15 కోట్లు అట.! ఎమ్మెల్యేలే మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు అని ఫోన్ చేసి, పోలీసులను రమ్మన్నారట.! అప్పటికే టీవీ చానెళ్లు ఆ పరిసరాల్లో చేరి రికార్డింగులు చేసుకుంటున్నారట.! పోలీసులు వెళ్లి ఆపరేషన్ భగ్నం చేశారట... ఈ 'పోలీస్ స్క్రిప్ట్' ఏమైనా 'నమ్మబుల్‌'గా ఉందా..? తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ కొనుగోలు యవ్వారం మాకేమీ తెలియదు అన్నారట మీడియాతో... మరి పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ ఆపరేషన్ భగ్నం చేసినవాళ్లు అలా ఎందుకు చెబుతున్నట్టు..? అసలు చివరలో ఓ ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడటంతో వ్యవహారం బెడిసికొట్టిందని పత్రికల్లో డౌటనుమానాలు.. ఎందుకలా చేసినట్టు..? అసలు వ్యూహం ఏమిటి..?_

_5) అసలు ఆ డబ్బు ఏది..? పోలీసులు దాన్ని చూపిస్తే ఈడీయో, సీబీఐయో, అవసరమైతే ఎన్ఐఏయో ఎంటరైతే కదా ఆ డబ్బు సోర్స్ ఏమిటో, ఏ ఖాతాల నుంచి వచ్చిందో, తేలుతుంది…? అబ్బే, డబ్బు దొరికిందని ఎవరు చెప్పారు అని ఉల్టా అడుగుతున్నారు పోలీసులు మీడియాను.._

_6) వాళ్లెవరో స్వాములట… ఈ కొనుగోళ్లకు తెగబడ్డారు సరే, వాళ్లు కిషన్‌రెడ్డికి సన్నిహితులట, సరే… కానీ చేరికల కమిటీకి బాధ్యుడు ఈటల కదా... కిషన్‌రెడ్డికి కొత్తగా ఈ కొనుగోళ్ల బాధ్యతలు ఎవరిచ్చారు..? ఫో, ఫోయి ఫలానాచోట ఎమ్మెల్యేలు ఉంటారు, కొనుక్కురాఫో, వారిలో ముగ్గురు ఆల్‌ రెడీ గెలిచిన పార్టీ తెప్పలు తగలేసి వచ్చినవాళ్లే.. అని చెప్పగానే ఆ బ్రోకర్ స్వాములు వందల కోట్ల నోట్ల కట్టల్ని గోనె సంచుల్లో నింపుకుని బయల్దేరారా..?_

_7) పోనీ, వంద కోట్ల చొప్పున కొనేంత సీన్ ఉందా వాళ్లకు..? 400 కోట్లు పెడితే ఏకనాథ్ షిండే రేంజ్‌లోనే దొరుకుతారు కదా..!_

_8) దొరికినవాళ్లు బీజేపీకి సన్నిహితులు అని ఎస్టాబ్లిష్ చేయడానికి టీఆర్ఎస్ సోషల్ మీడియా, మీడియా విపరీతంగా ప్రయత్నించాయి. బోలెడు వీడియోలు, ఫోటోలు గుప్పించారు. అంటే అంతా ప్రీప్లాన్‌డ్ యవ్వారమేనా..?_

_9) తీరా చూస్తే లీగల్ ఒపీనియన్ తీసుకుని, తదుపరి విచారణ కొనసాగిస్తామంటున్నారట.! మరి అరెస్టులు ఎలా చేసినట్టు..? ఇప్పుడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీద మాత్రమే ఎందుకు ఇష్యూ కేంద్రీకృతం అయి ఉంది..?_

_10) ఇంత సీరియస్ ఇష్యూ కదా.! వెంటనే ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే బెటర్ కదా..! కెసిఆర్ బీజేపీని ఇంకా కార్నర్ చేయొచ్చు. గాయ గత్తర పనులెన్నో వెలుగులోకి వస్తాయ్._

_11) ఇలాంటి కీలక సందర్భాల్లో టీఆర్ఎస్ ఎందుకోగానీ కిషన్‌రెడ్డి పేరునే తెరపైకి తీసుకొస్తూ ఉంటుంది.. ఆయనకేమో మైహోం రామేశ్వరరావు కావల్సినవాడు… ఆయనకు మేఘా కృష్ణారెడ్డి కావల్సినవాడు.. నంబర్ వన్, నంబర్ టూ చానెళ్లయిన ఎన్టీవీ, టీవీ9 చానెళ్లు ప్లాన్ ప్రకారం యాంటీ-బీజేపీ ప్రచారాన్ని నిన్న సాయంత్రంపూట దుమ్మురేపాయి.. ఫాఫం, ఆ ఇద్దరూ తమ ఫోల్డ్‌లోనే ఉన్నారనే పిచ్చి భ్రమల్లోనే ఉంది బీజేపీ ఇంకా.._

_12) కేసీయార్ ప్రతి శ్వాస రాజకీయం.. తను ఆలోచించినంత వేగంగా బీజేపీ నుంచి ప్రతిచర్య ఉండదు.. చేతకాదు.. అసలు తెలంగాణలో పార్టీలో ఎవరిది పెత్తనమో ఎవరికీ తెలియదుగా..._

_13) దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల పరాజయంతో కేసీయార్ మునుగోడులో మరింత విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ స్థితిలో ఇలాంటి కొనుగోళ్ల కథలు, ఇతరత్రా ప్రచారాలు, పథకాలు బయటికి వస్తూనే ఉంటాయి. ఒకరోజంతా బీజేపీ తాటతీసి వదిలేస్తే సరి. అనేది ఓ ప్లాన్. అనుకున్నట్టే అమలు చేశారు. బీజేపీ బిక్కమొహం వేసింది. మరుసటిరోజు రాష్ట్రవ్యాప్త నిరసనలు.. బీజేపీకి కడుక్కోవడానికే ఇక సరిపోతుంది.!_

_14) కొంతలో కొంత బండి సంజయ్ ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు గానీ, సరిపోలేదు.. తన మాటలు అసలు సగం అర్థమే కావు… నువ్వు నమ్మిన, నువ్వు పునర్‌నిర్మాణం చేసిన 'అదే యాదాద్రి దగ్గర, ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తాను, నువ్వూ చేస్తావా' అని కెసిఆర్ కు సవాల్ విసిరాడు… కానీ కేసీయార్ ఎలాగూ లైట్ తీసుకుంటాడుగా…? అసలు బీజేపీని ఫిక్స్ చేయడానికి రెండు, మూడు రోజులుగా 'స్కెచ్' వేస్తున్నా సరే, చివరలో తిరగబడిందా..? ఇదీ అసలు డౌట్.!_

_15) పోలీసుల కంటే మీడియా ముందే రావడం.. ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ కు కాకుండా ప్రగతి భవన్ కు పంపడం ఏమిటి.?_

_16) మునుగోడు పోలింగ్ ముగిసేదాకా కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ రాజకీయాలకు దూరంగా ఉంచేయ లేదా బీజేపీ హైకమాండ్..? పోనీ, యాదాద్రి దగ్గరకు కేసీయార్ ఎలాగూ రాడు, నిజంగానే బండి సంజయ్ వెళ్లి ‘ఈ పాపపు పనిలో మా పాత్ర ఏమీ లేదు… పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రకటించవచ్చుగా... పార్టీకి ఆ నిజాయితీ ఉందా..? తెలంగాణ సమాజానికి ఆ సమాధానం ఇస్తారా..?_

*_చివరిగా..:_*
రసీదు, తప్పితే మసీదు.. అంటే ఏ సాక్ష్యాధారాలు లేకపోతే దేవుడే దిక్కు అని.. ఇలాంటి కేసులు ఎలాగూ ఎటూ తేలవు… సో, ఆ దేవుడి ఎదుటే సచ్ఛీలతను నిరూపించుకోవచ్చు కదా..? కనీసం తెలంగాణ సమాజానికి చెప్పొచ్చు కదా..! ప్చ్, ఈ ప్రశ్నలకు అంతూపొంతూ లేకుండా పోతోంది సుమీ.!

బాక్స్:
*_వాళ్ళే నేరస్థులు -బండి సంజయ్_*
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. 'ఇదంతా డ్రామా' అని.. దాన్ని చూసిన తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారని చమత్కరించారు. బాధితులు వాళ్లే.. ఫిర్యాదు చేసింది వాళ్లే.. నేరస్థులు వాళ్లేనని విమర్శించారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ప్రగతి భవన్ నుంచే జరిగిందని మండిపడ్డారు. 'ఫోటోలు దిగితే బీజేపీతో సంబంధం ఉన్నట్టా?' అని ప్రశ్నించిన బండి.. 'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ వాళ్లు ఫోటోలు దిగారు? మరి.. ఇదంతా మీ ప్లానేనా?' అని నిలదీశారు. గతంలో ఓ మంత్రిపై హత్యాయత్నం జరిగిందని ఢిల్లీకి వెళ్లి డ్రామాలు ఆడారని.. సేమ్ టు సేమ్ అలాంటి డ్రామానే ఇప్పుడు క్రియేట్ చేశారని ఆరోపించారు. 'యాదాద్రిలో ప్రమాణం చేయడానికి కేసీఆర్ సిద్ధమా?' అని సవాల్ చేశారు

ఎమ్మెల్యేల కొనుగోలుకు.... బేరసారాలు.... పోలీసుల విచారణ వేగవంతం...!

ఎమ్మెల్యేల కొనుగోలుకు.... బేరసారాలు.... పోలీసుల విచారణ వేగవంతం...!

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు. మొయినాబాద్‌ సమీపంలోని ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడటంపై మొయినాబాద్‌ పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

మరోవైపు ఫామ్‌హౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఇతరులెవరినీ లోనికి అనుమతించడం లేదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఫామ్‌ హౌస్‌కు డబ్బు తెచ్చారా? తెస్తే ఎక్కడ దాచారు? అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు పూర్వాపరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
*అసలేం జరిగింది?*
తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. 'డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభపెడుతున్నట్లు తెరాస ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వగా సోదాలు నిర్వహించాం. అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో కొందరు సమావేశమయ్యారని తెలిసింది. దిల్లీలోని ఫరీదాబాద్‌ ఆలయంలో ఉండే రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ వీరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఫాంహౌస్‌లో రామచంద్రభారతితోపాటు తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారు. నందకుమార్‌ వీరిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రలోభపెడుతున్నట్లు సమాచారం అందింది. దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తాం. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం' అని రవీంద్ర చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి..... కేటీఆర్

*నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి..... కేటీఆర్*

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. నాగోల్‌లో రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ను నిర్మించామని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు.

వచ్చే ఏడాది మార్చి నెలలోపల మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నాగోల్ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ మీద ఆరు లైన్లలో వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి.

ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్‌ దగ్గర అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ఇప్పుడు నాగోల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ వరకు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సులభతరం కానున్నాయి.

*సుజీవన్ వావిలాల*🖋️ 

పసిపిల్లలపై పశుకామం...మతం మాటున గ్రేస్ సంస్థ

పసిపిల్లలపై పశుకామం

_◆ మతం మాటున గ్రేస్ సంస్థ_
_◆ చిల్డ్రన్ హోం పేరిట మైత్రి_
_◆ బాడీ మసాజ్‌లు, ఎన్నో వికృతాలు_
_◆ 85 మందికి విముక్తి_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)

*_మతం మాటున గ్రేస్ అనాథాశ్రమం. చిల్డ్రన్స్ హోం పేరిట మైత్రి అనే సంస్థలు చిన్నారులపై సభ్య సమాజం తలదించుకునే జిగుబ్సాకరమైన అకృత్యాలకు తెగబడ్డాయి. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు బయపపడింది. రెండు సంఘటనలలో గ్రేస్ సంస్థలో ఉన్న 34 మంది బాలికలు, మైత్రి సంస్థ ఉన్న 51 మంది మొత్తం 85 మంది చిన్నారులు స్వేచ్ఛా జీవితంలోకి వచ్చారు._*

*_గ్రేస్‌ అనాథాశ్రమంలో.._*
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నేరెడ్‌మెట్‌లోని జేజేనగర్‌లో ఉన్న గ్రేస్‌ అనాథాశ్రమంలో 14-15 ఏళ్ల మధ్య వయసుగల 34 మంది బాలికలు ఉన్నారు. వీరిపై కొంతకాలంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. విషయాన్ని బటయకు పొక్కనీయకుండా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం రాత్రి ముగ్గురు బాలికలపై లైంగిక దాడి జరిగిందంటూ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో.. నేరెడ్‌మెట్‌ పోలీసులు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు గ్రేస్‌ ఆశ్రమానికి చేరుకుని, విచారణ చేపట్టారు. బాధిత బాలికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆశ్రమంలోని మిగతా బాలికలను నింబోలిఅడ్డాలోని స్టేట్‌ హోంకు తరలించారు.

బాక్స్
*_మైత్రిలో అకృత్యాలు_*
కూకట్‌పల్లి కేబీహెచ్‌బీ కాలనీలోని మైత్రి చిల్డ్రన్స్‌ హోమ్‌లో బాలికలపై అకృత్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు దాడులు నిర్వహించి.. నిర్వాహకుడు బీఎల్‌ నర్సింహారావు, అతని కుమారుడు ప్రణీత్‌కుమార్‌లను అరెస్టు చేశారు. మైత్రి చిల్డ్రన్స్‌ హోంలో బాలికలతో వీరిద్దరూ బాడీ మసాజ్‌లు చేయించుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా.. హోంలోని బాలికలతో బాత్‌రూంలను శుభ్రపరచడం, కూరగాయలు తరగడం, గదులను శుభ్రం చేయడం వంటి పనులను చేయించుకుంటున్నారు. ఆ పనులు చేసేందుకు చిన్నారులు నిరాకరిస్తే.. బెల్టుతో కొడుతున్నారు. ఫిర్యాదు అందుకున్న చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు బాల రక్షక్‌ భవన్‌ కో-ఆర్డినేటర్‌ బి.నాగమణి, పీవో ఎన్‌ఐసీ నాగమధు, సఖీ సెంటర్‌ అడ్మిన్‌ నిత్యూష, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ టీమ్‌ సభ్యులు ప్రశాంత్‌, స్వప్న హోమ్‌ను సందర్శించారు. చిన్నారుల వాంగ్మూలం తీసుకున్నారు. తమకు అందిన ఫిర్యాదు నిజమేనని గుర్తించి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడిచేసి, నర్సింహారావు, ప్రణీత్‌లను అరెస్టు చేశారు. వారిపై జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆశ్రమంలో ఉన్న 51 మంది బాలికలను నింబోలి అడ్డాలోని స్టేట్‌హోంకు తరలించారు. గ్రేస్‌ అనాథాశ్రమం, మైత్రి చిల్డ్రన్‌హోంలను మూసివేస్తున్నట్లు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులు ప్రకటించారు.

అక్రమంగా గంజాయి సరఫరా.... ఇద్దరు మహిళలపై పీడీ యాక్ట్

*అక్రమంగా గంజాయి సరఫరా.... ఇద్దరు మహిళలపై పీడీ యాక్ట్*

హైదరాబాద్‌: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా పెడ్లర్లపై రాచకొండ పోలీసులు మంగళవారం పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్‌ పెడ్లర్‌ ఆకాశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ముఠా సభ్యులు సాయినాథ్‌ చౌహాన్, అతడి భార్య రవళి, ఆమె స్నేహితురాలు సంగీత, షేక్‌ నవాజుద్దీన్, వినాయక్, బానావత్‌ కిషన్, బానావత్‌ నాగలు రెండు కార్లలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాజు, సంసాయిరావు, నుంచి 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.

హైదరాబాద్‌ మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో రవళి, సంగీతలపై హయత్‌నగర్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, October 25, 2022

యువత పై కమలం.... గురి....!

*యువత పై కమలం.... గురి....!*

*మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ..*

*మునుగోడులో 1.25 లక్షల యువ ఓటర్లు*

*ప్రచారంలో యువ నాయకులకే బాధ్యతలు*

*60 మంది ఓటర్ల బాధ్యత ఒక్కో నేతకు*

*పోలింగ్‌ బూత్‌కు 25 మంది కార్యకర్తలు*

*బాధ్యులుగా కీలక నేతల నియామకం*

*గంపగుత్తగా వేయించుకునే యత్నాల్లో బీజేపీ*
నల్లగొండ, : మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఇక్కడ గెలుపు కోసం ప్రధానంగా యువ ఓటర్లపై దృష్టి సారించింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,367 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 40 ఏళ్లలోపు వయసున్న యువతీ, యువకులు 1,25,668 మంది ఉన్నారు. వీరందరినీ ఆకర్షిస్తే వారి కుటుంబ ఓట్లను కూడా తామే గంపగుత్తగా వేయించుకునే అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో యువ అధిక సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటున్నారు.గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఎక్కువగా యువకులకే అప్పగించారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేస్తూనే యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతోపాటు ప్రచారంలో తనవైన వ్యూహాలన్నింటినీ కమలం పార్టీ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 60 మంది ఓటర్లకు ఒకరు చొప్పున నేతలకు బాధ్యత అప్పగించింది. మండలాల వారీగా, సామాజికవర్గాల వారీగా బాధ్యతలను రాష్ట్ర స్థాయి నేతలకు అప్పగించింది. వీరందరినీ పర్యవేక్షించేందుకు స్టీరింగ్‌ కమిటీని నియమించింది. ఎన్నికల్లో నిష్ణాతుడైన బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌తోపాటు మరో ఇద్దరు జాతీయ నాయకులు మునుగోడులోనే మకాం వేశారు. ఓవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు కీలక నేతల రోడ్‌షోలు కొనసాగుతున్నాయి. జాతీయ నేతలతో భారీ సభకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు బీజేపీతో సంబంధం లేకుండానే చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఇక సాఫిగా జర్నీ.... రేపు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి KTR

*ఇక సాఫిగా జర్నీ.... రేపు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి KTR*

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను అక్టోబర్ 26 (బుధవారం)వ తేదీన ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు.ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు వెళ్లే ప్రయాణికులకు సిగ్నల్‌ లేని మార్గాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగోల్‌ ఫ్లైఓవర్‌ను రూ.143.58 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందులో యుటిలిటీ షిఫ్టింగ్‌, భూసేకరణ తదితరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

బంజారా హిల్స్ ఘటన తీవ్రంగా కలిచివేసింది.... చిరంజీవి

*బంజారా హిల్స్ ఘటన తీవ్రంగా కలిచివేసింది.... చిరంజీవి*

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై ఇటీవల జరిగిన అఘాయిత్యం ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు.ఈమేరకు మంగళవారం ఆయన ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.''ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య. శిక్షలు వేగవంతంగా విధించడంతో పాటు అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా'' అని చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

climate change


Ian Fry, UN Special Rapporteur on the promotion and protection of human rights in the context of climate change, in a report to the General Assembly today said
“There is an enormous injustice being manifested by developed economies against the poorest and least able to cope. Inaction by developed economies and major corporations to take responsibility for drastically reducing their greenhouse gas emissions has led to demands for ‘climate reparations’ for losses incurred. The G20 members for instance, account for 78 per cent of emissions over the last decade.”
The Special Rapporteur’s report focuses on the topics of mitigation action, loss and damage, access and inclusion, and the protection of climate rights defenders.
“The overall effect of inadequate actions to reduce greenhouse gas emissions is creating a human rights catastrophe, and the costs of these climate change related disasters are enormous,” Fry said.
Those most affected and suffering the greatest losses are the least able to participate in current decision-making and more must be done to ensure they have a say in their future, including children and youth, women, persons with disabilities, indigenous peoples and minorities.
Fry also raised deep concern about climate rights defenders. “As groups and communities become increasingly frustrated with the lack of action on climate change, they have turned to protests and public interventions to bear witnesses to the climate emergency. Sadly, we are seeing many climate rights defenders persecuted by governments and security organisations. Some defenders have even been killed.”
The expert emphasised that indigenous peoples, in particular, have been the target of serious attacks and human rights abuses.

Courtesy by : K. BabuRao 

కోదండరామ్.... మౌన ప్రదర్శన....!

కోదండరామ్.... మౌన ప్రదర్శన....!*

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోప్రోఫెసర్‌ కోదండరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధినేత, ప్రోఫెసర్‌ కోదండరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుద్ద భవన్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో కోదండరాం మౌన ప్రదర్శనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని.. రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరుగాలని కోదండరామ్ కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, October 24, 2022

కళ్యాణ్.. ఏమిటి పొగరు.!

*_కళ్యాణ్.. ఏమిటి పొగరు.!_*
_★ 'హంట్' వివాదం_
_★ తల తిక్క పనులు ఏల.? ★ మీరు మారరా.?_
_★ సినీ పెద్దలు ఏం చేస్తున్నారు.?_

*_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు,. 9440000009, 'తెలంగాణ వాత్' ప్రత్యేకం)_*

*_చిన్న సినిమా అంటే చిన్న చూపే. పైకి మాత్రం ఎన్నో తీపి కబుర్లు. ఔత్సాహిక యువత ఓ సినిమా తీద్దాం అనుకుంది. నిబంధనల మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఇంతలో  సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి.. మనకు ముసుగులో గుద్దులాట ఎందుకు.. ప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఏకంగా అదే పేరుతో ఓ పోస్టర్ విడుదల చేశాడు. దానికి కళ్యాణ్ ఆధ్వర్యంలోని నిర్మాత మండలి వంత పాడటం. నిబంధన మేరకు.. నిస్సంకోచంగా.. నిస్సందేహంగా టైటిల్ హిరో కం డైరెక్టర్ నిక్షిత్ దే.. అందులో ఎలాంటి సందేహం లేదు. నిర్మాత కళ్యాణ్ ఎందుకు ఈ టైటిల్ విషయంలో ఇంత మూర్ఖంగా ముందుకు వెళ్ళాడు.? ఇప్పటికైనా ఈ విషయంలో ఆయన నిజాయితీగా ఉంటాడా..? ఉండడా..? కాలం తేలుస్తుంది. మా లెక్కలు మాకు తప్పకుండా ఉంటాయ్.._*

*_అసలేం జరిగిందంటే..?_*
జులై నెలలో శ్రీ క్రియేషన్స్ బ్యానర్ 'హంట్' అనే టైటిల్ ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో అన్ని ఫీజులు చెల్లించి నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేసుకుంది.

*_వివాదం ఎక్కడ మొదలు.?_*
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ ‘హంట్’ పేరుతో ఓ సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు. అనంతరం టీజర్, పాటలను కూడా బయటకు వదిలారు.

*_రిజెక్ట్ చేశాయి.._*
భవ్య క్రియేషన్స్ 'హంట్' టైటిల్ కోసం దరఖాస్తు చేసింది. తెలుగు, తెలంగాణ రెండు ఫిల్మ్ ఛాంబర్స్ ఆ ప్రతిపాదనను రిజెక్ట్ చేశాయి, మరి అలాంటప్పుడు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏ అధికారంతో ఈ వ్యవహారంలోకి వచ్చింది. కళ్యాణ్ అత్యుత్సాహం ఎందుకు చూపుతున్నారు.?

*_ఎంటర్ అయిన 'తొండి బ్యాచ్'_*
ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఉన్న అధికారాలు ఏమిటి.? దానికి టైటిల్స్ ఇచ్చే హక్కు ఉందా.? అంటే లేదు. ఉండదు. అయినా అదే 'హంట్' టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి రిజిస్ట్రేషన్ చేసింది. టైటిల్స్ ఇచ్చే అధికారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కు మాత్రమే ఉంటుంది. మరి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎందుకు ఈ వివాదంలోకి వచ్చింది.

*_లీగల్ నోటీసులు పంపారు_*
"హాంట్' సినిమా టైటిల్ పై శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో నిక్షిత్, అడ్వకేట్ సురేష్ బాబు, నిర్మాత నర్సింగ రావ్, ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో తరుపున తల్లాడ సాయికృష్ణలు మాట్లాడుతూ  'ఇండస్ట్రీలో  జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని తెలుసుకున్నాం, మాకు సపోర్ట్ గా ఇప్పడు  రెండు తెలుగు ఫిల్మ్ ఛాoబర్లు తోడుగా నిలబడ్డాయి, ఫిల్మ్ ఛాoబర్స్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉంది, అలాంటిది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్  తప్పును వారే తెలుసుకోవాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు' అని అన్నారు.

బాక్స్:

*_ఇదేం పని బాసూ.._*
౼ భూ వివాదంలో ఇరుక్కున్న నిర్మాత సి కళ్యాణ్.. 
౼ పోలీసు కేసు నమోదు

తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే నిర్మాత సి కళ్యాణ్. తాజాగా ఈ నిర్మాతతో మరో ముగ్గురిపై షేక్‌ పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే నిర్మాత సి కళ్యాణ్. సీనియర్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈయన.. చిన్న హీరోలతోనూ వరస సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాస్త నెమ్మదించిన ఈ నిర్మాతపై ఇప్పుడు పోలీసు కేసు నమోదైంది. షేక్‌ పేట భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. ఉన్నట్లుండి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు పోలీసు కేసు వరకు వచ్చింది. అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలిం నగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఆరేళ్ళ కింద అంటే 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి ఆ భూమిని లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ స్థలంలో ప్రస్తుతం ఓ ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. అయితే జూన్ 28 సాయంత్రం నిర్మాత సి కళ్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళం వేశారు. స్వరూప్‌ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీళ్ళ ముగ్గురితో పాటు నిర్మాత సి కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీపావళి శుభాకాంక్షలు

*దీపావళి శుభాకాంక్షలు...*

*ఈ శుభాకాంక్షలు అందరికీ...*

*కులం చూడం...*
*మతం చూడం...*
*ప్రాంతం చూడం...*
*పార్టీ చూడం...*

*ప్రజలందరూ...*
*సుఖ సంతోషాలతో...*
*భోగ భాగ్యాలతో...*
*సిరి సంపదలతో...*
*తుల తూగాలని...*
*దేవుడిని వేడుకుంటున్నాను...Bplkm🪶* 

Sunday, October 23, 2022

తెలుగురాష్ట్రాల్లో.....ఖాకీ అంతర్మధనం!!

*_దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక సంచలన కథనం_*

_తెలుగురాష్ట్రాల్లో.._
*_ఖాకీ అంతర్మధనం_*

_★ఇప్పుడు సరే... మున్ముందు ఎలా?_
_★బాధితులు వ్యక్తిగతంగా చర్యలకు దిగితే మా పరిస్థితి ఏమిటి?_
_★క్షేత్రస్థాయి సిబ్బందిలో అంతర్మథనం_
_★ ఇప్పటికే పలువురు ప్రైవేటు కేసుల్లో ఇరుక్కున్నారని ఆందోళన_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_‘అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు‌, సమాచారహక్క ఉ పోరాట యోధులు, నిఖార్సయిన నిజాలను రాసే పాత్రికేయులపై ఇప్పుడు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట నిబంధనలకు విరుద్ధంగానూ వ్యవహరిస్తున్నాం. ఈ చర్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులు ఇవన్నీ మనసులో పెట్టుకుని భవిష్యత్తులో మాపై వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి?’ అని తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కొందరు అంతర్మథనం చెందుతున్నారు._*

*_ఇదో చిత్రం:_*
ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడంపై న్యాయస్థానాలు జారీ చేస్తున్న నోటీసులకు ఇప్పటికే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోందని... ఇవన్నీ భవిష్యత్తులో తమ ఉద్యోగ సర్వీసుపై ప్రభావం చూపిస్తాయంటూ సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు తమను తీవ్రంగా హింసించారని, కొట్టారని బాధితులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని కోరుతున్నారు. కొన్ని సందర్బాల్లో న్యాయమూర్తి వైద్య పరీక్షలకు ఆదేశిస్తున్నారు. వీటి ఆధారంగా బాధితులు ప్రైవేటు కేసులు వేస్తే వాటి నుంచి బయటపడలేక మేం చాలా ఇబ్బందులు పడాలి. ఇప్పటికే మాలో కొందరు ప్రైవేటు కేసులు ఎదుర్కొంటున్నారు. వారు పడుతున్న బాధలేమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మాకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే పట్టించుకునేవారే ఉండరు’ అని మరికొందరు సీఐడీ సిబ్బంది ప్రైవేటు సంభాషణల్లో వాపోతున్నారు.

*_కదలికలపైనా నిఘా పెడుతున్నారు:_*
‘ఉన్నతాధికారులు చెప్పినవన్నీ పాటిస్తున్నా సరే... మమ్మల్ని అనుమానాస్పదంగానే చూస్తున్నారు. మా కదలికలపైనే నిఘా పెడుతున్నారు’ అని కొంతమంది ఆవేదన చెందుతున్నారు. తెదేపా నాయకుడు చింతకాయల విజయ్‌పై నమోదు చేసిన కేసులో నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు కొందరు ఇటీవల హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. వారు చేరుకునే సరికే విజయ్‌ ఇంట్లో లేరు. దీంతో తమ విభాగంలో నుంచే ఎవరో ఒకరు ఉప్పందించడంతోనే విజయ్‌ తప్పించుకున్నారనే అనుమానంతో సీఐడీలో అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. సిబ్బంది సెల్‌ఫోన్‌ల కాల్‌డేటాను సైతం విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. సీఐడీలో ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న మధ్యస్థాయి అధికారి ఒకరు ఈ కేసులు, అరెస్టుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ... తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఆయన చెప్పినట్లు చేయకుంటే ఏదో రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఇదే సమయంలో కేసుల బాధితులు వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటే తమ పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.

*_మమ్మల్ని మార్చేయండి బాబోయ్‌:_*
పోలీసు శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది సిబ్బంది ఈ విభాగంలో తాము పనిచేయలేకపోతున్నామని, ఇక్కడి నుంచి తమను వేరే విభాగానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇంకొందరైతే తెలిసిన వారి ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారి తాను చెప్పినట్లు చేయలేదని సీఐడీలోని ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనస్థాపానికి గురైన బాధితుడు తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని పదేపదే కోరినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

బాక్స్ 1:
*_ఏసీపీ ఆంజనేయులుపై కేసు నమోదు_*
ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయుులుపై ఒకటో పట్టణ ఠాణాలో శనివారం కేసు నమోదైంది. నగర కాంగ్రెస్‌ నాయకుడు మిక్కిలినేని నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ఇచ్చిన ఆదేశాల మేరకు ఏసీపీపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 6న కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్రను ఏసీపీ ఆంజనేయులు చొక్కా కాలర్‌ పట్టుకుని లాగుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ రౌడీషీట్‌ తెరుస్తానని బెదిరింపులకు గురి చేశారంటూ బాధితుడు మరుసటి రోజు  ఒకటో పట్టణ పోలీసులు, ఖమ్మం సీపీ, డీజీపీలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించడంలేదంటూ నరేంద్ర ఖమ్మం జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో దాఖలైన ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన.. న్యాయస్థానం పోలీసు అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏసీపీ ఆంజనేయులుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వెనుక్కి తగ్గేదే లేదని  మిక్కిలినేని నరేంద్ర నిర్ణయం అభినందనీయం

బాక్స్ 2:
*ఇదో వింత కేసు*
మీగడ వెంకటకృష్ణ యాదవ్ పై
ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్ లో కేసు (427/2013) నమోదు. హైకోర్టు అరెస్ట్ చేయరాదని ఆదేశాలు. అయినా అరెస్ట్. జైలు..విడుదల. కోర్టు ధిక్కారణ నెం.1163/2013. క్వాష్ పిటిషన్ నెం. 11700/2013. ఈ కేసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎవరినీ వదలోద్దని ఘాటైన ఆదర్శవంతమైన. వాంఛనీయ నిర్ణయం.

బాక్స్ 3:

*_ప్రపంచ రికార్డ్_*
అతనో నిఖార్సయిన పరిశోధన పాత్రికేయుడు. దేనికి లొంగడు. నీతి, నిజాయితీ ఆయనకు ప్రాణం. (ఇది తెలియకే ప్రభుత్వం బోల్తా పడింది.) అతను భూమి కొంటే .. అతనిపైనే డబ్బులు తీసుకున్నేడే కేసు పెట్టాడు. పోలీసుల అత్యుత్సాహం. భూమ్మీద ఎక్కడా లేని విధంగా రేపు నేరం చేశాడని ఈరోజే కోర్టులో ఎఫ్ఐఆర్. స్టే ఉన్నా ఛార్జిషీట్. కోర్టు ధిక్కారణ నెంబర్ 629. హైకోర్టులో పెండింగ్. ఈ కేసు గెలిస్తే.. ఏకంగా వంద కోట్లకు పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యల కోసం వెయిటింగ్. జర్నలిస్ట్ ఇప్పటికే ఈ కేస కోసం బ్యాంకులో కోటి 43 లక్షలు ఫిక్డ్ డిపాజిట్ చేయడం గమనార్హం.

సోనియా ట్రస్ట్ లకు..... ఎఫ్ సీ ఆర్ ఏ లైసెన్సులు రద్దు

*సోనియా ట్రస్ట్ లకు..... ఎఫ్ సీ ఆర్ ఏ లైసెన్సులు రద్దు*

*కేంద్ర హోంశాఖ నిర్ణయం....!*

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని రెండు స్వచ్ఛంద సంస్థలకు 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్సులను కేంద్ర హోం శాఖ రద్దుచేసింది
రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ (ఆర్‌జీఎఫ్‌), రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్టు (ఆర్‌జీసీటీ) అనే ఈ రెండు సంస్థలు చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. 2020లో హోంశాఖ ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం చేపట్టిన విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలులో అక్రమాలు, చైనా సహా పలు దేశాల నుంచి అందిన నిధుల దుర్వినియోగం, నగదు అక్రమ చలామణి తదితర ఆరోపణలు ఈ సంస్థలపై వచ్చాయి. ఆర్‌జీఎఫ్‌, ఆర్‌జీసీటీ రెండింటికీ సోనియాగాంధీ అధ్యక్షురాలు.

రెండు ట్రస్టుల్లో ఇతరులతో పాటు ట్రస్టీగా రాహుల్‌గాంధీ ఉన్నారు. రెండు సంస్థలూ పార్లమెంటు సమీపంలోని జవహర్‌ భవన్‌ నుంచి పనిచేస్తాయి. ఇందిరాగాంధీ స్మారక ట్రస్టు కార్యకలాపాలపైనా విచారణ జరిగినా, దానిపై ప్రస్తుతానికి చర్యలేమీ తీసుకోలేదు. 2020లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆ సమయంలో ఆర్‌జీఎఫ్‌పై పలు ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టడానికి 2005-09 మధ్య ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందాయని ఆరోపించారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్‌ ఛోక్సీ వంటి వారి నుంచి ఆ సంస్థలకు నిధులు వచ్చాయనీ, అప్పట్లో ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా డబ్బును వీటికి మళ్లించారని చెప్పారు. 2005-06 వార్షిక నివేదిక ప్రకారం.. ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా ఉంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

పర్యావరణం కాపాడుకుందాం

https://twitter.com/Praja_Snklpm/status/1584114958018973697?t=aXVN1oSoWwNOiSHjEjXsFA&s=08  *ప్రమాదకర లోహాలతో, విషపూరిత రసాయనాలతో తయారైన టపాకాసులకు దూరంగా ఉందాం.దీపాలతో దీపావళి జరుపుకుందాం. పర్యావరణం కాపాడుకుందాం*
@CPCB_OFFICIAL @TelanganaPCB @HarithaHaram
@veeruveeru1 @hyderabadzinda2 @BplplH @IFHEofficial @RaviVattem @Hyderabadi567 @swachhhyd @NGOKYR @santoshajmeera                                            *Bplkm🪶*   prajasankalpam1.bligspot.com

Saturday, October 22, 2022

హైదరాబాద్ లో అడుగుపెట్టిన...డోనాల్డ్ ట్రంప్ కంపెనీ....!

*హైదరాబాద్ లో అడుగుపెట్టిన...డోనాల్డ్ ట్రంప్ కంపెనీ....!*

*ఖానామెట్‌లో 27 అంతస్తులలో ప్రాజెక్టు*

*స్థానిక నిర్మాణ సంస్థతో కలసి నిర్మాణం*

*దక్షిణాదిలో తొలిసారిగా నగరానికి ఎంట్రీ*

*తుది దశలో అనుమతులు; డిసెంబర్‌లో ప్రారంభం*

హైదరాబాద్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ట్రంప్‌ రియల్టీ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. స్థానికంగా ఓ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ఖానామెట్‌లో హెచ్‌ఎండీఏ వేలం వేసిన 2.92 ఎకరాలను సొంతం చేసుకున్న ఓ నిర్మాణ సంస్థతో కలసి 27 అంతస్తుల చొప్పున రెండు టవర్లను నిర్మించనుంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ అనుమతులు తుది దశలో ఉన్నాయని, అవి వచ్చాక రెరాలో నమోదు చేసి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మూడున్నరేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

*ఒక్క ఫ్లాట్‌ రూ. 5.5 కోట్లపైనే....!*
ఈ ప్రాజెక్టులో మొత్తం 270 లగ్జరీ ఫ్లాట్లు నిర్మించనున్నారు. అన్నీ 4, 5 పడక గదులే కావడం విశేషం. 4-5 వేల చదరపు అడుగుల (చ.అ.) మధ్య 4 బీహెచ్‌కే, 6 వేల చ.అ.ల్లో 5 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. ప్రాజెక్టు లాంచింగ్‌ తర్వాత నుంచి ప్రారంభ ధర చ.అ.కు రూ. 13 వేలుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. అంటే 4 వేల చ.అ. ఫ్లాట్‌కు ఎంతలేదన్నా రూ. 5.5 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందన్నమాట.

ట్రంప్‌ టవర్‌ ప్రాజెక్టులో అన్నీ అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండనున్నాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రైవేటు ఎలివేటర్, డబుల్‌ హైట్‌లో లివింగ్‌ స్పేస్, బాల్కనీలు ఉంటాయి. రెండు టవర్లను కలుపుతూ రూఫ్‌టాప్‌పై క్లబ్‌హౌస్‌ ఉంటుంది. ఈ ప్రాజెక్టులోని కామన్‌ ఏరియా ఇంటీరియర్‌ను ప్రముఖ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుజేన్‌ఖాన్‌ డిజైన్‌ చేశారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెరాస ఆపరేషన్ ఆకర్శ్ జోరు....పెంచిందా..?

*తెరాస ఆపరేషన్ ఆకర్శ్ జోరు....పెంచిందా..?*

హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకుల చేరికలతో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.
మునుగోడు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ తెరాస కారు జోరు పెంచి ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది. ఘర్ వాపసీ అంటూ గతంలో పార్టీని వీడిన నేతలను ఆహ్వానించి కండువా కప్పేస్తోంది. భారాసగా మారుతున్న తెరాస.. ఓ వైపు జాతీయ రాజకీయాలు, మరోవైపు మునుగోడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.

తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. నల్లాల ఓదెలు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గులాబీ కండువా కప్పారు. చేరికల పట్ల ఆచితూచి వ్యవహరించిన తెరాస.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భాజపాలో చేరడంతో వేగం పెంచింది. తెరాసలో బీసీలకు అవమానం జరుగుతోందని బూర నర్సయ్య వ్యాఖ్యలను తిప్పికొట్టేలా వ్యూహాలతో దూకుడు పెంచింది.

*ఒకరు పోతే నలుగురు వస్తారనేలా..*

బీసీ నాయకులు తెరాస వైపే ఉన్నారనే సంకేతం ఇచ్చేలా.. మొదట వారిపైనే దృష్టి పెట్టింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన పల్లె రవికుమార్ గౌడ్ దంపతులను పార్టీలో చేర్చుకున్నారు. ఒకరు పోతే నలుగురు వస్తారనే సంకేతాలిచ్చేలా మరింత దూకుడు పెంచింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భాజపాకు రాజీనామా చేసి తెరాసలో చేరారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, భాజపాలో ఉన్న దాసోజు శ్రవణ్‌కు ఒకేరోజు ఒకే వేదికపై గులాబీ కండువా కప్పి మంత్రి కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఉద్యమ సమయంలో తెరాసలో ఉండి కీలక పాత్ర పోషించిన నాయకులే. తెరాసలో బీసీలు, గతంలో బయటకు వెళ్లిన నేతల చేరికలు ఊపందుకోవడంతో.. మరికొందరు నాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్రస్థాయిలో మరికొందరు నేతలు తెరాసలో చేరబోతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌పై ప్రత్యేక కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.

ఇక మునుగోడు నియోజకవర్గంలో నాయకులు ఏపూట ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల భాజపా, కాంగ్రెస్‌లో చేరిన పలువురు మండల, గ్రామ స్థాయి నాయకులను మంత్రి జగదీశ్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలతో పాటు.. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు, శాసనమండలి ఎన్నికల్లో పదవులు, టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, October 21, 2022

తెరాసపై కేసు నమోదు చేసి... ఖర్చు అభ్యర్థి ఖాతాలో వేయండి... ఈసీ.....!

*తెరాసపై కేసు నమోదు చేసి... ఖర్చు అభ్యర్థి ఖాతాలో వేయండి... ఈసీ.....!*

హైదరాబాద్‌: లేని అధికారంతో గుర్తు మార్చి విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు మునుగోడు మాజీ రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది.ఈ నేపథ్యంలో జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. యాదాద్రికి 300 మందిని తీసుకెళ్లి ప్రమాణం చేయించిన వ్యవహరంలో వచ్చిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెరాసపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దానికయ్యే ఖర్చును తెరాస అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది. ఈవీఎం బ్యాలెట్‌లో బోటుకు బదులు మరో గుర్తు ముద్రించినందుకు చౌటుప్పల్‌ ఎమ్మార్వోపై సస్పెన్షన్‌ వేటు పడింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

బీజేపీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

మునుగోడు ఉప ఎన్నికల వేళ..బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు.  రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించే బదులు మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికల్లో  గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల  నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీకి గుడ్ చెప్పిన దాసోజు శ్రవణ్.. టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు మన్నెగూడలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 

దశాదిశాలేని నాయకత్వ ధోరణులు
బీజేపీలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొందని, దశాదిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిన లేఖలో దాసోజు శ్రవణ్ ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పిన మీరు, మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది.. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైందని శ్రవణ్ లేఖలో పేర్కొన్నారు. అనేక ఆశలతో ఆశయాలతో నేను బిజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలో అర్థమైంది...ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కన్నా మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను...అని దాసోజు శ్రవణ్ లేఖలో ప్రస్తావించారు. 

ఆగస్టులో కాంగ్రెస్ కు రాజీనామా...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరున్న దాసోజు శ్రవణ్ ...ఆగస్టు 5న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆగస్టు 7న కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. అప్పట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 91 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు. కొద్ది కాలంలోనే కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. అయితే టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు. టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన శ్రవణ్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. పార్టీ హై కమాండ్ ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కల్పించింది. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇటీవలే  ఖైరతాబాద్కు చెందిన మాజీ మంత్రి దివంగత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో దాసోజు కాంగ్రెస్ పార్టీని వీడి ఆగస్టులో బీజేపీలో చేరారు

Courtesy by : V6 వెలుగు మీడియా 

Thursday, October 20, 2022

GHMC ఉప్పల్ సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం


చెత్త డంపింగ్ ను తలపిస్తున్న రామంతపూర్ లోని అంతర్గత ప్రధాన రోడ్లు... CPM 
   
GHMC ఉప్పల్ సర్కిల్ నందు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం MLA, రామంతాపూర్కా డివిజన్  కార్పొరేటర్ శ్రీవాణి గారికి cpm నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలలో అంతర్గత ప్రధాన రహదారులపై అవగాహన లేక ప్రజలు రోడ్లపై చెత్తవేస్తున్నారు.ఇంటికి వచ్చిన ఆటోలకు వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని రోడ్లను చెత్త కుప్పలుగా మారుస్తున్నారు అందువల్ల రోడ్లపై చెత్త డంపు అయి పర్యావరణం పాడైపోతుంది అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రజల అనారోగ్యాల బారిన పడి ప్రైవేటు ఆసుపత్రులకు లక్షల్లో  ఫీజులు చెల్లించవలసి వస్తుంది. కాబట్టి రోడ్లపై చెత్త వేయకుండా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని రోడ్లపై చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ cpm కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్MLA గారికి వినతి పత్రం ఇచ్చారు  వై వెంకటేశ్వర్లు కుమారస్వామి, భీష్మాచారి, నామాల శ్రీనివాస్,
                ఎర్రం శ్రీనివాస్

పోలీస్ అమరవీరులకు వందనాలు

https://youtu.be/uJo4KfWchBM                                                      
పోలీసుల త్యాగనిరతి అమోఘమైనది. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు.ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ, పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకు వందనాలు... (HPR)*

*BAPATLA KRISHNAMOHAN* 
prajasankalpam1.blogspot.com

Wednesday, October 19, 2022

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే.

*తాజా వార్తలు.*

*ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే.*

*7వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపు*

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి.ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు వెల్లడయ్యాయి.ఈ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే గెలుపొందారు.7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఆమె కోసం.... ఎలక్ట్రిక్ మొబైల్ టాయిలెట్లు

ఆమె కోసం.... ఎలక్ట్రిక్ మొబైల్ టాయిలెట్లు*

హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో మహిళల సదుపాయార్థం ఇప్పటికే షీ టాయ్‌లెట్లు, మొబైల్‌ టాయ్‌లెట్లు వంటివి అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాల మొబైల్‌ టాయ్‌లెట్లను అందుబాటులోకి తెచ్చిందికేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ మెట్రో నగరాల్లో సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల కోసం 'నిర్భయ' ఫండ్స్‌ నుంచి నిధులు అందజేస్తోంది.

అలా అందిన నిధులతో మహిళల మొబైల్‌ టాయ్‌లెట్ల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు సమకూర్చుకున్న పోలీసు శాఖ.. వాటి నిర్వహణను జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. గ్రేటర్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఆరు జీహెచ్‌ఎంసీ జోన్లలో వీటిని ఉంచారు. సికింద్రాబాద్‌ జోన్‌లో 3 వాహనాలు, ఎబీనగర్‌లో జోన్‌లో 3, ఖైరతాబాద్‌జోన్‌లో 2, చారి్మనార్‌ జోన్‌లో 2, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్‌ మొబైల్‌ బస్సులను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్, ధర్నాచౌక్, చార్మినార్, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, ప్రగతిభవన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీని బట్టి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితోపాటు శానిటరీ నాప్‌కిన్స్‌ వంటివి ఉంటాయని పేర్కొన్నారు.

*షీ గెస్ట్‌హౌస్‌....!*
సేఫ్‌సిటీ ద్వారా అందే నిధులతో నగరంలో మహిళా యాత్రికుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌ను కూడా నిర్మించనున్నారు. నాంపల్లి సరాయి వద్ద 1900 చదరపుగజాల విస్తీర్ణంలో పార్కింగ్‌ సదుపాయంతోపాటు అయిదంతస్తులతో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. మొత్తం 187 బెడ్స్‌ కలిగి ఉండే గెస్ట్‌హౌస్‌లో సింగిల్‌ బెడ్స్, షేరింగ్‌ బెడ్స్‌ ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లో ఏసీతోపాటు వైఫై, లాకర్లు, లిఫ్టులు, ఇంటర్నెట్‌ కియోస్క్‌లు, ఎమర్జెన్సీ క్లినిక్‌ తదితర సదుపాయాలుంటాయి. అంచనా వ్యయం రూ.11 కోట్లు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, October 17, 2022

నీటి యోధుడు కామె గౌడ కన్నుమూత

Kame Gowda: నీటి యోధుడు కామె గౌడ కన్నుమూత


Kame Gowda: నీటి యోధుడు కామె గౌడ కన్నుమూత

మాండ్యా: కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన కామె గౌడ(Kame Gowda) కన్నుమూశారు. 16 చెరవులను తొవ్విన ఆయన్ను నీటి యోధుడిగా పిలుస్తారు. మాలవల్లి తాలూకాలోని దసనదొడ్డి గ్రామంలో ఆ చెరువులను ఆయన తొవ్వారు. 2020లో జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆ నీటి యోధుడిని విశేషంగా ప్రశంసించారు.

పశువుల కాపరి అయిన కామె గౌడ ఇటీవల 80 ఏళ్లు దాటారు. .. మాలవల్లి తాలూకాలో తనకు వచ్చిన ఆదాయం నుంచి కొన్ని సేవింగ్స్‌ చేసి.. ఆ డబ్బుతో అక్కడ ఉన్న కొండల్లో 16 చెరువులను తొవ్వించాడు. ఆ గుట్టలపై ఆయన మొక్కలను కూడా పెంచారు. వాటి సంరక్షణ కూడా ఆయనే చూసుకునేవారు.

చిన్న చిన్న చెరువులను నిర్మించడం వల్ల ఆ ఊరి నీటి సమస్యలను కామె గౌడ తీర్చినట్లు ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఓ సారి తెలిపారు. అసాధారణ వ్యక్తిత్వం ఉన్న రైతు ఆయన అని కీర్తించారు. కామె గౌడ మృతి పట్ల సీఎం బసవరాజ్‌ బొమ్మై సంతాపం తెలిపారు. గౌడ మరణం బాధించినట్లు సీఎం బొమ్మై ట్వీట్‌లో తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నించిన కామె గౌడకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవ, బసవశ్రీ అవార్డులు అందజేసింది. కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ ఆయనకు జీవిత కాల ఉచిత బస్సు పాస్‌ను కూడా కల్పించింది.

Ccourtesy by : నమస్తే తెలంగాణ మీడియా 


Sunday, October 16, 2022

ఆ 8 గుర్తులపై తెరాస న్యాయపోరాటం...!

*ఆ 8 గుర్తులపై తెరాస న్యాయపోరాటం...!*

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలంటూ తెరాస న్యాయపోరాటానికి దిగింది. హౌజ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని నిన్న కోరగాన్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయాలని నిర్ణయించింది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని కోరుతూ ఈనెల 10న ఎన్నికల కమిషన్ ను తెరాస కోరింది. ''పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో తెరాస అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు'' అని టీఆర్‌ఎస్‌ నేతలు సీఈవోని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

2018 ఎన్నికల్లోనూ తెరాసకు నష్టం..

గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకీ తెరాస వివరించింది. మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని తెరాస నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. అందువల్ల ఆ ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరారు. సోమవారం లంచ్ మోషన్ కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు తెరాస సిద్ధమైంది.

దుబ్బాకలో దెబ్బకొట్టిన 'రోటీ మేకర్‌'

దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బండారు నాగరాజు అనే వ్యక్తి 'రోటీ మేకర్' గుర్తుపై పోటీ చేశారు. ఉపఎన్నికలో ఆయనకు దాదాపు 3500 ఓట్లు పోలయ్యాయి. నిజానికి ఈ 3500 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సినవని... రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో కొంత నష్టం జరిగిందని అధికార పార్టీ మద్దతుదారులు అంటున్నారు. అయోమయానికి గురైన కొందరు ఓటర్లు కారు గుర్తుకు బదులు రోటీ మేకర్‌కు ఓటేశారని చెబుతున్నారు. ఆ ఓట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటున్నారు. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థిపై 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు ఓట్లు రాబట్టుకోవడంలో పోటీపడ్డారు. ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ ఈవీఎంలో గుర్తు రోటీ మేకర్‌ (చపాతీ పీట, కర్ర). ఆయనకు 1918 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి కంటె సాయన్న గుర్తు వజ్రం. ఆయనకు 1843 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలో ఈ రెండు గుర్తులు కారు, కమలం గుర్తులను పోలిఉండటంతో ఓట్లు విషయంలో తేడా వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

పేదలకు ఒకన్యాయం... బలవంతులకు ఒకన్యాయమా ??

https://twitter.com/Praja_Snklpm/status/1581603680629190657?t=T6m0o1qvTAImmfMhB9GErw&s=08                                                                                          

*జీరో ఎవిక్షన్స్ డే*        

*ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*

*పేదలకు ఒకన్యాయం... బలవంతులకు ఒకన్యాయమా ??*
                                                                        *తీగలగూడ బస్తీ వాసుల పట్ల #తెరాస ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది.... ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుని "పేదల ఆశయాలను" వమ్ము చేసిన జిల్లా కలెక్టర్ & సంబంధిత ప్రభుత్వ అధికారులమీద / ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టాలి.*                  

*మూసి నది కబ్జా అయింది ఎంత  ??*

*మూసీ నదిలో అక్రమానిర్మాణాలు చేస్తుంటే ప్రభుత్వాలు నిద్దురపోతున్నాయి ఎందుకు??*

*మూసీ నదిలో చట్టాలను ఉల్లంగించిన వారిమీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు??*

*మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద కేసు పెట్టాలి*                                                                                                                     

@KTRTRS @MinisterKTR @arvindkumar_ias @D_SudheerReddy @HMDA_Gov @swachhhyd @HumHyderabad @KhabarliveH @HydForum @aadabhyd @DonthiNreddy @DonitaJose @LubnaSarwath @IndianExpress @TOIHyderabad @SrinivasRTIA @RaviVattem @BplplH @KaleruVenkatesh

*#askktr*
*Bplkm🪶*

prajasankalpam1.blogspot.com

Friday, October 14, 2022

ఓయు విద్యార్థుల పిటిషన్ పై.... హైకోర్టులో విచారణ

*ఓయు విద్యార్థుల పిటిషన్ పై.... హైకోర్టులో విచారణ*

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పునరుద్ధరించకపోతే రేపు వర్సిటీ రిజిస్ట్రార్ హైకోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది.
ఓయూ హాస్టల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ''దసరా సెలవుల కోసం విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లి వచ్చేలోగా హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా, మెస్ సుదపాయాన్ని నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సెలవులను ఈనెల 26వ తేదీ వరకు పొడిగించారు. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి లేకపోతే ఈనెల 27 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కాలేరు'' అని విద్యార్థుల తరఫున న్యాయవాది సీహెచ్.రవికుమార్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం వర్సిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్, మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

టీఆరెఎస్ కు బిగ్ షాక్....బీజేపీ లోకి బూర నర్సయ్య గౌడ్....?

*టీఆరెఎస్ కు బిగ్ షాక్....బీజేపీ లోకి బూర నర్సయ్య గౌడ్....?*

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది… టీఆర్ఎస్‌ కీలకంగా భావిస్తున్న మునుగోడు బైపోల్‌ సమయంలో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత బూర నర్సయ్యగౌడ్..మునుగోడు ఉప ఎన్నికలో నిన్న టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.. భారతీయ జనతా పార్టీలో చేరడానికే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.కాగా, 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన.. 2019ల్లో మరోసారి పోటీ చేసినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది.. మునుగోడు టీఆర్ఎస్‌ టికెట్‌ను ఆశించారు బూర నర్సయ్యగౌడ్‌.. కానీ, ఆయనకు నిరాశ తప్పలేదు.. ప్రగతి భవన్‌కు పిలిపుంచుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్‌… బీఆర్‌ఎస్‌లో మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పినట్టుగా.. ఆ తర్వాత మీడియాకు బూర నర్సయ్య గౌడ్‌ చెప్పిన విషయం తెలిసిందే.. కానీ, ఉన్నట్టుండి.. కారు పార్టీకి షాక్‌ ఇచ్చారు బూర.. ఇక, నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తరుణ్ చుగ్‌ను భేటీ అయ్యారు బూర నర్సయ్య గౌడ్.. ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలుస్తోంది.. అక్కడే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం

*ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం*

*జాతీయ పార్టీ ప్రకటన తర్వాత*

*తొలిసారి దేశ రాజధానికి కానరాని హడావుడి..*

*కలవని ఇతర పార్టీల నాయకులు*

*పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పరిశీలనతోనే సరి*
న్యూఢిల్లీ, : ''భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నా.. బీఆర్‌ఎ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకువస్తున్నారు''..విజయదశమినాడు జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలివి! ఆ ప్రకటన తర్వాత తొలిసారి బుధవారం ఆయన ఢిల్లీకి వచ్చారు. కానీ 2 రోజులుగా ఆయన ఇక్కడ తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు!

ఈ 2 రోజుల్లో ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతా ఆయన్ను కలవడానికి రాలేదు. ఢిల్లీలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన కేసీఆర్‌.. గురువారం ఆ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ డిజైన్ల మ్యాపును అధ్యయనం చేసి, వాస్తు ప్రకారం పలు మార్పు చేర్పులను సూచించినట్లు తెలిసింది.

అలాగే.. టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌ రెడ్డి గురువారం ఆయన్ను కలుసుకున్నారు. ఇంతకు మించి ఏ హడావుడీ కనిపించట్లేదు. ఎలాంటి రాజకీయ సందడీ లేదు.

*సుజీవన్ వావిలాల*🖋️