*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ బూర్గుల సుమన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఈమె హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడి కుమార్తె , బూర్గుల నరసింగరావు చెల్లెలు. ఈమె బూర్గుల గ్రామానికి ఒక సారి ఎంపీటీసీ గా మరియు సర్పంచ్ గా సేవలందించారు.. అంతే కాకుండా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో తాను టీచర్ గా తన దగ్గర చదువుకున్న ఆ నాటి విద్యార్ధుల సహకారం తో బూర్గులలో "ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్" ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నేడు ఈ అసోసియేషన్ అనేక గ్రామాలకు విస్తరించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది.. అంతేకాదు తాను చనిపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగ పడాలని హాస్పిటల్ కి దానం చేస్తున్నట్లు వీలునామా రాసుకున్న గొప్ప వ్యక్తి. ఆమె లేని లోటు బూర్గుల గ్రామ ప్రజలతో పాటు చుట్టూ పక్కల ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
(Courtesy/ Source)by:➡️𝗚𝗡𝗥
No comments:
Post a Comment