Monday, October 13, 2025

*మునగనూరు సర్కారు భూమి కబ్జా లో ఫేక్ రసీదుల కలకలం..?*

*మునగనూరు సర్కారు భూమి కబ్జా లో ఫేక్ రసీదుల కలకలం..?*

*పోలీస్ వ్యవస్థ ఎక్కడ..?*

*హైడ్రా నిద్రపోతుందా..?*

*ఇప్పటికే దీనిపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ పంపిన స్థానిక ఐబి అధికారులు..*

*ఫేక్ రసీదులు తయారు చేసి భూములు కబ్జా చేసిన వారిని శిక్షించరా..?*

*రాచకొండలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?*

*ఎందుకు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదు..?*

*సామాన్యుడికి ఒక చట్టం.. జర్నలిస్టులకు మరో చట్టమా.. ఇదెక్కడి న్యాయం..?*

*ఫేక్ సర్టిఫికెట్లు.. రసీదులు తయారు చేయడం నేరం.. కాదా?*

*మునగనూరు గ్రామపంచాయతీ పేరుతో ఫేక్ రసీదులు తయారు చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు..?*

*జర్నలిస్టులు అయితే నేరం చేయవచ్చా..!*

*చట్టం అందరికీ సమానమే.. కదా.. మరి వీళ్లపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదు..?*

*మునగనూరు సర్వేనెం :90 భూ కబ్జా బాగోతంలో ప్రజా ప్రతినిధులు, గత అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో.. తుర్కయంజాల్ కమిషనర్... అందరూ పాత్రధారులే..!*

గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పేరుతో మాయ చేసింది. అందుకోసం ఎటువంటి జీ.ఓ విడుదల చేయకుండా.. అనధికారికంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ.. కొంత మంది జర్నలిస్టులకు అంట గట్టింది. ఆయా నియోజకవర్గాలలో గత ప్రభుత్వ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సర్కార్ భూముల కబ్జా బాధ్యతలను అప్పటి ప్రభుత్వం అప్పగించింది. దీంతో నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వాళ్లను.. వాళ్ల మోచేతి నీళ్లు తాగే జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రభుత్వ భూములను అనధికారికంగా కట్టబెట్టారు.

*జర్నలిస్టులు అనే సోయి మరిచి.. ఫేక్ రసీదులు సృష్టించి..!*

రంగారెడ్డి జిల్లా పరిధిలోని గత అధికార పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు (ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం) 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ల లబ్దికోసం అనధికారికంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వారికి అనుకూలమైన జర్నలిస్టులకు అంటగట్టారు. ఎల్బీనగర్ పరిధిలోని జర్నలిస్ట్ ల కోసం మునగనూరు సర్వేనెం :90 లో రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎమ్మెల్యే తనకు నచ్చిన జర్నలిస్ట్ లకు  అప్పగించారు. దీంతో సదురు మహానుభావులు.. లోక జ్ఞానం ఉన్నోళ్లు.. కదా.. సమాజం పట్ల అవగాహన ఉంటుందని ప్రజలు నమ్మేవాళ్లు.. కానీ సదురు జర్నలిస్టులు సంకలు గుద్దుకొని.. సోయి మరిచి.. సర్కారు భూమి లో 2004 నుంచి తామే ఉంటున్నట్లు.. ఇంటి నెంబర్లతో సహా పొందుపరిచి మునగనూరు గ్రామపంచాయతీలో ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు ఫేక్ రసీదులు తయారు చేశారు. ఎందుకంటే మునగనూరు సర్వేనెం:90 సర్కారు భూమిలో ఏండ్ల తరబడి ఉంటూ ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రభుత్వ భూమిలో 2023 వరకు ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదు. 

*బొక్క బోర్లా..*

మునగనూరు ప్రభుత్వ భూమిలో 2004 నుంచి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు బుఖాయించే ప్రయత్నం చేసిన కబ్జాదారులు 2023లో కరెంటు మీటర్ల కోసం అదే ఇంటి పన్ను రసీదులను పొందుపరచడం గమనార్హం. ఇక్కడే సదురు కబ్జాదారులు బొక్క బోర్లా పడ్డారు. వీళ్లను కాపాడే ప్రయత్నంలో అధికారుల కూడా బుక్కయ్యారు. 2004లో ఎటువంటి నిర్మాణాలు లేకుండా కొత్తగా నిర్మించిన ఇండ్లకు ఫేక్ రసీదులతో కరెంటు మీటర్లు మంజూరు చేసిన ఏడీఈ కూడా నేరస్తుడే..? వీళ్ళతో పాటు అతడిని కూడా విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

*గత ఎమ్మార్వో.. మున్సిపల్ కమిషనర్లు కూడా నేరస్తులే...!*

మునగనూరు ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన గత ఎమ్మార్వో.. గత తుర్కయంజాల్ కమిషనర్, ప్రస్తుత కమిషనర్లకు కూడా ఈ కబ్జా బాగోతంలో భాగము ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో లేకుండా సర్కారు భూమిని ఆక్రమించడం నేరం. ఇందులో గత ఎమ్మార్వో కు.. కమిషనర్లకు కూడా ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అనేక విషయాలు బయటపడతాయి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

*ఎమ్మెల్యేల పిఏ లకు డ్రైవర్లకు సైతం..!*

గత ప్రభుత్వ ఎమ్మెల్యే తన సోకాల్డ్ జర్నలిస్టులతో పాటు పీఏలకు, పీఆర్ఓలకు, డ్రైవర్లకు కూడా మునగనూరు సర్కార్ భూమిలో ఎలా ఉంటాయి..? ప్రస్తుత ఎమ్మెల్యే పీఏకు డ్రైవర్ కు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డ్రైవర్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉండే మరో డిజిటల్ పత్రిక చైర్మన్ కూడా ఇటీవల మునగనూరు సర్కారు భూమిలో ప్లాట్లు పొందినట్లుగా సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

*ఇప్పటికే ఐ బి రిపోర్ట్..?*

మునగనూరు సర్కారు భూమి కబ్జాపై ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జిల్లా కలెక్టర్ కు.. సంబంధిత రెవెన్యూ అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు.. ప్రభుత్వానికి ఇప్పటికే ఒక నివేదిక అందజేసినట్లుగా తెలుస్తోంది..! అయినా ఇప్పటి వరకు ఫేక్ రషీదులతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ఎందుకు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఫేక్ రసీదుల విషయంలో సమగ్ర విచారణ చేపట్టి సర్కార్ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

*హైడ్రా నిద్రపోతుందా..?*

పేదోడు ఓ 30- 40 గజాల ప్రభుత్వ స్థలంలో చిన్నపాటి గుడిసె వేసుకున్న.. లేదా ఓ రేకుల షెడ్డు లాంటి ఇల్లు నిర్మించుకున్న.. కూల్చి వేస్తున్న హైడ్రాధికారులు.. అప్పనంగా మునగనూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫేక్ రసీదులతో కరెంట్ మీటర్లు పొంది.. జర్నలిస్టుల పేరుతో పక్కా నిర్మాణాలు చేపట్టిన వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు. చట్టం పేదోడికైనా.. ఉన్నోడికైనా.. జర్నలిస్ట్ అయినా.. ఒక్కటే కదా..! మరి ఫేక్ రసీదులతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై విచారణ చేపట్టి క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? అనేది.. పలువురి ప్రశ్న..? వెంటనే హైడ్రాధికారులు మునగనూరు సర్కారు భూమి విషయంలో జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
(SOURCE)

No comments:

Post a Comment