Tuesday, November 4, 2025
Saturday, November 1, 2025
*_All D best for Indian proud daughters ✊_*
📲 Just scan & share your experience instantly... Collector,Hyderabad
📢 Dear Citizens,
Your feedback shapes better public service delivery!
💡 We’ve launched the QR Code Feedback System at the #Hyderabad Collectorate.
📲 Just scan & share your experience instantly.
💬 Your voice drives change — every opinion counts!
#PeopleFirst #SmartGovernance #Hyderabad
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@harichandanaias
Courtesy / Source by :
https://x.com/Collector_HYD/status/1984130048799219843?t=J8vNbN9FQuuonwc4pjlhbQ&s=19
Thursday, October 30, 2025
మొంథా తుపాను... అధికారులకు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశాలు జారీ
మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని @TelanganaCS గారిని, @TelanganaDGP గారిని ఆదేశించారు.
❇️వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి గారు మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని ఆదేశించారు.
❇️ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.
❇️పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.
❇️వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి గారు గురువారం రోజున వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. @Collector_WGL @Collector_HNK @cpwarangal #CycloneMontha #Warangal #Hanamkonda #ReliefOperation #SDRF
Courtesy / source by :
https://x.com/TelanganaCMO/status/1983813217135812623?t=gqrqGNoZQzQ9PmlFQFctkg&s=19
Wednesday, October 29, 2025
మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఆరా...
Tuesday, October 28, 2025
PUBLIC/PRESS NOTE
Friday, October 24, 2025
*నమిశ్రీ అవినీతికి సహకరించిన సంబందిత ప్రభుత్వ శాఖల అవినీతి అధికారులను సస్పెండ్ చేసి జైళ్ళో పెట్టాలి.*
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన మరియు సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :
1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం. రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా – గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
2.బడంత్ర జయసూర్య (వయసు 24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.
3.అండోజ్ నవీన్ కుమార్ (వయసు 26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి చికిత్సలో ఉన్నారు.
4.సరస్వతి హారిక (వయసు 30), తండ్రి రంగరాజు, బెంగళూరు – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు.
5.నెలకుర్తి రమేష్ (వయసు 36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలు, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.
6.శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (వయసు 8), అభీరా (వయసు 1.8 సంవత్సరాలు) – ముగ్గురు సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు.
7.కపర్ అశోక్ (వయసు 27), తెలంగాణ రాష్ట్రం – సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు.
8.ముసలూరి శ్రీహర్ష (వయసు 25), నెల్లూరు జిల్లా – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.
9.పునుపట్టి కీర్తి (వయసు 28), ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్ – చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు.
10.వేణుగోపాల్ రెడ్డి (వయసు 24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.
11.ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా – చికిత్స పూర్తయి హైదరాబాద్ చేరుకున్నారు.
12.ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
13.అశ్విన్ రెడ్డి – ఎటువంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు.
14.ఆకాశ్ – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.
15.జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు.
16.పంకజ్ ప్రజాపతి – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.
17.గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా – స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
18.శివా (గణేష్ కుమారుడు) – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.
19.గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.
20.చారిత్ (వయసు 21), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.
21.మొహమ్మద్ ఖిజర్ (వయసు 51), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.
22.తరుణ్ (వయసు 27) – బస్సులో ఎక్కకముందే రద్దు చేసుకున్నారు.
డ్రైవర్ల వివరాలు
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత అబ్స్కాండ్ అయ్యారు (సంఘటన స్థలం నుండి పరారయ్యారు).
2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు మరియు విచారణ కొనసాగుతోంది.
ప్రయాణికుల రాష్ట్రాలవారీగా:
👉తెలంగాణ రాష్ట్రం – 6
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11
👉మధ్యప్రదేశ్ – 1
👉కర్ణాటక రాష్ట్రం – 4
మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.
@Collector_JGL
Source / Courtesy by :
https://x.com/IPRTelangana/status/1981664928810373602?t=mn9So2NzD25H5Ck_ZfvJ9w&s=19
Tuesday, October 21, 2025
*ప్రజా సేవకురాలు, ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు బూర్గుల సుమన ఇక లేరు*
Sunday, October 19, 2025
*_Mr రేవంత్ రెడ్డి "గారు" మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న రెవిన్యూ శాఖ అవినీతి అధికారులు._*
Saturday, October 18, 2025
*తీరు మార్చుకోండి .... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్*
Friday, October 17, 2025
*Mr రేవంత్ రెడ్డి సారు ఇదేనా #TelanganaRising అంటే ?*
Thursday, October 16, 2025
కోర్టు పర్మిషన్తో క్రిమినల్ కేసు బుక్ చేసిన మేడిపల్లి పోలీసులు
రౌడీషీటర్ నగర బషిష్కరణ
పత్రికా ప్రకటన
రౌడీషీటర్ నగర బషిష్కరణ
గౌరవ శ్రీ. జి. సుధీర్ బాబు IPS గారు, రాచకొండ పోలీస్ కమిషనర్, ఆదిబట్ల SHO సమర్పించిన రికార్డులను పరిశీలించిన తర్వాత, తేదీ.30.09.2025 న హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫస్లీ, సెక్షన్ 26(1) నిబంధనల ప్రకారం రౌడీ షీటర్ అయిన కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి, వయస్సు: 32 సంవత్సరాలు, Occ: వ్యాపారం, R/o. ప్లాట్ నెం. 34, తిరుమల హోమ్స్, మన్నెగూడ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. N/o ముషంపల్లి గ్రామం, నల్గొండ మండలం మరియు జిల్లాకు చెందిన వ్యక్తికి నగర బహిష్కరణ ఉత్తర్వులు నోటీసును జారీ చేశారు.
స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నందుకు, ఏసీపీ ఇబ్రహీంపట్నం ద్వారా నోటీసు అందిన ఏడు రోజులలోగా, తనను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి 6 నెలల పాటు ఎందుకు బహిష్కరించకూడదో కారణం తెలపాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి (రౌడీ షీటర్) పై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో దాడి, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు, మరియు అల్లర్లు, వంటి నేరాలతో సహా పలు క్రిమినల్ కేసుల నేర చరిత్ర ఉంది. అతను ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, భయాందోళనలు సృష్టించడంలో పేరుగాంచాడు. అతని నిరంతర బెదిరింపుల కారణంగా, ప్రజలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. కావున నగర బహిష్కరణ విధించటం జరిగింది.
@TelanganaCOPs @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu
SOURCE / Courtesy by :
https://x.com/RachakondaCop/status/1978311802284032171?t=8rReLHGbHhr7jLqgCh96wg&s=19