Thursday, October 16, 2025

రౌడీషీటర్ నగర బషిష్కరణ

పత్రికా ప్రకటన

రౌడీషీటర్ నగర బషిష్కరణ

గౌరవ శ్రీ. జి. సుధీర్ బాబు IPS గారు, రాచకొండ పోలీస్ కమిషనర్, ఆదిబట్ల SHO సమర్పించిన రికార్డులను పరిశీలించిన తర్వాత, తేదీ.30.09.2025 న హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫస్లీ, సెక్షన్ 26(1) నిబంధనల ప్రకారం రౌడీ షీటర్ అయిన కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి, వయస్సు: 32 సంవత్సరాలు, Occ: వ్యాపారం, R/o. ప్లాట్ నెం. 34, తిరుమల హోమ్స్, మన్నెగూడ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. N/o  ముషంపల్లి గ్రామం, నల్గొండ మండలం మరియు జిల్లాకు చెందిన వ్యక్తికి నగర బహిష్కరణ ఉత్తర్వులు నోటీసును జారీ చేశారు. 

స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నందుకు, ఏసీపీ ఇబ్రహీంపట్నం ద్వారా నోటీసు అందిన ఏడు రోజులలోగా, తనను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి 6 నెలల పాటు ఎందుకు బహిష్కరించకూడదో కారణం తెలపాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న కొడుదుల నవీన్ రెడ్డి S/o కోటి రెడ్డి (రౌడీ షీటర్) పై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో దాడి, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు, మరియు అల్లర్లు, వంటి నేరాలతో సహా పలు క్రిమినల్ కేసుల నేర చరిత్ర ఉంది. అతను ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, భయాందోళనలు సృష్టించడంలో పేరుగాంచాడు. అతని నిరంతర బెదిరింపుల కారణంగా, ప్రజలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. కావున నగర బహిష్కరణ విధించటం జరిగింది.

@TelanganaCOPs @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir @DCPMaheshwaram @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu

SOURCE / Courtesy by :

https://x.com/RachakondaCop/status/1978311802284032171?t=8rReLHGbHhr7jLqgCh96wg&s=19

No comments:

Post a Comment