Friday, June 30, 2023

అందరి చూపు మెఘా వైపే...ఆడిట్ లో ఎన్నో అభ్యంతరాలు

*_అందరి చూపు మెఘా వైపే.!_*
_★ ఆడిట్ లో ఎన్నో అభ్యంతరాలు_
_★ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగింది_
_★ అసలు దొంగలు దొరికేనట్టేనా..?_

Courtesy by : _(అనంచిన్ని వేంకటేశ్వరరావు
దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_

*_కేంద్రం నటిస్తోందా..? జీవిస్తుందా.? అన్నది ఓ నేల రోజుల్లో తేలిపోనున్నది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. ఇకముందు జరగబోయోది ఒక ఎత్తు. ఇక భాజపా, భారస మధ్య దాగుడుమూతలకు కాలం చెల్లినట్లే. ఈ రెండు పార్టీల మధ ఆర్థక బంధాలకు నెలవైన 'మెఘా' కాంట్రాక్టుల లోగుట్టు రట్టు కానున్నదా.? చీకటి ఒప్పందాలతో యథాతథంగా పాతరేయబడుతుందా..? అన్నది కాలం తేల్చనున్నది. మొత్తం వ్యవహారం అంతా మెఘా కృష్ణారెడ్డి సంస్థల వైపు అడుగులు పడటం గమనార్హం. గుట్టుగా జరుగుతున్న ఈ' ఆడిట్ రిప్లై'పై 'ఘంటారావం' అందిస్తున్న ప్రత్యేక కథనం._*

*https://m.facebook.com/story.php?story_fbid=pfbid02rTUEmHWjDeuSG95RNhgnii5YuisjBrmdesw6AKGYL2ypbQdFXsFFNjZ84w7Fq84Zl&id=100063772548665&mibextid=Nif5oz*


*_అసలేం జరిగింది..?:_*
కాళేశ్వరం ప్రోజెక్టులో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)కు గతంలో అందిన ఫిర్యాదులపై ఆడిట్ చేయటం కోసం రంగంలోకి దిగింది. ఆ మేరకు వివరాలు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. దీనికి సమాధానం చెప్పటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్దండ పిండాలనే రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం నుంచి సంబంధిత అధికారులు కసరత్తులు మొదలెట్టారు. ఈ మొత్తం తంతు అంతా కాళేశ్వరం ప్రోజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన మెఘా సంస్థ వైపే చూడటం గమనార్హం.

*_డిజైన్ల మార్పు ఎవరికిలాభం...?:_*
డిజైన్లు మార్చడానికి గల కారణాలు, అందుకు అయిన అదనపు వ్యయం, కాంట్రాక్టర్ పాత్ర గురించి, వారికి అదనంగా ఎంత వరకు లాభించింది

*_అంచనాలు అంతగా పెరగటానికి కారణం ఎవరు..?_*
ప్రాజెక్ట్ వ్యయం రూ. 40,000 కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత.?

*_దారిమళ్ళిన నిధులు ఎన్ని..?_*
జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చింది. పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చింది. పేర్కొన్న ఆయన ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రభుత్వం దారి మళ్లించింది.

*_ఎందుకు అప్పగించారు..?_*
ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు అప్పగించటం గురించి.

*_105 మిషన్ల మతలబు ఏమిటి..?_*
కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు.

*_అప్పు ఎంత.? ఎందుకు తెచ్చారు..?:_*
ఈ ప్రోజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కు తెలంగాణ  ప్రభుత్వం  చేసిన అప్పు అక్షరాలా 97, 447కోట్లుగా తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా అప్పులు ఇచ్చాయి.

*_ఫోకస్ ఎందుకు.:_*
అధికారుల బృందం... నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్‌‌ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులపైనే ఎక్కువగా ఫోకస్

*_పరిహారంలో ఈ సమస్యలు ఏమిటి..?:_*
భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ, ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కోరిందట. మూడో ‌ టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, మూడో టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా కాగ్ బృందం అడిగిందట.

విద్యాహక్కు చట్టం విశిష్ఠత

*పత్రిక ప్రచురణార్ధం*
*తేది:30:06:2023*

*#📘🖊️ విద్యాహక్కు చట్టం విశిష్ఠత.. విద్యాశాఖ పై ప్రభుత్వ నిర్లక్ష్య విధానం... ఇదే అదునుగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు అధిక ఫీజుల పేరిట అడ్డగొలు దోపిడి#*

*రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన విద్యాశాఖను పూర్తిగా గాలికొదిలేసిన ప్రభుత్వం.*

*రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం...*

*నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ, విద్యార్ధులకు నలబై నుండి డెబ్బై వేల వరకు ఫీజుల పేరిట దోపిడి చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్*

*రాష్ట్రంలో ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల అడ్డగోలు ఫీజుల దోపిడి.. కమీషన్లు తీసుకోని అందుకు సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులు*

*ప్రైవేట్ పాఠశాలలపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయని విద్యాశాఖ అధికారులు.*

*ప్రతి ఏటా అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు.*

*మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారు*

*ప్రతి మండలానికి ఒక విద్యాశాఖ అధికారి ఉండాలి..కానీ జిల్లాలో ఏడు మండలాలకు ఒక విద్యాశాఖ అధికారి నియమించారు*

*ఉన్న మండల విద్యాశాఖ అధికారులు ఆఫీస్ కి రారు.. ఫోన్ చేస్తే ఎత్తరు ,ఎవరికి కలవరు*

*ఒక్క స్కూల్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకోని అదే స్కూల్ పేరుమీద నాలుగు బ్రాంచీలు నడిపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతు,విద్యార్థుల జీవితాలతో చెలగాటంఆడుతున్నారు*

*విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలో ప్రతి వంద మంది విద్యార్థులలొ ఇరవై ఐదు మంది పేద విద్యార్థులకు {Economically Weaker Section,EWS} వారికి బుక్స్, యూనిఫాం,తో సహా ఫ్రీగా అడ్మిషన్స్ ఇవ్వాలి.*

*పక్కాగా స్కూల్ రికార్డ్ మెయింటెన్ చెయ్యాలి.*

🔹📘🖊️విద్యా హక్కు చట్టం 2009, ఆర్టికల్ 21A, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 38 నిబంధనలు,7 అధ్యాయాలలో ఈ చట్టం రూపొందించారు.
*ఈ చట్టం పేరు ఉచిత నిర్భంద విధ్య  బాలల హక్కుల చట్టం 2009*
ఈ చట్టం పరిధి: జమ్మూకాశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
6 నుండి 11 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి బాల, బాలికలకు ఉచిత & నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఆర్టికల్ 21A & 86వ సవరణ లో విద్యా హక్కు ఆర్టికల్ 21 A ప్రకారం రూపొందించారు.
విద్యా హక్కు ప్రజాస్వామ్యం యొక్క సాధారణ అభివృద్ధికి మరియు సమర్థవంతమైన కార్యాచరణకు ఇది చాలా అవసరం. విద్య ప్రజలను మరింత సమర్థులుగా మరియు ఇష్టపడేలా చేస్తుంది.ఇది రాజకీయ స్థిరత్వం, సామాజిక పురోగమనం మరియు ఆర్థిక శ్రేయస్సుకు ఆధారమైన సమాజ స్తంభంగా పరిగణించబడుతుంది. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క నాల్గవ ప్రాథమిక అవసరం, దుస్తులు, ఆశ్రయం మరియు ఆహారం.ఇది సమాజాన్ని నిలబెట్టే మూలస్తంభంగా పనిచేస్తుంది.విద్య ద్వారానే సామాజిక న్యాయం, సమానత్వం లభిస్తాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 A రాజ్యాంగం (ఎనభై ఆరవ సవరణ) చట్టం 2002 భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 21A జోడించబడింది , ప్రతి రాష్ట్రం ఆరు మరియు పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని ఈ చట్టంలో క్లియర్ గా పొందుపరిచారు. ఈ చట్టం విధి విధానాలు పరిశీలిస్తే ఆర్టికల్ 21 A, రాజ్యాంగ సవరణ ద్వారా 7 అధ్యాయాలు 38 సెక్షన్ లు పరిశీలిద్దాం..*#విద్యా హక్కు చట్టాన్ని సవివరంగా పరిశీలిద్దాం...*
🔹📘🖊️
*అధ్యాయం:1*
*సెక్షన్-1.* చట్టం పేరు: ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం.
2009చట్టం పరిధి: జమ్ముకశ్మీర్ మినహా దేశం మొత్తం వర్తిస్తుంది.
చట్టం అమలు తేదీ: 2010, ఏప్రిల్ *సెక్షన్-2.* 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్నవారు బాలబాలికలు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతి వరకు క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాల్లో చెల్లించే చందాలు స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయతీ.
*అధ్యాయం-2* 
*సెక్షన్-3.* 6 నుంచి 14 ఏండ్లలోపు బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది.బాలలు ప్రాథమిక విద్య పూర్తిచేయడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవరసరం లేదు.
*సెక్షన్-4*–6 నుంచి 14 ఏండ్లలోపు వయసున్న పిల్లలు మధ్యలోనే బడి మానివేస్తే వారిని తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి విద్యార్థులతో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలను పొందటానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.ఈ విధంగా ప్రాథమిక విద్యలో ప్రవేశించిన బాలలు 14 ఏండ్లు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తిచేసేవరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది.
– ఆ విద్యార్థులకు శిక్షణ కాలవ్యవధి కనీసం మూడు నెలలు, గరిష్టంగా రెండేండ్లవరకు ఉండవచ్చు.
*సెక్షన్-5*–బడిలో ప్రాథమిక విద్య పూర్తిచేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు బాలలకు ఉంటుంది.
*అధ్యాయం-3* సెక్షన్-6
–ఆర్టీఈ అంశాలు అమలు చేయటానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేండ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ బడిని నెలకొల్పాలి.1 నుంచి 5 తరగతుల వరకు కిలోమీటర్ దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి.6 నుంచి 8 తరగతుల బాలలకు 3 కి.మీ.లోపు పాఠశాలను ఏర్పాటుచేయాలి.తీవ్రమైన వైకల్యంతో బాధపడే బాలలకు రవాణా సౌకర్యా లు ఏర్పాటుచేయాలి. లేకపోతే ఇంటివద్దే విద్యనందించాలి.
*సెక్షన్-7*–చట్టాన్ని అమలుచేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది.రెగ్యులర్ పాఠశాలల్లో బోధించే టీచర్లందరికీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి.
*సెక్షన్-8*–ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లలను చేర్పించి, ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలని అడిగే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకు ఉండదు.
*సెక్షన్-9*–తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 ఏండ్లు వచ్చేవరకు పిల్లలందరి రికార్డులను స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి.
*సెక్షన్-10*–6 నుంచి 14 ఏండ్లలోపు పిలల్లను పరిసర పాఠశాలలో చేర్పించటం ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
*సెక్షన్-11* ఆర్ టి ఇ ని ఉల్లంఘించినట్లయితే ఈ చట్టం క్రింద ఇచ్చిన హక్కుల రక్షకాలను, పిల్లల హక్కుల రక్షణ జాతీయ సమితి సమీక్షించి, ఫిర్యాదులను పరిశోధించి మరియు విచారణ చేస్తున్న కేసులలో, సివిల్ కోర్టు పవర్లను కలిగి ఉంటుంది.ఏప్రిల్ 1 నుండి ఆరు నెలలు లోపు, పిల్లల హక్కుల రక్షణ కొరకు ఒక రాష్ట్ర సమితిని (ఎస్ సి పి సి ఆర్) లేదా విద్యా హక్కు రక్షణ అధారిటీ (ఆర్ ఇ పి ఎ) ని రాష్ట్రాలు నియమించాలి. స్థానిక అధికారు లకి, ఏ వ్వక్తి అయినా ఒక సమస్యని ఫైల్ చేయాలనుకుంటే, వ్రాత పూర్వకంగా ఫిర్యాదును అందించాలి.ఎస్ సి పి సి ఆర్/ఆర్ ఇ పి ఎ చే విన్నపములు నిర్ణయించబడతాయి.సముచితమైన ప్రభుత్వముచే అధికారం ఇవ్వబడిన ఆఫీసర్ యొక్క ఆమోదం ఫిర్యాదుల పరిశీలనకు అవసరం.
*అధ్యాయం-4*
*సెక్షన్-12*–బడులు ప్రభుత్వ గ్రాంట్లు ఎంతశాతం పొందుతున్నాయో బడిలో చేరిన పిల్లల్లో అంతశాతం మందికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కనీసం 25 శాతానికి తగ్గకుండా పిల్లలను బడిలో చేర్చుకోవాలి.కేంద్రీయ, నవోదయ, సైనిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్యలో 25శాతం సీట్లు బలహీనవర్గాలకు, ప్రతికూల పరిస్థితులు ఉన్న పిల్లలకు కేటాయించాలి.
*సెక్షన్-13*–బాలబాలికలను బడిలో చేర్చుకోవటానికి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. బడిలో చేర్చుకొనేందుకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించరాదు. అనుమతి లేకుండా పరీక్ష నిర్వహిస్తే జరిమానా విధిస్తారు.
*సెక్షన్-14*–వయసు ధ్రువీకరణ పత్రం లేదన్న కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించరాదు.
*సెక్షన్-15*–విద్యాసంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణంగా జూన్ 12 నుంచి ఆగస్టు 31వరకు గడువు ఉంటుంది. గడువు తర్వాత ప్రవేశం కోరినా తిరస్కరించకూడదు.
*సెక్షన్-16*–బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు బడి నుంచి తొలగించకూడదు.
*సెక్షన్-17*–బాలలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ వేధించరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
*సెక్షన్-18*–ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలను స్థాపించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు.
*సెక్షన్-19*–షెడ్యూల్‌లోని నియమాలను పాటించని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదు. ఈ చట్టం అమలుకు ముందే స్థాపించిన పాఠశాలలు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేండ్లలోపు తమ సొంత ఖర్చులతో షెడ్యూల్‌లోని నియమనిబంధనల మేరకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.
*సెక్షన్-20*–షెడ్యూల్‌లోని నియమాలు, ప్రామాణికాలు తొలగించటం, కొత్తగా చేర్చటం లేదా సవరణ చేయటం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.
*సెక్షన్-21*–అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, బడిలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటుచేయాలి. కమిటీ మొత్తం సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలి. ఈ కమిటీకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా ఉండాలి.
*సెక్షన్-22*–పాఠశాల యాజమాన్య కమిటీ ఏటా నవంబర్‌లో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి.
*సెక్షన్-23*–ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
*సెక్షన్-24*–ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. నిర్ధారిత సమయంలో పాఠ్యాంశాలు పూర్తిచేయాలి.
*సెక్షన్-25*–షెడ్యూల్‌లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
*సెక్షన్-26*–ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం ఉపాధ్యా య పోస్టుల్లో ఖాళీలు పదిశాతానికి మించకుండా చూడాలి.
*సెక్షన్-27*–జనాభా గణన, ఎన్నికల విధులకు తప్ప ఉపాధ్యాయులను ఏ విద్యేతర పనులకు వినియోగించరాదు.
*సెక్షన్-28*–ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్స్, ప్రైవేటు బోధన పనులు చేయరాదు.
*అధ్యాయం-5*
సెక్షన్-29–బాలల జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యాలు పెంపొందించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారించి పూర్తిచేయాలి.
*సెక్షన్-30*–ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు బాలలు ఎలాంటి బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
*అధ్యాయం-6*
*సెక్షన్-31*–విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి, కాపాడే ఏర్పాట్లను సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యేందుకు తగిన సూచనలు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి.
*సెక్షన్-32*–విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు గురైన పక్షంలో ఎవరైనా స్థానిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.
*సెక్షన్-33, 34*–బాలల హక్కుల రక్షణకు జాతీయ, రాష్ట్ర సలహా సంఘాలను ఏర్పాటుచేయాలి.
*అధ్యాయం-7*
*సెక్షన్-35*–చట్టం అమలు కోసం సంబంధిత ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు, ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది.
*సెక్షన్-36*–శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేపట్టాలి.
*సెక్షన్-37*–సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ కల్పించాలి.
*సెక్షన్-38*–చట్ట నియమాలు రూపొందించటానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి బాల, బాలికలకు ఉచిత & నిర్బంధ విద్య హక్కు ఉంది. విద్యా హక్కు చట్టం 2009, ఆర్టికల్ 21A & 86వ సవరణ లో విద్యా హక్కు ఆర్టికల్ 21 A ప్రకారం..
విద్యా హక్కు ప్రజాస్వామ్యం యొక్క సాధారణ అభివృద్ధికి మరియు సమర్థవంతమైన కార్యాచరణకు ఇది చాలా అవసరం
ఇది రాజ్యాంగంలోని నిబంధన III ద్వారా రక్షించబడిన విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది . విద్యా హక్కు చట్టం , 2009, కొన్నిసార్లు RTE చట్టంగా సూచించబడుతుంది, ఆగష్టు 4, 2009న భారత పార్లమెంట్ ఆమోదించింది మరియు 2010లో అమలులోకి వచ్చింది.
విద్యా హక్కు నేపథ్యం
1947లో భారతదేశం బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందినప్పుడు జనాభాలో అత్యధికులు నిరక్షరాస్యులు మరియు అత్యంత పేదవారు, మరియు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నరు.
సార్జెంట్ కమీషన్ 1944, చివరి బ్రిటీష్ ఎడ్యుకేషన్ కమీషన్,40 సంవత్సరాలలో లేదా 1985 నాటికి సార్వత్రిక విద్య అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.ఇది 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో కూడిన వ్యవస్థ కోసం యేర్పాటు చేసారు.కింద పేర్కొన్న విధంగా 6-11 (జూనియర్ బేసిక్) మరియు 11-14 (సీనియర్ బేసిక్) పిల్లలందరికీ సార్వత్రిక, నిర్బంధ మరియు ఉచిత ప్రాథమిక ప్రాథమిక విద్య , సీనియర్ బేసిక్ లేదా మిడిల్ స్కూల్ మెజారిటీ విద్యార్థుల పాఠశాల కెరీర్‌లో చివరి దశ.
నిజానికి అమలులోకి వచ్చిన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 45, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రం , రాజ్యాంగం ఆవిర్భవించిన పదేళ్లలోపు ప్రతి చిన్నారికి పద్నాలుగేళ్ల వరకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందజేయడానికి రాష్ట్రం ప్రతి సహేతుకమైన మార్గాలను ఉపయోగించాలని సూచించింది.రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు "న్యాయస్థానంలో అమలు చేయదగినవి" కావు, అయితే చట్టాలను ఆమోదించేటప్పుడు వాటిని ఉపయోగించమని రాష్ట్రం ఒత్తిడి చేయబడుతుంది, ఎందుకంటే "దేశ పాలనలో అందులో పేర్కొన్న సూత్రాలు ముఖ్యమైనవి" రాజ్యాంగం.ప్రాథమిక విద్యా సౌకర్యాలను విస్తరించడానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో, మరియు ప్రాథమిక విద్యపై దృష్టి సారించి ఉచితంగా మరియు తప్పనిసరిగా అందించడం ద్వారా ప్రతి వ్యక్తికి విద్యను అందుబాటులో ఉంచడానికి, 1976 నాటి భారత రాజ్యాంగంలోని 42వ సవరణ విద్యను  ఏకకాలిక ఆందోళనగా ప్రకటించింది.
సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించే లక్ష్యంతో, సర్వశిక్షా అభియాన్ [అందరికీ విద్య కోసం జాతీయ ప్రచారం] జాతీయ గొడుగు కార్యక్రమం 2000లో ప్రారంభించబడింది.
అంతిమంగా, 2002 రాజ్యాంగం (ఎనభై ఆరవ సవరణ) చట్టం ఆర్టికల్ 21Aని ప్రవేశపెట్టింది, ఇది న్యాయ పరిశీలనకు లోబడి ఉండే ప్రాథమిక హక్కు. బాల్య సంరక్షణ మరియు విద్య.
ప్రాథమిక హక్కులుగా విద్యాహక్కు
రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ఆర్టికల్ 45 ప్రకారం సార్వత్రిక విద్యను కలిగి ఉన్నాయి మరియు రాజ్యాంగ సభ సభ్యులు దాని ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ, నిధుల కొరత కారణంగా వారు దానిని ప్రాథమిక హక్కుగా హామీ ఇవ్వలేకపోయారు.
1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో, భారతీయ కోర్టు వ్యవస్థ విద్యాహక్కును జీవించే హక్కులో ఒక అంశంగా చేర్చడానికి ప్రయత్నించింది. 2002లో రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్ 21Aని చొప్పించడం ద్వారా ఆమోదించబడిన రాజ్యాంగ సవరణ ద్వారా భారత పార్లమెంటు దేశ భావి పౌరులకు విద్యను పొందే హక్కును కూడా కల్పించింది.
విద్యా హక్కు చట్టం, 2009, కొన్నిసార్లు RTE చట్టంగా సూచించబడుతుంది, ఆగష్టు 4, 2009న భారత పార్లమెంటు ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21Aలో పేర్కొన్న విధంగా 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల భారతీయ పిల్లలు తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్యను పొందాలి...ఈ చట్టాన్ని ఏప్రిల్ 1, 2010 నుండి అమలులోకి తీసుకురావడం ద్వారా, ప్రతి పిల్లవాడికి విద్యపై ప్రాథమిక హక్కు ఉందని ప్రకటించిన 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.
విద్యా హక్కుకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ జాబితా...ఆర్టికల్ 21A 86 వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, రాజ్యాంగంలోని పార్ట్ IIIలో ఈ కొత్త ఆర్టికల్‌ను చొప్పించింది, "చట్టం ద్వారా నిర్ణయించబడిన 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ రాష్ట్రం ఉచిత & నిర్బంధ విద్యను అందిస్తుంది".
ఆర్టికల్ 15 భారత రాజ్యాంగం జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించింది. అయితే, ఆర్టికల్ 15(3) ప్రకారం, ఈ నిబంధనలో ఏదీ రాష్ట్రాన్ని మహిళలు మరియు పిల్లల కోసం నిర్దిష్ట చర్యలు తీసుకోకుండా ఆపలేదు.
ఆర్టికల్ 38 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ సామాజిక నిర్మాణం అయినా రక్షించబడుతుంది.
ఆర్టికల్ 45 ప్రకారం. 6సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ & విద్యను రాష్ట్రం అందించాలి.
ఆర్టికల్ 29(2) ఏ పౌరుడు వారి మతం, జాతి, కులం, భాష లేదా ఈ కారకాల కలయిక కారణంగా ప్రభుత్వం నిర్వహించే విద్యా సౌకర్యాలు లేదా రాష్ట్ర డబ్బు నుండి ఆర్థిక సహాయం పొందేందుకు నిరాకరించబడదని ఇది హామీ ఇస్తుంది.
ఆర్టికల్ 30 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ఏ రకమైన సంస్థనైనా స్థాపించడానికి మరియు నిర్వహించడానికి అల్పసంఖ్యాక భాషా మరియు మత సమూహాలకు రక్షణ హామీ ఇస్తుంది.
86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002
6 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేయడానికి, 2002 నాటి 86వ సవరణ చట్టం రాజ్యాంగంలో మూడు స్పష్టమైన విభాగాలను జోడించింది. ఈ సవరణ యొక్క లక్ష్యం విద్యపై పౌరుల హక్కులను కాపాడటం మరియు భారతదేశ విద్యాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం.
భారత రాజ్యాంగంలోని పార్ట్ IIIలో ఆర్టికల్ 21A చేర్చడం, కొన్ని ప్రాథమిక నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అధికారిక పాఠశాలలో తగిన మరియు సమానమైన నాణ్యతతో కూడిన పూర్తి-సమయ ప్రాథమిక విద్యను పొందే హక్కు ప్రతి చిన్నారికి ఉందని పేర్కొంది.
కానీ ఈ విద్యాహక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ పేద మధ్యతరగతి ప్రజల డబ్బును అడ్డగోలుగా దోచుకుంటుంది.

*జై భీమ్ జై భారత్*

                  *ఇట్లు*
      *ఇటికాల అంబేద్కర్*
         *ప్రధాన కార్యదర్శి*
*బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా*
✊✊✊📘🖊️✊✊✊

రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యాముల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం....!

*రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్యాముల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం....!*

హైదరాబాద్ : రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకోనిలో పోలీసులు విచారిస్తున్నారు.ఈ చోరీ కేసులో ఎస్సై కృష్ణ సూత్రదారిగా అధికారులు గుర్తించారు. సురేందర్ ను విచారించడంతో వెలుగులోకి ఎస్సై కృష్ణ వ్యవహారం వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.ఎస్సై కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. మే 30న శామ్యూల్ కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. డాక్యుమెంట్లు దుండిగల్ ఎస్సై కృష్ణకు ఇచ్చిన సురేందర్ విచారణలో ఒప్పుకున్నాడు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. చోరీ చేసిన డబ్బులతో సురేందర్ గోవా వెళ్లి క్యాసినో ఆడినట్లు అంగీకరించాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు తెలిపాడు. ఎస్సై కృష్ణా, సురేందర్ ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఓ భూమి విషయంలో రిటైర్ శామ్యూల్ ఎస్సై కృష్ణకు మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో శామ్యూల్ ఆస్తిని మొత్తం కొట్టేసేందుకు ఎస్సై ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, June 29, 2023

_ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ ఆత్మహత్యా ప్రయత్నం

_ఈ సమస్యకు పరిష్కారం లేదా..?_
*_రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో శేజల్‌.. బ్యాగ్‌లో లేఖ లభ్యం_*

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన  అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్‌ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, లేఖను గుర్తించారు._*

మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఆమెను పెద్దమ్మగుడి వద్ద ఎవరో డ్రాప్‌ చేశారని స్థానికులు చెబుతున్నారు. శేజల్‌ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇటీవల దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌, హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఆతర్వాత తెలంగాణ భవన్‌ వద్ద ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం శేజల్‌ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

‘‘లైంగికంగా వేధించిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి. దిల్లీలో అధికార పార్టీ ఎంపీని కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో చిన్నయ్య వేధింపులపై ఆధారాలు లేవని ఎంపీ అంటున్నారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎప్పుడు చంపుతారోననే భయంతో బతుకుతున్నా. పెద్దమ్మగుడి వద్ద ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నా’’ అని శేజల్‌ లేఖలో పేర్కొన్నారు.

Press Note

*Press Note*       29/06/2023

*రామంతపూర్ RTC కాలనీ నుంచి*
*బస్సులను* *పునప్రారంభించాలి* *BSP*

ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో గల రామంతపూర్ డివిజన్లలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్లి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోవటం జరిగింది   కరోనకి ముందు 18R సికింద్రాబాద్ 2)115 కోటి, 3)113 ESI సన్నత్ నగర్ / యూసఫ్ గూడ4)71A చార్మినార్5) 141 నాంపల్లి బస్సులు గతంలో మా కాలానికి వచ్చేవి ,కరోన తగ్గిన తరువాత నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆ బస్సులను పునప్రారంభించలేదు అని కాలనీ వాసులు వాపోయారు
ముక్యంగా, చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు, మహిళలు,సీనియర్ సిటీజన్స్, ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
ఉప్పల్ డిపోలో ఎన్నో సార్లు ఈ విషయంపై  ఫిర్యాదు చేసిన పాటించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు
బస్సులు రాకపోవడంతో అదే అదునుగా తీసుకున్న ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు అని తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తిరిగి బస్సులు వచ్చేలా చేయటానికి మా వంతుగా కృషి చేస్తాము,బస్సులు వచ్చే వరకు స్థానికులకు  అండగా BSP ఉంటుంది అని హామీ ఇచ్చారు
ఈ విషయంపై డిపో మేనేజర్ స్పందించి వెంటనే కాలానికి బస్సులను పునప్రారంభించాలి అని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో
*తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*శీలం అనిత రెడ్డి గారు*
*మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ఇంఛార్జీ*
*గౌడ సుదర్శన్ గారు*
*జిల్లా ప్రధాన కార్యదర్శి*
*ఇటుకల అంబేద్కర్ గారు*
*జిల్లా కోశాధికారి*
*కుసుకుర్తి శ్రీహరి గారు*
*ఉప్పల్ అసెంబ్లీ ఇంఛార్జీ*
*కుమార్ D*
*ఉప్పల్ అసెంబ్లీ అధ్యక్షులు*
*గందమల్ల శ్రీనివాస్ గారు*
*స్థానికులు సామాజిక కార్యకర్త*
*బాపట్ల కృష్ణ మోహన్(ప్రజాసంకల్పం),* *ఒబేలు,సత్యనారాయణ,మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు*  

*****---*****---*****---*****---*****
28/06/2023
*#ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం  BRS & BJP & Congress & BSP & Communists నాయకులను "ప్రజాసంకల్పం" ప్రశ్నిస్తుంది 👉 రామంతాపూర్ డివిజన్ లో RTC కాలనీ (E - Seva) నుండి ఎన్నో సంవత్సరాలనుండి బస్సు సౌకర్యం ఉండేది. వృద్ధులు / మహిళలు / విద్యార్థిని విద్యార్థులకు ఈ బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేది ఇప్పడు ఈ సౌకర్యం లేక రెండు సంవత్సరాలు అయింది. అందరు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరు ప్రజల ప్రయోజనాలకోసం పనిచేయాలి కదా! ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్య మీద ద్రుష్టి పెట్టడం లేదు ఎందుకు??*

*మీరు ప్రజలకోసం పనిచేస్తున్నాము అనుకుంటే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండి.*

*Bplkm🪶*

*NOTE: COPY TO GROUP LINK MEDIA*
https://www.instagram.com/p/CuCO254PPe8/?igshid=MTc4MmM1YmI2Ng==

Wednesday, June 28, 2023

కాళేశ్వరం'పై ఆడిట్ రిప్లై


*_'కాళేశ్వరం'పై ఆడిట్ రిప్లై_*
_★ హైదరాబాద్ కేంద్రంగా కసరత్తులు_
_★ కాచి వడపోస్తున్న అధికారులు_
_★ 'కాగ్' అడిగిన అవినీతికి ధీటైన సమాధానాలు రెడీ_
_★ మరో రెండు రోజులు కొనసాగనున్న లెక్కలు_

Courtesy by : _(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం, 9440000009)_

*_కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం నుంచి సంబంధిత అధికారులు మొదలెట్టారు. గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కాళేశ్వరం ప్రోజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాల గురించి అనేక ప్రశ్నలను తెలంగాణ రాష్ట్రానికి పంపింది. దీనికి ధీటుగా సమాధానం చెప్పటం కోసం సంబంధిత అధికారులు కసరత్తులు మొదలెట్టారు. గుట్టుగా జరుగుతున్న ఈ' ఆడిట్ రిప్లై'పై 'ఆదాబ్.హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం._*

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02pzWC593sGNiZv18Kw8VrGxH19QX5s7v46h7n37xKnzaSkWgLxfNmgiwVHM6ofBCol&id=100063772548665&mibextid=Nif5oz

*_ప్రధాన ఆరోపణలు ఇవే:_*
కాగ్ అధికారుల దృష్టిలో అనేక అరోపణలు ఉన్నప్పటికీ.. నిధుల దుర్వినియోగంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగ్ పేర్కొన్న అంశాలలో ముఖ్యమైనవి.

*_లాభం ఎవరికి.?:_*
డిజైన్లు మార్చడానికి గల కారణాలు, అందుకు అయిన అదనపు వ్యయం, కాంట్రాక్టర్ పాత్ర గురించి, వారికి అదనంగా ఎంత వరకు లాభించింది

*_అంచనాలు అంతగా పెరగటానికి..:_*
ప్రాజెక్ట్ వ్యయం రూ. 40,000 కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత.?

*_దారిమళ్ళిన నిధులు..:_*
జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చింది. పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చింది. పేర్కొన్న ఆయన ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రభుత్వం దారి మళ్లించింది.

*_ఎందుకీ అప్పగింత:_*
ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు అప్పగించటం గురించి.

*_105 మిషన్ల గురించి..:_*
కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు.

*_అప్పు ఎంత..?:_*
ఈ ప్రోజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కు తెలంగాణ  ప్రభుత్వం  చేసిన అప్పు అక్షరాలా 97, 447కోట్లుగా తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా అప్పులు ఇచ్చాయి.

*_ఫోకస్ ఎందుకు.:_*
అధికారుల బృందం... నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్‌‌ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులపైనే ఎక్కువగా ఫోకస్

*_పరిహారంలో మతలబు:_*
భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ, ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కోరిందట. మూడో ‌ టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, మూడో టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా కాగ్ బృందం అడిగిందట. 

*_ఫిర్యాదులతో ముందుకు..:_*
సిబిఐకి బక్క జడ్సన్, కాగ్ కు షర్మిల ఫిర్యాదులు చేశారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోసం అడిగినట్లు తెలుస్తోంది.

బాక్స్:
*_ప్రభుత్వ వాదన ఇలా..:_*
గోదావరి వరద ఏకంగా 108.02 మీటర్ల మేర ప్రవహించింది. పరిమాణం 29 లక్షల క్యూసెకులకు పైగా ఉన్నది. అంటే 1986 మట్టం కన్నా 1.2 మీటర్లు అధికం. అసాధారణ ఆ వరద వల్లనే పంప్‌హౌజ్‌ రెగ్యులేటర్‌ గేట్ల రబ్బర్‌ సీల్స్‌ ఊడిపోయాయి. ఫోర్‌బేలోకి అధికమొత్తంలో నీళ్లు వచ్చాయి. అతి భారీ వర్షాలకు పంప్‌హౌజ్‌ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్తు సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. దీంతో అధికారులు నీరు తోడలేక పోయారు. ఫలితంగా ఫోర్‌బే రక్షణ గోడపై వత్తిడి పెరిగి కొంత కూలిపోయింది. పంప్‌హౌజ్‌ నీళ్లతో నిండింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. చందనపూర్‌ వాగు పొంగడం వల్ల బరాజ్‌ రక్షణకు నిర్మించిన కరకట్టపై నుంచి నీరు పొర్లినందువల్ల అన్నారం పంప్‌హౌజ్‌ మునిగింది.

తెలంగాణ ఠీవి మన.... పీవీ... సీయం కేసీఆర్!

*తెలంగాణ ఠీవి మన.... పీవీ... సీయం కేసీఆర్!*

హైదరాబాద్‌: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి. ఇక, పీవీ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో దేశానికి పీవీ అందించిన సేవలను కేసీఆర్‌ సర్మించుకున్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని పీవీ కాపాడారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు.

మరోవైపు.. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాణిదేవి మాట్లాడుతూ.. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నాం. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది అని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కమ్మ,వెలమ సంఘాలకు... భూ కేటాయింపుపై.... తెలంగాణ హైకోర్టు స్టే!

*కమ్మ  , వెలమ సంఘాలకు... భూ కేటాయింపుపై.... తెలంగాణ హైకోర్టు స్టే!*

హైదరాబాద్ :
కమ్మ, వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూములు కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.ఇలా కేటాయించడం కూడా ఓ విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.

*బలమైన కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకు?*

కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తూ 2021లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. భూముల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో.. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పింది.

అణగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థం చేసుకోవచ్చని.. బలమైన కులసంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించింది. సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, June 27, 2023

తెలంగాణ ముఖ్యమంత్రి (CM) బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలు RTIA

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి (CM) బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం, 2005 కింద కొంత సమాచారాన్ని కోరాను. నా ప్రశ్నల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
1. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత జీతం తీసుకుంటున్నారు మరియు  నెలలో ఏ రోజు జీతం పొందుతున్నారు?
2. దయచేసి CM జీతం స్లిప్ కాపీని షేర్ చేయండి.
3. ప్రగతి భవన్ నిర్వహణకు ప్రతినెలా ఎంత డబ్బు ఖర్చు చేస్తారు?
4. సీఎం భద్రతకు, ఎర్రవల్లిలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ఎంత డబ్బు ఖర్చు చేస్తారు?
5. సీఎం ప్రతిరోజూ ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు?
6. చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని ఫైళ్లను పంపింది మరియు జూలై 2014 నుండి మార్చి 2023 వరకు ఏయే విషయాలపై పంపబడింది?
7. 2014 నుండి మార్చి 2023 వరకు ఆమోదించబడిన/తిరస్కరించబడిన/వాయిదా వేయబడిన ఎన్ని ఫైళ్లను CMO నుండి చీఫ్ సెక్రటరీ స్వీకరించారు?
8. 2014 నుండి మార్చి 2023 వరకు సీఎం ఎన్ని శాఖలను సమీక్షించారు, అవును అయితే అటువంటి సమీక్షల్లో తీసుకున్న సమీక్షలు మరియు విధానపరమైన నిర్ణయాల తేదీలు ఏమిటి?
9. గత 9 ఏళ్లలో విద్య, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం ఎన్నిసార్లు సమీక్ష నిర్వహించారు? అవును అయితే, దయచేసి సమావేశం తేదీలు మరియు దానిలో తీసుకున్న నిర్ణయాలను అందించండి.
10. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలు మరియు బాధ్యతలు మరియు అధికారిక వ్యవహారాలపై సమాచారాన్ని అందించండి.

నాకు ప్రభుత్వం నుండి వచ్చిన డొంకతిరుగుడు సమాధానం చూస్తే విస్తుపోతారు. 😊 నిజం చెప్పడానికి ఎందుకు జంకుతున్నారు, సారూ..

Courtesy by : @RSPraveenSwaero (Twitter)

https://twitter.com/RSPraveenSwaero/status/1673577343544332288?t=5PQzdQnMUiYQhho4YTMoTQ&s=19

(RS ప్రవీణ్ కుమార్ IAS rtd)

Monday, June 26, 2023

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ప్రొ. ఆర్. లింబాద్రి

*తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా నియమింపబడ్డ ప్రొ. ఆర్. లింబాద్రి సర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తుంది "ప్రజాసంకల్పం"... Bplkm🪶*


*Hearty congratulations to Prof. R. Limbadri Sir on his appointment as Chairman of Telangana State Council of Higher Education (TSCHE). Right person for Right Job. All the best, SIR.... Bplkm🪶*

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తమ ఆవేదన

https://twitter.com/Praja_Snklpm/status/1673530326948380674?t=fnPIgA7EzVxSZSPCTpPm_Q&s=08                                                                                        *#తెలంగాణ #డైనమిక్ మంత్రివర్యులు @KTRBRS సారూ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తమ ఆవేదనను మీకు వినతిపత్రం ద్వారా ఇవ్వడం చూస్తుంటే బాధేస్తుంది 😔.*
*తెలంగాణ ద్రోహులకు పెద్దపీఠ వేసి... ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసి సర్వం కోల్పోయిన వారిని మీరు పట్టించుకోవడం లేదు ఎందుకు??*                                                                                                                                                             *4నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడైనా "గరిక సుధాకర్" లాంటి ఉద్యమకారులు చాలా మంది వున్నారు ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి అని  "ప్రజాసంకల్పం" విజ్ఞప్తి చేస్తుంది 🙏*

*@TelanganaCMO*
*#kcr*
*#తెలంగాణమలిదశఉద్యమకారులు*
*#KTR*
*#askktr*

*#జోహార్లుతెలంగాణఅమరవీరులకు*
*Bplkm🪶*                                                                                                                         *NOTE : Copy To Group Link Media*

కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!

*16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.... తెలంగాణకు 2102 కోట్లు....!*

దిల్లి....దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.ఈ ఏడాది బడ్జెట్‌లో  ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, June 25, 2023

MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!

*MLA రోహిత్ రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి!*

*దేవాలయాల్లో పూజలు, ఇంటి వద్ద అభిమానుల కోలాహలం...!*

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అభిమానులు సందడి చేశారు.తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతోపాటు తాండూరు పట్టణానికి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మె ల్యే నివాసానికి పెద్దఎత్తున తరలివచ్చారు.

తాండూరు ప్రజలు ప్రేమానురాగాలు, దేవుని కృపతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి బయట పడటం తో అభిమానులు, నాయకులు దేవాలయాల్లో, చర్చిలలో, మసీదుల్లో, దర్గాలలో ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు కొందరు నాయకులు 1101 కొబ్బరికాయలు పగులకొట్టారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాకాయలు కాల్చారు. తమ నాయకుడు రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో అభిమానులు కోలాహానికి అవదులు లేకుండా పో యాయి. ఎమ్మెల్యేను కలిసి క్షేమంగా ఉండాలని నాయకులు, అభిమానులు కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, June 24, 2023

*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!

*పాత్రికేయులకు... త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ.... మంత్రి KTR.....!*

*న్యూదిల్లి....!*
పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు.ఢిల్లీ టీయూడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్‌ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్‌ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్‌ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గడ్డం రంజిత్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

షాద్ న‌గ‌ర్‌లో ధ‌ర‌ణి దొంగ‌లు

షాద్ న‌గ‌ర్‌లో ధ‌ర‌ణి దొంగ‌లు

– రికార్డుల్లో పేరొచ్చిందని దోపిడీ
– అధికారుల స‌హకారంతో రూ.వందల కోట్ల భూస్కాములు
– 90 మంది వృద్ధుల ప్లాట్స్ కు టోక‌రా?
– చ‌క్రం తిప్పిన రెవెన్యూ అధికారులు!
– త‌క్కువ‌లో కొని.. ఎక్కువ లాభాలకు అమ్మకం
– త‌న్నుకు చావండి.. మేము సేఫ్ అంటున్న రియ‌ల్ట‌ర్స్
– డీటీసీపీ వ‌ర్సెస్ హెచ్ఎండీఏ లే అవుట్స్ ర‌గ‌డ‌

క్రైంబ్యూరో, తొలివెలుగు:హైద‌రాబాద్ శివార్ల‌లో ఎకరం భూమి ఎక్క‌డ చూసినా రూ.10 కోట్ల‌కు త‌క్కువ లేదు. అలాంటప్పుడు హైద‌రాబాద్-బెంగ‌ళూరు హైవేకి ఆనుకుని వున్న భూమిలో యజమానిగా తాతల పేరు ధరణిలో కనిపిస్తే ఈ త‌రం వాళ్లు ఊరుకుంటారా? ఎలాంటి పొజిష‌న్ లేకున్నా.. తాతలు చ‌నిపోయి ప‌దేళ్లు దాటినా.. ఆ భూమిని కొట్టేసేందుకు చ‌ట్టాల్లోని లొసుగుల‌ను వాడేస్తున్నారు. హెచ్‌ఎండీఏ అనుమ‌తులు అంటూ ఎల్పీ నెంబ‌ర్‌ తో అమ్మేసుకుని కోట్లు గ‌డిస్తూ ప‌రార్ అవుతున్నారు. ఇలా గ్రామ పంచాయతీ, డీటీసీపీ లే అవుట్స్ చేసి అమ్మిన ప్లాట్స్ కు ఇంకా రైతుబంధు తింటూ లిటిగేష‌న్ సృష్టిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణే షాద్ న‌గ‌ర్ ఫారుఖ్ న‌గ‌ర్ లోని 8 ఎక‌రాల లే అవుట్.

dharani thieves in shadhnagar

జరిగింది ఇదే..!

హైద‌రాబాద్-బెంగుళూరు హైవేకి ఆనుకుని ఉన్న కొత్తూరు శివారులోని తిమ్మాపూర్ స‌ర్వే నెంబ‌ర్ 97, 98లోని 10 ఎక‌రాల భూమి. దాన్ని అన్నీ లీగ‌ల్ గా చూసుకుని 6 ఎక‌రాలు డీటీసీపీ లే అవుట్ తో ప్లాట్స్ అమ్మ‌కాలను జ‌రిపాయి జ‌న‌ సాయి హౌసింగ్, సుప్ర‌జ హౌసింగ్. ఇందులోని రోడ్లు, పార్క్ ప్లేస్ అంతా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, 2019 తర్వాత అసలు కథ మొదలైంది. త‌హసీల్దార్ ఆఫీస్‌ లో ప‌నిచేసే భాను, రిటైర్డ్ ఎమ్మార్వో వెంక‌ట్ రెడ్డి క‌లిసి ఆ భూమికి పట్టా పాసు బుక్ ఇచ్చి వివాదం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఐపీఎస్‌ లు, ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పలువురు ప్రముఖులు ప్లాట్స్ తీసుకున్నారంటే ఆ భూమి విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి లే అవుట్‌ లోని భూమిలో ధరణి వచ్చాక మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు ప్లాట్స్ కొన్నవారు. 2009లో మరణించిన కొండ అంజయ్య(గతంలో భూ యజమాని) పేరు ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. 2018 ఫిబ్ర‌వ‌రి 15న కొండయ్య వారసులు డెత్ సర్టిఫికేట్ సమర్పించి ఆయ‌న భార్య రాధమ్మ పేరు మీద 2019లో పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత వెంట‌వెంట‌నే బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ పేర్ల మీదకి ఆ భూమి వచ్చేసింది. సంజీవ‌ని పేరుతో క‌ల‌ర్ ఫుల్ బ్రౌచ‌ర్స్ వేయించి ఓపెన్ స్పేస్ అంతా అమ్మ‌కాలు జ‌రిపారు. రీ లే అవుట్ చేసి మూడు నెలల్లోనే రూ.25 కోట్లు దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డీటీసీపీ వ‌ర్సెస్ హెచ్ఎండీఏ!

2005 నాటికి అమలులో ఉన్న చ‌ట్టానికి అనుకూలంగా లే అవుట్‌ తో ఉన్న భూమికి హెచ్ఎండీఏ మ‌ళ్లీ అనుమ‌తులు ఇవ్వ‌డంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. వృద్ధులైన ప్లాట్ ఓన‌ర్స్ న‌గ‌రంలోనే ఉండేవారు. దీంతో ఇష్టానుసారంగా సంజీవ‌ని ప్రాజెక్ట్స్ ఆ ప్లాట్స్ ను అమ్ముకున్నారని ఆరోపణలు వున్నాయి. రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడిప్పుడే ప్లాట్ ఓన‌ర్స్ వెళ్లి చూడగా.. డీటీసీపీ లే అవుట్ ప్లాట్స్ ను భూ మాఫియా మింగేసిందని వాపోతున్నారు. హుటాహుటిన కోర్టుకు వెళ్లి అక్ర‌మ పాస్ బుక్స్ ను స‌స్పెండ్ చేయించారు. హెచ్ఎండీఏలో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అప్ప‌టికే రూ.25 కోట్లు తీసుకున్న రియల్టర్స్ మాత్రం.. తమకు సంబంధం లేదని మీరంతా కొట్టుకు చావండి అంటున్నారని కొత్తగా ప్లాట్స్ కొన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తులు తీసుకుంటే.. 200 నుంచి 500 గజాల వ‌ర‌కు అమ్మకాలు చేసి బిజినెస్ చేస్తారు. కానీ, త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి పూర్తి అనుమ‌తులు అంటూ.. ఒక్కొక్క‌రికి 700 గ‌జాల నుంచి 2,500 గ‌జాల వ‌ర‌కు అమ్మేశారని అంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన వారు.. తాజాగా కొనుగోలు చేసిన వారు కొట్టుకోని చావండని.. తాము, అధికారులు రెండేళ్ల‌లో రూ.25 కోట్లు వెనకేసుకున్నాం అంటూ బొల్లినేని శ్రీవ‌ల్లి, ప‌త్తిపాటి శ్రీధ‌ర్ నేరుగా చెబుతున్నారంటూ వారంతా వాపోతున్నారు. అక్ర‌మ పాస్ బుక్స్ ను స‌స్పెండ్ చేయించినా ధ‌న బ‌లం, ఎమ్మెల్యే అంజ‌య్య అండ‌దండ‌ల‌తో చుట్టూ ప్రహరీ గొడ‌లు నిర్మిస్తున్నార‌ని ప్లాట్ ఓన‌ర్స్ ఆరోపిస్తున్నారు.

 

హెచ్ఎండీఏ ఎం చేస్తోంది?

సైబ‌ర్ మోస‌గాళ్లు తాము చట్టానికి దొరక్కుండా ఉండేందుకు సిమ్ కార్డులు ఎలా మారుస్తారో.. అలాగే అక్ర‌మ‌ ప్రాజెక్ట్స్ చేసే రియ‌ల్ట‌ర్స్ కూడా తప్పుడు పత్రాలతో అప్లికేష‌న్స్ పెట్టి.. జ‌నాల‌ను మోసం చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. తాము చేసేందే క‌రెక్ట్ అంటూ పోలీసులు, పొలిటిష‌న్స్ ముందు క‌ల‌రింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. దోచుకుని.. త‌లా కొంత‌ ఇచ్చిన వారికే మ‌ద్ద‌తు ప‌లకడం కామ‌న్ గా మారిందని వాపోతున్నారు. అస‌లు రికార్డ్స్ ఏంటి? ఎవరెవరు ఏ ప్రాంతంలో పొజిష‌న్స్ లో ఉన్నారు? 2019లో వ్య‌వ‌సాయ భూమి అంటే ఎలా సాధ్య‌మో క‌నీసం గుర్తించ‌కపోవ‌డం… మున్సిపాలిటీ ఆథారిటీ అధికారులు ఇప్ప‌టికీ లేక‌పోవ‌డం న‌గ‌ర శివారులోని వారికి శాపంగా మారిందంటున్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేశామ‌ని చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు.

రిటైర్డ్ ఎమ్మార్వో నిర్వ‌ాకంతోనే గొడ‌వ‌లు!

డీటీసీపీ లే అవుట్స్‌ లో భాగంగా 2005లో 6 ఎక‌రాలు నాలా కన్వ‌ర్ష‌న్ అయింది. గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ లు పూర్తి చేశారు. కానీ, మ‌ళ్లీ అదే ప్రాంతంలో 2019లో అక్కడ వ్య‌వ‌సాయం సాగు చేస్తున్న‌ట్లు అప్పటి తహసీల్దార్ పంచ‌నామా రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. మ‌ళ్లీ నాలా క‌న్వ‌ర్ష‌న్ చేశారని, ఒకే భూమికి రెండు సార్లు ఎలా చేశారో వారికే తెలియాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యే ముందు అడ్డ‌గోలు వ్య‌వ‌హారాలు చేసి.. కోట్లాది రూపాయ‌లు రియ‌ల్ట‌ర్స్ కి దొచిపెట్టేందుకు కార‌కులు అయ్యారంటూ ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.

ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు

అదిత్రీ హౌసింగ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొల్లూరులో  ఫ్రీ లాంచ్ఆఫర్ పేరుతో 2018 లోనే విల్లా లను అమ్మి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒక్క విల్లా కూడా మొదలు పెట్టలేదు.
ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు పక్కన డౌన్ స్ట్రీమ్ లో కింగ్ ఫిషర్ పాండ్ ని మూసేసి తూములను మూసేసి 18 ఎకరాల్లో విల్లా లు కడుతున్నామని ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మార్కెటింగ్ చేసి తక్కువ ధరకు ఆశ చూపి చాలా ప్లాట్లను అమ్మేశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని జీవో ఎంఎస్ నెంబర్ 168 ఆఫ్ 2012 ఒకసారి పూర్తిగా చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక్క ఇరిగేషన్ ఎన్వోసీ తప్ప ఎటువంటి అప్రూవల్సు లేకుండా కింగ్ ఫిషర్ పౌండ్ ని మూసివేసి అవుట్ ఫ్లో ఛానల్ ని మూసివేసి చెరువు అలుగు మీద ఫ్రీ కాస్ట్ షెడ్లను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ గాని ఎమ్మార్వో గాని మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపల్ చైర్మన్ హెచ్ఎండిఏ గాని ఇరిగేషన్ శాఖ  గాని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వాళ్ల అవినీతికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇలా ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కళ్ళముందే మోసాలు చేస్తున్న కూడా సంబంధిత అధికారులు లంచాలకు కక్కుర్తి బడి చట్టాలకు తూట్లు పొడుస్తూ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ కూర్చుంటున్నారు. ఇరిగేషన్ సంగారెడ్డి ఎస్సీ అదిత్రీ సంస్థ తూములను మూయలేదు అని ఎమ్మార్వోకు చెప్పడం వారి లోపాయాకారి ఒప్పందాలకు నగ్నసాక్షి.
కళ్ళముందు స్పష్టంగా ఒక చదువు రాని వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా తూములను మూసినట్టు కనిపిస్తున్న కూడా ఇరిగేషన్ వారు రియల్ ఎస్టేట్ సంస్థకు వత్తాసు పలుకుతున్నారు అంటే వారికి ముట్టాల్సినవి ముట్టినయాన్ని స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు అమీన్పూర్ బయోడైవర్సిటీ లేదా జీవవైవిద్య చెరువుగా గుర్తింపు పొందినటువంటి చెరువులో నీరు బయటికి వెళ్లే దారులన్నీ మూసివేసి డ్రనేజీ పైప్లైన్ కలపడం పారిశ్రామిక వ్యర్థాలను చెరువులోకి వదలడం ఒక దుర్మార్గమైన చర్య. కళ్ళముందే చట్టాలను కారరాస్తున్న పరిరక్షించాల్సిన అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియా తో కుమ్మక్కయి బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
రాష్ట్ర గవర్నర్ గారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని ఈ విషయంలో తక్షణం కలగజేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
 @Collector_SRD
@TelanganaCS @MinisterKTR @PIBHyderabad @moefcc @CGWB_CHQ @CWCOfficial_GoI @DrTamilisaiGuv @KTRoffice @Praja_Snklpm 

24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం

*24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం* 

 *షాద్ నగర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య*  

 *ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి  పాడె కడుతామని అల్టిమేటం* 

 *షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం* 

 *పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ముదిరాజ్ సంఘం నేతల ఫిర్యాదు* 

 *ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని సీఎం కేసీఆర్ ను కోరిన ముదిరాజులు* 

: బాధ్యతగల పదవిలో ఉంటూ ఓ వీడియో జర్నలిస్టును దుర్భాషలాడి అతని కెమెరా లాక్కొని అతనిపై దాడికి పాల్పడడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునేలా ముదిరాజ్ కులాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి  తొలగించాలని, 24 గంటల్లో అతనిపై సీఎం కేసీఆర్ చర్య తీసుకోకపోతే ముదిరాజుల తడాఖా ఏమిటో? రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామని ముదిరాజ్ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని ముదిరాజు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ఆయా పార్టీలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఈ ధర్నాలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉంటూ ఒక వీడియో జర్నలిస్టును కిడ్నాప్ చేసి అతని హింసించడం కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని అన్నారు  ముదిరాజులు తలుచుకుంటే కౌశిక్ రెడ్డి మిగలడని హెచ్చరించారు. అనేక సందర్భాల్లో రౌడీలా వ్యవహరించిన కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని బాబయ్య డిమాండ్ చేశారు. స్థానిక అధ్యక్షుడు అంచె రాములు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ముదిరాజులు వదిన పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా సామాన్య ప్రజలను బాధ్యత గల జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇంత పనికిమాలిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించడం ఎంత మాత్రం సబబు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముదిరాజ్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే అతన్ని పదవి నుండి తొలగించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యువ నాయకుడు శ్రీధర్ వర్మ మాట్లాడుతూ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముదిరాజులు స్పందిస్తారని తమ ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి బలి కాక తప్పదని హెచ్చరించారు. ఈ సంఘటనపై కౌశిక్ రెడ్డిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ముదిరాజ్ సంఘం యువనేత అందే మోహన్ మాట్లాడుతూ 24 గంటల్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికార మదంతో వీర్రవీగుతున్న కౌశిక్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఇంకా ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు నాయకులు కౌశిక్ రెడ్డి పై తీరుపై విరుచుకుపడ్డారు. కౌశిక్ రెడ్డిని బండ బూతులు తిడుతూ అతని బొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కౌన్సిలర్ కానుగు అనంతయ్య, ప్యాట అశోక్,*టీజెఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రాసిడెంట్  చెక్కల శ్రీశైలం*, అంచెరాజు, కుడుముల బాలరాజ్, ఎలికట్ట ఎంపిటిసి శ్రీశైలం, బుడ్డ నరసింహ, చెట్ల వెంకటేష్, రమేష్, నలమొని శ్రీధర్, అందే పైలయ్య, మంగ వెంకటేశ్, కొండే యాదయ్య, భాస్కర్, గూడూరు నర్సింహ,  సంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....

Friday, June 23, 2023

కేసీఆర్ దారిలో కేజ్రీవాల్....? ఇది కాంగ్రెస్ కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం....!

*కేసీఆర్ దారిలో కేజ్రీవాల్....? ఇది కాంగ్రెస్ కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం....!*
ఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి.ఇందులో భాగంగా శుక్రవారం బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్‌ ఇచ్చారు.

*కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం*
శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌ కూడా హాజరయ్యారు.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్‌ పార్టీ విషయంలో కాంగ్రెస్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకుప్రయత్నించాగా.. అది కుదరలేదు.

*కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్‌ దారిలో కేజ్రీవాల్‌?*
ఒక వేళ ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్‌ కూడా సీఎం కేసీఆర్‌ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్‌.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️ 

#ముదిరాజ్ జాగో

https://youtu.be/x0oOSTfqgNo                                              
 *#ముదిరాజ్ బంధు మిత్రులారా మీకు #ఆత్మగౌరవం లేదా ??#ముదిరాజ్ సంఘాలు వివిధ పార్టీలలో వున్న ముదిరాజ్ నాయకులు నిద్దుర పోతున్నారా ?? #ముదిరాజ్ బిడ్డను అమ్మనా బూతులు తిడుతుంటే ఇంకెన్నాళ్లు మౌనంగా వుంటారు??..... Bplkm🪶*                                          
*@TelanganaCMO* *@KTRBRS*
*@Eatala_Rajender*                                                                                                                             https://twitter.com/Praja_Snklpm/status/1672256798882148353?t=eoG8Amo5348SxiVbCQ6nsA&s=19

Thursday, June 22, 2023

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ

హైదరాబాద్‌: తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది..

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్‌ చేసినట్లు తెలిపింది.

'హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్‌ పీజ మెడికల్‌ సీట్స్‌ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం' అని ఈడీ పేర్కొంది..


Courtesy by : సుజీవన్ వావిలాల 

Wednesday, June 21, 2023

UAPA లాంటి చట్టాలను దుర్వినియోగం చేస్తుండ్రు

భీమ కోరెగవ్ కేసులో దేశ స్థాయిలో ప్రశ్నించే గొంతులను పట్టుకుంటే, ములుగు UAPA కేసు రాష్ట్ర స్థాయిలో అదే పని చేయడానికి ప్రయత్నిస్తోంది. 

హరగోపాల్ అంటే ఫేమస్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి ఆయన మీద కేసుని తీసేయండి అంటే తీసేసారు.  అది UAPA కేసు కాబట్టి మీడియా దృష్టిని ఆకర్షించింది, కొంత మంది బయట పడ్డారు. 

ముఖ్యమంత్రి గారు చెప్పగానే, ములుగు పోలీసులకు ఆ కొంతమంది మీద ఆధారాలు లేవు అని అప్పటికి అప్పుడు తెలుసుకొని, కోర్టుకు వాళ్ళ పేర్లు కొట్టెయ్యమని చెప్పారు.  

కారణం లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరాదు అని చెబుతున్న వ్యవస్థ అడ్డుపడలేకపోయింది. పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు విని, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారు అని సినిమాలలో చూపించిన విధంగా జరిగింది. 

 ఎప్పుడో పోయిన సంవత్సరం పెట్టిన కేసు గురించి ఇప్పటి దాకా నిందితులకు కూడా తెలియదు. విచారణ మొదలు అవ్వలేదు. ప్రజా ఉద్యమాల కోణం లో ఆలోచిస్తే, అవసరం అయినప్పుడు హరగోపాల్ గారిని జైల్ లోకి తోయడం కోసం పేపర్ వర్క్ సిద్దం చేసుకున్నారు అనుకోవచ్చు. అది తప్పు అని చెప్పడానికి పెద్దగా చర్చ అవసరం లేదు. 

ఒకవేళ,  152 మీద ఏటువంటి  రాజకీయ వొత్తిడి లేకుండా, వారు రాజద్రోహం చేస్తారు, చేయబోతున్నారు అని నమ్మి కేసు పెడితే, సంవత్సరం వరకు విచారణ మొదలు అవ్వక పోవడం ఏంటి?

ములుగు పోలీసులు జూన్ 17, 2023 రోజు ఇచ్చిన స్టేట్మెంట్ లో, మావోయిస్టు లీడర్స్ మీద, మావోయిస్టు సానుభూతి పరుల మీద, అక్కడ దొరికిన విప్లవ సాహిత్యం లో ఉన్న మనుష్యుల పేర్ల ఆధారంగా కేసులు పెట్టడం జరిగింది అని చెప్పారు. క్రైమ్ చేసిన వారి మీద, అనుమానం ఉన్న వారి మీద కేసులు పెట్టాలి కానీ, నక్సల్స్ దగ్గర దొరికిన పుస్తకాలలో రాసి ఉన్న పేర్లు అని, వారికి సానుభూతిపరులు అని కేసు పెట్టడం ఏమిటో? ఆ పుస్తకాలో  కార్ల్  మార్క్స్  పేరు , మజుందార్ పేరు కూడా ఉండే ఉంటాయి, వారి మీద కూడా కేసులు బుక్ అయ్యాయా?

ఇక్కడ అందరు భయపడాల్సిన విషయం ఏమిటంటే,   దాదాపు సంవత్సరం పాటు తెలియకపోవడం. అంటే ఎవరి మీద ఎక్కడ ఏమి కేసు ఉందో తెలియదు, కాబట్టి సరైన సమయం చూసి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు.  

ఒక పద్దతి, ఒక నియమం లేకుండా జరిగే పనుల వల్ల, ప్రజలకు వ్యవస్థ పట్ల నమ్మకం పోయే అవకాశం ఎక్కువ. అలా నమ్మకం పోయిన రోజున, తాము నిర్బంధానికి గురికాకుండా ఉండాలంటే, అధికార పార్టీ మనుష్యులతో  సత్సంబంధాలు ఉంచుకోవల్సిన పరిస్థితి వచ్చిన రోజు, మానవ హక్కుల మాట పక్కన పెడితే, అసలు వ్యవస్థ నే  కూలిపోయినట్టు భావించాలి. 

UAPA లాంటి చట్టాలు భారత దేశం లో కొత్త కాదు.  ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, వ్యతిరేకించే వారిని అదుపులో పెట్టడానికి POTA,UAPA లు ఉంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను , సంఘ విద్రోహ వ్యక్తులుగా చిత్రీకరించడం అనేది కూడా కొత్తది కాదు.  అయితే, ఇలా ప్రశ్నించే వారు, విమర్శించే వారు తక్కువ సంఖ్య లో  ఉండటం వలన ఇలాంటి నల్ల  చట్టాలతో వారి నోరుని నొక్కెయ్యడం తేలిక. అలాకాకుండా ప్రతి వ్యక్తి , ప్రభుత్వ చట్టాలు , విధానాలతో తన జీవితం, తన చుట్టూ ఉన్న సంఘ్ ఎలా మారచ్చో అర్థం చేసుకున్న రోజు, ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, మానవ హక్కులు కాపాడబడతాయి.  

Courtesy by :
సంజీవ్
మానవ హక్కుల వేదిక.

తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు దశాబ్ది ఉత్సవాలా?

*తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు దశాబ్ది ఉత్సవాలా?*
 
*BSP-ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు*
*గందమల్ల శ్రీనివాస్*

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ధనంతో హంగు, ఆర్భాటలతో నిర్వహిస్తున్న దశాబ్ది సంబరాలు, ముందుగా వారి కుటుంబం మొత్తం బాగుపడినందుకు, మరియు KCR పెట్టిన నూతన పార్టీ BRSను ప్రచారం చేసుకోవటం కోసం
మాత్రమే అని అన్నారు

గడిచిన 9 సంవత్సరాల  కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని అన్నారు
మాయమాటలతో అధికారంలోకి వచ్చి మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను నేడు అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత మన KCR గారిది అని విలేకరుల సమావేశంలో అన్నారు

తెలంగాణలో గద్దెనెక్కదానికి ఇచ్చిన హామీలలో KCR ఇంత వరకు నెరవేర్చని వాటిలో కొన్ని హామీలు మాత్రమే

1) తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయనందుకు సంబరాలా?

2) నిరుద్యోగులను మోసం చేసినందుకు సంబరాలా


 3) ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వనందుకు సంబరాలా

 4) డబల్ బెడ్ రూములు ఇవ్వనందుకు సంబరాలా

(ని ఫామ్ హౌస్, ,ప్రగతి భవన్, నూతన సచివాలయం నిర్మాణం కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసుకోవటం కోసం వందల కోట్లు ఉంటాయి కానీ
పేదవాడికి ఇల్లు కట్టుకోవటానికి 9 సంవత్సరాల నుండి బడ్జెట్ ఇవ్వనందుక)

 5)  కేజీ టు పీజీ విద్య అమలు చేయనందుకు సంబరాలా 

 6)  ధరణి పేరుతో వేల ఎకరాల భూమిని దగా చేసినందుకు సంబరాలా 

 7) దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు సంబరాలా  

 8) నిరుద్యోగ భృతి ఇవ్వనoదుకు సంబరాలా 

9)  TSPSC లో పేపర్లు లీకేజీ చేసి 36 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసినందుకు  సంబరాలా 

 10) ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నందుకు సంబరాలా 

 11)  నల్ల మట్టిని  దోస్తునందుకు,ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నదుక సంబరాలా 

 12) లిక్కర్ స్కాము చేశాం అని సంబరాలా 

13)ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా,హర్హులను వదిలేసి కేవలం BRS కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చినoదుక

15) తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను వదిలిన కుటుంబాలను వదిలి
తెలంగాణ ఉద్యమాన్ని నిరుగార్చిన వారికి ఈ రోజు MLA, MP టిక్కెట్లు ఇచ్చి 
సామాన్య ప్రజలను దోచుకుంటుంనందుక

16)దళితుడిని ముఖ్యమంత్రి చేయనందుక

16)ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్న, విద్యార్థుల, తల్లిదండ్రుల ఆనాదలు అయినందుక
అని ప్రశ్నించారు

18)నిటమునిగిన ఇళ్లకు ఇంత వరకు నష్ట పరిహారం ఎవ్వనందుక

19)ఒక్క వనకే ఇండ్లు, మునిగిపోయే డ్రైనేజీలు, ఏర్పాటు చేసినందుక
కాళేశ్వరం, వంటి ప్రాజెక్టులాల్లో లక్షలాది రూపాయలను కమీషన్ల రూపంలో మీ కుటుంబాలకు దోచిపెట్టినందుక 

20) చెరువులు, సామాన్య ప్రజల భూములు కబ్జా చేస్తున్నాదుక ఈ సంబరాలు
అని అన్నారు

వీటి అన్నిటికి ఉప్పల్ MLA బేతి సుభాష్ రెడ్డి  గారు
సమాధానం చెప్పాలి అని అన్నారు
ఎమ్ సాధించారు అని దశాబ్ది ఉత్సవాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు
మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల అన్నిoటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని రాబోయే ఎన్నికల్లో BRS కు తగిన బుద్ధి చెప్పి BSP కి అధికారం ఇస్తారు అని అన్నారు
రాబోయే రోజుల్లో తెలంగాణ బహుజన సమాజం మొత్తం 
బహుజన్ సమాజ్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి
Dr RS ప్రవీణ్ కుమార్ గారి వెంట ఉంటూ ఆయన చేస్తున్న పోరాటానికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు అదే విదంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు
బహుజనులకు రాజ్యాధికారామే అంతిమ లక్ష్యంగా BSP  పని చేస్తుంది అని అన్నారు.

డిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన.... గద్దర్

*డిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన.... గద్దర్*

ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. కొత్త రాజకీయ పార్టీ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు.రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను గద్దర్ కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. ''గద్దర్ ప్రజా పార్టీ'' పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీకి వచ్చినట్టుగా చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులకు అప్లికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు.

ఇది ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న పార్టీ అని గద్దర్ చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని అన్నారు. తాను పార్లమెంటరీ మార్గంలోకి వచ్చానని.. ఓట్ల యుద్దంలోకి దిగానని చెప్పారు. తాను ఏర్పాటు చేస్తున్న గద్దర్ ప్రజా పార్టీ ఒక తెలంగాణదే కాదని.. దేశంలోని ఒక పార్టీగా నిర్మాణం చేసేందుకు తాను బుద్దుడిలా కృషి చేస్తానని తెలిపారు. ఇక, గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉండనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలి గుర్తును పెట్టారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, June 20, 2023

విద్యా దినోత్సవంలో చోటుచేసుకున్న విషాదం

*వెంట పడిన కుక్కలు... ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం*

*విద్యా దినోత్సవంలో చోటుచేసుకున్న విషాదం*

*హనుమకొండ జిల్లా మర్రిపల్లిగూడెంలో దుర్ఘటన*

*కమలాపూర్...* కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓ బాలుడు ట్రాక్టర్‌ కిందపడి దుర్మరణం పాలైన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మర్రిపల్లిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీసుల వివరాల మేరకు.. మర్రిపల్లిగూడేనికి చెందిన ఇనుగాల జయపాల్‌-స్వప్న దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనుష్‌ (10) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చదువుతున్నాడు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధనుష్‌ ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు వెంట పడ్డాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అదే గ్రామంలోని రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్‌ తోట విజయేందర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి బాలుడుని ఢీకొట్టాడు. ప్రమాదంలో ధనుష్‌ ట్రాక్టర్‌ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.గమనించిన స్థానికులు వెంటనే కమలాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలే తమ కుమారుడిని బలి తీసుకున్నాయని, ఈ ఉత్సవాలు లేకుంటే తమ కుమారుడు బతికేవాడని ధనుష్‌ తల్లిదండ్రులు విలపించారు. ధనుష్‌ తండ్రి జయపాల్‌ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ యజమాని నారాయణరెడ్డి, డ్రైవర్‌ తోట విజయేందర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

*ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి: ఈటల*
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విద్యార్థి ధనుష్‌ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ధనుష్‌ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కమలాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, June 18, 2023

ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. సెలవులు ఇవ్వాలి

https://twitter.com/AnooradhaR/status/1670452750319247360?t=aRf8M6pk95PqMZ_tK-tthg&s=08                        
*ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది మన తెలంగాణాలో,రుతు పవనాలు రాలేదు.ఈ వేడికి పిల్లలు తట్టుకోలేక చాలా ఇబ్బందులు,జ్వారాలు, డీహైడ్రేషన్ కు గురి అవుతున్నారు.వాతావరణం మారే వరకు సెలవులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం డిమాండ్*.                                                                     

*@TelanganaCMO @SabithaindraTRS*
*@TSEduDept* *@Praja_Snklpm* *@BplplH* *@dr_mvreddy*

Saturday, June 17, 2023

BSP ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులుగా గంధమల్ల శ్రీనివాస్

*ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులుగా గంధమల్ల శ్రీనివాస్*

బహుజన్ సమాజ్ పార్టీ 
మేడ్చెల్ మాల్కాజిగిరి జిల్లా ఉప్పల్ అసెంబ్లీ సమీక్ష  సమావేశంలో నన్ను
ఉప్పల్ నియోజకవర్గ  అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర, జిల్లా, మరియు సపోర్టు చేసిన అసెంబ్లీ, డివిజన్ నాయకులకు ధన్యవాదాలు🙏🏻

మహనీయుల ఆశయాలను బహుజన సమాజానికి తెలియపరుస్తూ,
*జాతీయ అధ్యక్షురాలు*,
*భావి భారత ప్రధాని బేహాన్జీ కుమారి మాయావతి*, 
*తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు*
*తెలంగాణ ముఖ్యమంత్రి* *అభ్యర్థి*
*Dr RS ప్రవీణ్ కుమార్ IPS (Vrs) గార్ల నాయకత్వంలో*
 బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా  ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో గల నాయకులందరిని  కలుపుకుని పోతూ 
బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు నావంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న                       *తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*శీలం అనిత రెడ్డి గారు*
*మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ఇంచార్జి*
*గౌడ సుదర్శన్ గారు*
*జిల్లా అధ్యక్షులు*
*బానోతు రవేందర్ నాయక్ గారు*
జిల్లా ఉపాధ్యక్షులు
ఎర్రవెల్లి మల్లేష్ గారు
జిల్లా కోశాధికారి
కసుకుర్తి శ్రీహరి గారు 
ఉప్పల్  ఇంఛార్జీలు
ఎడ్ల పరమేశ్వర్, 
కుమార్ గార్లు
ఉప్పల్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు SK వలి 
కోశాధికారి
పోలేపాక ప్రవీణ్ కుమార్
కార్యదర్శి
బుగ్గ నరేష్
మిర్పెట్ ఇంఛార్జీ
పంగ ప్రభాకర్ గారు
సురేష్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు

జై భీమ్✊🏻💙🐘 జై భారత్

తెలంగాణలో ఎం జరుగుతుంది ... మంత్రి KTR...!

*తెలంగాణలో ఎం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి.... మంత్రి KTR...!*

*వరంగల్...!*
ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న టెక్స్‌టైల్‌ పార్కుకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.261 ఎకరాల్లో రూ.900 కోట్లతో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. యంగ్‌ వన్‌ కంపెనీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయనుంది. భూమిపూజ అనంతనం కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

''వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం. పట్టుపట్టి మరీ వరంగల్‌లో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యం ఉన్న నేతన్నలు ఉన్నారు కాబట్టే వరంగల్‌కు మంచి పేరు వచ్చింది. వరంగల్‌ జిల్లాలో నాణ్యమైన పత్తి పండుతోంది. గణేశా కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టింది. గణేశా కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయి. యంగ్‌ వన్‌ కంపెనీలో మొత్తంగా 11 పరిశ్రమలు వస్తాయి. తద్వారా వేల ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ నిర్మించే పరిశ్రమల్లో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి.మేడిన్‌ వరంగల్‌ దుస్తులు అనేక దేశాలకు వెళ్తాయి. యంగ్‌ వన్‌ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమ. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి. మన దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. టెక్స్‌టైల్ రంగంలో మనకంటే బంగ్లాదేశ్‌, శ్రీలంక ముందున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తీసుకొచ్చింది. వరంగల్‌ జిల్లాలో రానున్న 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు వస్తాయి. చల్లా ధర్మారెడ్డి చొరవ వల్లే కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు వచ్చింది. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే భయపడుతున్నారు. నియోజకవర్గాలు మార్చుకొని మరీ వేరేచోటుకు వెళ్లిపోతున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, June 16, 2023

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మరియు అవినీతి మాయం చేసి బ్రష్టు పట్టించారు

ఇంట గెలవలేని వాళ్ళు రచ్చ గెలుస్తారంట. 9 ఏళ్ల స్వపరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మరియు అవినీతి మాయం చేసి బ్రష్టు పట్టించారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు దేశం మీద పడి దోచుకోవాలని బయలుదేరారు. డిపాజిట్లు కూడా రావు గుర్తు పెట్టుకోండి. ఆధారాలతో సహా భూకబ్జాల గురించి చెరువులు కుంటల కబ్జాల గురించి అవినీతి గురించి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవట్లేదు అంటే అందులో మీ ప్రభుత్వం భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సంగారెడ్డి జిల్లా లో, ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో కబ్జాకు గురైన నారాయణ రావు లేఔట్ లోని 455 ఎకరాల ప్రభుత్వ భూములను చెరువులను కబ్జా చర నుంచి విముక్తి చేసి అక్రమార్కులపై తక్షణం చర్యలు తీసుకోండి అలాగే లగ్డారం పెద్ద చెరువును అక్రమ మైనింగ్ నుంచి క్రషర్ల నుంచి కాపాడండి, మరియు పటాన్చెరు పెద్ద చెరువును అమీన్పూర్ పెద్ద చెరువును రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి కాపాడండి అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలను తొలగించండి ఆపేయండి, అమీన్పూర్ సందికుంటచెరువును ఆక్రమించిప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ లో 18 ఎకరాలలో 355 విల్లాలను నిర్మించి ఒక్కొక్క విల్లా కోటిన్నరకు అమ్ముకున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని ఆ డబ్బు రికవరీ చేయండి, అలాగే శంభునికుంట చెరువు ఎఫ్డిఎల్ / బఫర్ జోన్ లో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి నిర్మిస్తున్న అక్రమ బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ను తక్షణం కూల్చివేయండి, అప్పుడు నేనే స్వయంగా మీ పార్టీకి ప్రచారం చేస్తా మీ పార్టీ కండువా కప్పుకుంట కావాలంటే. నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీ పైన ఎటువంటి ద్వేషము లేదు ఏ వ్యక్తి పైన ఎటువంటి ద్వేషము లేదు..... V. రవికృష్ణ (సామాజిక కార్యకర్త & హైకోర్ట్ న్యాయవాది)9618531012*                                           
*@TelanganaCMO @TelanganaCS @MinisterKTR @AmeenpurM @Collector_SRD @arvindkumar_ias @TSMAUDOnline @BRSHarish @RaoKavitha #Telangana*

Thursday, June 15, 2023

International Domestic Workers’ Day 2023

*PRESS NOTE*

Domestic Workers Union Calls for Comprehensive Legislation
Celebrates International Domestic Workers’ Day 2023 with 5 Demands

Demanding a comprehensive legislation for the domestic workers in Telangana, Bro. Verghese Theckaneth, Director of Montfort Social Institute, said that a law is needed to recognise and protect the rights of domestic workers and safeguard them against violence and discrimination. Domestic Workers from three districts of Telangana – Rangareddy, Hyderabad & Medchal - Malkajgiri met to celebrate the International Domestic Workers’ Day at the Montfort Social Institute (MSI) in Uppal. Registered as a trade Union, Gruhakarmikula Union Telangana State (GUTS) has come up with 5 demands as they commemorated the spirit of domestic workers across the world. 

Speaking on the occasion, he said a majority of the domestic workers receive wages below minimum wage, work without any weekly off, face verbal abuse from employers, working without any job security. He mentioned that if brought forth, Telangana would be first in the country to legislate for the domestic workers.
 
Standing in solidarity with the fight of domestic workers, Mala Mukunda, the Founder of Queer Bandhu has highlighted about the Transgenders and the social stigma they face. She outlined that they must be recognised and respected for who they are.

Sajaya Kakarla, social activist and Sahitya Akademi Awardee, raised the importance of ratifying ILO Convention 189 which talks about decent work conditions for domestic workers. She asked that when politicians come to ask for votes next time, instead of taking money for the vote, they have to be demanded to do something about Convention 189.

Joshna, Founder of Caste Annihilation Society, raised about the health issues of domestic workers and urged the government to include Domestic Workers in ESI and PF so they have social security and acces to halth care without which they are forced to incur out-of-pocket expenditure. Currently, E-shram card only has one benefit - Rs. 2,00,000 in case of accidental death. Even though Domestic Workers contribute majorly, they continue to remain the most vulnerable of groups within the unorganized sector. Brother Susai Alangaram, Manjula, Sandhya, Sisters Lourdu, Jenastus, Nirmala and others have joined the programme.

Courtesy by : MSI 

రాజస్థాన్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై వేటు

*అర్ధరాత్రి విందు కోసం... హోటల్ సిబ్బందిపై దాడి!*

*రాజస్థాన్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై వేటు*

*రాజస్థాన్...!*
అజ్‌మేర్‌ సమీప రెస్టారెంటులో అర్ధరాత్రి జరిగిన గొడవ తాలూకు సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ కావడంతో ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను సస్పెండు చేసింది.వీరితోపాటు మరికొంతమంది సిబ్బందిపైనా సస్పెన్షన్‌ వేటు పడింది. ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అజ్‌మేర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా ఉన్నారు. గంగాపుర్‌ సిటీ పోలీసు విభాగానికి ఐపీఎస్‌ అధికారి సుశీల్‌కుమార్‌ బిష్ణోయ్‌ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. ఈ కొత్త నియామకాన్ని పురస్కరించుకొని విందు చేసుకునేందుకు అర్ధరాత్రి రెస్టారెంటుకు వెళ్లి గొడవ పడ్డారు.

''ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆ ఇద్దరు అధికారులు స్నేహితులతో కలిసి వచ్చారు. సిబ్బందిని నిద్ర లేపి గొడవకు దిగారు. నాకు సమాచారం అందగానే.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. నా ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదే ఐపీఎస్‌ అధికారితో కలిసివచ్చి కర్రలు, ఇనుప రాడ్లతో మావాళ్లపై దాడి చేశారు. 11 మంది గాయపడ్డారు'' అని రెస్టారెంట్‌ యజమాని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై వేటు పడింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, June 14, 2023

రైతుల చేతులకు బేడీల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. HRF

*Human Rights Forum,TS*
*మానవ హక్కుల వేదిక*
14.06.2023.

              పత్రిక ప్రకటన

*రైతుల చేతులకు బేడీల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి*
       
ఇటీవల మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులు నలుగురిని యాదద్రి భువనగిరి జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటమే కాక, జైలు నుండి వాళ్లకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చిన సంఘటనను మా సoస్థ  తీవ్రంగా ఖండిస్తున్నది.

   గతంలో 2017 జూలై నెలలో ఖమ్మంలో మిర్చీ పంటకు మద్దతు ధర కోసం ధర్నా చేసిన ఎనిమిది మంది రైతులను, 2018 ఆగస్ట్ నెలలో తన భూమి సమస్య కోసం ఎం.ఆర్. ఓ ఆఫీసు ముందు నిరసన తెలిపిన రైతు ను కూడా చేతులకు బేడీలు వేసి బజారులో  నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు.
మా సంస్థ ఈ విషయంలో పోలీసులను మాత్రమే ( per se) తప్పు పట్టడం లేదు. నిరసనలను అనచివేయడానికి ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన అభయ హస్తం ( impunity) వల్ల పోలీసు శాఖ ఇష్టా రాజ్యాంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. నిందితుడికి బేడీలు వేసి కోర్టు కు తీసుక పోయే విషయంలో గతంలో సుప్రీం కోర్టు,  మూడేళ్ల క్రితం విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ ను బేడీలతో కోర్టుకు తీసుకెళ్లిన సందర్భంలో ఢిల్లీ హైోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
 భారీ హత్యలూ, ఆర్థిక నేరాలు చేసే ఆర్థిక ఉన్నత వర్గాలకు సకల మర్యాదలు చేసే పోలీసులు, ప్రభుత్వాలు తమ భూములు పోతున్నాయని ఆకృషించే రైతుల చేతులకు బేడీలు వేసి తిప్పటం సిగ్గుచేటు.
 
  భోన గిరిలో రైతుల కు బేడీలు వేసిన సంఘటనపై విచారణ జరపాలనీ, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రైతుల గౌరవ, ప్రతిష్టలను భంగపర్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేయాలనీ మా సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.

- *ఎస్. జీవన్ కుమార్*
(ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ)
*డా. ఎస్.తిరుపతయ్య*
(తెలంగాణ ప్రధాన కార్యదర్శి)

*ఆత్రం భు జంగ రావు*
(తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు)