*ఇలా చేస్తే మీ ఆధార్ సేఫ్....వర్చువల్ ఐడీతో మరింత గోప్యంగా సమాచారం*
మన ప్రాథమిక ఐడీ ఆధార్. అందులోని వివరాలు అంగడి సరకుగా మారితే చాలా ముప్పు ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి బయటికి వచ్చిన ఆధార్ సమాచారంతో అనేకమంది ఖాతాల నుంచి రూ.లక్షలు మాయమయ్యాయి. ఇలా జరగకుండా చూడ్డానికి ఉడాయ్ వర్చువల్ ఐడీ, ఆధార్ లాక్, హిస్టరీ వంటి సేవలను అందుబాటులో ఉంచింది. మరి మన సమాచార భద్రతను సరిచూసుకుందామా?
*ఆధార్ వర్చువల్ ఐడీని ఎలా పొందాలి :*
* వర్చువల్ ఐడీ (వీఐడీ) ద్వారా వ్యక్తిగత సమాచారం మరింత గోప్యంగా ఉంటుంది.
* అధికారిక పోర్టల్‌కి వెళ్లి ఆధార్ సర్వీసుల్లో వర్చువల్ ఐడీ (వీఐడీ) జనరేట్పై క్లిక్ చేయాలి.
* అనంతరం ఆధార్ కార్డు నంబరు, క్యాప్చా నంబరును నమోదు చేయాలి.
* తరువాత లింక్ అయిన ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే వర్చువల్ ఐడీ కనిపిస్తుంది.
* మెసేజ్ ద్వారా కూడా ఈ ఐడీని పొందవచ్చు.
* ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబరులో ఆర్వీఐడీ స్పేస్ ఆధార్‌లోని చివరి నాలుగు నంబర్లను టైప్ చేసి 1947కు మెసేజ్ పంపించాలి. ఇలా చేస్తే వర్చువల్ ఐడీ నంబర్ మెసేజ్ ద్వారానే వస్తుంది.
* ప్రతి పనికీ ఆధార్ నంబరును కాకుండా వర్చువల్ ఐడీని వినియోగించుకోవచ్చు.
* బ్యాంకు అకౌంట్ తెరవడానికి, ప్రభుత్వ సర్వీసులకు దరఖాస్తు చేయడానికి, ఈ కేవైసీ వంటి తదితరాలకు దీనిని ఉపయోగించవచ్చు.
*లాక్ చేసే అవకాశం :*
* ముందు మై ఆధార్ పోర్టల్‌కు వెళ్లాలి. అందులో ఆధార్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
* దానికింద ఆధార్ లాక్, అన్‌లాక్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి తదుపరిపై క్లిక్ చేయాలి.
* తరువాత ఆధాక్ వర్చువల్ ఐడీ (వీఐడీ), పూర్తి పేరు, పిన్‌కోడ్, క్యాప్చాను నమోదు చేయాలి.
* తరువాత వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది.
* ఇదే తరహాలో అన్‌లాక్ చేసుకోవచ్చు.
*ఎక్కడ వినియోగించామో తెలుసుకోండిలా :*
* ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఉడాయ్ పోర్టల్‌కు వెళ్లాలి.
* పైన ఎడమవైపు ఉన్న మై ఆధార్ ఆప్షన్లో కనిపించే ఆధార్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
* ఆధార్ అథంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* అందులో లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబరు, క్యాప్చా, ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* తరవాత కనిపించే స్క్రీన్లో ఆథంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
* అక్కడ ఆల్‌ను, తేదీని ఎంచుకుంటే ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే విషయం కనిపిస్తుంది.
*ఇలా ఫిర్యాదు చేయవచ్చు :*
* మీకు తెలియకుండా ఆధార్‌ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి కంప్లెయింట్ చేయవచ్చు.
* help@uidai.gov.inకి మెయిల్ ద్వారా లేదా ఉడాయ్ వెబ్సైట్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
* ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డును బయోమెట్రిక్ లాక్ చేయడం ఉత్తమం.
* దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్‌ని వినియోగించడానికి వీలుండదు.
*వేలిముద్ర పడటంలేదా :*
* వేలిముద్రలు లేని వారికి, వైకల్యం ఉన్న వ్యక్తులకు తమ ఐరిస్ స్కాన్లను మాత్రమే అందించడం ద్వారా ఆధార్ కార్డు లభ్యమవుతుంది.
* కొందరు వృద్ధులు, కాయకష్టం చేసేవారి వేలి ముద్రల గీతలు చెరిగిపోతుంటాయి.
* దానికోసం దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్ల బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల కింద పేరు, జండర్, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలి. దీని తరువాత ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ సూపర్వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుంది.
* అప్పటికీ కాకపోతే దగ్గరలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది.
* అక్కడ ఆధికారులు వేలిముద్రలను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు.
*గంతల నాగరాజు(GNR)*
No comments:
Post a Comment