Thursday, February 29, 2024
సీఎం రేవంత్ రెడ్డికి... KTR సవాల్....!
Wednesday, February 28, 2024
HMDA లో విజిలెన్స్ సోదాలు....!
Tuesday, February 27, 2024
దళితులను మోసం చేసిన ప్రభుత్వఅధికారులు
Monday, February 26, 2024
జర్నలిస్ట్ ల కోసం పని చేయని వారికి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వారికి పెద్ద పీట!
Sunday, February 25, 2024
#ధరణి దరఖాస్తులకు మోక్షం
#ధరణి దరఖాస్తులకు మోక్షం
✅ పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం
✅ మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు
✅ మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ
✅ ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం
ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
ఈరోజు సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు శ్రీ ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ రేమండ్ పీటర్, అడ్వకేట్ శ్రీ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ శ్రీ బి. మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్వో శ్రీ వి. లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.
2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవిన్యూ రికార్డుల నవీకరణతో నే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది.
లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.
కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయటం లేదా.. కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడున్న పెండింగ్ దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు.
2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారటం, డైరెక్టర్లు అందరూ మారిపోవటం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా.. అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా.. అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1761397134769750208?t=XHrVWVqLdA5H80rg2SgFJQ&s=19
Saturday, February 24, 2024
FAKE... FAKE.... FAKE
Friday, February 23, 2024
హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయి.
హెచ్ఎండీఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula సమీక్ష నిర్వహించారు.
➧ @GHMCOnline, @HMDA_Gov పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ ఫైల్స్ క్లియర్‌గా ఉండాలి
➧ చాలా బిల్డింగ్స్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా పర్మిషన్లు ఇచ్చారు.
➧ 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయి. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోతారు.
➧ ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందే..
➧ హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
➧ 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే..
➧ చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
పురపాలక పరిపాలన శాఖపై సీఎం సమీక్ష:
➧ హైదరాబాద్ నగరంలో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
➧ కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో కమిషనర్లు లేకపోవడంపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆశ్చర్యం..
➧ ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి
➧ గ్రూప్ 1 అధికారులు కమిషనర్‌లుగా ఉండేలా చూడాలని ఆదేశం...
➧ కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను కమిషనర్‌లుగా నియమించాలని సూచన
➧ మున్సిపాలిటీల్లో పని చేసే మున్సిపల్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు...
➧ జీహెచ్ ఎంసీలో వయస్సుపైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచన
➧ ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించేందుకు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశాలు
➧ హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచన
➧ జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి హెచ్చరిక... ఉదయమే లేచి కాలనీల్లో పర్యటించని జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చన్న ముఖ్యమంత్రి
➧ కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామని వ్యాఖ్య
➧ హైదరాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన
➧ మల్టీ యుటిలిటీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు
➧ వీధి దీపాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచన
వాటర్ వర్క్స్ సమీక్షలో సీఎం..
➧ హైదరాబాద్ నగరానికి మంచి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు
➧ స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలని సూచన
➧ మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా అయ్యేలా ప్రణాళిక రచించాలని ఆదేశం...
➧ ఔటర్ రింగు రోడ్డు బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని సూచన
➧ వచ్చే 50 ఏళ్ల తాగు నీటి అవసరాల కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించిన సీఎం
➧ హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం
➧ హైదరాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని అధికారులకు సీఎం సూచన
➧ మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన
➧ నాలుగు గంటలకుపైగా సాగిన సమీక్ష
ఈ సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు శ్రీ దాన కిషోర్, శ్రీమతి ఆమ్రపాలి తదితరులు.
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1761082058711969817?t=y2xIYxcajAFBuIQ0sOVZAw&s=19
Thursday, February 22, 2024
హైకోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న #GHMCUppalCircle
Wednesday, February 21, 2024
TelanganaHighCourt ఆదేశాలను బేఖాతరు చేస్తుండ్రు
Tuesday, February 20, 2024
చిన్న వయసులో పెద్దల సభకు
ప్రగతి భవన్ ఆస్తిపన్ను చెల్లించారా?
రామంతాపూర్ లో బస్సు షెల్టర్ కోసం పోరాటం
Monday, February 19, 2024
లోక్‌సభ స్థానాలకు ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్
Sunday, February 18, 2024
దర్జాగా దందాలెన్నో
Friday, February 16, 2024
people will loose faith on the judiciary....
Wednesday, February 14, 2024
బరితెగిస్తున్న ఇసుక మాఫియా
*సిగ్గుపడాలి #తెలంగాణాప్రభుత్వం*
Monday, February 12, 2024
#KaleshwaramProjectScam పర్యటన
Friday, February 9, 2024
పీవీ గారికి #భారతరత్న... మోడీ గారికి ధన్యవాదములు
Thursday, February 8, 2024
*శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు....రంగంలోకి ఈడీ*
ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు సహాయం
Monday, February 5, 2024
'#న్యాయం' ఎక్కడ దొరుకుతుంది ?*
Sunday, February 4, 2024
➧ కేసీఆర్, హరీష్, డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు:
➧ కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
➧ అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
➧ రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారు.
➧ ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత
➧ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు..
➧ టీఆరెస్ అభ్యంతరం చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారు..
➧ దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు..
➧ ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే..
➧ 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు.
➧ 2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించింది
➧ 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారు.
➧ తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.
➧ కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32శాతం మాత్రమే ఏపీలో ఉంది..
➧ అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి.
➧ కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.
➧ 15 ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారు.
➧ 19.05.2023న 17వ KRMB సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారు.
➧ 2023 బడ్జెట్ లో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు రూ.400 కోట్లు కేటాయించారు.
Saturday, February 3, 2024
నందమూరి తారకరామారావు... సచివాలయం
త్తు... త్తు.. ఈళ్ల బతుకులు చెడ!
_*జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊*_
_*#తెలంగాణ ఒస్తే నిరుద్యోగులకు / రైతులకు / ప్రభుత్వవిద్యకు / సాగునీటి ప్రాజెక్టులకు.... Etc న్యాయం జరుగుతుంది అనుకుంటే #దొర కుటుంబం,#దొర బంధుమిత్రులు,#దొర గడిలో బానిసలుగా ఉన్న #ప్రజాప్రతినిధులు / ప్రభుత్వఅధికారులు ముఖ్యంగా #IAS / #IPS అధికారులు #తెలంగాణ ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్నారు. ఈ దోపిడీ గురించి తెలిసినా మౌనంగా ఉన్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా & జర్నలిస్ట్ లు మరీముఖ్యంగా కండ్ల ముందు ఇంత పెద్ద #అవినీతి జరుగుతున్నా ప్రశ్నించని వెదవలు అనబడే మేధావులు మరియు పౌరసమాజం... త్తు... త్తు.. ఈళ్ల బతుకులు చెడ.... Bplkm🪶
Thursday, February 1, 2024
హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్
హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్
🚦భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక
🚦సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు
🚦సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు
🚦మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం
🚦హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.
హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు.
పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణనివ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని. తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్లో) లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడుతామని సీఎం చెప్పారు.
సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని అన్నారు. టూ వీలర్ ట్రాఫిక్ ఇంటర్సెప్టర్స్ పై (ద్విచక్ర వాహనాలపై) ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే లను ఎక్కడెక్కడ నిర్మించాలి... అక్కడున్న సాధ్యాసాధ్యాలను గుర్తించాలని సీఎం అన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయనే చర్చ జరిగింది. వీలైనన్ని చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు.
లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్లు, పార్కులు, మౌలిక వసతులకు ఎంత స్థలం కేటాయించాలనే ప్రమాణాలు పున: పరిశీలించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో పరిశీలించాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ రవి గుప్తా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ షానవాజ్ ఖాసీం, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ శ్రీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ శ్రీ సుధీర్ బాబు, ట్రాఫిక్ డీసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Courtesy / Source by :
https://twitter.com/TelanganaCMO/status/1752721089254539625?t=0YNoueuGiEWqaT4QcMUHAA&s=19