Thursday, September 30, 2021

Telangana Ku Haritha Haram, biggest plantation drive in country

Hyderabad : 30/09/2021

Telangana Ku Haritha Haram, biggest plantation drive in country

An aerial view of the improved green cover due to Haritha Haram

HYDERABAD: The 

Telangana

 government’s flagship programme 

Telangana Ku Haritha Haram

 (THH), taken up to enhance the green cover in the state is the biggest plantation drive in the country and third in the world after China and Brazil. After launching the 

THH

, Telangana had planted 239 crore saplings in the past six years, which is nine crore more than the target 230 crore. 

Chief minister 

K Chandrasekhar Rao

 started THH in July, 2015 with an intention to improve the forest coverage to 33% from the 24% in 2014. The National Forest Policy of India, 1988 also envisages 33% of forest cover. There is a gap of about 9% in the forest cover in the state, 

Telangana forest department

 officials said.

Forest department officials said no other state has taken up plantation drive in such a big way in the past.

“In the past six years, the forest department and other departments have planted over 160 crore saplings outside the forest areas and another 80 crore with the forest areas after 7th THH programme conducted this year. This include direct plantation and rejuvenation of degraded forest,” RM Dobriyal, principal chief conservator of forest (social forestry) said.

Since CM KCR has been giving top priority for Haritha Haram, not only forest department, revenue, municipal and panchayat raj departments have been actively participating in the programme every year. The state government mandated 

Green Budget

 in every civic body and even made must that every elected representative in the panchayats and municipalities should ensure 85% of the saplings in their respective jurisdiction.


Tuesday, September 28, 2021

వెంటాడుతున్న తాలిబాన్లు

అంతర్జాతీయ వార్తలు : 29/09/2021

వెంటాడుతున్న తాలిబాన్లు

  • క్లైర్ ప్రెస్
  • బీబీసీ వరల్డ్ సర్వీస్

అఫ్గానిస్తాన్: వందలమంది మహిళా న్యాయమూర్తులు ప్రాణభయంతో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.
!! BBC News తెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

ఫొటో క్యాప్షన్,

వందలమంది మహిళా న్యాయమూర్తులు ప్రాణభయంతో బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.

గతంలో వాళ్లంతా అఫ్గానిస్తాన్‌ మహిళల హక్కులకు రక్షణ కవచంలా నిలిచారు. తమ దేశంలో అణగారిన వర్గంగా మారిన మహిళలకు చట్టంతో రక్షణ కల్పించారు. కానీ, పరిస్థితులు తలకిందులయ్యాయి. తాలిబాన్‌లు పాలన చేపట్టడంతో ప్రాణభయంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అయితే, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారు, మాఫియా ముఠాలే తమ ప్రధాన శత్రువులని, మహిళా న్యాయమూర్తులను భయపెట్టే ఉద్దేశం లేదని తాలిబాన్‌ల ప్రతినిధులు అంటున్నారు.

తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత 220 మంది మహిళా జడ్జిలు ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారిలో ఆరుగురు జడ్జిలు రహస్య ప్రాంతం నుంచి బీబీసీతో మాట్లాడారు. వారి భద్రత దృష్ట్యా అందరి పేర్లను మార్చి రాశాం.

ఒక న్యాయమూర్తిగా తన కెరీర్‌లో అనేక తీర్పులు ఇచ్చారు మసూమా. ముఖ్యంగా అత్యాచారం, హత్య, హింస, మహిళలకు వేధింపులకు సంబంధించి వందలమందిని ఆమె దోషులుగా నిర్ధారించారు.

కానీ, తాలిబాన్లు ఆమె నివసిస్తున్న నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కొద్ది రోజుల తర్వాత పాత నేరస్తులంతా జైలు నుండి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి.

టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ నోట్స్, ఇంకా గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఆమె ఫోన్‌కు కాల్స్ వరద మొదలైంది.

"తాలిబాన్లు ఖైదీలందరినీ జైలు నుండి విడుదల చేశారని మాకు అర్ధరాత్రి సమయంలో తెలిసింది. ఇల్లూ వాకిలి వదిలి వెంటనే పారిపోయాం" అని మసూమా చెప్పారు.

గత 20 ఏళ్ల కాలంలో 270 మంది మహిళలు అఫ్గానిస్తాన్‌లో న్యాయమూర్తులుగా పని చేశారు. దేశంలో అత్యంత శక్తివంతమైన, ప్రముఖ మహిళలుగా వారు గుర్తింపు పొందారు.

"కారులో ప్రయాణిస్తున్నప్పుడు బుర్ఖా ధరించాను. దీంతో ఎవరూ నన్ను గుర్తించలేదు. అదృష్టవశాత్తూ మేము అన్ని తాలిబాన్ చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటిపోగలిగాము. " అన్నారు మసూమా.

ఇల్లు వదిలి బయటకు వచ్చిన కాసేపటికే ఆమె ఇంటికి కొందరు తాలిబాన్ సభ్యులు వచ్చి వెళ్లారని పొరుగింటి వారు మసూమాకు మెసేజ్ చేశారు.

వాళ్లు ఎందుకు వచ్చారో తనకు అర్ధమైందని మసూమా అన్నారు. తాలిబాన్‌ల ఆక్రమణకు కొన్ని నెలల ముందు ఆ గ్రూప్‌కు చెందిన ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మసూమా తీర్పునిచ్చారు.

భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో అతడు నిందితుడు. ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు మసూమా.

"నాకు ఇప్పటికీ ఆ అమ్మాయి ముఖం గుర్తుకు వస్తుంటుంది. అది చాలా ఘోరమైన హత్య'' అన్నారామె.

కేసు విచారణ పూర్తయ్యాక సదరు నిందితుడు మసూమాకు ఎదురయ్యారు. ''నేను జైలు నుంచి బైటికి వచ్చిన తర్వాత నా భార్యను చంపినట్లే నిన్ను కూడా చంపుతా'' అని హెచ్చరించాడని మసూమా గుర్తు చేసుకున్నారు.

"అప్పుడు నేను అతడిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అతను నాకు చాలాసార్లు ఫోన్ చేసాడు. నా వివరాలన్నీ కోర్టు నుంచి తీసుకున్నానని చెప్పాడు'' అన్నారు మసూమా.

''నువ్వెక్కడున్నా వెతికి ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు'' అని వెల్లడించారామె.

తాలిబాన్: కొత్త ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటూ విలపిస్తున్న ఓ మహిళ

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

కొత్త ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటూ విలపిస్తున్న ఓ మహిళ

బెదిరింపుల పర్వం

కనీసం 220 మంది మాజీ మహిళా న్యాయమూర్తులు ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో అజ్ఞాతంలో ఉన్నారని బీబీసీ దర్యాప్తులో తేలింది. వివిధ ప్రావిన్సుల నుండి ఆరుగురు మాజీ న్యాయమూర్తులతో బీబీసీ మాట్లాడింది. గత ఐదు వారాలుగా సాగిన ఈ సంభాషణలు దాదాపు ఒకేలా ఉన్నాయి.

గతంలో తాలిబాన్‌లను జైలుకు పంపిన మహిళా జడ్జిలందరికీ బెదిరింపులు వచ్చాయి. భార్యలను చంపిన కేసుల్లో శిక్షను ఎదుర్కొన్న కొందరు నిందితుల పేర్లను నలుగురు న్యాయమూర్తులు చెప్పగలిగారు.

బెదిరింపు కాల్స్ కారణంగా వీరిలో చాలామంది ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. తెలిసిన వారి ఇళ్లకు మారుతూ వారు ప్రాణాలు రక్షించుకుంటున్నారు. వీరిలో చాలామంది జడ్జిల ఇళ్లను ఇప్పటికే తాలిబాన్ సభ్యులు తనిఖీ చేసి వారి ఆచూకీ గురించి వాకబు చేశారు.

అయితే ఈ ఆరోపణలపై తాలిబాన్‌ల అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ స్పందించారు.

''మహిళా న్యాయమూర్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వారిని ఎవరైనా బెదిరించినట్లు ఫిర్యాదులు వస్తే, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం'' అని బీబీసీతో అన్నారు కరీమీ.

అఫ్గానిస్తాన్‌ అంతటా తమకు వ్యతిరేకంగా పని చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని కరీమీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఖైదీల విడుదల సమయంలో తాలిబన్లతో సంబంధం లేని చాలా మంది నేరస్తులు కూడా బైటికి వచ్చారు.

మహిళా న్యాయమూర్తుల భద్రత గురించి ప్రశ్నించినప్పుడు "మేం మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, మాఫియా సభ్యుల విషయంలోనే కఠినంగా ఉంటాం'' అన్నారు కరీమీ

ఉన్నత విద్యావంతులైన ఈ మహిళా న్యాయమూర్తులు. వారే కుటుంబానికి ప్రధాన ఆధారం. కానీ ఇప్పుడు వారి జీతాలు నిలిపేయడం, బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేయడంతో వారంతా అప్పులు చేసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాలిబాన్: తాలిబాన్ల అణచివేత ధోరణికి నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్న అఫ్గాన్ మహిళలు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

తాలిబాన్ల అణచివేత ధోరణికి నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్న అఫ్గాన్ మహిళలు

మహిళల హక్కులపై తీర్పులు

మూడు దశాబ్దాలకు పైగా జడ్జిగా పని చేసిన సనా, మహిళలు, పిల్లలపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. ఆమె దగ్గరకు వచ్చిన కేసుల్లో నిందితులు చాలామంది తాలిబాన్, ఐసిస్‌లో సభ్యులు. వారిలో చాలామందికి శిక్షలు పడ్డాయి.

"విడుదలైన ఖైదీల నుండి నాకు 20కి పైగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి" అన్నారు సనా. ప్రస్తుతం ఆమె తన డజనుకు పైగా కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలో ఉన్నారు.

ఒకసారి ఆమె కుటుంబంలోని మగ వ్యక్తి ఒకరు ఇంటికి తిరిగి వచ్చి, దుస్తులు సర్దుతుండగా తాలిబాన్‌ కమాండర్లు వచ్చారు. "నేను తలుపు తెరిచాను. ఇది న్యాయమూర్తి ఇల్లు కాదా అని వారు నన్ను అడిగారు" అని ఆయన చెప్పారు.

"ఆమె ఎక్కడుందో నాకు తెలియదని నేను చెప్పగానే నన్ను వారు మెట్ల మీద నుంచి తోశారు. ఒకరు నన్ను తుపాకీ మడమతో కొట్టారు. నా ముక్కు నుంచి, నోటి నుంచి రక్తం వచ్చింది'' అని ఆయన వివరించారు. తాలిబాన్లు వెళ్లిన తర్వాత ఆయనను సనా బంధువు ఒకరు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

"మనం ఇంటిని తరచూ మారుస్తూ ఉండాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. పాకిస్తాన్ కు వెళ్లినా మనకు రక్షణ లేదు'' అని అతని బంధువు వివరించారు.

తాలిబాన్ గార్డులు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

తాలిబాన్ గార్డులు

మహిళల దుస్థితి

ప్రజలు నివసించడానికి అత్యంత కష్టతరమైన దేశాలలో ఒకటిగా అఫ్గానిస్తాన్ దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, 87% మహిళలు, బాలికలు తమ జీవితకాలంలో హింసను అనుభవిస్తున్నారు.

అయితే, ఈ మహిళా న్యాయమూర్తులు వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్నో కేసులను క్షుణ్నంగా విచారించారు. నిందితులకు శిక్షలు విధించారు. తద్వారా మహిళలపై జరిగే హింసను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అత్యాచారం, హింస, బలవంతపు వివాహాలతోపాటు, మహిళల ఆస్తి హక్కును నిరోధించిన వారికి కూడా శిక్షలు విధించారు. తమ కెరీర్‌లో ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నామని ఈ ఆరుగురు మహిళా న్యాయమూర్తులు ఇంతకు ముందే వెల్లడించారు.

"నేను నా దేశానికి సేవ చేయాలనుకున్నాను. అందుకే నేను న్యాయమూర్తి అయ్యాను" అని అస్మా అనే న్యాయమూర్తి ఓ రహస్య ప్రదేశం నుంచి బీబీసీకి వివరించారు.

ఫ్యామిలీ కోర్టులో ఎక్కువగా విడాకుల కేసులు, లేదంటే తాలిబాన్ సభ్యుల నుంచి విడిపోవాలనుకునే మహిళలకు సంబంధించిన కేసులను తాను తీర్పులు ఇచ్చినట్లు అస్మా వెల్లడించారు.

"అదే మాకు శాపంగా మారింది. ఒకసారి, తాలిబాన్లు కోర్టు దగ్గర రాకెట్లను కూడా ప్రయోగించారు. మా స్నేహితురాలైన ఓ న్యాయమూర్తిని కోల్పోయాం. ఆమె ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు అదృశ్యమైంది. తర్వాత ఆమె శరీరం మాత్రమే దొరికింది" అన్నారు అస్మా.

అదృశ్యమైన న్యాయమూర్తి హత్యకు సంబంధించి ఎవరిపైనా కేసులు పెట్టలేదు. ఆ సమయంలో, స్థానిక తాలిబాన్ నాయకులు తమ ప్రమేయం లేదని ఖండించారు.

తాలిబాన్ ఆక్రమణకు ముందు పాఠశాలల్లో అఫ్గాని బాలికలు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

తాలిబాన్ ఆక్రమణకు ముందు పాఠశాలల్లో అఫ్గాని బాలికలు

కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది?

మహిళల హక్కుల విషయంలో అఫ్గానిస్తాన్ కొత్త నాయకత్వం ఎంత సీరియస్‌గా ఉంటుందో ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. కానీ ఇప్పటి వరకు వారి ప్రవర్తన మాత్రం సానుకులంగా కనిపించడం లేదు.

ప్రస్తుత మంత్రి వర్గంలో అందరూ పురుషులే ఉన్నారు. మహిళా హక్కుల వ్యవహారాల కోసం ఎవరినీ నియమించలేదు. మగ ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూళ్లకు రావాలని ఆదేశించారు కానీ, మహిళలకు ఇంత వరకు అనుమతి లభించ లేదు.

తాలిబాన్ల పాలనలో మళ్లీ మహిళా న్యాయమూర్తులు కనిపిస్తారా అన్న ప్రశ్నకు '' మహిళలకు ఉద్యోగాలు, అవకాశాల గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి'' అని కరీమీ అన్నారు.

ఇప్పటి వరకు లక్షమందికి పైగా ప్రజలు దేశం నుండి వెళ్లి పోయారు.

బీబీసీతో మాట్లాడిన ఆరుగురు న్యాయమూర్తులు కూడా తాము ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నామని, కానీ తమ దగ్గర డబ్బు లేదని, కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్టులు కూడా లేవని వెల్లడించారు.

మాజీ మహిళా న్యాయమూర్తులందరినీ తక్షణమే విదేశాలకు తరలించాలని ప్రస్తుతం యూకేలో ఉంటున్న అఫ్గానిస్తాన్ మాజీ రాయబారి మార్జియా బాబాఖర్‌హైల్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి రక్షణ రక్షణ అవసరమని ఆమె అన్నారు.

"ఓ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక మహిళా న్యాయమూర్తి నాకు చేసిన కాల్ నా గుండెలను పిండేసింది. మేం ఇంకెక్కడికి వెళ్లాలి, సమాధుల్లోకే అని ఆమె అన్నారు'' అని మార్జియా వెల్లడించారు.

"ఈ న్యాయమూర్తులలో చాలామందికి పాస్‌పోర్ట్ లేదా సరైన పేపర్‌వర్క్ లేదు. కానీ, వారంతా పెను ప్రమాదంలో ఉన్నారు'' అన్నారామె.

న్యూజీలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు తాము కొంత వరకు సహకారం అందిస్తామని తెలిపాయి. అయితే ఈ సహాయం ఎప్పుడు వస్తుంది లేదా ఎంతమంది న్యాయమూర్తులను వీరు తీసుకోగలరనేది ఇంకా స్పష్టం కాలేదు.

ఇలాంటి సహాయాలు సమయానికి అందుబాటులోకి రావడం లేదని మసూమా అంటున్నారు. "ఒక్కోసారి నేను చేసిన నేరమేంటి, చదువుకోవడమే తప్పా, మహిళలకు న్యాయం చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారా అనిపిస్తుంది'' అని మసూమా వ్యాఖ్యానించారు.

"నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఖైదీని. మా దగ్గర డబ్బు లేదు. మేము ఇల్లు వదిలి వెళ్ళలేము'' అన్నారామె.

"మేం మళ్లీ స్వేచ్ఛగా ఉండే రోజు కోసం నేను ప్రార్థించడం మాత్రమే నేను ఇప్పుడు చేయగలిగింది'' అన్నారు మసూమా.

(అదనపు సమాచారం అహ్మద్ ఖలీద్ నుంచి)

Monday, September 27, 2021

113 years later, we still have a lot of rain on the same day.

Hyderabad : 28/09/2021The saviour Tamarind Tree inside Osmania General Hospital https://t.co/387YOyhtQj

113 years later, we still have a lot of rain on the same day. Thankfully, managed well till now. No flooding in the city. Taken a photo at 6.30 am today at the same place in Koti. OMG.
! https://t.co/eHHAT7wsY6

Courtesy by : M Ramesh IPS (DCP EASTZONE )Twitter 

Sunday, September 26, 2021

ఘనంగా జాతీయ బీసీ కమిషన్ రెండో వార్షికోత్సవం

హైదరాబాద్ : 27/09/2021

ఘనంగా జాతీయ బీసీ కమిషన్ రెండో వార్షికోత్సవం
!! Q న్యూస్ మీడియా సౌజన్యంతో  !!

హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు జరిగి రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రెండో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ... రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దాదాపుగా కొన్ని వందల మంది వారి వారి సమస్యలను తెలుపుతూ కమిషన్ ఆశ్రయించారన్నారు. కొన్ని పేపర్ స్టేట్మెంట్ లో వచ్చినటువంటి సంచలన విషయాలను సైతం సుమోటోగా స్వీకరించి కమిషన్ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని ప్రజలకు కమిషన్ ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. కేవలం ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రజలు వారి వారి సమస్యలను తెలుపుతూ కమిషన్ను ఆశ్రయించిన ఉన్న పరిస్థితిని చూస్తే చాలా జాలి వేస్తుందని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర బీసీ కమిషన్ లేవని అక్కడ కూడా జాతీయ బీసీ కమిషన్ చొరవతో రాష్ట్రాల్లో కూడా కమీషన్ను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కమిషన్ సభ్యులు ఆచార్య వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుందని ఏ అధికారి అయినా కమిషన్ ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రతి అధికారి కచ్చితంగా అన్ని కమిషన్ల ఆదేశాలను పాటించాలని హెచ్చరించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం కమిషన్ లో ఆచార్య పాత్రను ప్రశంసించారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా జాతీయ బీసీ కమిషన్ ఉందని ఎటువంటి పరిస్థితులనైనా కమిషన్ చొరవతో పరిష్కరించే అవకాశం మెండుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలాగే పుదుచ్చేరి గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర టూరిజం, కల్చర్ డెవలప్మెంట్ శాఖామాత్యులు జి.కిషన్ రెడ్డి జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ భగవన్ లాల్ సహాని, NCBC లీగల్ అడ్వయిసర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. 

Works within Achari Kunta lake spark outrage

Hyderabad : 27/09/2021

Works within Achari Kunta lake spark outrage

Courtesy By : Donita Jose| Express News Service | Published: 26th September 2021 08:54 AM
Achari Kunta lake (Photo | Twitter/@praharitrust)

HYDERABAD: It has only been a month since the National Green Tribunal (NGT) gave directions to the Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWS&SB) to build a lake in compensation for the encroachments in Lingamkunta lake in Chandanagar for the construction of a Sewage Treatment Plant. However, a similar tale seems to be replaying in Nizampet where citizens allege that the Water Board is destroying their lake. The case is of Achari Kunta, where the citizens have alleged that the HMWS&SB, without requisite permissions, has begun digging an illegal road inside the lake’s Full Tank Level limits to lay a pipeline. The works have been ongoing since September 24 and are on the verge of getting completed.

“This lake has about two-three court cases going on with regard to encroachment. While they claim it is on the road beside the lake, documents suggest that road itself is illegal and inside the FTL,” said Raghu Rama Rao, founder of Parahari Trust, which is working on the beautification of the lake.The citizens have submitted a representation to concerned authorities. Sources say that the HMWS&SB didn’t take the requisite permissions from the Irrigation Department, under whom the lake is enlisted for safeguard. 

“Until Friday, we didn’t get any letter seeking permission to lay the pipeline. On Friday, the work was stopped after it came to our notice and the HMWS&SB has now sought our permission. The same is under consideration and a decision will be taken,” said an official from the Irrigation Department. The lake has seen an enthusiastic effort by nearby colonies for conservation with another end of the lake being developed. “The road is illegal as per our knowledge and leads to a school.

The water pipeline being laid is also to the school itself. What we can’t understand is that despite there being an alternative route via Siri Colony why the Water Board has to waste public money and lay it through an illegal encroachment,” added Raghu.

గులాబ్ గండం.. మ‌రికొన్ని గంట‌ల్లో..

హైదరాబాద్ : 26/09/2021

గులాబ్ గండం.. మ‌రికొన్ని గంట‌ల్లో..

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

గులాబ్ గండం ముంచుకొస్తోంది. ఆదివారం సాయంత్రం ఉత్తర ఆంధ్రా-దక్షిణ ఒడిశా తీరాన్ని తాకుతుందని వాతావ‌ర‌ణ శాఖ అంచనా వేస్తోంది. 95 కిలోమీటర్ల వేగంతో విరుచుకుప‌డొచ్చ‌ని హెచ్చరించింది. తీరం దాటిన త‌ర్వాత‌ ఆదివారం ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, సోమవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

సెప్టెంబ‌ర్‌లో అత్యంత అరుదుగా తుపాన్లు వ‌స్తుంటాయ‌ని చెప్పిన వాతావ‌ర‌ణ‌శాఖ‌.. గులాబ్ ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉండొచ్చ‌ని తెలిపింది. తుపాను దాటికి భారీ విధ్వంసం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చరించింది. గుడిసెలు, ఇతర నిర్మాణాలు, విద్యుత్/కమ్యూనికేషన్ లైన్లు పంటలు దెబ్బతినే అవకాశం ఉంద‌ని తెలిపింది.

గులాబ్ ప్రభావంతో.. ముంబై, గుజరాత్ సహా విదర్భ, తెలంగాణ, మరాఠ్వాడా, కొంకణ్ తీరంలో సెప్టెంబర్ 29 వరకు భారీ వ‌ర్షాలు కుర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేసిన వాతావ‌ర‌ణ‌శాఖ‌.. ఈ మేర‌కు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గులాబ్‌ తర్వాత మ‌రో తేలికపాటి తుఫాను అనుసరించే అవకాశం ఉందని వెల్ల‌డించింది. ఇది సెప్టెంబర్ 28 సాయంత్రం నుంచి ప్రభావం చూపుతుందని, దాని కార‌ణంగా కోల్‌కతా, ఒడిశా, ఢిల్లీతో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల్లో వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపింది.

Saturday, September 25, 2021

రేప్ అటెంప్ట్.. 6 నెల‌లు మ‌హిళ‌ల బ‌ట్ట‌లుతికితేనే బెయిల్

జాతీయ వార్తలు : 25/09/2021

రేప్ అటెంప్ట్.. 6 నెల‌లు మ‌హిళ‌ల బ‌ట్ట‌లుతికితేనే బెయిల్

రేప్ అటెంప్ట్.. 6 నెల‌లు మ‌హిళ‌ల బ‌ట్ట‌లుతికితేనే బెయిల్ 

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

త్యాచారయ‌త్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చే క్ర‌మంలో బిహార్ కోర్టు విచిత్ర‌మైన ష‌ర‌తు పెట్టింది. త‌న గ్రామంలోని స్త్రీల దుస్తుల‌ని ఆరునెల‌ల పాటు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాల‌ని ఆదేశించింది. అందుకు అయ్యే ఖర్చును కూడా అత‌డే భరించాలని వెల్ల‌డించింది.

బిహార్‌లోని మజోర్ గ్రామానికి చెందిన లాలన్ కుమార్ చాక‌లి వృత్తిలో కొన‌సాగుతున్నాడు. గ‌త ఏప్రిల్‌ నెలలో ఓ మహిళపై అత్యాచార‌య‌త్నం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. బెయిల్ కోసం కోర్టులో పిటిష‌న్ వేయ‌గా.. ఈ వింత నిబంధ‌న పెట్టింది. మ‌జోర్ గ్రామంలో 2 వేల మంది మహిళలు ఉన్నారు. కోర్టు తీర్పు ప‌ట్ల వారంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి తీర్పు చ‌రిత్ర‌లోనే మొద‌టిసారి అని, ఈచ‌ర్య‌తో నిందితుడిలో ప‌రివ‌ర్త‌న వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఇలాంటి తీర్పుల‌తో… మ‌హిళ‌ల‌పై జ‌రిగే నేరాల గురించి విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బిహార్ కోర్టు తీర్పు దేశ‌వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నిందితుడు ఆ ప‌నిచేసిన‌ట్టుగా 6 నెలల తర్వాత గ్రామ సర్పంచ్‌ ధ్రువీక‌రించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ తీర్పున‌చ్చిన ఝంజీర్‌పూర్ ఏడీజే ఉన్న అవినాష్ కుమార్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. గతంలోనూ ఆయ‌న ఇలాంటి విచిత్ర‌మైన తీర్పులు ఇచ్చి వార్త‌ల్లోకెక్కారు.

పీవోకేను వెంట‌నే ఖాళీ చేయండి.. పాక్‌కు భార‌త్ వార్నింగ్

జాతీయ వార్తలు : 25/09/2021

పీవోకేను వెంట‌నే ఖాళీ చేయండి.. పాక్‌కు భార‌త్ వార్నింగ్

పీవోకేను వెంట‌నే ఖాళీ చేయండి.. పాక్‌కు భార‌త్ వార్నింగ్

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

క్య‌రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ వేదిక‌గా పాక్ తీరును భార‌త్ క‌డిగిపారేసింది. ప‌దే ప‌దే జ‌మ్మూ- కాశ్మీర్ స‌మ‌స్య‌ను ప్ర‌పంచం ముందుపెట్టి ఆదేశం సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టాన్ని భార‌త్‌ను గ‌ట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను ఎలా పెంచి పోషిస్తున్న‌ది, ఆశ్ర‌యం ఇస్తున్న‌ది, సాయం చేస్తున్న‌ది ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ తెలుసు అని భారత్ ఎండ‌గ‌ట్టింది. పాకిస్థాన్ అంటేనే సాయుధ ఉగ్ర‌వాదుల‌కు నిల‌యం అని యూఎన్‌వో స‌భ్య దేశాలకు ఎప్పుడో తెలుసు అని విరుచుకుప‌డింది.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమ‌ని, ఎప్పటికీ విడదీయలేనివి అని భార‌త ప్ర‌తినిధి నొక్కి చెప్పారు. భార‌త్ భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉంద‌ని, వెంట‌నే పీవోకే నుంచి పాక్ అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాల‌ని హెచ్చ‌రించింది. అంత‌కుముందు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ వ‌ర్చువ‌ల్ మీటింగ్‌లో భార‌త్ తీరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కాశ్మీర్‌లో మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని ఆరోపిచారు. అక్క‌డ ప్ర‌జాస్వామాన్ని నెల‌కొల్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మొస‌లి కన్నీరు కార్చారు. దీంతో భార‌త్ ధీటుగా స‌మాధానం ఇచ్చింది.

Friday, September 24, 2021

Manthan co-founder Ajay Gandhi passes away at 65

Hyderabad : 24/09/2021

Manthan co-founder Ajay Gandhi passes away at 65

Courtesy by : K V Kurmanath BusinessLine (THE HINDU)
He came up with the platform to ensure healthy democratic discourses

Ajay Gandhi, a chartered accountant by profession, and co-founder of Manthan, has passed away on Wednesday after suffering from an illness briefly. He was 65.

The last rites were performed on Friday in Hyderabad. He is survived by wife, a son and a daughter.

Born into a Gujarati family settled in Hyderabad, Ajay completed his CA in 1978 and started Gandhi & Gandhi with his brother Kamlesh. Eventually, he founded an accounting software company Wings.

Finding the absence of a healthy public discourse in Hyderabad, Ajay co-founded Manthan with his long-time friend Mamidipudi R Vikram, who is also a CA and runs the firm, M Anandam & Co. “He was a person with maximum empathy. He always longed for a healthy democratic discourse,” Vikram recalls.

He built Manthan on three principles – no scope for personal issues or offensive questions in the discussions, the platform must be free for public and comfort of the audience comes first. “He ensured that the platform remained free for the audience. He always argued that a platform that is not free loses democratic spirit,” Vikram says.

Manthan attracted some top names from various fields from across the country. Musician T M Krishna, former Finance Minister Chidambaram, former RBI governor Y V Reddy and student leader Kanhaiya Kumar are some of the well-known people to have used the platform to speak their mind.

But none of these discourses triggered a row. “It’s because of Ajay’s insistence on discussing the topic alone, giving no scope for asking any personal or offensive questions that these discourses never triggered a controversy,” Vikram says.

Ajay and Vikram spent from their pockets and raised money from like-minded friends and a few corporates to organise the discourses. Manthan’s annual event – Manthan Samvad, is a hugely successful event, packed with day-long speeches and discussions.

Founded in 2005, Manthan has organised 398 speeches so far

ప్ర‌చార యావ‌… న‌వ్వుల పాల‌వుతున్న కేటీఆర్

హైదరాబాద్ : 24/09/2021

ప్ర‌చార యావ‌… న‌వ్వుల పాల‌వుతున్న కేటీఆర్


!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


ట్విట్ట‌ర్ పిట్ట‌గా ప్ర‌తిప‌క్షాల విమర్శ‌లు ఎదుర్కొంటున్న మంత్రి కేటీఆర్ ప్ర‌చార యావ‌లో నవ్వుల పాల‌య్యారు. తామే రికార్డు స్థాయిలో వ్యాక్సినేష‌న్ చేస్తున్నామ‌ని, రైతుల వ‌ద్ద‌కే పొలాల్లోకి వెళ్లి మ‌రీ ఆరోగ్య కార్య‌కర్త‌ల‌తో వ్యాక్సిన్ ఇప్పిస్తున్న‌ట్లు కొన్ని ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.

ఖ‌మ్మం, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల్లో ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు పొలాల్లోకి వెళ్లి రైతుల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పి వ్యాక్సిన్ ఇస్తున్నార‌ని, తెలంగాణ‌లో కేసీఆర్ నాయ‌క‌త్వంలో వ్య‌వ‌సాయ విప్ల‌వం వ‌చ్చేసింద‌ని గొప్ప‌లు కూడా చెప్పుకున్నారు.

కానీ, అంత‌కు రెండ్రోజుల ముందే వైసీపీ ఎంపీ విజ‌యసాయి రెడ్డి ఇవే ఫోటోల‌ను షేర్ చేస్తూ… సీఎం జ‌గ‌న్ స్ఫూర్తితో ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల అంకిత భావంతో పొలాల్లోకి వెళ్లి మ‌రీ వ్యాక్సిన్ ఇస్తున్నార‌ని ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ ఉద్య‌మంలో సాగుతుంద‌ని పొగ‌డ్త‌లు కురిపించారు.

కేటీఆర్ కు ప్ర‌చార యావ ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే అని, కానీ మ‌రీ ఇత‌ర రాష్ట్రంలో చేస్తున్న ప‌నులను కూడా కాపీ కొడుతూ మేమే చేశాం అని చెప్పుకోవ‌టం దారుణ‌మ‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ప్రచారం కోసం మ‌రీ ఇంత దిగ‌జారుతారా…? మీకు నిజంగా జ‌నం ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉంటే మీరు కూడా రైతుల వ‌ద్ద‌కే వ్యాక్సిన్ పాల‌సీ తీసుకోని ప్ర‌చారం చేసుకోవాలి కానీ ఇత‌ర రాష్ట్రాల్లో తీసిన ఫోటోల‌ను మ‌న‌వి అని చెప్ప‌టం సిగ్గనిపించ‌టం లేదా అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌చారం కోసం ఉన్న త‌ప‌న‌… వ్యాక్సినేష‌న్ పై కూడా ఉంటే బాగుండు అంటూ రియాక్ట్ అవుతున్నారు.

ఇటీవ‌ల సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో 6ఏళ్ల పాప హ‌త్యాచార ఘ‌ట‌న‌లోనూ మొద‌ట నిందితుడు దొరికాడ‌ని చెప్పి, ఆ త‌ర్వాత త‌న‌కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని అందుకే అలా చెప్పానంటూ కేటీఆర్ మాట మార్చారు. ఇప్పుడు ఏపీ ప‌నితీరును త‌మ‌దేన‌ని చిన్న సారు చేసిన ట్వీట్ పై ఏం చెప్తారో చూడాలి.

ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఓకే సినిమా అన్ని థియేట‌ర్ల‌లో ఉన్న‌ట్లుగా… ఒకే ఫోటోలు రెండు రాష్ట్రాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని ట్వీట్ చేశారు. మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులుంటార‌ని అంటారు కానీ పొలాల‌ను పోలిన పొలాలు కూడా ఉన్నాయా అని సెటైర్స్ వేశారు.

కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ కూడా స్పందించారు. కొడుకు ఇంకా ఎదో మూడ్ లో ఉన్న‌ట్లున్నారు, ఏపీ స‌క్సెస్ ను త‌మ‌దిగా చెప్పుకుంటున్నార‌ని… ఇంకా ఇలాంటి మార్ఫ్ ఫోటోల‌తో ప్ర‌జ‌ల‌ను ఎంత‌కాలం మోసం చేస్తార‌ని ప్ర‌శ్నించారు.


Thursday, September 23, 2021

కుల వివక్ష: రెండేళ్ల దళిత బాలుడు ఆలయంలోకి వచ్చాడని తండ్రికి రూ. 25 వేల జరిమానా

జాతీయ వార్తలు : 24/09/2021

కుల వివక్ష: రెండేళ్ల దళిత బాలుడు ఆలయంలోకి వచ్చాడని తండ్రికి రూ. 25 వేల జరిమానా

  • ఇమ్రాన్ ఖురేషి
  • బీబీసీ కోసం
!! BBC News తెలుగు ట్విట్టర్ సౌజన్యంతో !!
ఆలయం

ఫొటో సోర్స్,GETTY IMAGES

'దళిత బాలుడు ఆలయ ప్రవేశంతో మైల అంటుకున్నది ఆలయానికి కాదు, మన మనస్సులకు'

కర్ణాటకలోని కొప్పల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గ్రామస్తులకు చెప్పిన మాటలు ఇవి.

ఓ దళిత చిన్నారి ఆలయంలోకి వెళ్లడంతో ఆ బాలుడి తండ్రికి అగ్రవర్ణాలవారు రూ. 25,000 జరిమానా విధించారు.

రెండేళ్ల వయసున్న కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఆలయం బయట ఉండి దేవుడిని ప్రార్థించుకుంటుండగా ఆ పసిబిడ్డ ఆలయంలోకి పరుగెత్తడమే ఆ తండ్రి చేసిన తప్పు.

ఆలయం

ఫొటో సోర్స్,GETTY IMAGES

"మేం ఆలయం బయట ప్రార్థన చేస్తున్నప్పుడు చినుకులు పడుతున్నాయి. దీంతో బాబు ఆలయంలోకి పరుగెత్తాడు. వెంటనే నేను బాబుని పట్టుకున్నాను. అయినా, సెప్టెంబర్ 11న జరిగిన బహిరంగ సమావేశంలో గ్రామ పెద్దలు నేను అభిషేకానికి, దేవాలయ శుద్ధి చేయడానికి డబ్బు చెల్లించాలని చెప్పారు. దాదాపు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని వారు నాతో చెప్పారు'' అని చిన్నారి తండ్రి చంద్రు విలేకరులతో అన్నారు.

చంద్రు పెద్ద మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరిపారు. తరువాత కుష్టగి పోలీసులను ఆశ్రయించారు. కానీ, భయంతో అధికారికంగా ఫిర్యాదు చేయలేకపోయారు.

''గ్రామానికి వెళ్లే ముందు, ఆలయాన్ని శుభ్రం చేయడానికి జరిమానా విధించారని నేను చదివాను. అందుకే పసిపిల్లల ప్రవేశం తర్వాత మైల పడింది దేవాలయం కాదు, మన మనస్సులకు అని నేను గ్రామస్తులతో చెప్పాను'' అని కొప్పల్ డిప్యూటీ కమిషనర్ వికాస్ కిషోర్ సురాల్కర్ బీబీసీ హిందీకి చెప్పారు.

"బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడినా.. తాలూకా సాంఘిక సంక్షేమ అధికారి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్న ఐదుగురిని మేం అరెస్టు చేశాం" అని సురాల్కర్ తెలిపారు.

వీడియో క్యాప్షన్,

అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నారా?

మియాపూర్ గ్రామంలో సుమారు 450 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 20 శాతం దళిత కుటుంబాలున్నాయి.

"మిగిలిన వారందరూ వివిధ కులాలకు చెందిన వారున్నారు. వీరందరి ప్రధాన వృత్తి వ్యవసాయం" అని జిల్లా ఎస్‌పీ టీబీ శ్రీధర బీబీసీ హిందీకి చెప్పారు.

"గ్రామస్తులందరి ఆలోచనా దోరణి ఇలానే లేదు. దళితులపై ఇలాంటి చర్యలు తీసుకోవడాన్ని అగ్రవర్ణాలకు చెందిన చాలా మంది వ్యతిరేకించారు. కేవలం కొందరు మాత్రమే ఈ వైఖరితో ఉన్నారు'' అని శ్రీధర అన్నారు.

వీడియో క్యాప్షన్,

తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?

నాలుగు నెలల క్రితం కొప్పల్ జిల్లాలో దళిత యువకులు హెయిర్‌ కటింగ్ చేయించుకోవడానికి సెలూన్‌కి వెళ్లారని, వారిని గ్రామం నుంచి వెలివేశారు. ఆ దుకాణం గ్రామంలోని లింగాయత్‌లకు మాత్రమే అని వారు చెప్పారు.

మియాపూర్‌లో కూడా చంద్రుకి జరిమానా విధించిన వారు లింగాయత్‌లే. కానీ, మధ్యతరగతికి చెందిన, గనిగా సామాజిక వర్గానికి చెందిన వారు.

Wednesday, September 22, 2021

YS Jagan: విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘం పద్మశ్రీ అవార్డు గ్రహీత బివిఆర్ మోహన్ రెడ్డి..!!

ఆంద్రప్రదేశ్ వార్తలు : 23/09/2021

YS Jagan: విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘం పద్మశ్రీ అవార్డు గ్రహీత బివిఆర్ మోహన్ రెడ్డి..!!
!! NewsOrbit media Twitter సౌజన్యంతో !!

YS Jagan: ఇటీవల వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బివిఆర్ మోహన్ రెడ్డి సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘమని కొనియాడారు. వాస్తవానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా విద్యారంగాన్ని పట్టించుకోరని కానీ జగన్.. దానికి భిన్నంగా విద్య వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టడం.. ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో పదిహేను వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడం.. పాటు అమ్మఒడి విద్యా కానుక వంటి కార్యక్రమాలు అమలు చేయడం.. స్కిల్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు వంటి చర్యలు చేపట్టడం.. పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని కొనియాడారు.

BVR Mohan Reddy Comments On CM YS Jagan - Sakshi

కేవలం చదువు పైనే కాకుండా కొత్త పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంమీద చూసుకుంటే విద్యావ్యవస్థలో సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత బివిఆర్ మోహన్ రెడ్డి విజయవాడ వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో కొనియాడారు. జగన్ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువు ఏ కుటుంబానికి భారం కాకూడదని అనేక పథకాలతో.. విద్యార్థులకు ప్రోత్సాహాలు అందిస్తూ వస్తున్నారు.

 

అంత మాత్రమే కాక స్కూల్ దశ నుండే ఇంగ్లీష్ మీడియం.. అమలులోకి తీసుకు వచ్చి ప్రపంచంతో పోటీ పడేలా చిన్ననాటినుండే.. విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఒక చదువు విషయంలో మాత్రమే కాక భోజనం విషయంలో కూడా జగన్ అన్న గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలకు.. మంచి పౌష్టికాహారాన్ని కూడా జగన్ ప్రభుత్వం అందిస్తుంది. ఈ రీతిగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. విద్యా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు.. ప్రముఖులను ఆకర్షించటం మాత్రమే కాక దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టేలా విజయవంతంగా ఏపీలో విద్యావ్యవస్థను.. జగన్ మార్చడం జరిగింది.