Thursday, November 14, 2024

పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలి రేవంత్ రెడ్డి

దేశంలో చట్ట సభలకు పోటీ చేయడానికి వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోరారు. వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించడం వల్ల యువత చట్ట సభల్లోకి రావడానికి అవకాశం ఏర్పడటమే కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు.

♦️దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం పురస్కరించుకుని #SCERT ప్రాంగణంలో 18 ఏళ్ల లోపు బాలబాలికలు మాక్ అసెంబ్లీని అద్భుతంగా నిర్వహించారు.

♦️ఈ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం @Bhatti_Mallu గారు, మంత్రి @Ponnam_INC గార్లతో కూర్చొని వీక్షించించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎంతో క్రమశిక్షణతో చిల్డ్రెన్ మాక్ అసెంబ్లీ నిర్వహించారంటూ  అభినందించారు. సీఎంగారు ఇంకా ఏం చెప్పారంటే...

♦️ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేస్తూ చట్ట సభలకు పోటీ చేయడానికి విధించిన వయో పరిమితిని కూడా 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ తీర్మానం చేయాలి.

♦️ఆ తీర్మానాన్ని రాష్ట్ర ఎంపీలకు పంపించాలి. తద్వారా పార్లమెంట్ సమావేశాల్లో వారు ఈ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది.

♦️భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా, భవిష్యత్తు సమాజానికి అవసరమైన శాసనాలు చేయాలన్న సంకేతాలిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహించడం ప్రశంసనీయం.

♦️ఈ రోజుల్లో కొందరు చట్ట సభలను ఎప్పుడు వాయిదా వేయిద్దామన్న దిశగా ఆలోచన చేయడం దురదృష్టకరం.

♦️రాజకీయాలంటే ఈనాడు ఒక రకమైన భావన నెలకొంది. మాక్ అసెంబ్లీ నిర్వహించిన వారిలో కొందరైనా రాజకీయాల్లోకి రావాలి.

♦️మాక్ అసెంబ్లీలో అండర్ 18 హెడ్ క్వార్టర్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ, హైడ్రా వంటి బిల్లులపై చర్చించడం అభినందనీయం.

♦️పండిట్ నెహ్రూ గారు దేశంలో తీసుకొచ్చిన విద్య, వ్యవసాయ విప్లవం వల్ల సమాజంలో అనేక అవకాశాలు వచ్చాయి.

♦️యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కృషితో దేశంలో నిర్బంధ విద్య అమలులోకి వచ్చింది.

♦️ఇలాంటి మాక్ అసెంబ్లీ సమావేశాలు సమాజానికి చాలా అవసరం. చట్ట సభల్లో జరుగుతున్న చర్చలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలి. #ChildrensDay #JawaharlalNehru #MockAssembly #RisingTelangana 

Courtesy / Source by :https://x.com/TelanganaCMO/status/1857062426681671848?t=TJpK5np8E5ORMSIqXq6knw&s=19

No comments:

Post a Comment