Tuesday, June 24, 2025

పి.ఓ. డబ్ల్యూ, భాద్యురాలు, మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి సంఘటన పై విచారణ చేయాలి

పత్రిక పకటన

Dt. 24.06.2025
*పి.ఓ. డబ్ల్యూ, భాద్యురాలు, మహిళా హక్కుల నాయకురాలు వి. సంధ్య పై పోలీసులు దాడి చేసి, గాయ పరచిన సంఘటన పై విచారణ జరిపించాలి*

మహిళా హక్కుల కార్యకర్త, ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కన్వీనర్ వి.సంధ్యను పోలీసులు అరెస్టు చేసిన క్రమంలో తీవ్రంగా గాయపడిందని తెలిసి, ఆమె హాస్పిటల్ లో చికిత్స తరువాత, ఇంటికి వచ్చిందని తెలిసి,
ఆ సంఘటన పై విషయ సేకరణ చేయడానికి మానవహక్కుల వేదిక సంస్థ కు చెంది నముగ్గురు సభ్యు ల బృందం గాయపడ్డ సంధ్య గారి ఇంటికి వెళ్ళి, ఆమెను, సంఘటన జరిగిన రోజు ఆమెతో బాటు ఉన్న మహిళా కార్యకర్తలను కలిసి విషయ సేకరణ చేయడం జరిగింది. ఈ నెల 19వ (శ్రుక్రవారం), తేది న తొమ్మిది వామపక్ష పార్టీలు, పాలస్తీనా దేశం పై దాడి చేసి మారణ కాండ జరుపుతున్న ఇజ్రాయిల్ కు అమెరికా ఇస్తున్న మద్దతుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అమెరికా దోరణి ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేసారు.

అందులో భాగంగా ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ ల నాయకులతో కలిసి సంధ్య గారు కూడా నానక్ రామ్ గూడలోని అమెరికన్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన చేయడానికి యత్నంచినప్పుడు పోలీసులు చాలా దురుసుగా వ్యవహరించడం
వల్ల తీవ్ర గాయాలపాలై ఆమె కుడికాలు కు తీవ్రంగా గాయం అయింది. ఆమె చాలా భాధ తో మాకు విషయాలు వివరించింది.
"అమెరికన్ ఎంబస్సీ ముందు చాలా దూరం లో  ఉన్న బ్యారికేడ్ ల కు ఇవతలనే నిరసనకు ఉపక్రమించామ ని, ఎంబస్సీ లోకి 
చోచ్చుకొని వెళ్లే ఆలోచన తమకు లేదని, ప్రశాంతంగా నిరసన తెలుపుతూ గుమిగూడి న కార్యకర్త లను, చె దరగొట్టి, కొందరు నాయుకులను అరెస్టు చేసారని, తనను నలుగురు మహిళా కాన్స్టేబుల్స్ తన రెండుకాళ్ళు, రెండు చేతులు గట్టిగా పట్టుకొని  గాలిలోకి లేపి పొలీసు వ్యాన్ లో పడవేసారని, ఈ క్రమంలో తన కుడికాలు పట్టుకున్న మహళా కాన్స్టేబుల్ తన కాలును ఆగ్రహంలో వడిపెట్టిందని,తనకు బాగా నొప్పి గా ఉందని అరిచినా వినలేద ని "  సంధ్య అని మా బృందానికి తెలిపిం ది. 
ఆమెను అరెస్టు చేసిన గచ్చి బౌళీ పో లీసులు, ఆమెను నార్సoగి పో లీస్ స్టేషన్ కు తరలించారు. కoడరాలు దెబ్బ తిని కాలువాచి బాధపడు తున్నా పోలీసు లు ఆమెకు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా  ఇతరులతో బాటు ఆమెను పోలీస్ స్టేషన్ లోనే  నిర్భంధం లో ఉంచి సాయంత్రం ఆరు గంటలకు వదిలి పెట్టారని ఇతర కార్యకర్తలు లు తెలిపారు.
ఆమె ను పరీక్షించి న డాక్టర్ నివేదిక, ఎక్సరే రిపోర్ట్ లు పరిశీలి స్తే, ఆమెకు, గ్రేడ్-ll, లెగ్మెట్ తె గిందని, గ్రేడ్ -ll కడరo కూడా బాగా దెబ్బ తిన్నట్టు గా  రాసి ఉంది.
ఆమె బ్యాండెజీ తో కదలలేని స్థితిలో, భాధ లో ఉన్నట్టు మేము గమనించాo.
 డాక్టర్ లు ఆరు వా రాల పూర్తి విశ్రాంతి లో ఉండాలని చెప్పారట.

*పూర్తి ఆరోగ్యం గా ఉన్న సంధ్య గారిని పోలీసులు తమ దురుసు ప్రవర్తన తో ఆశక్తు రాలిని చేయడా న్ని మాసంస్థ తీవ్రంగా గా ఖండిస్తుంది.
*గచ్చిబౌళీ పోలీసుల దుష్ప్రవర్తన పై విచారణ చేసి తగువిదంగా శిక్షించాలి.
*సంధ్య గారు పూర్తిగా కోలుకొనేవరకు ప్రభుత్వమే వైద్యo కోసం అయ్యే వ్యయాన్ని భరించాలి.

ఎస్. జీవన్ కుమార్ 
ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు
ఎం. సురేష్ బాబు
నగర కమిటీ అధ్యక్షుడు 
వెంకట్ నారాయణ
సభ్యుడు.

No comments:

Post a Comment