Saturday, June 14, 2025

_నిన్నటిదాకా 'నియంత' _ నేడు భయం నీడలో బిక్కు బిక్కుబిక్కుమంటూ బతుకు_

*_ఇదేం ఖర్మ.!_*
_#  ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!_
_# కాలం వస్తే..ఇలాగే వెంటాడుతోంది.!_
_# కూతురు జైలుకు పాయే.!_
_# కొడుకుకు ఎప్పుడు ఖైదు అవుతాడో తెలియదాయే..!!_
_# నిన్నటిదాకా 'నియంత' _ నేడు భయం నీడలో బిక్కు బిక్కుబిక్కుమంటూ బతుకు_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_

*_మామూలుగా ప్రతిపక్షం అంటే..? ప్రభుత్వం చేసే అక్రమాల్ని, తప్పు నిర్ణయాల్ని, ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేది. నిలదీసేది. అంతే కదా..! సాధారణంగా జరిగేది అదే కదా..! నో, తెలంగాణలో జరుగుతున్నది వేరు. ప్రతిపక్షమే ప్రశ్నించబడుతోంది. ప్రశ్నల తాకిడికి తల్లడిల్లిపోతోంది. తను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలపై నిలదీయబడుతోంది. అదీ బహుముఖంగా.. అధికార మదంతో నియంతల్లా మారి, నికృష్టంగా ప్రవర్తించిన ఒక్క నీచుడి పెదవి కూడా ఇప్పుడు ఆడటం లేదు. కేసిఆర్ అదే 'ఖర్మ అంటే..!' తెలుసుకో.!_*

*_ట్యాపింగ్ వాడు వచ్చాడు.._*
అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడిన పోలీస్ విలనుడు 'రాను రాను' అని అమెరికాలో హఠం వేసుకుంటే… 'ఎలా రప్పించాలో మాకు తెలుసులేవో.!' అని రకరకాల ఇంటర్ పోల్ కార్నర్ నోటీసులు ఇచ్చి, అడ్డంగా కార్నర్ చేసి దాదాపుగా లాక్కొచ్చారు. ఇప్పుడు ప్రశ్నించబడుతున్నాడు. దౌర్భాగ్యుడు. ఛీ.ఛీ

*_హరీషా...ఓ నిందితుడా.?_*
'అది కాంగ్రెస్ కమిషన్, భయం లేదు, బాజాప్తా హాజరవుతాను' అంటూ హరీష్ రావు ఘోష్ ముందుకు వెళ్లాడు. ప్రశ్నించబడ్డాడు. నానారకాలుగా కసరత్తు చేసుకుని మరీ వెళ్లాల్సి వచ్చింది. సాక్షిగా కాదు, ఓ నిందితుడిగానే ప్రభుత్వం పరిగణిస్తోంది తనను.

*_ఇదే ఖర్మ అంటే..?_*
తెలంగాణ జాతిపిత (మనం చెప్పటం లేదు. అయినా ఓ తాగుబోతను జాతిపిత గాంధీతో పోల్చటం ఏమిటి.?), తొలి ముఖ్యమంత్రిగా కీర్తించబడే కేసీయార్ కూడా అదే కమిషన్ ఎదుట నిన్న ప్రశ్నించబడ్డాడు. శుక్రమహర్దశ కలకాలం ఉండదు కదా.! చేసిన అక్రమాలు నేల మీదకు తీసుకువస్తాయి. నిందితుడిగా నిలబెడతాయి. వేలెత్తి చూపిస్తాయి. అదీ టైమ్ అంటే, అదీ డెస్టినీ అంటే..!

*_ఆ టైమ్ ఎలాంటిదంటే.._*
సాక్షాత్తూ కన్నబిడ్డే 'నీ చుట్టూ చేరిన ఆ కొరివి దెయ్యాల మాటేమిటి డాడీ' అని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. మరి ఆ కన్నకొడుకు..? ఆ వారసుడు..? తనూ ప్రశ్నించబడుతున్నాడు. ఫార్ములా రేసు బాపతు అక్రమాల మాటేమిటి.? కొన్ని ప్రశ్నలున్నాయి, 'కాస్త వస్తారా..?' అని ఏసీబీ మళ్లీ పిలిచింది. ఖర్మ వెంటాడమంటే ఇదే..!

*_వీడో ఖాకీ దొంగ_*
ఐతే.. రాటుదేలిన రాజకీయం కదా..! 'ఎహె, మేం ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని బుక్ చేస్తున్నారు' అని ఎదురుదాడికి దిగుతుంది. ట్యాపింగ్ దోషి పోలీసు కదా..! ఇరకకుండా దొరకకుండా జవాబులు చెబుతూ..! అబ్బే, నాకేం సంబంధం అని బుకాయిస్తాడు. తెలియదు, గుర్తులేదు, మరిచిపోయాను పడికట్టు సమాధానాలు. ఒరేయ్ ట్యాపింగోడా..! ఇదేరా ఖర్మ అంటే.! నా పాపం, మా కుటుంబాల పాపం తగలాల్సింది ఇంకా ఉంది రా.! బద్మాష్.!

*_రాజకీయం ఎలాంటి సమాధానం ఇస్తుందంటే..?_*
రెండూ రెండూ కలిస్తే ఆరే కదా అంటుంది. అదే నమ్మాలని దబాయిస్తుంది. ఎలాగంటే..? లక్ష కోట్ల కాళేశ్వరం అప్పు ఎలా తీరుద్దామనుకున్నారయ్యా అనడిగితే, 'దాందేముంది, నీళ్లు అమ్మి కట్టేస్తామని అనుకున్నాం' అని అలా అలవోకగా ఓ జవాబు అలా విసిరేస్తుంది. ఓరేయ్.. బూతు..బూతులు తిట్టలేం కదా రా..!

*_చెప్పేవాడికి అడిగేవాడు ఎప్పుడూ లోకువే కదా..!_*
ఎవరికి నీళ్లమ్ముతాడు..? రైతులకా..? సాధ్యమేనా..,? మొత్తం తెలంగాణ సమాజం చెవుల్లో పెట్టడం కాదా ఇది. అల్లుడిలాగే మామ కూడా అవే జవాబులు చెప్పబోతున్నాడు. అదేమంటే కేబినెట్ నిర్ణయం అంటాడు. కేసీయారే కదా మంత్రులు అంటే, ఇంజినీర్లు అంటే... ప్లానర్, డిజైనర్, సూపర్‌వైజర్ అన్నీ ఆయనే కదా.! తీరా అడ్డంగా దొరికిన తర్వాత నాకేం తెలవదనే బుకాయింపు.. సిగ్గులేదురా.. నెలసరి ఉద్యోగులను ఇరికించడానికి నీచుల్లార్రా.!

*_అదే కేటీయార్ ఏమంటాడు..?_*
ఫార్ములా రేసు నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ హఠాత్తుగా ఆకాశానికి ఎగిసింది అంటాడు. అదే గొంతు ప్రపంచ సుందరి పోటీలను వెక్కిరిస్తుంది, ఆక్షేపిస్తుంది. రాజకీయం.. సో, ప్రస్తుతం తెలంగాణలో క్వశ్చన్ అవర్ నడుస్తోంది. సారీ, ఇంటరాగేషన్ సీజన్ అనుకొండి.

*_ప్రశ్నల వడగళ్లతో పెద్దతలలు బొప్పి కడుతున్నాయి సరే.._*
ఇదేమిటయ్యా కేసీయారూ, 'నమ్మి నీకు పదేళ్లు కుర్చీ అప్పగిస్తే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డావా..?' అని ప్రజలూ ప్రశ్నిస్తున్నారు. అవును, ప్రతిపక్షం ఘోరంగానే తట్టుకోలేని రీతిలో ప్రస్తుతం ప్రశ్నించబడుతోంది..!! క్వశ్చన్ అవర్, క్విజ్ టైమ్, గ్రిల్ సీజన్, ఇంటరాగేషన్ పీరియడ్. పేరు ఏదైనా పెట్టుకొండి..!!

*_ఐతే దోషులు ఎవరు..?_*
జరిగిన తప్పులేమిటో… ఏసీబీలు, కమిషన్లు తేలుస్తాయి. మళ్లీ కోర్టుల్లోనూ క్వశ్చన్ అవర్లు నడుస్తాయి. బహుముఖ ప్రశ్నాధ్యాయం..!!

*_కేసీఆర్... ఇది ఊహించావా.?_*
నీ నిజ జీవితం సినిమాలో క్లైమాక్స్ కేసీయార్ ప్రశ్నించబడే సీన్.. అసలు ఓ కమిషన్ ఎదుట, వాళ్ల ప్రశ్నలకు కేసీయార్ జవాబులు చెప్పడం అనే సీన్ ఊహించుకుంటేనే అదొక పెద్ద విశేషం. ఎందుకు..?

తను ప్రశ్నను సహించడు కాబట్టి.. ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడడు.. అంతకుముందు ఏమో గానీ, తను అధికారంలోకి వచ్చాక ఆ ప్రశ్నను సహించలేనితనం పీక్స్‌కు చేరింది.. అది ఎంతలా అంటే..?

*_మీడియా ప్రశ్నించలేదు._* 
(అందులో నా బాచ్ అతీతం) ఆర్ఎఫ్సీ భూముల యవ్వారం కావచ్చు, మరింకేమైనా భయాలు కావచ్చు, రామోజీరావు కేసీయార్ జోలికి వెళ్లేవాడు కాదు. అతిరథ మహారథులు ఎవరైనా సరే, అందరినీ తన వద్దకే రప్పించుకునే 'రామోజీరావు' అనే అక్షర నియంత మరో రాజకీయ నియంత దగ్గరకే వెళ్లినట్టు గుర్తు.

*_రాధాకృష్ణ...గ్రేట్_*
సరే, ఆ లక్ష నాగళ్లు గట్రా వివాదాలు, విమర్శలు ఎలా ఉన్నా.. ఆంధ్రజ్యోతి మొదట్లో కేసీయార్‌కు అనుకూలంగానే ఉన్నా.. తరువాత ఎక్కడో బెడిసింది. రాధాకృష్ణ ఒక్కడే మీడియాలో కేసీయార్‌‌ పట్ల విమర్శనాదృష్టితో ఉన్నాడు. యాడ్స్ ఆపేయడం వంటివి ఎన్ని ఎదురైనా తను నిలబడ్డాడు..గ్రేట్‌.

*_కేసీయార్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ వైరంలో..._*
రాధాకృష్ణ చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాడు కాబట్టి అలా కేసీయార్‌కూ వ్యతిరేకమయ్యాడేమో కూడా తెలియదు. జగన్, కేసీయార్‌కు జాన్ జిగ్రీయే, ఇద్దరూ కలిసి గోదావరి టు పెన్నా బృహత్తర ప్రణాళిక కూడా అమలు చేయాలనుకున్నారు. సంయుక్తంగా.. సో, సాక్షి కేసీయార్ అనుకూల ధోరణే. ఈరోజుకు కూడా..అదే భజన. అది వాళ్ళ ఇష్టం. తిరస్కరించటం ప్రజల హక్కు.

*_తను అధికారంలోకి వచ్చాక ఎప్పుడో ఓసారి ఇంటర్వ్యూ_*
కానీ తనకు నచ్చిన ప్రశ్నలు మాత్రమే.! వాటికి తను చెప్పదలుచుకున్న సమాధానాలే… మన తెలంగాణ పత్రిక ఆవిష్కరణకు రమ్మంటే, వేరే ఏ ఇతర పార్టీ నాయకుడు వచ్చినా నేను రాను అని చెప్పాడు. దాంతో తనొక్కడినే పిలిచి, ఇంకెవరూ రాకుండా తనతో మాత్రమే ఆవిష్కరింప చేశాడు ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి(?).

*_బాహుబలిలో శివగామిలాగా.._*
కేసీయార్ మాటే శాసనం.. గీత గీస్తే అది లక్ష్మణ రేఖే.. టీవీ చానెళ్ల గురించి చెప్పనక్కర్లేదు‌. అసలు 'చట్టసభల్లో తనను ప్రశ్నించేవాడు ఉండకూడదు' అన్నట్టుగా టీడీపీ, కాంగ్రెస్‌ను, చివరకు కమ్యూనిస్టులను కూడా వదల్లేదు.. చీల్చి, చెండాడి, తొక్కేసి.. నార తీసి...కకావికలం చేశాడు. 

*_తనకు కంట్లో నలుసుగా.._*
రేవంత్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు క్యాంపులో ఉండి, తనకు కంట్లో నలుసుగా మారుతున్నాడనే భావనతో.. వోటుకు నోటు కేసులో భలే దొరకబట్టాడు.. తరువాత కూడా మరేవో కారణాలతో జైలులో వేశాడు. అంతేతప్ప తెలంగాణ ఏ ఇతర పార్టీ నుంచి ఏ ప్రముఖ నాయకుడూ కేసీయార్‌ను పల్లెత్తు మాట అనేవాళ్లు కాదు. అలా మేనేజ్ చేయగలిగాడు కేసీయార్. జస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈజ్ ఏ డిఫరెంట్. మేనేజ్ చేసే ప్రయత్నాలు చెల్ల లేదు. అందుకే జైల్లో పెట్టావ్. బట్ ఖర్మ నిన్ను వదల్లే. వదలదు.

*_ప్రశ్నించేవాళ్లు ఎవరెవరు..?_*
ఏం చేస్తున్నారు..? దాని కోసం దేశంలోనే ఎక్కడా లేనంత భీకరమైన ఫోన్ ట్యాపింగ్. చివరకు బిడ్డ, అల్లుడి మీద కూడా... ‘అసలు ప్రశ్నించే వాతావరణమే’ లేకుండా చేసుకోవడంలో ఇదొక భాగం.

*_సీన్ కట్ చేస్తే..._*
అదే రేవంత్ రెడ్డి సీఎం. 'నాకు ఎదురు లేదు' అనుకున్న కేసీయార్ ప్రస్తుతం నథింగ్. ఇల్లు కదలని ప్రజానాయకుడు. అసలు ప్రశ్నను సహించని, ఎదుర్కోని కేసీయార్ 'ప్రస్తుతం ఓ కమిషన్ ఎదుట ప్రశ్నించబడటం' అనే సీన్ అందుకే విశేషం, ఆశ్చర్యం… అవును, ఓ మిత్రుడు చెప్పినట్టు… టైమ్, అంటే కాలమహిమ…

*_'ఈ కమిషన్ల విచారణతో ఏమవుతుందీ' అనే మరో ప్రశ్న.._*
కానీ 'కేసీయార్‌ను నువ్వు తప్పు చేశావ్, జవాబు చెప్పు' అని ప్రశ్నింపజేస్తూ... కార్నర్ చేయడం..! ఇది కొత్తేమీ కాదు.. విచారణను ఎదుర్కోవడంలో కేసీయార్ మొదటివాడు కాదు, చివరివాడూ కాదు. అంతకుముందు మాజీ ప్రధాని ఏకంగా కోర్టు విచారణకే హాజరయ్యాడు నిందితుడిగా, అదీ తను ఉద్దరించిన పార్టీకి కోపమొచ్చి. ఇదే కేసీయార్‌కు గతంలో గురువు, నాయకుడు చంద్రబాబు కూడా వైఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుప్పం విచారణ కమిషన్ ఎదుట హాజరైనట్టు గుర్తు. అయితే వాళ్లు అప్పుడు పదవుల్లో లేరు. పదవులు దిగిపోయాక లాలూ కొన్నేళ్లపాటు జైలులో ఉన్నాడు, ఇందిర కూడా అరెస్టయింది. కాకపోతే అరెస్టు, కొన్ని గంటల్లోనే విడుదల అంతా నాటకీయం. ఇదే ఖర్మ అంటే..!

*_అంతెందుకు..?_*
సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అప్పటికప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి, జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సో, టైమ్ డిసైడ్స్ ఎవరీ థింగ్. అదే అల్టిమేట్. 'నాకు శుక్రమహర్దశ నడుస్తోంది, నేను ప్రశ్నకు, విమర్శకు, పరాజయానికి అతీతం అనుకున్న ఎవరైనా సరే, అదీ కొన్నేళ్లే' అని గుర్తుంచుకోవాలి.

*_అధికారం, కుర్చీ ఆ నిజాన్ని గుర్తించనివ్వదు.._*
అదీ చెప్పదలిచింది. ఏమో, రేప్పొద్దున ఇదే రేవంత్ రెడ్డికీ ఈ స్థితి ఎదురవుతుందా..? ఏమో, టైమ్ ఏం రాసి పెట్టిందో..!! అవునూ, కేసీయార్‌కు ఓ ప్రశ్న. ఏ తప్పు ఎరుగని వీర తెలంగాణ ప్రయోజనవాదివి కదా.? మరి నీ వాదనను బహిరంగంగానే వినిపించవచ్చు కదా.! మరి ఘోష్ కమిషన్ ఎదుట వన్ టు వన్ విచారణను ఎందుకు అడిగావు..? దాల్ మే కుచ్ కాలా హై… నిజమేనా..? ఇదే ఖర్మ అంటే...

Source / courtesy by :
Anamchinnivenkateshwararao 
Journalist 

No comments:

Post a Comment