ఓట్లేసి గెలిపిస్తే.. కోట్ల స్థలం కొట్టేస్తారా...?
* ఎమ్మెల్యే ప్రణాళిక.. అన్న కొడుకు అమలు...
* మియాం మీయాంతో సమర్థవంతంగా పనిచేసిన పోలీసులు బలి?
* నాడు అన్న సోదరులు... నేడు అబ్బా కొడుకులు...
* వృద్ధ వితంతు మహిళ శాపనార్థం తప్పదు
తిరుపతి/విజయవాడ క్రైమ్ కరెస్పాండంట్ (గురువారం జూన్ 19): రూపాయి రూపాయి కూడా పెట్టి.. పియ్య పిండాకూడు తిని.. నాడు వేలకు కొన్న స్థలం నేడు కోట్లకు విలువ పెరగడంతో నాయకుల కన్ను పడింది. ఉపాధ్యాయ నగర్ మారస సరోవర్ ప్రీమియర్ స్టార్ హోటల్ సమీపంలో వాస్తు ప్రకారం అన్ని రకాలుగా మంచి బిజినెస్ ఏరియాలో ఉన్న 300 అంకణాల స్థలంపై గతంలో అన్న సోదరులు.. నేడు అబ్బా కొడుకుల కన్ను పడి కొట్టేయాలని తెర వెనుక మంతనాలు జరిపి అమాయక దళితులను అడ్డుపెట్టి పెద్ద ప్రణాళిక రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేశారు. అంతే ఆవేశంగా బాగా భక్షించే అలవాటు పడ్డ రక్షక బటులకు అధిక మొత్తంలో మామూళ్లు ఇచ్చి వారిచే సమర్థవంతంగా పనిచేయించి తన ఇంట్లో గోప్యంగా నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధ వితంతు మహిళ రుద్రరాజు సంపూర్ణమ్మను దౌర్జన్యంగా బయటకు నెట్టి, సీసీ కెమెరాలు పగలగొట్టి, ఇల్లు ధ్వంసం చేసి, పది లక్షలకు పైగా నష్టం కలిగించి వారిని వీధుల పాలు చేసిన సంఘటన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి మహానగరంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో శ్రీవారి పాదాల చెంత జరిగింది. వితంతు వృద్ధ మహిళ సంపూర్ణమ్మ మాటల్లో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..నాయనలారా మీ అవ్వను ఆదుకోండి. నేను 1981లో తిరుపతి అర్బన్ మండలం అక్కారం పల్లి గ్రామ లెక్కదాఖలా సర్వే నంబర్ 11/2బి2 లో 150 అంకణములు, 12.50 సెంట్లు భూమిని కొనుగోలు చేశాను. దాని విలువ దిన దినానికి పెరిగి నేడు కోట్లకు పడగలెత్తింది. నాడు అన్నా సోదరులు.. నేడు అబ్బా కొడుకులు... కొట్టేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. నన్ను మానసికంగా హింసించి మనోవేదనకు గురి చేశారు. దేవుని నమ్ముకున్న నాకు ఆ భగవంతుడే కాపాడాడు. రెండేళ్లుగా నేను నా చిన్న కూతురు నీరజ నా అల్లుడు సుకుమార్ రాజు ఆ స్థలంలో కాపురం ఉండగా గత నెల 22న అలిపిరి ఎస్సై లోకేష్ కుమార్ తన అల్లుడు కూతుర్ని స్టేషన్కు రమ్మని, నా కూతురును స్టేషన్లో ఉంచి నా అల్లుడ్ని నేను నివాసం ఉంటున్న స్థలంకి తీసుకు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నగరమంతా తిప్పి సాయంత్రం గా దొంగతనం కేసు ఉందని రిమాండ్ కు పంపారు. 23న తిమ్మి నాయుడుపాలెం చెందిన తెలుగుదేశం పార్టీ చోటా నాయకుల వెంకటరత్నం, విజయ్ లతోపాటు జవహర్ బాబు, చెన్నయ్య, జాన్ డబ్ల్యు పాలస్తీన్, జూలీ హెలినా, హేమా హెప్సిబా, సికే లీనా వినోలియా,న్యాయవాది బోకం రమేష్, తిమ్మినాయుడు పాలెం కు చెందిన వెంకటరత్నం కొడుకు పుతిన్, లోకేష్, ప్రశాంత్, చిత్తూరుకు చెందిన రౌడీ మూకల కొందరు ఏపీ 39ఎన్జే 3405 కారు, ఏపీ 39 టిఎఫ్ 0700 ఆటోలో వచ్చి దౌర్జన్యంగా నన్ను నా కూతుర్ని నానా దుర్భాషలాడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇల్లు చెట్లను కూల్చేసి వీధులపాలు చేశారు. పోలీసులు పట్టించుకోక పోగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనకు కొంతమేర ఉపశమనం కలిగింది. అయినా ఆ దౌర్జన్యకారులు హింసాత్మక, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. నాకు అన్యాయం చేసిన వారు సర్వ నాశనమైపోతారు. నా శాపనార్ధాలు తప్పక ఫలిస్తాయి. నా స్నేహితురాలు దొమ్మరాజు లక్ష్మమ్మను పొట్టన పెట్టుకున్నారు. ఉన్నతాధికారులు, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులే తనను కాపాడుతారని నమ్మకంతో విశ్వసిస్తున్నాను. నా మానసిక క్షోభ నన్ను ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పదని భావిస్తున్నాను.
(Source :Prasad,Journalist)
No comments:
Post a Comment