*సమాచార కమిషనర్ల నియామకం* విషయంలో రాజకీయ పార్టీలకు చెందిన వారిని నియమించవద్దని, పారదర్శకంగా నియమించాలని, గడువు లోపు దరఖాస్తు చేసుకొన్న వారిని, ఇంటలిజెన్స్ రిపోర్ట్లు పూర్తి అయిన వారిని, అర్హులైన వారిని మాత్రమే నియామకం చెయ్యాలని ,
అనర్హులను, రాజకీయ పార్టీల్లో నాయకులుగా వివిధ స్థాయి పదవుల్లో పని చేసిన వారిని నియామకాలు చేయవద్దని, పూర్తిస్థాయిలో నిబంధనలను, సెక్షన్ 15 సబ్ సెక్షన్ 5 ,సబ్ సెక్షన్ 6 అనుసరించి సమర్థులైన అర్హత గల వారిని మాత్రమే సమాచార కమిషనర్లు గా నియమించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి పౌర సమాజం, వివిధ సంఘాలు మేధావులు ఫిర్యాదు పత్రములు పంపిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా పంపడానికి ఈరోజుకు సోమవారం రోజు కు మాత్రమే అవకాశం కలదు.
సమాచార కమిషనర్లుగా నియామకం కోసం పంపినట్లుగా ప్రచారం జరుగుతున్న అభ్యర్థుల విషయాన్ని, వారి బయోడేటా ను, వారు పని చేసిన రంగం ను, చేసిన ప్రజా సేవల గురించి క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయంలు తీసుకోవాలని, సమర్ధులు,అర్హతలు గల వారిని మాత్రమే సమాచార కమిషనర్ లుగా నియామకం చెయ్యాలని గవర్నర్ గారిని కోరుతూ మీ తరపున, మీ సంఘం ,సమితి, అసోసియేషన్ తరపున లెటర్, వినతి పత్రం, పిర్యాదుపత్రం లను గవర్నర్ గారికి పంపండి.
తప్పు జరిగిన తరువాత, నిర్ణయం చేశాక విమర్శించడం చాలా మంది చేస్తున్నారు. దాని కంటే ముందుగా తప్పు జరగక ముందే, నిర్ణయాలు తీసుకోవడానికి ముందుగానే జరగబోవు వాటి విషయంలో సంబంధిత అధికారం గల వారికి(గవర్నర్) తెలియజేయడం, పిర్యాదు చెయ్యడం, వినతి పత్రం ఇవ్వడం అంటే సంబంధిత అధికారికి సహాయంగా వుండడం, సరైన నిర్ణయం తీసుకోవడానికి అండగా వుండడమే. ప్రభుత్వానికి మద్దతుగా వుండడమే, పౌరులు, మేధావులు వారి అభిప్రాయాలను తెలియజేసిన వాటిని,వాటిలో తెలిపిన అంశాలను,లేవనెత్తిన అభ్యంతరాలను తప్పకుండా పరిశీలన జరుగుతుంది. తద్వారా నూటికి 99 శాతం మంచి, సరైన నిర్ణయాలు, ఆదేశాలు వెలువడడం జరుగుతుంది. ఏ అధికారి కూడా కావాలని చట్టాలను, నిబంధనలను, సెక్షన్లు, నోటిఫికేషన్ లోతెలిపిన పద్ధతులను ఉల్లంఘించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉండవు. ఎవరి వత్తిడి వల్లనైనా పై విషయాలను ఉల్లంఘించి నిర్ణయాలు ,ఆదేశాలు జారి చెయ్యడం జరిగితే సంబంధిత ఆదేశాలు జారి చేసిన అధికారి జవాబుదారుడు అవుతాడు.
ఆ ఆదేశాలపై ఎవరైనా, ఆ ఆదేశాల ద్వారా నష్టపోయిన అర్హత గల వారు ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, మెరిట్ ఉన్న వారు న్యాయస్థానాలను ఆశ్రయించి కేసులు వేసినప్పుడు, విచారణ సమయంలో నిర్ణయాలను, ఆదేశాలను జారీ చేసిన అధికారి వారు పాటించిన విధానం,సెక్షన్లు, చట్టాలను అనుసరించినట్లుగా నిరూపించుకోవాలి. లేని పక్షంలో వారిపై చర్యలు వుండును.
జారి చేసిన ఆదేశాలు రద్దు చేయబడును.
ఇది నడుస్తున్న విధానం.
కాబట్టి సమాచార కమిషనర్ నియామకంలో గవర్నర్ గారు *బుధవారం రోజు నిర్ణయం* తీసుకునే అవకాశం కలదు. కాబట్టి మేధావులు, బాధ్యతగల పౌరులు, వివిధ సంఘాల బాధ్యులు,సబ్యులు మీ అభిప్రాయాలను పంపడానికి ఈరోజు చివరి అవకాశం కలదు. గవర్నర్ గారు బుధవారం ఆదేశాలు జారి చెయ్యడానికి అవకాశం కలదు.
కావున సమర్థులైన వారిని,
అర్హత గల వారిని
*త్రీ మెన్ కమిటీ* నివేదికల అనుసరించి,
ఇంటలిజెన్స్ ఇచ్చిన
రిపోర్టులను అనుసరించి,
నోటిఫికేషన్ లో చూపిన ప్రకారంగా నిబంధనలను చట్టాలను సెక్షన్లను అనుసరించి అర్హులైన వ్యక్తులను సమాచార కమిషనర్లుగా నియమించాలని సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు రాష్ట్ర గవర్నర్ గారికి వినతి పత్రం లేదా ఫిర్యాదు పత్రాన్ని, అభిప్రాయాన్ని తెలుపుతూ నేడు లెటర్లు పంపాలని కోరుతున్నాము. .
మరియు
మెయిల్ చెయ్యాలని కోరుతున్నాము.
గవర్నర్ గారి అడ్రెస్స్,
మెయిల్ అడ్రస్
Address
To
గవర్నర్.
రాజభవన్ . సోమాజిగూడ,
హైద్రాబాద్ - 500082.TG.
PHONE NO 040-23310521.
💐💐💐
మెయిల్ address.
rajbhavanadc@gmail.com
ఫోన్.040-23310521
💐💐💐💐
చీకటిని తిడుతూ కూర్చుంటే చీకటి పోదు.
చిరు దీపం వెలిగిస్తే చీకటి పోతుంది.
తప్పు జరుగుతుంటే, చట్టాలు నిబంధనలు ఉల్లంఘనలతో నిర్ణయాలు,ఆదేశాలు వెలువడే పరిస్థితుల్లో...
మేధావులు, పౌర సమాజం, వివిధ సంఘాలు ప్రశ్నించడం, పిర్యాదులు చెయ్యడం, వినతి పత్రాలు ఇవ్వడం, అభిప్రాయాలను చెప్పడం చెయ్యక పోతే... తప్పులు జరిగిన తర్వాత విమర్శించే హక్కు ఉండదు. తప్పుడు నిర్ణయాలను అనుసరిస్తూ ఉంటూ అన్యాయం జరిగిన, మీకు అన్యాయం జరిగిన అనుభవించ వలసిందే.. ?
జై RTI జై జై RTI.
చట్టాలను కాపాడండి.
ఆ చట్టాలు మిమ్ములను కాపాడతాయి..
🎯చట్టం సమర్ధ అమలు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు స్పందించండి. పొర సమాజం చైతన్యమే ప్రగతికి మార్గం.
జై రాజ్యాంగం. జై జై రాజ్యాంగం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Plz share..
(Source)from RTI Activist
No comments:
Post a Comment