Monday, October 26, 2026

ఖైరతాబాద్ నియోజకవర్గం లో మాదిగల అలయ్ బలాయ్ కార్యక్రమంలో డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ_

*ఖైరతాబాద్ నియోజకవర్గం లో మాదిగల అలయ్ బలాయ్ కార్యక్రమంలో డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 25:

అలయ్ బలాయ్ అంటే ఆత్మీయత.. అలయ్ బలాయ్ అంటే ఐక్యత.. అలయ్ బలాయ్ అంటే సోదరభావం అని మనమందరం ఒకే సమాజానికి చెందినవారిగా, ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలుస్తూ, ఒకరి విజయాన్ని మరొకరు మన విజయంగా భావిస్తూ ముందుకు సాగాలి అని డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు.మాదిగ సమాజానికి గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో కష్టాలు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా సమాజ అభివృద్ధి కోసం మన పూర్వీకులు ఎంతో కృషి చేశారు అని అన్నారు. వారి పోరాట స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.మన సమాజానికి విద్యే బలం.. ఐక్యతే ఆయుధం.. ఆత్మగౌరవమే మన గుర్తింపు! అని అన్నారు.మన హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, గౌరవప్రదమైన జీవనం ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలి అని అన్నారు.ఈ అలయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా మన మధ్య ఆత్మీయ సంబంధాలు మరింత బలపడాలి. పరస్పర సహకారం పెరగాలి. మన సమాజంలో ఐక్యత, చైతన్యం, అభివృద్ధి మరింత విస్తరించాలి అని డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో అంజన్న, నవీన్, కుమార్ తదితరులు 
పాల్గొన్నారు.

No comments:

Post a Comment